‘వెలుగుపూలు’ – ఝాన్సీ కె.వి. కుమారి

నువ్వు రంగురంగుల
సీతాకోక చిలుకలా
ఆడుతూ పాడుతుండడం
వాడు సహించలేడు
నీ రెక్కల విన్యాసాన్ని
వాడి గుండె ఓర్వలేదు
నీ భావనల స్వేచ్ఛా విహారాన్ని
అరువు కళ్ళవాడు అందుకోలేడు
స్వేచ్ఛ వాడికి గిట్టని వస్తువు
బానిసత్వమే వాడి వారసత్వం
చీకటి ప్రియనేస్తం
మనసును మెదడును
సంకెళ్ళ కౌగిళ్ళకు
అంకితమిచ్చాడు కదా
…. నువ్వు విహంగానివై
గాలి అలలతో ఊసులాడితే
ఊబిలోని వాడు
ఉడుక్కోవడం సహజం కదూ…
నీ రెక్కలపై దాడిచేయడం వాడి నైజం…!
రేపటి ఆశలను
అగ్నికి ఆహుతి చేయడం
సతుల్ని చితుల్లో దహించడం
వెలుగు ద్వారాల చూపులకు
గుడిగంతలు కట్టడం… కారణం
పచ్చ కామెర్ల కళ్ళను
ఒళ్ళంతా పులుముకున్న జాడ్యం!
మెదడు నిండిన హాలాహలాన్ని
తరతరాల సంపదగా
జబ్బలు చరుచుకుంటుందే
‘పాపం.. పిచ్చివాడ’ని జాలిపడడం
కాదు సుమా…
వాడు పేర్చుకొచ్చిన
శతాబ్దాల చీకట్లను
వెలుగుపూల జ్వాలలతో
ఛేదించడం…
నేటి తక్షణ కర్తవ్యం!
సజీవ చైతన్యానికి
నిజమైన నిదర్శనం!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో