స్త్రీవాదోద్యమంలో ఉద్యమసింధువు అన్ను విజయకుమారి

డా. శిలాలోలిత

స్త్రీలు స్త్రీవాద ఉద్యమ కేతనాన్ని చేత ధరించి సమానత్వపు శిఖరాన్ని అధిరోహించడానికి, అనేక అవరోధాలను అధిగమించారు.

  గెలుపుకు చేరువయ్యారు.  కొంతమేరకు చేరుకున్నారు.  దానికి నిదర్శనంగానే సాహితీ వాతావరణంలో ‘అన్ను విజయకుమారి’ వంటి కొత్త మొలకల్ని సృష్టించింది స్త్రీవాద ఉద్యమ సాహిత్యం.

ఇటీవలే, ‘తెనాలి’లో కవిత్వం చదవడానికి వచ్చి ఈ ‘ఎంతెంతదరం’ కవిత్వ పుస్తకాన్ని చేతిలో పెట్టింది.  స్త్రీల కవిత్వాన్ని విశ్లేషించడానికి వెళ్ళిన నాకు ఈ కవయిత్రి కొత్తపుస్తకం సంతోషాన్నే కలిగించింది.
ప్రకాశం జిల్లాలోని ‘పేర్నమిట్ట’లో ‘టీచర్‌’గా ఉద్యోగం చేస్తున్నారు.  ఈ పుస్తకాన్ని ఆమె తండ్రి ఆదిశేషుకి అంకితమిచ్చింది.  ముందుమాటలు కె. శివారెడ్డి, ప్ర.ర.సం. అధ్యక్షులు బి. హనుమారెడ్డిలు రాశారు.  ‘చేయాల్సింది ఎంతో వుంది’ – అంట విజయకుమారి తానెందుకు రాస్తుందో ఇలా చెప్పింది.  ‘నాలోని వూపిరి తనకు తానుగా శిల్పీకరించుకున్న ప్రపంచంలో ఏళ్ళ తరబడిగా అన్వేషణ, అంతర్ముఖంగా మారి కీలక సన్నివేశాలను విశ్లేషించుకుంటూ, పదాలు నేర్చుకుంటూ… ఆశల గటిలో కొత్తవటల కోసం వెతుక్కుంటూ…’ రాస్తున్నానని తన కవిత్వ నేపథ్యాన్ని చెప్పింది.  ఈ సంకలనంలో మొత్తం 42 కవితలున్నాయి.  చిత్రమేమంటే కవితాపుస్తకాలు, కథల పుస్తకాల పేర్లు కొన్ని కవితాశీర్షికలయ్యయి.  తురాయిచెట్టు – యన్‌. శైలజ, ఆకురాలుకాలం – మహెజబీన్‌, ఎంతెంతదరం – శిలాలోలిత, ‘సందర్భం’, ‘వెన్నెల’, ‘లోలకం’, ‘వరదగడు’, ‘గమనం’ ఇలా మరికొన్ని.  ఆయ పేర్లుగాని వాటిలోని రచనాసారంగానీ కవయిత్రిని ప్రభావితం చేసుండవచ్చు.  లేదా నచ్చుండవచ్చు.  కాకతాళీయమూ కావొచ్చు.
 ‘స్వేచ్ఛానీలాకాశం క్రింద
  మబ్బు పొత్తిళ్ళలో
  కొత్త ఆశల్ని మొలిపించుకుంటూ’
– విజయకుమారి కవితాప్రస్థానం మొదలైంది.  పిడికిట్లో దుఃఖం కవితలో ప్రాంతీయ అసమానతల గురించి తన ఆవేదనను ఆరాటాన్ని వ్యక్తీకరించింది.
 సామాజిక సమస్యల్ని విశ్లేషిస్తూ రాజకీయ స్పృహతో రాసిన కవిత ‘మేడిపండు’.  ‘లేత మొక్కలకు కొత్త చివుళ్ళ ఆశల మొగ్గలేయిద్దాం’ అనే ఆశావాదంతో రాసిందది.
 ఒక గొప్ప జీవనసత్యాన్నిలా చెప్పింది.  కంఠనాళాలు తెంచుకున్న సిరాచుక్క అక్షరమై వర్షిస్తుందని కలానికి నమస్కరిస్తున్న ఓ మబ్బ! ఈ సత్యం నీకు తెలుసా? కలాన్ని దోచుకోవాలంటే సిరాచుక్కయి పుట్టాల్సిందే!’.
‘ఒక వసంతం కోసం’ కవితలో – గాయల్ని వెదకే ముందు
గాయం కాని చోటెక్కడో వెదకు
– అంటూ స్త్రీలు ఎటువంటి హింసలకు గురవుతున్నారో ఎంతో ఆర్ద్రతతో చెప్పారు.
స్నేహ ఔన్నత్యాన్ని గురించి ‘నందనవనం’ కవితలో ఎంతో హృద్యంగా చెప్పింది. 
స్త్రీలు చేసే యుద్ధం అనివార్యమనడంలోనే ఈ కవయిత్రికున్న మెచ్యరిటీ, స్త్రీవాదసిద్ధాంత అవగాహన స్పష్టంగా తెలుస్తోంది.  ‘నియంత్రణరేఖల పునర్వించడానికి, నిబద్ధతలేని నీతిపై కొరడా త్రిప్పడానికి చరిత్ర అనుమతి అఖ్కర్లేదంటుంది.
విజయకుమారి స్త్రీవాద ఉద్యమస్ఫర్తితో మన ముందుకు వచ్చిన కొత్త కవయిత్రి.  ఆమె భావాలలో తీవ్రత, కవిత్వంలోని అవగాహన, స్త్రీల సమానత్వ సాధనకై ఆమె అక్షరాలలో ఒలికించిన తపన, అన్వేషణ, సుస్పష్టం.  మంచి కవిత్వాన్ని చదివిన అనుభతిని కలిగించిన అన్ను విజయకువరి కవితాసేద్యాన్ని మరింతగా చేయలని అభిలషిస్తున్నాను.

Share
This entry was posted in మనోభావం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో