చిట్టి గురువులు – ఎస్‌.ఆమని, 8వ తరగతి, సమతా నిలయం

రాజు, చందన అన్నా చెల్లెళ్లు. వారు అమ్మ నుంచి శుభ్రత, నాన్న నుంచి నిదానం, తాతయ్య నుంచి మర్యాద నేర్చుకున్నారు. రోజూ ఉయదమే స్నానం చేసి బడికి పోవటం, తిరిగి రాగానే కాళ్ళూ చేతులు కడుక్కోవటం వారికి అలవాటు. ఇంటికి వచ్చిన బంధువులు వారి శుభ్రతను కళ్లారా చూసి మెచ్చుకుని వెళ్ళేవారు.

 ఒకనాడు ఇంటికి దూరపు బంధువు బాలయ్య వచ్చాడు. అతడు మరీ శుభ్రత లేని మనిషని రెండో రోజుకే అందరూ గ్రహించారు.

 బాలయ్య రెండుమూడు రోజులకొకసారి స్నానం చేసేవాడు. ఊరంతా తిరిగి వచ్చి కాళ్లు కడుక్కోకుండా ఇల్లంతా తిరిగేవాడు. అన్నం తినే ముందు చేతులు కడుక్కునేవాడు కాదు. చిరుతిళ్లు తిన్నాక చేతులు కడుక్కోకుండా తన బట్టలకే తుడచుకునేవాడు. భోజనం చేశాక పంటిలో ఇరుక్కున్న చెత్తని వేళ్లతో తీసుకుని చేతులు శుభ్రపరుచుకునేవాడు కాదు. అతడు దగ్గరి చుట్టం కావటాన ఇంట్లో వారు పల్లెత్తు మాట అనలేకపోయారు.

 ఒకనాడు బాలయ్య చెవుల్లో, ముక్కుల్లో చేతి వేళ్లు దూర్చి తిప్పి దురద తీర్చుకున్నాడు. ఆ చేతులతోనే ఇతరులకు కరచాలనం చేశాడు. అది చూసి రాజు, చందన చిరాకు పడ్డారు. వెంటనే తాతయ్య దగ్గరికిపోయి బాలయ్య అశుభ్రత అలవాట్ల గురించి చెప్పారు. ‘నేను అంతా గమనిస్తూనే ఉన్నా అతను మన బంధువు అమర్యాదగా ఒక్కమాట అన్నా బంధుత్వాలు చెడతాయి’ అని ఒక ఉపాయం చెప్పాడు తాతయ్య.

 మరునాడు ఉదయం స్నానం చేయనని చందన మారాం చేసింది. చందనని బాలయ్య దగ్గరికి లాక్కుపోయాడు రాజు.

  ‘బాబాయ్‌! చందన స్నానం చేయనని మారాం చేస్తోంది. నీవైనా చెప్పు’ అన్నాడు. ‘చందనా! రోజూ స్నానం చేయకపోతే ఒళ్లంతా చెమట కంపు కొడుతుంది. దురదలు వస్తాయి’ అని చెప్పాడు. బాలయ్య చందన మారుమాట్లాడకుండా స్నానం చేసింది.

 సాయంకాలం మామిడి రసాలు తిన్నారు. అందరూ చేతికి అంటిన రసాన్ని తలుపు తెరకు తుడిచేసింది చందన. బాలయ్యకి చందన చేసే పని చూపించాడు రాజు.

 బాలయ్య ఆమె దగ్గకెళ్లి ఏదైనా తిన్నాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పాడు. చందన చేతులు కడుక్కుంది. మర్నాడు బయటికి వెళ్లివచ్చిన రాజు ఇంట్లోకి వెళుతుంటే చందన పరిగెత్తుకుని బాలయ్య దగ్గరకు వచ్చి ‘బాబాయ్‌’, రాజు చూడు, నాకు నీతులు చెప్పి, తను ఊరంతా తిరిగొచ్చి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి దూరుతున్నాడు’ అంది చందన.

 ”రాజూ! దుమ్ము కొట్టుకుపోయిన కాళ్ళతో ఇంట్లోకి పోవచ్చా! వెళ్లి కడుక్కురా’ అని మందలించాడు బాలయ్య. ఇదంతా చూస్తున్న తాతయ్య ముసిముసిగా నవ్వుకున్నాడు. మర్నాడు ఉదయం లేస్తూనే బాలయ్య స్నానం చేశాడు. బయటకెళ్లాచ్చాక శుభ్రంగా కాళ్ళు కడుక్కుని లోపలికోచ్చాడు. బట్టల సంచి సర్దుకుని తాతయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన పాదాలకి నమస్కారం చేశాడు.

 ‘బాబాయ్‌ నేను వెళ్ళొస్తా, మా ఇంటి మీదకు గాలి మళ్లింది. ఇంట్లో వారు నా మార్పును చూసి ఆశ్చర్యపోతారు’ అన్నాడు. గుమ్మంలో ఎదురైన రాజు, చందనలను తల నిమిరి ‘చిట్టి గురువుల్లారా! వెళ్లొస్తాను’ అని బయలుదేరాడు బాలయ్య.

నీతి: మనకు తెలిసిన మంచి మాటలు ఇతరులకు నేర్పించాలి.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో