ఒక ప్రాకృతిక అద్భుతం – వి. ప్రతిమ

లెనిన్‌ చెప్పినట్లు నాకూ కాలజ్ఞాపకం లేదు కానీ నెల్లూరు జిల్లాలోని చింతూరు మండలంలో యధేచ్ఛగా హడావిడిగా సెజ్‌లు ఏర్పాటు చేస్తున్న కాలమది… ఆ సెజ్‌ల రాకతో వ్యవసాయ భూములను పోగొట్టుకొని అటు భూమి, ఇటు డబ్బూ లేకుండా అగమయి పోయిన రైతు కుటుంబాలను పలకరించడం కోసం సునీత, పొండమ్మలతో మండల మంతటా తిరుగుతున్నప్పుడు తొలిసారిగా సిలికా గుట్టల్ని, సొన కాలువలని చూడ్డం జరిగింది. అప్పుడే మొదటి సారిగా సొనకాలువల గురించి వినడం …జిల్లాలో నేలలో ఉన్న మిలియన్‌ గ్యాలన్ల నీటిని క్షేపాలు సిలికా తవ్వడం మూలంగా పరిశ్రమల స్థాపన మూలంగా విధ్వంసమైపోతున్నయన్న సంగతి అప్పుడే అర్థమయింది…. అప్పుడే చాలా అన్పించింది. దీని గురించి లోతుకెళ్లి దీన్ని గురించి తెలుసుకోవాలనీ, మాట్లాడాలనీ…. అయితే చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ నిత్యజీవితపు రంధిలో వాయిదా వేసుకుంటూ వచ్చే అనేక పనుల్లో ఇది ఒకటయ్యిపోయింది. ఆ పనిని మిత్రుడు లెనిన్‌ ధనిశెట్టి చేసి చూపించడం అభినందనీయం. లెనిన్‌కి ఈ అన్వేషణకి సుధీర్ఘమైన ఎనమిది సంవత్సరాల కాలం పట్టింది. అంతంటే అభినందిం చదగిన విషయం ఏమిటంటే జిల్లావాసుంతా నింసాదిగా వుండగా నల్గొండ నుండి అనంతుడు పౌండేషన్‌ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించి పాఠకుల ముందుకు తీసుకురావడం వారికి జిల్లా వాసులంతా ధన్యవాదాలు చెప్పుకోవాలి.

‘సొన’ అనగానే గుడ్డులోపలి తెల్లసొన అనో లేదా ఆకులు తుంచినప్పుడు చెట్టునుండి కారే ధ్రవమనో అనిపిస్తుంది.లెనిన్‌ దీనికి అర్ధం వూరే, కారే అని చెపుతాడు.. నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో ఏర్పడి వున్న అందమైన ఈ ఇసుక దిబ్బలకి సిలికాన్‌ డైయాక్సైడ్‌ వర్షపు నీటిని పిల్చుకుని తమ గర్బంలో దాచి వుంచుకునే శక్తి కలిగి వుండడమే గాక హై హైడ్రాలిక్‌ కండెక్టివిటీ వుండటంతో ఇసుక దిబ్బల వాలు ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన పాయల ద్వారా ఆ నీటిని విడుదల చేస్తాయి. ఇవే సొన కాలువలంటారు. వీటి మూలంగా వేల ఎకరాల నేల నిరంతరాయంగా మూడుసార్లు సాగవుతూ ఉండేది. ఇప్పుడు సికా మైనింగ్‌ వల్ల పరిశ్రమల స్థాపన మూలంలగానూ సాగునీటి సంగతి దేవుడెరుగు తాగునీరు కూడా లేక గ్రామాలకు గ్రామాలు వలస పోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.

SonaKalavalaApoorvaPuragadha600 - Copy

యధేచ్ఛగా మైనింగ్‌ జరిగిపోతున్న ఈ ఇసుక దిబ్బల్లో ఒక క్యూబిక్‌ మీటర్‌కు 380 లీటర్ల మంచినీటిని నిల్వచేసే సామర్థ్యముంది అనే నిజాన్ని వెలికి తీసి మనని కలవరపెడుతాడు రచయిత. అవి ఎంత మంచి నీరంటే ఒక ప్రముఖ కంపెని పంపిణీ చేస్తొన్న మినరల్‌ వాటర్‌ కంటే ఎక్కువ పి.హెచ్‌ విలువలో వున్నట్లు రుజువయింది.

రెండు వందల ఏండ్ల నాటి ఈ సొన కాలువల అపూర్వ పురాణ గాధ గతాన్ని వర్తమానాన్ని భయంకరమైన ,భవిష్యత్తుని కూడా మన కళ్లముందు పరుస్తుందీ పుస్తకం. రెండు వేలా ఆరు నుండి రెండు వేలా పద్నాలుగు వరకు ఎనమిది సంవత్సరాల పాటు ఈ సొన కాలువలు వల అపూర్వగాధని అన్వేషిస్తూ.. అన్వేషిస్తూ…. ఆగమనంలో తేలిన ఋజువైన అనేక అంశాలు సత్యాలు,నిజాల వివరాలను పొందుపరిచి ఈ సమాజం ముందుంచాడు.డాక్టర్‌ లెనిన్‌ధనిశెట్టి….సొక కాలువలు ప్రపంచంలో ఆ మాటకొస్తే ఈ సృష్టిలోనే ఎకైక ప్రాకృతిక అధ్బుతం అది అని ప్రోపెసర్‌ జగదీశ్వర్‌రావు తేల్చిచెప్పారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ఈ సొన కాలువలని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిదీ అని గుర్తుచేశాడు.

కడుపే కైలాసమనీ, డబ్బుతోనే అనుబందాలనీ, జీనవం సాగిస్తున్న జిల్లా వాసులంతా జరుగుతోన్న నేరాన్ని తెలుసుకొని మేలుకోవాలని, మాట్లాడాలని, నిలదీయాలని,, ఈప్రాకృతిక అధ్భుతాన్ని కాపాడుకోవాలని సూచిస్తుంది పుస్తకం ”సోన కాలువ అపూర్వ గాధ”.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో