నల్ల తేజం

పి. సత్యవతి
బానిసత్వపు సంకెళ్ళలో మగ్గుతూ, వర్ణవివక్షను, పేదరికాన్నీ, అవమానాన్నీ ఎదుర్కుం టూ జీవన మమకారాన్నీ, ఆశనీ కోల్పోకుండా కాపాడుకుంటూ,

 బ్రతుకుపోరు ప్రారంభించి, కొనసాగించి, కొంత విజయం సాధించటానికి తమ శక్తియుక్తుల్ని ధారపోసిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళల గురించి, వారి పోరాట పటిమ, ధైర్యసాహసాలు, త్యాగశీలత, హృదయ సౌకుమార్యం గురించి తెలుసుకున్నప్పుడు స్త్రీలుగా మనందరికీ వుండే సమస్యలేకాక బానిసత్వమనే అతిహీనమైన, అమానవీయ అణచివేతపై తిరుగుబాటుతో ప్రారంభమైన వారి హక్కుల సమరం ఎన్ని మెట్లు అధిరోహించిందో అర్థం అవుతుంది.

  బానిసల్ని కొనుక్కోడం వాళ్లని సంకెళ్లతో బంధించి తెచ్చుకోడం ఆపైన వారిపై సర్వాధికారాలు కలిగి ఉండడం అనే ఈ అధ్యాయం చరిత్రలో ఒక చెరపలేని మచ్చ.

 బానిస స్త్రీ యజమాని ఇంట్లో, పొలంలో పనిచెయ్యడమే కాదు, అతని శారీరక వాంఛల్ని కూడా తీర్చాలి.  యజమానికి పుట్టిన బిడ్డలైనా వాళ్ళూ మళ్ళీ బానిసలే.  అట్లా తండ్రెవరో చెప్పుకోలేని పిల్లలప్పుడు ఎంతమందో.  ఉదాహరణకి శాలీహెమ్మింగ్సు అనే ఆమె థామస్‌ జెఫర్సన్‌ దగ్గర ఇంటి నౌకరుగా పనిచేసేది.  ఆయన కూతురు మేరీకి సహాయకురాలిగా వుండేది.  జెఫర్సన్‌ 1748లో పారిస్‌లో రాయబారిగా వుండేవాడు.  ఆయన కూతురు మేరీతో పాటు శాలీ కూడా పారిస్‌లో వుండేది, అక్కడ శాలీకి జెఫర్సన్‌తో శారీరక సంబంధం ఏర్పడడంతో ఆమె గర్భవతిగా అమెరికా తిరిగొచ్చింది.  ఆమెకు పుట్టిన బిడ్డలో ఆయన పోలికలు కనిపించినా చేయగలిగింది ఏమీలేదు.  ఒక బానిసని కొంటే ఆమె పిల్లలు కూడా యజమాని బానిసలే.  అట్లా బానిసత్వపు సంకెళ్ల నించీ తప్పించుకు పారిపోయినవాళ్ళు, బానిసత్వ నిర్మలనోద్యమంలో పాల్గొన్నవాళ్ళు, పట్టుబడి, భయంకరమైన శిక్షలనుభవించినవాళ్ళు ఆఫ్రికన్‌ అమెరికన్‌ సాహిత్యం నిండా మనకి కనిపిస్తారు.  మానవజాతి సిగ్గుతో తలవంచుకునేలా మన ఎదుట నిలబడతారు.  ఇన్ని అవమానాలకోర్చి ఇంకా సంపూర్ణ సమానత్వాన్నీ, ఆదరణన సాధించలేకపోయిన ఈ నల్లతేజం ఇప్పుడు ఒబామాని గెలిపించుకోడంలో ఎంతవరకూ కృతకృత్యమౌతుందో చూడాలి.

 బానిసత్వాన్ని తప్పించుకోడానికి తప్పించుకుపోయి నిర్మలనోద్యమంలో పనిచేసిన సొజర్నర్‌ ట్రత్‌ గురించి మనలో చాలామందికి తెలుసు.  ఆమె ఒహాయె రాష్ట్రంలోని ఆక్రన్‌ పట్టణంలో ఆమె చేసిన ”నేను స్త్రీని కానా” అనే ప్రసంగం చాలా ప్రసిద్ధి పొందింది.  స్త్రీలహక్కుల గురించిన సభలో ఈ ప్రసంగం చేసింది.  అలాగే హారియట్‌ టబ్మన్‌ కూడా తప్పించుకునిపోయి బానిసత్వ నిర్మలనోద్యమంలోనూ, పౌరహక్కుల ఉద్యమంలోనూ పాల్గొన్నది.  హార్లెమ్‌ రినైజాన్స్‌ ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, ఇట్లా అనేక ఉద్యవలలో పాల్గొన్న ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళల్ని గురించి తెలుసుకోడం ఇప్పటికైనా అవసరం.  హార్లమ్‌ రెనైజాన్స్‌ కాలంలోని రచయిత్రి జోరా నీల్‌ హస్టన్‌, పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు రోసాపార్కస్‌ ప్రఖ్యాత రచయిత్రులు, ఆలీస్‌ వాకర్‌, మాయ యేంజలో, ఆడ్రె లార్డ్‌, ఏంజిలా డేవిస్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత టోనీవరిసన్‌, ఇట్లా ఎంతోమంది, ఆఫ్రికన్‌ అమెరికన్‌ స్త్రీలగురించి కృషిచేశారు.

అమెరికా కోసం ఆడినవారు పాడినవారు ఎంతోమంది నల్లజాతివారున్నారు.  ట్రేసీచాప్మన్‌, విట్నీ హూష్టన్‌ వంటి ప్రఖ్యాత గాయనులు, ఊపీ గోల్డ్‌ బర్గ్‌, హాలీ బేరి లాంటి తారలు, వీనస్‌, సెరీనా లాంటి క్రీడాకారిణులు, అమెరికా ఖ్యాతిని పెంచారు.  ఓప్రా విన్‌ ఫ్రీ కన్న విజయవంతమయిన టాక్‌ షో హోస్ట్‌ ఇంకెక్కడా లేదేమో. తమ దేశంలో ఉండనివ్వడం వల్ల అమెరికాకు విదేశీయుల వల్ల అనేక బహుమతులొచ్చాయి.  ఈ నల్ల తేజోరాసులను ఒక్కొక్కరినీ పరిచయం చేసుకునేముందు ఆలీస్‌ వాకర్‌ వ్రాసిన ఈ కవిత చదవండి.

”ఓ, యు కాన్ట్‌ కీప్‌ ఏ రియల్‌ గుడ్‌ వుమెన్‌ డౌన్‌,
ఓ, యు కాన్ట్‌ కీప్‌ ఏ రియల్‌ గుడ్‌ వుమెన్‌ డౌన్‌
యు త్రో మి డౌన్ హియర్,పాపా ఐ రైజ్ అప్ సంమ్ అదర్ టౌన్”

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో