జాషువా కవిత్వం – స్త్రీ వాదం – బొడ్డు శేషకుమార్‌

‘యత్రనార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్రదేవతాః’ అన్న ఒక కవి విశ్వాసంతో మహాకవి గుర్రం జాషువా తన రచనల్లో భారతీయ మహిళలకు నీరాజనం పట్టినారు. భారతీయ మహిళాభ్యుదయానికి అవరోధాలుగా ఉన్నటువంటి పనికిరాని కట్టుబాట్లను, ద్వంద్వ ప్రమాణాలను తీవ్రంగా నిరసించారు.

 బాల్యంలో తల్లి ఒడిలో తను పొందిన ప్రేమానురాగాలు, దాంపత్య జీవితంలో చవి చూపిన ఇల్లాలి నిస్వార్థ సేవ, స్త్రీల పట్ల జాషువకు ఒక పూజ్యనీయ భావం పెంపొందించడానికి దోహదం చేస్తే, భారత స్త్రీ సమాజంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల వివక్షతలను గమనించడం ద్వారా వారు జాగృతం చెందవలసిన అవసరం ఎంతైనా ఉందన్న ఆలోచనా దృక్పథం ఆయనలో ప్రోది చేసుకొంది.

 ముందుగా తల్లిని, భార్యను, కూతురిని జాషువ గౌరవించిన తీరును పరిశీలిద్దాం.

 ”పుణ్యములు తల్లి ! నీ పాలు పుష్టికతన

 కవన బాలిక నాజిహ్వనవతరించే” నన్నారు. తన తల్లి పాలపుష్టి చేతనే తనకింతటి కవితా వైభవమిచ్చిందని జాషువ భావన.

 నలభై ఏండ్లు దాటినా తనను ముద్దు చేసిన తల్లిని గూర్చి పద్యం రాసిన జాషువ, అరవై ఏండ్లు దాటినా ”తల్లికంటికి తాను చిరుత’ నేనని, ‘నీ ఋణము దీరదు రక్తము ధారవోసినన్‌” అన్నారు. అంతేకాదు, కొందరు తల్లులు ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలకు మూఢ విశ్వాసాలను, పిరికి మందును ఉగ్గుపాలతో నూరి పోయడాన్ని విమర్శించారు. ”ఇట్టి పైశాచిక వత్సలత్వములు జాతికి తీరని వజ్రఘాతముల్‌” అన్న హెచ్చరిక మహిళా లోకానికి చేసిన హితబోధ.

 నా కవితకు నా ప్రతిభా

 శ్రీకిం గారణము నాడు ప్రేయసి’ మహిళా

 లోక శిరోమణి’ మీరీ

 చాకిరి నన్నింత వాని సలిపెందలపన్‌

   భార్య మరణానంతరం తల్లి తండ్రి తానై కూతురు హేమలతకు వివాహం చేసి దీవించిన తీరులో జాషువా హృదయం, తనపై గల వాత్సల్యం స్పష్టమవుతుంది.

 కులమున గన్న కూతులకు, గౌరవలీల వివాహ కార్యముల్‌

 సలిపితి, డ్పునం గనిన నా తనుజన్మకు నీకు,నేడు పెం

 డిలి మొనరించుచుంటి ధరణీ సుర బాలునకిచ్చి, వార్ధిలో

 గల లవణంబుతో యుసిరికాయకు పొత్తు ప్రసిద్ధమే కదా!

ఇక – ‘వంచిత’ ఖండికలో జాషువ స్త్రీకి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. స్త్రీని వంటఇంటి పనిముట్టుగా పరిగణించడం, భారతనారిని నేనని స్త్రీ భావదాస్యంలో పడి వుండటం, కలుపుల రాణిగా, చిలుక పుల్కుల చక్కెర పిండి బొమ్మగా, అలికుల వేణిగా స్త్రీని పొగిడి, ఆకాశంలో ఊయల గట్టి ఊగిస్తున్నాడీ పురుషుడు ఎన్నో యుగాల నుండి అని జాషువ తెలిపాడు.

 స్త్రీపట్ల సమాజము, మనసంస్కృతి, మనధర్మాలు, కర్మసిద్ధాంతాలు, అంతకంటే పురుషులు చూపిన వివక్షతను జాషువా కవి స్పష్టాతి స్పష్టం చేసాడు.

 పురుషుని మోసప్రయుక్తులకు స్త్రీ ఎలా లోబడి మంచి బట్టలు,నగలు, షోకులతో సంతృప్తి చెంది అనాది నుంచి ఎలా నడుచుకొంటూ ఉందో వివరించి, కళాత్మకమైన ఈ ప్రపంచాన్ని  పరిశీలించమని మహిళా లోకానికి ప్రబోధాన్నందించారు.

 స్త్రీ కంటే పురషుడధికుడని తాటాకుల్లో రాసి, కంఠమెత్తి ప్రచారంచేసారని, స్త్రీ జాతికే ఇది తీరనిఅన్యాయమని, స్త్రీకి పురుషునితో సమానగౌరవం ప్రసాదించమని పరమేశ్వరుని జాషువా ప్రార్థించారు.

 ”అబలయన్న బిరుద మంటించి కాంతల

 స్వీయ శక్తులదిమి చిదిమినారు

 సబలయన్న బిరుదు సాధించి హక్కులు

 గడన చేసి కొమ్ము కష్ట చరిత’

 అంటూ తమ హక్కుల సాధన దిశగా మహిళా లోకాన్ని జాగృతం చేసే కవిత్వం జాషువా సృజించారు.

 అనాది నుంచి వస్తున్న తమ దుస్థితిని నవ నాగరిక మహిళా లోకం గుర్తించిందనీ, మగవాళ్ళ మటుమాయల

నుంచి తప్పించుకుని’నేటి నెలత”ను

 గ్రహించినది నేటి కామినీ తిలకంబు

 బురఖాలకెరయైన బుద్ధి బలము

 తెలిసికొన్నది నేటి కలికి ముద్దుల గుమ్మ

 ఉబ్బించు గాధలందున్న కిటుకు” అంటూ ప్రశంసించారు.

 1. యుద్దంలో మరణించిన పురుషుడు రంభను కూడి సుఖిస్తాడని అంటారు. మరి యుద్ధంలో మరణించిన వీరకాంతులకు ఆ సుఖం ఎట్లా అమరుతుందని జాషువా ఆనాడే ప్రశ్నించారు.

 2. ”ఘోషాలోబడి క్రుళ్ళిపోయినది దిక్కున్‌ మ్రొక్కు లేకుండనీ యోషా మండలి

 ఉత్తుత్త ధర్మాలకున్‌ భోషాంబయి – బూజు పట్టినది హిందూజాతి చిత్తంబునం

 దీషత్ప్రేమ  వహించి స్వేచ్ఛయిడవోయీ ! అక్క చెల్లెండ్రకున్‌” అని సహపురుష ప్రపంచానికి పిలుపునిచ్చాడు.

 3. ”నగలు, చుప్పనాతి తనము, మూఢాచారాలు, ఒళ్ళు బరువు తనము

 ప్రబలియున్న దెల్ల భామినీ లోకాన

 ఎట్లు శిక్ష సలిపి యేమి కఱపి

 యుద్దియలను తీర్చిదిద్ది దీవింతువో  

 భారమెల్ల నీది పాఠశాల … ” అంటూ స్త్రీల అజ్ఞానాన్ని ఆవిష్కరించి విజ్ఞాన కాంతులు ప్రసరింప చేసే మహిళాభ్యుదయకరమైన సాహిత్యాన్ని రచించాడు జాషువా.

 4. ప్రధిత సంస్కార మార్గాన్నే భారత మహిళా లోకం అనుసరిస్తున్నారని అనుసరించాలన్న జాషువా కవి, ముసలి వాడిని వివాహం చేసికుని సామాజిక కట్టుబాట్ల మధ్య ఇమడ లేక, వాటిని బహిరంగంగా ఎదుర్కోలేక, వేరేదారులు ఎదుర్కొనే స్త్రీల మనసులోని సంఘర్షణను తెలిపారు. వితంతువైన యువతి తన వయసు చేసే గారడీ, నరాల తీపు గురించి ఘర్షణ పడటాన్ని చిత్రించాడు.

 1.వీర చానమ్మ – ముగ్గురాడ వాళ్ళమయ్యాలినటం,పసుపు రాసుకుని స్నానం (2) చుప్పనాతి మొ||న  పదప్రయోగాలు.

 2. స్త్రీల బాధలు అర్ధం చేసుకొలేని వారిని స్త్రీలుగా జన్మింపచేసి శిక్షించాలనటం వంటివి మినహాయిస్తే

 1. ఆడది లేకుండిన నీ

  రేడు జగంబులను శోభయే లేదు

 2. సతుల నైసర్గిక జ్ఞాన సస్యరమను

  చిత్ర చిత్రంబుగా హత్య చేసినారు.

 3. పతిభక్తురాలన్న పద గౌరవము దక్క

  సౌఖ్యం బెరుంగని జాన తనము

 4. అన్నదమ్ముల వోలి నాస్తి పాస్తుల మీద

  హక్కులించుక లేనియాడు తనము.

 5. స్త్రీ విద్యా విభూషితయై ప్రకాశించాలి.

 మహిళాభ్యుదయాన్ని జాషువా ఎంతగా కోరారో తెలుసుకోవడానికి వారి వాక్యాలు, ఖండికల లోని అనేకమైన ఉదాహరణల నుంచి కొన్ని మాత్రమే ఇవి.

  ”కొంత మగవారితో చేయి గలపకున్న

  తలపనేల యనర్ధంబు తప్పదనుచు

  భారతక్షోణి చిత్తంబు కోరిగింప

  కలము బట్టిన దీనాటి వెలది మిన్న”

 1. పి.హెచ్‌.డి. 2. యం.ఫిల్‌, చేయదగినంత మహిళాభ్యుదయకరమైన సాహిత్యం జాషువా సాహిత్యంలో ఉన్నది. అన్నది నా దృష్టిలోకి వచ్చిందని ఈ సదస్సుకు విన్నవించు కుంటున్నాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో