బిడ్డను మింగిన తండ్రి – యమ్‌. అనిత, 8వ తరగతి, సమతా నిలయం, వర్ణి.

అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పచ్చని పొదలతో పచ్చని చెట్లతో నిండి ఉన్నది. ఆ ఊరి పేరు రామంపేట్‌. ఆ గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వారి ఇద్దరి పేర్లు రమణ, వెంకటేష్‌. వాళ్ళకి ఒక కొడుకు కూతురు. ఇద్దరు చదువుకొనేవారు. వాళ్ళ పేర్లు అనూష, పవన్‌. వెంకటేష్‌ వాళ్ళకి కొద్దిగా పొలం ఉండేది. పొలం పనికి వెళ్ళేవాడు. రమణ ఇంట్లోనే పని చేసుకుంటూ బీడీలు చేస్తూ ఉండేది. ఒక రోజు అనూష వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చింది. అప్పుడు వాళ్ళ కూతురు డాక్టర్‌కి ఫోన్‌ చేసి రమ్మని చెప్పింది. డాక్టర్‌ వచ్చి వాళ్ళ అమ్మకు చాలా జ్వరం ఉంది. ఈమెను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంతలో అమ్మకి జ్వరం వచ్చిందని అనూషను ఇంటికాడ ఉంచి పవన్‌ను స్కూల్‌కి పంపించేవాడు వాళ్ళ నాన్న. ఒకరోజు అనూష వాళ్ళ నాన్నను ఇలా అడిగింది. నాన్న నేను ఇంటికాడ ఉండను. నేను స్కూల్‌కి వెళ్తాను ఇంట్లో అమ్మకి సాయం చేస్తూ స్కూల్‌కి వెళ్తాను అంది. అవసరం లేదు. నువ్వేం చదువుకొని ఉద్ధరిస్తావు అన్నాడు కోపంగా వెంకటేష్‌. మరీ తమ్ముడిని ఎందుకు చదివిస్తున్నావు నాన్న అని, బాధగా అనూష అడగబోతే ఎందుకంటే వాడు మగపిల్లాడే నీకెందుకు చదువు? అనూష నువ్వు నోరు మూసుకొని ఇంట్లో పడిఉండు. మేము చెప్పిన పని చేయాలి అని వాళ్ళ నాన్న గట్టిగా బెదిరించాడు. ఆ… ఆ… నేను చదువుకుంటాను అంది ఏడుస్తూ అనూష. అలాగే తమ్ముడు కూడ వాళ్ళ నాన్నకే సపోర్టు ఇస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ జ్వరంతోనే మూలుగుతూ ఏం తినలేక చనిపోయింది. నాన్న ఒక రోజు ఏం  చేసాడంటే ఆమెకు పెళ్ళి సంబంధం చూసాడు. అప్పుడు, అనూష నేను ఈ పెళ్ళి చేసుకోను నేను చదువుకుంటాను. అని మొండికేసింది. ఏడ్చి గోల చేసింది. అప్పుడు వాళ్ళ నాన్న చాలా కోపం వచ్చి నాకు ఎదురు చెబుతావా అని కర్ర తీసుకొని చాలా కొట్టాడు. కొడుకు నాన్న ప్లీజ్‌ నాన్న కొట్టకు అన్నా ఎవరు కూడా ఆపుమని అనలేదు. వాళ్ళ నాన్న వెంటనే పెళ్ళి కొడుకును వెతికి పెళ్ళి చేసి పంపాడు. ఆమెను అత్తగారింట్లో పని చేస్తుండగా ఆమె భర్త పిలిచినా పలకలేదని మెల్లగా వచ్చి రోకలి బండను తీసుకొని ఆమె తలపైన కొట్టాడు. అప్పుడే చాలా రక్తం కారింది. కళ్ళు తేలేసింది. అప్పుడు అతనికి భయం వేసింది. ఈ విషయం వెంటనే 108 కి ఫోన్‌ చేసి రమ్మని చెప్పారు. అంబులెన్స్‌ వచ్చి తీసుకొని వెళ్తుండగా దారిలోనే అనూష చనిపోయింది.

ఈ విషయం తెలిసి తండ్రి కొడుకు ఇద్దరు పరుగు పరుగున దగ్గరికి వచ్చారు. శవమైన అనూషను చూసి తండ్రి కొడుకు చాలా బాధపడ్డారు. నా కూతురుని ఒప్పించి నీకిచ్చి పెళ్ళి చేస్తే నా బిడ్డను చంపేస్తావారా. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను మింగేస్తావా అని వెంకటేష్‌కి చాలా కోపం వచ్చింది. కత్తి తీసుకొని నరికేయబోయాడు. అందరు అల్లుడిమీదకు పోతున్న అతనిని ఆపారు. అంతలోపు పోలీస్‌లు వచ్చి అతనిని జైల్లో వేసేసారు. అతనికి 6 నెలలు శిక్ష విధించారు. అప్పుడు తండ్రికి అనిపించింది. నేను నా బిడ్డను చదివిస్తే ఎంత బాగుండేది. అప్పుడు నాకు తెలియలేదు. అది ఎంత ఏడ్చినా వినలేదు. నా బిడ్డను నేనే దూరం చేసుకున్నాను. కాని ఇక నుంచి అయినా బుద్ధిగా ఉంటాను. కాని ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. అప్పుడు తండ్రి ఊళ్లోనే పొలం పనికి వెళ్తూ కొడుకును కష్టపడి చదివిస్తూ వారిద్దరు సంతోషంగా ఉన్నారు.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.