అల్లూరయ్య మైసూర్‌ పాక్‌ – రమాసుందరి బత్తుల

1 జులై, 1991
జీతాలు వచ్చాయి. ఆఫీసులో సందడి మొదలియ్యింది. కొలీగ్‌ దగ్గర రెవెన్యూ స్టాంప్‌ అడుక్కొని, నోటితో తడిచేసి అంటించి కేషియర్‌ దగ్గర సంతకం పెట్టి డబ్బులు తీసుకొన్నాను. ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టుకొన్నాను. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఆ పందొనిమిది వందల యాభై ఆరు రూపాయలే. భద్రంగా పర్సులో దాచుకొని బస్‌ ఎక్కాను. ఒంగోల్లో దిగాక అల్లురయ్య కొట్టుకి వెళ్ళి అరకేజీ మైసూర్‌ పాకు అరిటాకులో ప్యాక్‌ చేయించుకొని పాతిక రూపాయలు ఇచ్చాను. తలవంచుకొని ఇంటికి నడుస్తుంటే ఇంటి ఖర్చులు నా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. ప్రతి నెల వేసే లెక్కలే.

అయిదొందలు ఇంటి అద్దె కట్టాలి. నాలుగొందలు పచారి కొట్లో ఇవ్వాలి. పాలకు రెండొందలు, మహిళా సంఘం వాళ్ళకు ప్రతినెలా ఇచ్చే రెండు వందలు ఎటూ తప్పదు. కరెంటు బిల్లు వందయినా రాదూ ఈ నెల! జూన్‌ ఉక్కకు ఉన్న ఒక్క ఫాను తిరిగింది తిరిగినట్లే ఉంది మరి. బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవి కొనటానికి ఎప్పుడో పాడుకొన్న చీటి పాటకు రెండు వందలు పూర్తిగా కట్టాలి ఈ నెల. చివరి నెలలు వచ్చాయి కదా. ఇంకా నా బస్‌ ఛార్జీలు, కూరగాయలు, అప్పుడప్పుడూ పండ్లు, ఏమైనా పుస్తకాలు… తల గిర్రున తిరిగింది. డబ్బులు కూడేసి ఒక ప్యూర్‌ సిల్క్‌ చీర కొనుక్కొందామనుకొంటే కుదరటం లేదు. చీర సంగతి పక్కన పెడితే మధ్యలో ఏదైనా ఇంట్లో అనారోగ్యం వస్తే పరిస్థితి ఏమిటి? ఎవరినైనా అడుక్కోవాల్సిందే కదా. డబ్బులు ఎలా మిగులుతాయో తెలియటం లేదు.

చేతిలో మైసూర్‌ పాక్‌ పాకెట్టు బరువుగా అనిపించింది. ఇలాంటి పిచ్చి ఖర్చులు చేస్తే డబ్బులు ఎలా మిగులుతాయి? రేపు పిల్లలు పుడితే పరిస్థితి ఏమిటి?

అయినా జీతం ఇంకో అయిదు వందలు పెరిగితే బాగుండు కదా! కొద్దిగా లిబరల్‌గా ఖర్చు పెట్టుకోవచ్చు.

1 జులై 2014

రైల్వే గేటు దగ్గర కారాపాను. చేతిలో మొబైల్‌ విచిత్రమైన సౌండ్‌ చేసింది. ఎస్సెమ్మెస్‌ వచ్చినట్లుంది.

”యువర్‌ అక్కౌంట్‌ ఈజ్‌ క్రెడిటెడ్‌ యాన్‌ అమౌంట్‌ ఆఫ్‌ 88016 రూపీస్‌.” అమ్మయ్య. ఈ నెల ఒకటికే సాలరీస్‌ పడ్డాయి. ఒంగోల్లోకి ఎంటర్‌ కాగానే వచ్చిన ఏటియమ్‌లో పదివేలు డ్రా చేశాను. చాలా రోజులైయింది అల్లూరయ్య మైసూర్‌ పాక్‌ తిని. ఆ ఆలోచన రాగానే నేరుగా ఆ షాప్‌ దగ్గర కారు ఆపాను.

అరిటాకులో చుట్టి ఇచ్చిన అరకేజీ మైసూర్‌ పాక్‌కి ఏటియమ్‌ లోంచి తీసిన కట్టలో నుండి రెండు వందలు ఇస్తుంటే కొద్దిగా పించింగ్‌గా అనిపించింది. ఈ పది వేలలో ఇంటిలోను ఏడు వేలు కట్టాలి. మిగిలిన మూడు వేలు వెంటనే మహిళా సంఘం వాళ్ళకు పంపాలి. వాళ్ళు అసలే ఇబ్బందుల్లో ఉన్నారు. పిల్లలిద్దరికి చెరో అయిదు వేలు ఆన్‌ లైన్‌ ట్రాన్స్ఫ్‌ర్‌ చేయాలి. అంత దూరంలో చదువు కొంటూ ఐదు వేలతో సర్దుకొంటున్నారంటే మా పిల్లలు జాగ్రత్త  పరులే.

కరెంట్‌ బిల్‌ ఏడు వేలు వచ్చినట్లుంది. మరి సమ్మర్‌ కదా. పిల్లలు కూడా పోయిన నెల ఇంట్లోనే ఉన్నారు. ఏసి వేసింది వేసినట్లే ఉంది. వాళ్ళు ఎప్పుడో కదా వచ్చేది ఇంటికి. ఈ ఒంగోలు ఎండలకు అది లేకపోతే కష్టమే. రెండు లాండ్‌ లైన్ల బిల్లు మూడు వేలు దాకా వస్తుంది. పోనీ ఒకటి తీసేస్తే? పిల్లలు వచ్చినపుడు నలుగురికి ఇంటర్నెట్‌ స్పీడ్‌ చాలటం లేదు సింగిల్‌ లైన్‌తో, అన్నట్లు పనమ్మాయి అర్జెంట్‌గా జీతం కావాలని అంది. ఐదు వేలు మళ్ళీ డ్రా చెయ్యాలి. సూపర్‌ బజార్‌ వాడు నిన్ననే బిల్‌ పంపాడు. అదీ ఐదు వేలు వచ్చింది. పాలకు పదిహేను వందలు తప్పదు. మూడు పేపర్లు, మాగ్జైనులు ఇంకో వెయ్యి. పెద్దాడి ఎడ్యుకేషన్‌ లోను ఇంట్రెస్టు మూడు వేలు. పని లేనట్లు పోయిన నెల ఒక ఆర్డీ మొదలు పెట్టాను. దానికి మూడు వేలు కట్టాలి. ఈ నెల్లో కాస్త షాపింగ్‌ చేసి కొన్ని చీరలు కొనాలి. కళానికేతన్‌లో లేటెస్టు వెరైటీ వచ్చిందట.

ఉన్నట్లుండి కారు సడన్‌ బ్రేక్‌ వేశాను. చిన్నాడి సెమిస్టర్‌ ఫీజు ఈ నెలే కదా! పాతిక వేలు వాడికి పంపాలి. మర్చేపోయాను. వాడిది గవర్మెంటు చదువు కాబట్టి సరిపోయింది. ఇక మిగిలింది ఎంత? నోటితో లెక్కేశాను. పదిహేను వేలు. నా డీజిల్‌ ఖర్చు అయిదు వేలు దాకా వస్తుంది. ఇక కూరగాయలు, పండ్లు, మందులు, పిల్లలు వస్తే సినిమాలు, బట్టల ఐరన్‌, సెల్‌ఫోన్ల రీఛార్జింగ్‌… చాల్తాయా? పక్క సీటులో ఉన్న మైసూర్‌ పాక్‌ పాకెట్టును అయిష్టంగా చూశాను. ఇప్పుడీ పిచ్చి తిండి కొనకపోతే ఏమయ్యింది? ఇలాంటి చిల్లర మల్లర ఖర్చులు ఆపాలి.

ఆయన జీతం ఈ కారులోను, బండి లోన్లకు పోను కాస్తో కూస్తో ఆయన చేతి ఖర్చుకి సరిపోతుంది. ఎన్నో రోజులుగా కొత్త పీసీ కొనుక్కోవాలని అడుగుతున్నాడు. ప్రతి నెల ఏదో అదనపు ఖర్చు వస్తూ కొనలేకపోతున్నాము. ఖర్చు పెట్టటం తెలియని మనిషి కాబట్టి సరిపోయింది. అయినా జీతం ఇంకో యాభై వేలు పెరగకూడదు! కాస్త లిబరల్‌ గా ఖర్చు పెట్టుకోవచ్చు!

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.