ప్రతిస్పందన

ఆక్టోబర్‌ భూమిక సంచికలో, సంపాదకీయం స్థానంలో మీరు చేసిన మౌన నిరసన శక్తివంతంగా ఉంది! మీడియాలో తగిన మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.                            –  అబ్బూరి ఛాయాదేవి,హైదరాబాదు.

ప్రచురణార్థం భూమిక సంపాదకులకు, ఆక్టోబర్‌ సంచికలో ” మాదిగ పుటుక కాదు (సం.వెం. రమేష్‌), ” నాన్న వెరీ సారీ ” (పి.రాజ్యలక్షి), ” దేవకి ” (ప్రతిభారాయ్‌/జయశ్రీ మోహన్‌రాజ్‌) కథలు గొప్పవో కావో నిర్ణయించే సామర్థ్యం నాకు లేదు. అవి పాత సినిమా పాటలు కావు కదా ! కానీ చదువుతుంటే నాలో గొప్ప సంచలనం చెలరేగింది. వారి అభిప్రాయాలు అన్నింటితో ఏకీభవించానని కాదు. వారి బాధ అనుభవించాను. వారి ఏడుపు ఏడ్చాను. అది ఒక కేథార్సిస్‌ (భావోపశమనం). ఇలాంటివి అత్యధిక సర్క్యులేషన్‌ మాదేనంటున్న వార, మాస పత్రికలలో కనపడవు కదా.             – వి.ఏ.కే రంగారావు,చెన్నై.

సత్యవతి గారూ,
అక్టోబర్‌ ‘భూమిక’ అమోఘం ఇదేమిటి. ‘అమోఘం’ రుచులకి కదా వాడతారు అనుకుంటున్నారా – అవునండీ అక్టోబర్‌ భూమిక పంచభక్ష్య పరమాన్నాలూ వడ్డించిన విస్తరి లాగుంది. ఆ తప్పిపోయిన పిల్లాడు మళ్ళీ దొరికాదు- అపర్ణతోట గారి పుస్తక సమీక్ష చదువుతుంటేనే మనసంతా బరువై పోయింది. చివర్లో ఈ పుస్తకాన్ని సంపాదించడానికి ఆచరించవలసిన విధానం, ఈ పుస్తకం పాఠకులకి లభ్యమవ్వాలన్న ఆకాంక్షా సరదాగా ఉండి భారమైన మనసుని తేలిక పరిచాయి. కొత్త సీరియల్‌ – జీవితానుభవాలు – ఆ రోజుల్లోనే రమణిక గుప్తాగారు లింగ వివక్షని భరించలేక కుటుంబంలో అందరూ వ్యతిరేకమైనా ఎదిరించి, చిన్నతనం నుండీ చుట్టు పక్కల వారిని కలుపుకుని, నాయకత్వం వహించి పనికిరాని సంఘం కట్టుబాట్లని నిలదియ్యటం – ఈ తరం వారికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది.     జయశ్రీ మోహన్‌ రాజ్‌ గారి అనువాదం -దేవకి- పేగు బంధాన్ని దూరం చేసుకోడాన్కి తల్లి పడ్డ బాధ, మరొక బిడ్డ ఒడిలోకి రాబోతున్నాడని సరిపెట్టుకోవటం, చివరికి ఆ బిడ్డా దక్కక – తన మనుగడకి అవసరమైన డబ్బునే బిడ్డలా జాగ్రత్తగా పొదువుకోవడం – మనసుని మెలి పెట్టింది. రమాసుందరిగారు -అల్లూరయ్య మైసూర్‌పాక్‌లో మనిషి ఆలోచనా విధానంలోని- మనం ఒదులుకోవలసిన ఒక కోణాన్ని ఎంతో సరళంగా ఎత్తి చూపేరు. ఇక మీరు సంపాదకీయంలో చూపిన నిరసన విధానం బాగుంది. సూటిగా తగిలింది. తీరైన బాపుగారి బొమ్మతో గిఫ్ట్‌ ర్యాప్‌ చేయించుకుని మాకందిన అందమైన కానుక ఈ భూమిక.         – ధూళిపాళ సుబ్బలక్ష్మి, హైదరాబాదు.

స్త్రీవాద పత్రిక భూమిక సంపాదకులకు,
నమస్తే, భూమిక లేఖలలో ప్రచురణార్ధం, ఆక్టోబరు, 2014 సంచికలోని అపర్ణ గారి పుస్తక సమీక్షకి స్పందనగా నా ఈ క్రింది లేఖని ప్రచురించగలరు.
”ఆ తప్పిపోయిన పిల్లడు……” నాకూ దొరికాడు, మళ్ళీ.
ఎన్నాళ్ళకిందో… ఐపోయేదాకా ఆగకుండా చదివి, కళ్ళకు నీళ్ళు వస్తుంటే. ‘హృదయం’ తెలియని బాధతో నిండిపోతుంటే, చివర్లో…. ”హమ్మయ్య, సెర్యోష అమ్మా, తమ్ముడితో, ఎంతో ప్రేమించే నాన్నకాని నాన్నతో – సెర్యోష మనసుని తన మనసుతో తడిమిన నాన్నతో-వెళ్ళిపోయాడు” అనుకుంటూ నిద్రపోయాను.
నిజంగా ఈ పుస్తక సమీక్ష చదువుతున్న సమయంలోనే, కాకతాళీయంగా నాకోసం ఓ 10రోజుల కిందటే, మా తమ్ముడు మా పల్లెటూరు ‘ఏడూళ్ళ బయ్యారం’ (మణుగూరు, ఖమ్మం జిల్లా) వెళ్ళి, మా ఇంట్లో మా నాన్న దాచుకున్న పుస్తకాల్లోకి ముక్కు చుట్టూ గుడ్డ కట్టుకుని మాతో ఊసులాడిన ఆ పుస్తకాలన్నీ వెతికి వెతికి, అపురూపంగా పట్టుకొచ్చిన ‘గంధపుచెక్క’ ఈ ”పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు”. వెనుక అట్ట చిరిగి, ముందు అట్టపై సెర్యోష పలకరిస్తూంటే, అపురూపంగా ఆ పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాను. తీరిగ్గా మళ్ళీ చదవాలని దాచుకున్న ఆ పుస్తకాన్ని, మళ్ళీ ఈ ‘పుస్తక సమీక్ష’ చదవమని నాకు గుర్తుచేసింది.
అపర్ణ గారూ! నిజంగా ఇది నా పెన్నిధిలో ఒకదాన్ని తట్టిలేపిన సమీక్ష. మీరు ‘న్యాయం’ గానూ అందమైన అనుభూతిని గుర్తుతెచ్చే విధంగానూ రాశారు. కృతజ్ఞతలు.         -యు.హెచ్‌. వేదన, ఖమ్మం.

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో