రోడుపాల్జేస్తె సెత్తకింద నలగ్గొడుతం

జూపాక సుభద్ర

గౌరుమెంటు సార….

ఇరువై ముప్పైయేండ్లసంది రోడ్లడ్సి వూడ్సి సీపురుకట్టలరిగిపొయినట్లు అరిగిపోతిమి.

  అర్థరాత్రి, అపరాత్రి, పగలు రాత్రనక పంజేత్తిమి.  దొంగలకు, లంగలకు, కుక్కలకు, కుక్కలసోంటి మనుషుల బారినబడి ఆగమైతిమి.  తాగి తడిపిన వెటర్ల జోరుల కిందబడి మా పాణాలుబాయె.  రోడు పొక్కిలైతె అగమేగాలమీద బాగుజేత్తరు.  కంకెర కల్సిన డాంబరి రోడ్లకంటె మేం కనా కష్టెమా!  మా బతుకు పొక్కిలి మీ కండ్లకానదా!
అద్దాలోలె రోడ్లడిస్తిమి.  ఇయ్యల, రేపు పర్మనెంటయితమని గిన్నేండ్లసంది కొండకెదురుససినట్లు ఎదిరిసత్తిమి.  మాసేతులు మొండి సెత్తను ఎత్తిపోసి, ఎత్తిపోసి కంకెర దేలినట్లు మా నరాల్దేలినయి.  గీ మిషిండ్లు దెచ్చి రోడ్డుమీని సెత్త యెత్తేసినట్లు మా బత్కుల్ని ఎత్తేసిండ్రు.  మా సీపురు సేతులకు మిషిండ్లకు పోటిబెట్టిండ్రు.
కొండమీది జేజెమ్మలను దించేంత పొడుగైనం, పొగసరినం అని, మమ్ముల జూడు మా అభివృద్ధి జూడని సెప్పుకొని మురువ ససుకొని యేడ్వ అని గీ మిషిండ్లను నువయిష్‌ జేస్తుండ్రు.  కాని మీ లోపటి మతులావులు మాకెరికే. తెలువయను కోకుండ్రి.  ఏ రోడు ఎక్కడికి బోతది మట్టిదా, కంకెరదా, సిమిటిదా, డాంబరుదా, ఏ రోడు లెక్కెంత అనేది సెప్పెటోల్లం, గా గడ్డబల్సిన  దేశాలల్ల, బ్యాంకులల్ల అప్పులు బుట్టించుకునే దానికి, ఎంగిలి మెతుకులడు క్కునేదానికి, మూతినాకుల్లకు గీ మిషిండ్లను ముందట వెట్టిండ్రు మమ్ముల బాయిల నకి.  పక్కా రోడ్లకోసం మా బత్కుల్ని కచ్చారోడ్లం జేత్తరా. 
సుట్టుముట్టు పల్లెలు నట్టనడుమ గీ పట్నాలు బెరుగుతున్నయి.  అట్లనే మంచిసెడ్డ తెలివి బెరుగుతంది.  గిది అందరికి కుతికెబడ్డట్లున్నది.  మనుషుల కంటె గియి శాన అగ్గువ అని సెప్తుండ్రు.  మనుషుల్ని వయంజేసి మిషిండ్లను జూయించి ఎల్లయి ఏడు పయ్యయిపదిగా పెరుగుతున్న పెద్ద దేశం అవుతున్నమని పెగ్గెలకు బోతుండ్రు.  జవజీవాలున్న మనిషికంటె మిషిని ఫాషనైంది మీకు.  ‘జి’ బల్సిన పెద్ద దేశాల్తోని ఏడుదో పిల్ల బుడ్డదేశాలు పోటిపడి మా బక్కోల్ల బతుకులను రోడుపాల్జేసెదానికే గీ మిషిండ్లు.
ఇక్కడి రోడ్లు మా సెమటకలు వాటుబడ్డ ఎత్తువంపుల రోడ్లు, గతుకులు, బొతుకులు గాయిది, గర్కాసి లొందల, బొందల రోడ్లు.  గిసోంటి రోడ్లను పెద్దదేశాలల్ల ఒక లెవల్‌తోని, ననెబడితె ఎత్తుకునేటట్లుండే నున్నటి రోడ్లునడ్సిన మిషిండ్లడుస్తయ!  గవి మా అసోంటి మున్సిపల్‌ మనుషులా రోడ్లెట్లున్నా వంపులు దింపులున్నా, దిగుకుంట, ఎక్కుకుంట అన్నిటికి రోసి వూడ్సెదానికి.  ఏతులకు బొయి తెచ్చుకున్నరు కొన్ని కోట్లుబోసి.  గిప్పుడు తెలుస్తది మిషినంటేందో మనుషులంటేందో…దుక్కం లేనోడు ఒక్క బర్రెను కొనుక్కున్నట్లున్నది మీకత.
గీకుల సమాజం నీచంగ, హీనంగ జూసే రోడ్లడుసుడు, రోడ్లమీన కక్కిన, ఏరిగిన, వుచ్చబోసిన, గొడ్డు సచ్చినా, గోద సచ్చిన సెత్త పచ్చిది ఎండింది అంత సాపుజేత్తిమి.  డ్రైనేజి కాల్వలు కడుగుడు, మలమెత్తిపోసుడు పనులన్ని పల్లెలిడిసి పట్నాలకొచ్చినా మమ్ముల్ని యిడిసిపెట్టలే…  కాలం కాలువల ఎన్ని సమాజాలు కొట్కపోయినా గీకుల సమాజం కొట్కపోలే… రాజరికంకాన్నుంచి పెట్టుబడిదారికాలందాక గీ పారిశుద్దెం పనులని మా అంటరానోల్లకే అంటగట్టింది.
అభివృద్ధి అదునాతనం అని సెప్పే మీ గౌరుమెంటు ఆఫీసు కక్కోసుల్ల, రైల్వే స్టేషండ్లల్ల పట్టాల పరిశుద్యాలల్ల మేం దప్ప వేరే కులాలె కనబడయి ఎందుకో జెర జెప్పుండ్రి.  అగ్రకులమనే హైందవసవజం ముక్కు, మూతి మూసుకొని దరముండిన గీ రోతపనులు జేసి బుక్కెడు బువ్వ తింటన్న దయనీయంలో బతుకుతున్నోల్లం.  గీ మిషిండ్లు దెచ్చి మా నోటికాడి బుక్కను తొక్కుతుంటిరి.  మా పనికి, బతుక్కు ఏ గ్యారంటి లేనోల్లం.  మా లందతోల్లను గుంజు కొని మమ్ముల బొందల నకి మీరు అందలమెక్కితిరి.  గిప్పుడు గీ మిషిండ్లు దెచ్చి మమ్ముల రోడుపాల్జేసిన సెత్తైన దళితాడోల్లము.  మనిషిజాతిని బమ్మీదేసే కానుపుల యిద్దెలు వయే.  యీ భూమికి పచ్చలద్దే పచ్చబొట్లం మేమే.  రోడ్లను దువ్వి ముడిసి ముస్తాబులు జేసేది మేమేనాయె.
మనుషుల్ని పనుల్ల బెట్టుకుంటే తెలివిమీరుతుండ్రని గీ మిషిండ్లు ఏ లొల్లి జెయ్యవనుకుంటుండ్రు.  జీతం బెంచుమని అడుగయి, పర్మనెంటు జెయ్యిమని బైటా యించయి, రాత్రిపూట రక్షణ గావాలనయి, గియన్ని నెత్తి నొప్పెందుకని, యింకా మీదికెల్లి అన్ని కమీషండ్లు గీ మిషన్‌ పేరు మీద దొబ్బొచ్చని, రిపేర్లకని కొనుగోల్లకని కోట్లకు కోట్లు దండుకోవచ్చని గీ మిషిండ్ల మీద వెజుపడ్తండ్రు.  ఆకలిదప్పుల్లేనియి, నోరు వాయిలేనిది అని అనుకుంటండ్రు.  గాని దాని శోకం దానిదే.  దాని బతుకు సెత్తలకే వత్తది జూడుండ్రి.
మా సీపురుసేతుల కంటె గీ కోట్ల మిషిండ్లు తురుంకాండ్లా…గప్పుడెప్పుడో శానేండ్ల కింద మనుషుల్ని కాదని మిషిండ్లు దెస్తే మేంజేసినట్లే వాల్లు పొల్లుపొల్లు పోడుపోడు జేసిండ్రాట గౌరుమెంటు సార జెర యినుండ్రి…పులిదేశాలను జూసి నక్కదేశాలు వాతలు బెట్టుకొనుడెందుకు, ఆ వాతలకు సచ్చిపోవుడెందుకు.  మన కాడ పంజేసే సేతులకు కొదువలేదు.  గీడ కొండల్ని పిండిజేసే కండలున్నయి.  మాకు బడేసే కొసిరి కొసిరి జీతాలకంటె మీరు దెచ్చిన తెల్లఏనుగులసోంటి మిషిండ్ల మేతకు, పనికి, దాని రోగాలకు అయ్యే కర్చు మీ ఖజానాలకు తట్లుబడ్తయి.
కడుపుల సల్లకదులకుంట తిని కూసునే రికామీ దేశాలకు మనుషులకు మిషిండ్లు అల్షేషన్‌ బొచ్చుకుక్కలే.  కాని కడుపుల ఆకలి తీరని మాకు పోటిగ మిషిండ్లొస్తె సెత్తకింద నలగ్గొడ్తం.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో