మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే

వరకట్నం అదనపు కట్నం కోసం వేధింపులు వెళ్లగొట్టటం,హత్యలు, ఆత్మహత్యలు, భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, ఆడపిల్లల అమ్మకాలు వంటి సమస్యలు ప్రపంచీకరణ క్రమంలో మరింత తీవ్ర రూపం దాల్చి కనిపిస్తాయి ఈ దశకంలో. సంస్కరణోద్యమం కాలం నాటి బాల్యవివాహం నూతన సహస్రాబ్దిలోనూ సమస్యగానే ఉంది. బాల్య వివాహ నిరోధక చట్టం వున్నా, ప్రభుత్వమే వాటిని నిరోధించడానికి ప్రచారం చేసే బాధ్యతను గ్రామ సేవకులకు అప్పగించినా, ప్రత్యేక కళాబృందాలను ఏర్పరచి కళాజాతను నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నా, తరుణి వంటి స్వచ్ఛంద సంస్థలు అనేకం బాల్య వివాహలను జరుగకుండా చూడాలని ప్రత్యేకంగా కృషిచేస్తున్నా, బాల్యవివాహ ధోరణి మాత్రం ఆగకుండా ఉంది. స్త్రీ విద్యకు, సామాజిక వ్యక్తిగా ఎదగడానికి, సాధికారత పొందడానికి అవరోధమైన బాల్యవివాహలను ఆపడానికి ఆంధ్రదేశంలో జరిగిన, జరుగుతున్న ప్రయత్నాలు మహిళల ఉద్యమంలో భాగమే.

ఆడపిల్ల ముఖ్యంగా తెలంగాణలో నిజమాబాద్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో గిరిజన కుటుంబాలలో ముఖ్యంగా లంబాడీ తండాలలో ఆడపిల్లలను అమ్మిన ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చారుు.దత్తత పేరు మీద విదేశాలకు తరలించిన ఘటనలు కూడా జరిగారుు. వీటిపై మహిళా సంఘాలు ఆందోళనలు చేశారుు. ప్రభుత్వ మధ్యం విధానానికి వ్యతిరేకంగా మహిళాసంఘాలు పనిచేస్తూనే ఉన్నారుు. మద్యం అమ్మకాలకు బెల్టుషాపులు విస్తరించి మంచినీళ్లు లేనిచోట కూడా మద్యం మాత్రం అందుబాటులో ఉండే అందుబాటులో వుండే వ్యవస్థ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడే దిగువ స్థారుు ఆర్ధిక వర్గాలలో పురుషులను త్రాగుబోతులుగా మార్చి అకాల మరణాలకు కారణమవుతుండగా నలబై ఏండ్ల లోపు వితంతు స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది. ఈ పరిణామాలపై కూడా మహిళా సంఘాలు ఉద్యమించారుు. బెల్టు షాపుల రద్దుకై ఆందోళనలు చేసారుు.

2005 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉమ్మడి కనీస కార్యక్రమం (సి.ఎం.పి)లో మహిళలకు సంబంధించి చట్టసభల్లో మూడవ వంతు రిజర్వేషన్‌ కొరకు చట్టం చేస్తామని గృహహింస, లింగ వివక్షతలకు వ్యతిరేకంగా చట్టం చేస్తామని, ఇళ్ళు భూమి వంటి ఆస్తులపై సమాన యాజమాన్య హక్కును కలిగించే చట్టం చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయమని మహిళా సంఘాలు నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉద్యమిస్తూనేవున్నారుు. 2006 నుండి అమలులోకి వచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణచట్టం 2005 గురించిన అవగాహనను సమాజంలో అభివృద్ధి చేయుటలోనూ, స్త్రీలు దీనిని దుర్వినియోగం చేసుకోకూడదని వచ్చిన హెచ్చరికలను తిప్పికొట్టడంలోనూ మహిళా ఉద్యమం విమర్శనాత్మక భావజాలాన్ని అభివృద్ధి పరచింది. పనిచేసే చోట లైంగిక వేధింపులను నిరోధించే చట్టం కోసం తొంభైౖలలోనే ప్రారంభమైన ఉద్యమం విమర్శనాత్మక భావాజాలాన్ని అభివృద్ధి పరిచింది. మహిళా ఉద్యమం ఒత్తిడి ఫలించి ఎట్టకేలకు 2013 పిబ్రవరి 26న రాజ్యసభ ఆమోదంతో చట్టమైంది. అరుుతే పార్లమెంటులో జెండర్‌ సమానతను సాధించడానికి స్త్రీల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడానికి మొత్తంగా మహిళా సాధికారత సాధనకు ఉపయోగపడుతుందన్నా ఉద్దేశ్యంతో 1996 సెప్టెంబర్‌ 12న ప్రతిపాధింపబడిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభ ఆమోదాన్ని పొందింది. కానీ ఇంతవరకూ చట్టరూపాన్ని తీసుకోలేదు. దీనికై ఉద్యమం కొనసాగాల్సేవుంది.

ప్రాంతీయ స్థారుులో స్త్రీ సమస్యలకు స్పందిస్తూ,ఉద్యమిస్తూ,జాతీయ స్థారుు ఉద్యమాలతో సంఘీభావం ప్రకటిస్తూ, ఐక్య సంఘటన కడుతూ, అంతర్జాతీయ మహిళా ఉద్యమాల తాత్వికతను అర్థం చేసుకుంటూ మహిళా ఉద్యమం ఈనాడు పురోగమిస్తుంది. స్త్రీలపై హింస ఇంకానా….. ఇకపై సాగదు అనే ప్రపంచ మహిళలందరూ వన్‌ బిలియన్‌ రైజింగ్‌ అని ముక్త కంఠంతో పలుకుతున్న సందర్భం నుండి స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజావళి గళం విప్పాలన్న ఆకాంక్ష మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినపు అసలైన స్ఫూర్తిని తనదిగా చేసుకొని మహిళా ఉద్యమం అర్థవంతంగా అభివృద్ధి కర దిశలు సాగుతుందని ఆశిద్ధాం……

దండ కారుణ్య విప్లవోద్యమం మహిళల భాగస్వామ్యంతో మహిళల సమస్యలపై పనిచేసే క్రమంలో, విప్లవోద్యమంలోకి మహిళలను సమీకరించి చైతన్యపరిచే క్రమంలోనూ మహిళల సమస్యలపై ప్రత్యేక అధ్యయనం అవసరమని గుర్తించింది. ఆ మేరకు 2003లో ముగ్గురు సభ్యులతో ఏర్పడిన ఒక కమిటి ఆ తరువాత ఐదుగురు సభ్యులతో మహిళా సమస్యల మీద అధ్యయనాన్ని మహిళా పత్రికా నిర్వాహణను,మహిళా సాహిత్య ప్రచురణను కొనసాగించింది. 2001లో పార్టీ 9వ కాంగ్రెస్‌ విప్లవ క్యాంపులో పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా దిద్దుబాటు కాంపెరుున్‌ తీసుకోవాలని చేసిన తీర్మానాన్ని బట్టి దండకారుణ్య విభాగం 2004 లో పితృస్వామ్య నిర్మూలనకై కాంపెరుున్‌ చేపట్టింది. పితృస్వామ్య నిర్మూలనకై విమర్శ, స్వయం విమర్శల ద్వారా నూతన చైతన్యాన్ని అభివృద్ధి చేసుకునే పని పైస్థారుు నుండి గ్రామస్థారుు వరకు జరిగింది. పితృస్వామ్య వ్యతిరేక సభలు, సమావేశాలు విస్తృతంగా జరిగారుు. మహిళలకు వంట, ఇంటి నుండి విముక్తి, రాజకీయాల పోరాటాలలో భాగస్వామ్యం లక్ష్యంగా ఇవి నిర్వహించబడ్డారుు. ఈ దిద్దుబాటు కాంపెరుున్‌ మహిళలకు తమలో న్యూనతా భావాన్ని, పురుషులకు తమలోని ఆధిక్యభావనను తగ్గించుకోవడానికి ఉపకరించింది. పితృస్వామ్య భావజాలం నుండి రీతిరివాజుల నుండి బయటపడడానికి సాగించాల్సిన పోరాటం సుధీర్ఘమైందని నిరంతరమైందని అన్న అవగాహనతో మహిళా ఉద్యమాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవాల్సిన అభిప్రాయం బలపడింది.జనతన సర్కార్‌లో వివిధ స్థారుులలో మహిళల క్రియాశీలక భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని అభివృద్ధి చెందించడానికి దోహదపడింది.

స్త్రీల కోణం నుండి పితృస్వామ్యాన్ని సంబోధించి పనిచేసే చైతన్యాన్ని కనబరుస్తూనే దండ కారుణ్య మహిళా ఉద్యమం స్త్రీల సమస్య అంటే కేవలం పితృస్వామ్యానికి సంబంధించినవే కాదు అన్న అవగాహనతోనే కార్యచరణను రూపొందించుకొంటూ వచ్చింది. రైతులుగా, ఆదివాసీలుగా, పేద ప్రజలుగా పురుషులతో పాటు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారం కొరకూ పురుషులతో కలిసి పని చేయ్యడం దండకారణ్య మహిళా ఉద్యమ మౌలిక లక్షణం. అందువల్లనే రాజ్యహింసకు, మతదౌష్య్టాకి, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా సభలు నిర్వహించుటంలో చర్యలు సాగించుటంలో మహిళలు ముందున్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం వందేళ్ల వేడుకల సందర్భంగా 2010 మార్చి 8 నాడు స్వావలంబన సాధికారత ప్రాతిపాదికగా ఏర్పడుతున్న రాజ్యాధికారమే స్త్రీలకు విముక్తిని, హామీని ఇస్తుందని అందువల్ల ఆ నిర్మాణాన్ని పటిష్టం చేసుకొని తీరతామని మహిళలు శపథం చేశారు.

హిందూ మతోన్మాదం, రాజ్యహింస పితృస్వామ్యం, టూరిజం, ప్రభుత్వ సంస్కరణలు, ప్రత్యేక ఆర్థిక మండలులు, నిర్వాసిత సమస్యలు మొదలైన దేశీయ సమస్యల నుండి నూతన అంతర్జాతీయ మహిళా ఉద్యమంలో క్లారాజట్కిన్‌ పాత్ర, చైనా నూతన ప్రజాస్వామిక విప్లవం వరకూ అనేక విషయాలను ప్రధాన స్రవంతి మహిళా ఉద్యమం వేటినైతే సంబోధించిందో అవన్నీ దండకారణ్య మహిళా ఉద్యమంలోనూ చర్చకు వచ్చారుు. ప్రపంచీకరణ అనుకూల ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నీరు, భూమి, అడవి ఆదివాసీలవేనని దండకారణ్య మహిళా ఉద్యమం నొక్కిచెప్పింది. ఆ హక్కును ఆచరణన వాస్తవం చేసుకునే క్రమంలో పోలీసు దాడులకు, కాల్చివేతలకు, అత్యాచారాలకు గురవుతూ మొక్కవోని ధైర్యంతో మునుముందుకే సాగుతున్నారు దండకారణ్య మహిళలు.

మహిళా ఉద్యమానికి కేంద్రాంశం జండర్‌ సమస్య. భారతదేశ మహిళా ఉద్యమం హింసకు, వివక్షకు వ్యతిరేకంగా స్త్రీలు జీవన స్థితిగతులను మెరుగెక్కించడానికి మానవ హక్కులను అనుభవంలోకి తీసుకొనిరావటానికి మహిళలను సమీకరిస్తున్నది, దేశంలో భిన్న ప్రాంతాలలో భిన్న రూపాలను తీసుకొంటూ సాగుతున్న ఈ ఉద్యమం సంపద్వంతమైంది, సంచలనాత్మకమైనది. అరుుతే ఒకే నాయకత్వంలో ఒకే ప్యూహంతో సిద్ధాంతంతో సాగుతున్న ఉద్యమం కాదు. అందువల్లనే సంఘటనల వెంబడి పోవటమేనా, అప్పుడు ఆ సమస్యపై పోరాడి ఇక ఆగటమేనా అన్న నిస్పృహ కలిగినవాళ్లు మౌనంలోకి జారటం కదలాడుతుటుంది. ఒకప్పుడు ఉదృతం ఉత్సాహంగా ఉద్యమం ముందున్నవాళ్లు ఆ తరువాత కాలంలో కనిపించకుండా పోవటం దాని ఫలితమే. ఏక నాయకత్వం ఒక సిద్దాంతం, ప్రణాళిక, నిర్ధిష్ఠ కార్యక్రమంలో నిరంతరత్వం లేవు కనుక మహిళా ఉద్యమాలను ఉద్యమం అనడానికే వీల్లేదనే వాళ్లు కూడా వున్నారు. అరుుతే ఏక నాయకత్వం, ఏకైక సంఘర్షణ సమస్యలు లేకపోవడం బలహీనతలకు లక్షణం కావచ్చు .కానీ అదే మహిళా ఉద్యమం బలం అన్న అభిప్రాయం అనుభవాల నుండి రాటుతేలి స్పష్టమైంది. చెల్లాచెదురు ఘటనలతో ఆగుతూ సాగుతూ వున్న మహిళా ఉద్యమం బలమైంది, బహుముఖమైంది.

జెండర్‌ సమస్య అనేది పితృస్వామిక సామాజిక రాజకీయార్థిక సంస్కృతిలో ఊడలు దిగిన మర్రిచెట్టు. దానిపై యుద్ధానికి తలపడవలసిన శత్రువు భూస్వామిలాగానో, పెట్టుబడిదారులాగానో, రాజ్యంలాగానో ఒక చోట కేంద్రీకృతమై లేదు.పితృస్వామ్యం ఇంటి నుండి బడికి,బజారుకు, పని స్థలానికి, పాలనా విభాగాలకు,పోలీసు న్యాయవ్యవస్థలకు అన్నింటికి విస్తరిం చింది. కనుక మహిళా ఉద్యమం బహుముఖా లుగా సాగవలసిందే. భిన్న సామాజిక అస్థిత్వ చైతన్యాలతో పాటు వర్గం స్త్రీలను అనేక సమూహలుగా విడగొట్టింది. సూక్ష్మ స్థారుులో వివక్ష. వైవిధ్యం అర్థం చేసుకొనటానికి ఎవరి అనుభవంలోకి వచ్చిన వివక్షతో వాళ్లు తలపడటానికి అవి ఉపయోగప డుతారుు.అలాగే భిన్న రాజకీయ ధృక్పధాలను బట్టి కూడా స్త్రీలు భిన్న రాజకీయాలలో భాగమవుతూ, అందులో భాగంగా జెండర్‌ వివక్షను పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేస్తుంటారు.అందువల్ల అనేక సంఘాలు వుండటం సమస్య కాదు.అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఐక్య సంఘటనతో ఉద్యమించడమే దానిని అలావం చేస్తుంది చాలావరకూ ఈనాడు మహిళాసంఘాలు ఆవిధమైన ఐక్య సంఘటనల అవసరాన్ని గుర్తిస్తున్నారుు.ఆ విధంగా పనిచేసి విజయాలు సాధించాలి. కనుక మహిళా ఉద్యమం ఒక నిరంతర నిర్మాణం, నిత్యచైతన్యం…

(అయిపోయింది)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో