అది మా నాయనమ్మ అరికట్లమే
అందంగా ‘స్కార్ఫ్’ అంటున్నారీ అమ్మాయిలు.
ముద్దబంతి ముఖాలకు బిగించిన పరదాలు
బాండేజీ కట్లల్లోంచి మిటకరించే రెండు గుడ్లు
బందిపోటు రాణియో, బందూకు ధారిణియో అనిపిస్తుంది
మనవాళ్ళో మరెవరో పోల్చుకోలేం.
ఆ కదిలే మిలమిలల ఆనవాళ్ళుతప్ప
మరమనుషుల్లా ఉంటారు
హలోలూ, హావభావాలూ లేవు.
కాలు విరిగి ఇంట్ల పడేదాక
కట్టుబాటు బానిసలే!
ఇది చారిత్రక నేపథ్యమా!?
మరి సాంస్క ృతిక వారసత్వమా!
కాదు… కాదు స్వచ్ఛంద బురఖాధారణే
తరచి చూస్తే
బహు ప్రయోజనాలేననిపిస్తుంది.
ఇది కాలానుగుణంగా కాపాడే సఖి
దుమ్ము ధూళి పొగపొల్యూషన్నూ వడపోస్తుంది
సరదాకో సంబురానికో కాదు
రంగు రంగుల పల్చని కొంగులు
ఆసిడ్ దాడులు అత్యాచారాలకు జడిసి
నక్కలకూ తోడేళ్ళకు బెదిరి
ముందే ముఖం చాటేసుకుంటున్న మగువలు.
పాలకులూ, ఏలికలూ, చట్టాలూ, చుట్టాలపై
సన్నగిల్లిన నమ్మకమే
ఉక్కపోసే ముసుగుల నాశ్రయించింది.
చేతులు కాలకముందే ఆకులు పట్టుకునే వైనం
అందం, అలంకరణ, బొట్టూ, కాటుక,
నవ్వులు, నగలూ, అన్నీనూ
ఆ ఇనుపతెర మాటున సమాధేపాపం.
అర్థరాత్రి ఆడది తిరిగే రోజేమో కానీ..
పట్టపగలు గుండెనిండా
గాలి తీసుకునే రోజులొస్తాయంటారా!
-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
