భూమిక – బి. గోవర్ధన

నేనొస్తూ!
వసంతాన్ని మూటగట్టి తెస్తాను
ప్రేమ పుష్పాన్ని.. పండు వెన్నెల్ని
సుగంధ పరిమళాన్ని.. పచ్చదనాన్ని
ఎడారిలో నీటి చెలమను.. సప్తవర్ణాల స్వప్నాన్ని తోడ్కొనివస్తాను-
– ఇంకా
నీకు మాత్రమే నచ్చినవి
నాకు ఏమాత్రం నచ్చనివి
నన్ను తెమ్మని.. మరెన్నో అడిగినవి!
– ఎలాగో.. ఒకలాగ
నాతల్లిదండ్రుల్ని.. తోడబుట్టినవారిని.. ఇబ్బందిపెట్టి
నీ గొంతెమ్మకోర్కెలు తీర్చడానికి
నా జీవితకాలం.. నీకోసం
నాలుగు గోడల మధ్య చాకిరీనౌతాను!
– తర్వాత తెలుస్తుంది!
నాదొక విరిగిన స్వప్నమని.. భ్రమల్లో వున్నాననీ!!
నేను పంజరంలో తిరుగుతూ
వెట్టి బానిసలా తయారౌతాను.
అదే స్వేచ్ఛనుకుంటాను-
– చివరకు!
అందరూ ఏకమై
నా సహజ జీవిత మాధుర్యాన్ని మట్టుబెట్టాలనీ
నన్ను తగలెట్టాలనీ కుట్ర చేస్తారు!
నా భూమిక ఏమిటో అపుడు అర్థమౌతుంది!
నా అస్థిత్వం నవచైతన్యమవుతుంది-
కుటుంబహింసపై పోరాటమవుతుంది-

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.