యీ వింగ్‌ల బతుకు మాకొద్దు – జూపాక సుభద్ర

ఉద్యోగాలు ఉద్యోగ సంఘాలు పుట్టిన కాన్నుంచి యిప్పటిదాకా మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా స్వతంత్ర సంఘాలు లేపు. ప్రపంచ బ్యాంకుల్నించి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి గొంతులు చించుకుంటున్నా వాస్తవంగా మహిళా సాధికారత ఎక్కడా కనబడదు. సాధికారత పక్కన పెట్టి కనీస ప్రజాస్వామ్య భాగస్వామ్యాలు కూడా కనబడవు. యిప్పటికి కూడా మహిళలు ఉద్యోగ, కార్మిక సంగాల్లో లేరు. వున్నా ఒకటి అరా. అదీ కో ఆప్ట్‌ చేసుకునుడే గానీ పోటీి చెయ్యడం, గెలవడం అనేవి మహిళా ఉద్యోగులకు అందని విషయమైంది.

ఎపి ఎన్‌జివో సంఘాల్లో టిఎన్‌జి వో సంఘాల్లో ఇప్పటిదాకా పోటీ చేసి గెలిచి న మహిళా నాయకులు లేరు. నచ్చిన వాళ్ల ను, అనుకూలులను మాట్లాడని ఆడవాళ్ళను నామినేట్‌ చేసుకొని మహిళా వింగ్‌ కన్వీనర్‌ గా ఒక్క పోస్టుకు మాత్రం అనుమతి. ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రమైన మహిళా ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అణచేసిన పరిస్థితుల్నే చూసినం.     ‘మీరు స్వతంత్ర సంఘాలు పెట్టి ఏం జేస్తరు, ఉద్యమాలు చేయగలరా? స్ట్రైక్‌లు చేయగలరా? సమ్మెలు చేస్తారా? జైల్లల్లుంటారా, అధికారుల్తో, సిఎమ్‌తో చర్చలు చేస్తారా? మేమే తలకిందులైతుమ్‌ మీ వల్ల ఏం అయితది, కుటుంబాలేం గావాలె, సంసారాలు కూలిపోతాయి’. అని అవమానించడం, వామ్మో తెగించినోళ్లు, ఫైర్‌ బ్రాండ్‌లని ముద్రలేయడం, ఎన్నికలపుడు మా మహిళా కరపత్రాలను, బ్యానర్లను చించేయడం చేసిండ్రు. మహిళా టాయిలెట్స్‌ రూంలో కండోమ్‌లు పెట్టి లిప్టుల్లో బూతు రాతలతో మమ్మల్ని చాలా రకాలుగా సెక్రటేరి యట్‌లో బెదిరిరించినా సెక్రటేరియెట్‌ మహిళా ఉద్యోగుల సంగం బెట్టి మహిళా సమస్యల మీద పంజేసి కొంత విజయం సాధించాం వింగ్‌ల దుస్థితి నుంచి.

‘ఎపీి ఎన్జీవో’లో మహిళా వింగ్‌ సంస్కృతి ‘టిఎన్జీవో’లక్కూడా ‘డంప్‌’  అయిందని ఉద్యమ సందర్భంలో కూడా అట్లనే ‘వింగ్‌’ గా మహిళలు కొనసాగడం దురదృష్టకరం. తెలంగాణ ఉద్యోగ సంగాల్లో, జెఏసీిల్లో అంతా మగమయంగానే ఉండింది. ఏందిదీ? అని అడిగితే తెలంగాణ రాని య్యండి అన్నారు. ఇపుడు ఆ స్వతంత్య్ర తెలం గాణ రాష్ట్రం వచ్చింది. మహిళా సాధికారత కావాలి. మహిళలు అన్ని రంగాల్లో సమాన భాగస్వాములుగా ఉండే దిశగా కొనసాగాలి అనుకున్న కొంతమంది మహిళా ఉద్యోగు లం తెలంగాణ మహిళా ఉద్యోగుల సంగం (ఊఇజూజు) పెట్టినం. ఉద్యోగ సంగా ల్లో మహిళా వింగ్‌ మహిళల కోసం పనిచే యడంలేదు. చాలా అవమానకరంగా మహి ళల పరిస్థితులున్నయి వింగ్స్‌లో. ఇవి నిలువ రించాలని ప్రత్యేక ప్రతిపత్తిగా మహిళా ఉద్యోగుల కోసం పనిచేయాలి, కూడగట్టాలి, ఆర్గనైజ్‌ కావాలని మేము తెలంగాణ రాష్ట్ర మహిళా సంగం ఏర్పాటు చేసినం. అట్లా పెట్టి వెంటనే కమల్‌నాథన్‌ కమిటీకి తెలంగాణ మహిళా ఉద్యోగుల సమస్యల మీద ఒక రిపోర్టు యిస్తూ కొన్ని సిఫార్సులను కూడా చేయడం జరిగింది. కమల్‌నాథన్‌ స్వయంగా యిప్పటిదాకా మహిళా ఉద్యోగుల సమస్యలు ఎవరూ చర్చించలేదు రిపోర్టు చేయలేదని ఆశ్చర్యపోయిండంటే మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యాలు ఎట్లా వున్నయో అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీరామారావు ప్రభుత్వము మహిళలకు 33శాతం రిజర్వేషన్స్‌లో తెలంగాణ మహిళలకు 5శాతం కూడా చెందలేదని మా సంగం అధ్యయనంలో తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో 9,80,000 మంది ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగులు 2,91,000. దీంట్ల తెలంగాణ మహిళలు చాలా స్వల్పం. టి సెక్రెటేరియట్‌లో 240 మంది మహిళా ఉద్యోగుల్లో గట్టిగా 100 మంది కూడా డౌటే. తెలంగాణ మహిళా పోస్టుల మీద టిఎన్జీవో సంగాలు నోరు విప్పలే. కానీ అన్ని వివరణలతో కమలనాథన్‌ను కమిటీకి రిపోర్టు చేస్తూ, వేసే అన్ని కమిటీల్లో మహిళా ప్రతినిధులు ఉండాలని ప్రతిపాదిం చాము. వీలైన ఆదివారాలు చూసుకొని జిల్లా లో టీచర్స్‌ సమస్యల మీద పనిచేయడానికి మొదలైనము.

ఇంతలో బత్కమ్మ వచ్చింది.  తెలంగాణలో బత్కమ్మ అంటే మహిళలు, పూలు, చెరువులు, ఆటపాటలే. బత్కమ్మని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించినపుడు మహిళా సమస్యల కోసం మహిళా సాధికార బత్కమ్మ ఆడుదామని అంటే మా అభిప్రాయానికి ముఖ్యమంత్రి కొంత సానుకూలత చెబితె మగ సామ్రాజ్యాలు కూలిపోతున్నట్లుగా టి ఎన్జీవోల సంగాలకు నిద్రబట్టక మాకు అనేక అడ్డంకులు కల్గించిండ్రు. జిల్లాల్లో, సిటీిల్లో సడన్‌గా మహిళల మీటింగ్‌లు బెట్టడం, బత్కమ్మాడించడాలు, కమిటీలు వేయడం చేసిండ్రు. బత్కమ్మలు స్వతంత్రంగా మహిళలే ఆడుకునేటట్లుగా గాక మగవాల్ల కటౌట్లతో వాల్ల ఉపన్యాసా లతో, స్టేజీల మీద దర్జాగా రాజుల్లాగా కూసుంటే స్టేజీ కింద మహిళా ఉద్యోగులతో ఆడించడం వీల్లు ఎంజాయ్‌ చేయడం, మద్య మద్యలో మగవాల్లు కూడా ఆడటం చేసి, డిస్కో పాటలు, డిజెలు పెట్టి మహిళల్ని, పూలని, బత్కమ్మల్ని అవమానించిండ్రు. మా సంగాన్ని అన్ని జిల్లాల్లో యిట్లానే అవమానించి సిఎం ఆడుకోవడానికి ఇచ్చిన ఫండ్‌కి కూడా అడ్డంబడిండ్రు. యిక సెక్రెటేరియట్‌లో వింగ్‌ మహిళల చేత స్వతంత్ర సంగం మహిళల మీద పోటీ బత్కమ్మలాడించిండ్రు. వాల్లను మా మీదికి పురికొల్పి పూల బత్కమ్మను యుద్ధ బత్కమ్మగా ఆడాల్సొచ్చింది. మహిళలంతా కలిసి సంతోషంగా తమ చరిత్రలను పూలతో, చెరువు నీల్లతో కలిపి ఆడుకొని పాడుకొనే పండుగను మగబత్కమ్మలుగా మార్చిండ్రు.

అంటే స్వతంత్ర మహిళా సంగాలుంటే యిట్లానే చేస్తాం అని చెప్పదలిచారు మగ ఉద్యోగ సంగాలు. కానీ మా మహిళా సంగం ఎన్ని అడ్డంకులెదురైనా మహిళా ఉద్యోగ సంగం నిలబడాల్సిందేనని నిశ్చయించామ్‌.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.