నవనాగరిక సమాజంలో
యుద్ధం నడుస్తూనే ఉంది
రెండు జాతుల మధ్య
రెండు దేశాల నడుమ
ఆధిపత్య పోరాటం
చాపకింద నీరులా
కొనసాగుతూనే ఉంది
ఎన్ని యుగాలు గడిచినా
తలరాత మారని వ్యవస్థలో
మగవాడి పద్మవ్యూహంలో
స్త్రీ ప్రాణాలను కోల్పోతోంది.
పుట్టుక కోసం ప్రాణంకోసం
మానం కోసం, జీవితం కోసం
క్షణ క్షణం యుద్ధం చేస్తూనే ఉంది.
ప్రతిక్షణం నేలకు ఒరిగిపోతూనే ఉంది
బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు
ప్రేమ పేరుతో తాళిపేరుతో
మమకారపు సుడి గుండాలలో చిక్కుకుని
రెక్క తెగిన పక్షిలా విల విల్లాడుతూనే ఉంది
స్త్రీలపై జరుగుతున్న దాడులు
వయస్సుతో ముడిపడి లేవు
నవ సమాజాన్ని నిగ్గదీసి ప్రశ్నించినా
ఉద్యమించినా అవి ఏ మూలో
ఏ గాలిలోనో కలిసిపోతున్నాయి.
సంప్రదాయం కట్టు బొట్టు స్త్రీని
వంచనకు అవమానాలకు గురిచేస్తుంది,
ఆనాటి సీతబాటలో
ప్రాణ తాగ్యం చేసే స్త్రీల సంఖ్య పెరిగిందే తప్ప
స్త్రీల జీవితంలో వెలుగు రేఖలను నింపలేదు
ఇంటికి కంటికి వెలుగైన స్త్రీ
తన రాతను తానే మార్చుకోవాలి
ఈ బుద్ధ భూమిలో ఓ సైనికురాలై
నిరంతరం యుద్ధం చేస్తూ
గెలుపు బావుటాను ఎగురవేయాలి.
-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
