శ్రీమతి ఝాన్సీ కె.వి. కుమారి అం’తరంగం’ – డా|| సి. భవానీదేవి

ప్రముఖ రచయిత్రి ఝాన్సీ కె.వి. కుమారి మానస సముద్రం లోంచి ఎగిసిన తరంగాలు ఈ కాలమ్‌ వ్యాసాలు. నాలుగేళ్ళు వార్త ‘చెలి’ పేజీలో ధారావాహికగా వెలువడిన ఈ వ్యాఖ్యాన పరంపర అనేక సామాజికాంశాలపై విల్లెక్కుపెట్టి పదునైన బాణాలను సంధించింది. బలమైన తార్కికశక్తితో భాషామాధుర్యం భావపటుత్వం, విశ్లేషణా వైశిత్యం, సుకుమార చమత్కారం, విసిరే వ్యంగ్యాస్త్రాలతో హేతుబద్ధంగా పాఠకుల్ని ఆలోచింపచేయగల సత్యాన్వేషణాంతరంగంతో సాగించిన కలం సాధన. అక్షరాలా అక్షర ప్రస్థానం ఈ రచన!

ఈ శీర్షికా వ్యాఖ్యానాలు 85 సంఖ్యలో కన్పిస్తూ రచయిత్రి లోకానుభవాన్నీ, స్నేహప్రియత్వాన్నీ, లౌకిక భావాలనూ, శాంతి ప్రియతనూ, ప్రేమకాంక్షనూ వ్యక్తం చేస్తాయి. ప్రతి అంశాన్నీ బలంగా వ్యాఖ్యానిస్తూ జీవితం పట్ల మానవతా దృక్పథంతో, ఆశాభావంతో మార్గదర్శనం చేయగల సాధికారత కన్పిస్తుంది. ఇవి రాసి పదేళ్ళయినా ఇప్పటికీ కొన్ని సమస్యలు మరింత దృఢంగా పట్టి పీడిస్తున్నాయంటే శోచనీయమే! సముద్రం హోరు, జలపాతం జోరు, నదీ ప్రవాహ సదృశ ప్రజ్ఞ, కొండవాగుల చురుకుదనం, ఇవన్నీ కలసిన అక్షర ప్రవాహం ఈ ”అంతరంగం”.

ఈ వ్యాఖ్యాన వ్యాసాల్లో మనిషి అహంకారాన్నీ, ప్రజాస్వామ్యం గురించి, ప్రేమ, స్త్రీ సమస్యలు, స్నేహం, డబ్బు, క్లింటన్‌, సంవత్సరాది, మౌనం, అహింస, టి.వి, మానవతావాదం, రోడ్డు, క్రైస్తవం, త్యాగం, శబ్దకాలుష్యం, యుద్ధోన్మాదం, సత్యం-ధర్మం. ఐకమత్యం, గురువు, డాక్టర్లు, దేశం, గాంధీజీ, ఇలా బహుముఖీయమైన అంశాలమీద లోతైన విశ్లేషణ కన్పిస్తుంది. డా|| విద్యాసాగర్‌ గారు ముందుమాటలో ‘ప్రపంచ భాష్యం’ అన్నారు. నిజమే! ఇందులో ఎంచుకున్న వస్తు విస్తృతి అలాంటిది. ఏ వస్తువును తీసుకున్నా విశ్లేషించి, వ్యంగ్యీకరించి, చురకలేసి కన్నీళ్ళుకార్చి, ఉద్వేగం పంచుకొని, ఆందోళన చెంది, ఆశావహంగా ముగించటం విశేషం, అన్నింటికీ కేంద్ర బిందువు మనిషే. మానవతావాదం ఆమె స్వరం. పరోపకారం, దేశక్షేమం ఆమె ఊపిరి.

నిజంగా ఇలాంటి లోకంలో మనమంతా ఎంత ఆనందంగా ఉంటాం. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి.

స్త్రీలు, దళితులు, గిరిజనులను లేళ్ళతో పోల్చారు రచయిత్రి. లేళ్ళనే బలి ఇచ్చే ఆటవిక సంస్క ృతిని నిరసించారు.

మరోచోట ”స్నేహకెరటం తాకని జీవితం పెద్ద ఎడారిలో ఒంటరి పయనం” అన్నప్పుడు మనలో చాలామంది అలాంటి ఎడారుల్లోనే ప్రయాణిస్తున్నామనీ అప్పుడప్పుడూ కొందర్ని మరీచికలుగా భావించటం జరుగుతుందనీ అన్పిస్తుంది. కార్టూనిస్టులను ‘చిలిపి శిల్పులు’ అనటంలో ఝాన్సీ చమత్కారం మనసును ఆకట్టుకుంటుంది.

మనల్ని ఆలోచింపజేసి, ఆర్ద్రం చెడే మరో దృశ్యాన్ని కళ్ళముందు నిలబెట్టారు. గుడిలో ఏముందంటూ ”బయట బారులు తీరిన బిచ్చగాళ్ళు, గుడిలో కిలోల బంగారంతో విగ్రహాలు” అంటారు! బంగారు భూమిలో దారిద్య్రరేఖ బలంగానే గీసుకున్నాం కదా!

ఝాన్సీగారి కలం రాయదు. మనతో నేరుగా హాయిగా మాట్లాడుతుంది. వింటుంటే ‘నిజం సుమా!’ అన్పిస్తుంది. మాయాబజార్‌ సినిమాలో చెప్పిన అసమదీయులు, తసమదీయులను విశ్లేషిస్తూ చిన్నప్పటి ప్రతిజ్ఞ ”భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సహోదరులు” గుర్తు చేస్తారు. ఇప్పటి పాఠ్యపుస్తకాల్లో ఆ ప్రతిజ్ఞను ఉంచారో తీసేశారో నాకు తెలీదుగానీ మతం, కులం, వర్ణం, ప్రాంతం, జెండర్‌, ఆర్థిక వర్గాలుగా ముక్కలు ముక్కలుగా విడిపోయిన నేటి ఖండభారతంలో అందర్నీ కలిపే దారం మానవత్వమే! మనందరం ముందు మనుషులం అనే స్పృహే!

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో