ఆమె, అతడు, కలలు …- రమాసుందరి బత్తుల

ఆకాశం నిండా భూమి నిండా ఎండ. తెల్లటి ఎండ. కళ్ళు మూసుకుపోయేటంత తెల్లదనం. ఆ తెలుపులో చొచ్చుకొని వచ్చిన ఎరుపు. తెలుపు వెలుతురును యిస్తుంటే ఎరుపు సర్రున కాలుస్తుంది. వీపును కాల్చకుండా వాళ్ళాయన పాత చొక్కా వేసుకుంది వెంకాయ. తలకు టవలు కట్టుకొంది. ఎరుపుకు కోపం వచ్చి రూపం మార్చుకొని సెగలై మొహం మీద బుసలు కొడుతుంది. కూర్చొని కలుపు తీస్తున్నాదల్లా ఒక్కసారి విదిల్చి ఎరుపు వంక చూసింది. పైన సూర్యుడు నవ్వాడు. కలుపు లాగుతూ నేలను మునివేళ్ళతో తడివింది. మెత్తటి మన్ను. చేతికి పువ్వులాగా తగిలింది.

”పదేళ్ళ కాడి నుండి యిదేగా నన్ను బతికించింది. నడుం మీదకు బొందెల కట్టీ కట్టక ముందే దాన్ని వంచి.. ముక్కు నేలకు రాసినట్లు ఏసిన నాట్లు, కోసిన కోతలు, తీసిన కలుపులుగావా నాకు బువ్వ పెట్టింది? పొద్దుటూడి, మాయటాల రెండు పూట్ల సత్తువ కరగబెట్టుకొని గాదా కుటుంబరాన్ని నడుపుకొంది? ఒక్కో మాలి కాంటారాక్డు మీద తెల్లారి అయిదుగంటలకు బయట పెడితే రేత్తిరి నడిజావుకి గాదా కొంపజేరింది? అయితేనేం? ఈ బంగారం నన్ను గాసింది. కూలి డబ్బుల్తో ఒక పూట ముద్దేసుకొన్నా, ఎండుగారం తిన్నా.. చీటిలు గట్టి నా కూతురుకి పెళ్ళి చేశా. నాలుగు లక్షల అయ్యింది మరి. కాకేంజేస్తంది? అబ్బాయికి రాడ్‌ బెండింగ్‌ పని. అత్తోరి ఊరా, యిజయాడకి బండి కిక్కు కొడితే పది నిమిషాల దూరం. కేరేజీ గట్టిస్తే కొలువు చేసినట్టే టయానికి యిల్లు చేరతాడు. పిల్ల నీడ పట్టున ఉంటది. ఏదో వాళ్ళత్తతో పాటు అప్పుడప్పుడు గేడింగ్‌ కో, పచ్చాక్కో పోద్ది. అత్తాకోడళ్ళు సద్దుకొని పోతారు. వాళ్ళ వూరి పల్లెలో ఉండటానికి శ్లాబేసిన కొంప ఉంది.”

కేరేజి యిప్పి మజ్జిగన్నం కతికింది. టవలు గట్టుమీద ఉండగట్టి తలవాల్చింది. కళ్ళు మూయంగానే ‘సిరీస’ కనబడింది.. నిండు కడుపుతో. కొబ్బరి సవురుతో నున్నగా దువ్విన తల.. సన్నటి జడలో దోపిన మందారపువ్వు. సొట్టబోయిన బుగ్గలతో కళగా కళ్ళతో నవ్వుతుంది. ఆ పక్కన అబ్బాయి తగులాడుతున్నాడు అసలు తినడం లేదని. ‘నీ పెళ్ళానికి కూడా ఒక మెతుకు పెట్టు.” అని ఊళ్ళో అంటున్నారంట.

సన్నటి నవ్వు ఎంకాయి ముఖంలో వచ్చింది. ‘అబ్బాయికేం తెలుసు. ఆ పిల్ల పాలు మానకపోతే కూలికి పోవటం కష్టమవుతుందని నోట్లో మెతుకులు ఏసి పోయేదాన్ని. చప్పరిత్త నిద్రపోయేది. బడికి పోతానని పేచీ పెడితే బరిక తీసుకొని ఊరంతా తిప్పి కొట్టి కూలికి లాక్కెల్లా. దాని ఆకలి. ఆశలు చిన్నంతరాన కోసేస్తేనే ఈ కాసిని డబ్బులు మిగిలాయి దాని పెళ్ళికి. రేపు దాని కాన్పుకి, బాలింతతనానికి, పుట్టినోడికి మెళ్ళోకో, చేతికో బంగారం అతికించాలంటే ఓ లచ్చైనా కావద్దూ! దానికేవన్నా అయ్యా, తాతా! నీడ మాటున పెంచి పెళ్ళిచేసి సాంగెలు చేసి సాగనంపటానికి.” చిన్నప్పుడే ఆమెను వదిలేసి పక్కింటోడి పెళ్ళాంతో పేట పారిపోయిన మొగిణ్ణి అయిష్టంగా తలుచుకొంది.

మూసుకొన్న కళ్ళల్లో ఒక కల. ‘సిరీస’ బిడ్డని కాళ్ల మీద పడుకోబెట్టుకొని నీళ్ళు పోస్తుంది. చేతులు, కాళ్ళు సాగతీస్తుంటే బిడ్డ కిలి కిల మంటున్నాడు.

ఆ దొండ చేన్లో తలకు గుడ్డలు కట్టుకొని, పొడుగు చేతుల పాత చొక్కాలు తొడుక్కొని ఎంకాయితో బాటు సీతాయి, సుబ్బాయి, మంగాయి…. అందరూ రకరకాల కలలు కంటున్నారు. నేలకు ముడ్డానించి… చేతులు కాళ్ళు చువ్వలు చేసుకొని భూమితో సావాసం చేస్తూ … పట్టపగలే కలలు కంటున్నారు.

నై దిబ్బ ఎండిపోయి పొడిలాంటి పేడను జర్మన్‌ సిల్వర్‌ బేసిన్లో బయటకు తోడుతుంది నారాయణమ్మ. పక్కన్నే గడ్డపారకు కట్టేసి ఉన్న బర్రెగొడ్డు పరవశంగా నెమరు వేస్తుంది. నెమ్మదిగా లేచి సత్తవను చేనులో ఎదజల్లింది. మోటారు వేస్తూ ‘ఒక్క తడి తగిలితే చాలు’ అనుకొంది. ఒక పక్క వంగ కాపుకు వచ్చి ఉంది. ఇంకో వైపు తోటకూర భూమి నుండి అప్పుడే లేచి సుకుమారంగా, ఆకుపచ్చగా కూర్చొని ఉంది.

‘వాన రాక పోయినా పర్వాలే.’ అనుకొంది. మొగుడు పోయేనాటికి ఆయన అన్నదమ్ముల్లో తనకూ, తన పిల్లలకూ మిగిలింది ఈ ఎనబ్భై సెంట్లే, ఆ నాటికి మామ బతికే ఉండాడు. తండ్రి లేని పిల్లలకు అన్యాయం జరుగుద్దని పంపకాలు జరిగే దాకా తన కాడే ఉన్నాడు. బతికినంత కాలం పొలం మీదే ఉండే వాడు. చిన్న రాయి కాలికి తగలితే ఒప్పుకొనేవాడు కాదు. బాట అరిగేటట్టు ఇంటికీ పొలానికి తిరిగేవాడు. పొలాన్ని గొబ్బెమ్మలా మెత్తగా తయారుచేశాడు. చివరాకరుకు కూతురు కాడ వెల్లబార్చు కొన్నాడు. తను మాత్రం! ఏనాడూ వళ్ళు దాచుకోలేదు. రేయింబవళ్ళు పొలం రందే.

ఏడాదికి ఎన్ని పంటలైనా వెయ్యొచ్చు. ఒకేడాది వానలు రాక పోయినా బాద లేదు. ఒకేడాది ఎక్కువ వర్షాలైన ఏం కాదు. రెక్కల కట్టమే మదుపు ఈడ. జరీబు బూమి. కూలి ఖర్చులు పోయినా లక్ష మిగులుతుంది. నాలుగు బర్రెగొడ్డను ఈ బూమె సాకింది. ఇద్దరు కొడుకులు ఇంజనీరింగు చదివించింది.

”కాటికి పొయ్యేదాకా నేనీడే. చేయలేని నాడు కౌలుకిచ్చిన కాలు మీద కాలు వేసుకొని బతకచ్చు. ఒకమ్మని ముద్ద అడగకుండా” కళ్ళు మూసుకొంది. ఎండకు కాసిన ముఖంలో నవ్వు. మట్టిని జవురుతూ రేపటి రోజుని తలుచుకొని ఒక కల కనింది. పక్క పొలంలో వెంకయ్య, రావయ్యా, వీరాంజనేయులు… అందరూ అలాంటి కలలే. నిన్నటి కష్టం మర్చిపోయి రేపటి బరోస మనసునిండా నింపుకొంటూ…

ఏసీ మెత్తటి చప్పుడు కూడా చేయటం లేదు. బంగాళా చుట్టూ జెడ్‌ కేటగిరీ బందోబస్తు. మెత్తటి పరుపు మీద అతడు దొర్లుతున్నాడు.

”ఈ రోజుకి రెండు గంటలు దొరికింది నిద్ర పోవటానికి…” కళ్ళు మూసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నిద్ర రావటం లేదు. ”వళ్ళు అలిసి నిద్ర పట్టి చాలా రోజులయ్యింది.” అనుకొన్నాడు. మనసు అలిసి నిద్ర పోవాల్సిందే. రేపు ఎర్లీ మార్నింగ్‌ ప్లైయిట్‌. సింగపూర్‌, జపాన్‌, ఈ ట్రిప్‌లో పూర్తి చేసుకొని రావాలి.

”అసలు ఈ ప్రయాణం అవసరమా?” ఈ ప్రశ్న వేధిస్తుంది పొద్దుటి నుండి.

”నేనెటూ బహిరంగంగా ప్రకటించాను కదా. ఎవరైనా వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టవచ్చునని. మిగితా ఫార్మాలిటీస్‌ తరువాత చూసుకొందాం అని. ఇప్పుడు సంతకాల కోసం ప్రత్యేకంగా వెళ్ళి టైమ్‌ వేస్టు చేసుకోవడం ఎందుకు? ఇక్కడ ఎన్ని పనులున్నాయి? ఈ ఐయ్యేయెస్సులకు ఏం పని లేదు.” మనసులో తిట్టుకొన్నాడు.

” ఈ రైతుల నోళ్ళు మూయించాలి. అప్పటికి రెండు పత్రికలూ, ఆరు ఛానళ్ళు కష్టపడుతూనే ఉన్నాయి. నవ్వుతున్న రైతుల ఫోటోలు తీసి పెట్టండయ్య అని చెప్పాను. ఆ ఏడుపుగొట్టు ఆడోళ్ళ, మగోళ్ళ జోలికి పోవద్దు అని చెప్పాను. ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎవరో ఏదో కుట్ర చేస్తున్నారు….” అసహనంగా కదిలాడు.

మూసిన అతడి కళ్ళలో అస్థిమితంగా తిరుగుతున్న కంటి గుడ్డులోంచి అతడూ ఒక కల కంటున్నాడు.

”మూడు రింగ్‌ రోడ్డులు, మెట్రో లైన్‌, ఆకాశానంటే బిల్డింగులు…

మెల్లిగా నిద్రలోకి జారుకొన్నాడు. కలలో అతడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఒక్కో అడుగు ఒక్కో ఎకరం దూరం పడుతుంది. లక్షల అడుగులు వేస్తున్నాడు.

”ఇదేంటి ఇంత పెద్ద పాదాలు నాకు. నాకు కావల్సిన భూములు దొరికాయి…. ” కంటి కొసల నుండి ఆనందభాష్పాలు.         ”అడుగున ఎవరూ? నలిగి పోతున్నారు?…. వెంకాయిలు, నారాయణమ్మలు, సిరిసాలూ, రావయ్యాలూ, వెంకయ్యలూ… ఎవరక్కడ స్ట్రెచెర్స్‌ పట్టుకురండి. బతికిన వాళ్ళను పక్కనే ఉన్న దగ్గులాసుపత్రిలో చేర్పిద్దాం.”

 

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

2 Responses to ఆమె, అతడు, కలలు …- రమాసుందరి బత్తుల

  1. S R Battula says:

    మనసుకు హత్తుకొనెలా మీరు చెప్పగలరని తెలుసు కానీ , ప్రస్తుత పరిస్తితిని , మద్యతరగతి జీవి కలలు కల్లలయ్యె వాస్తవికతను బాగా చెప్పారు . ఏ చరిత్ర చదివినా, పాలకులంతా సగటు మనిషి కలల సమాదుల మీద తాజ మహల నిర్మించుకున్న వాల్లె . చేతులు కాళ్ళు చువ్వలు చేసుకొని భూమితో సావాసం చేస్తూ … వాల్లు కంట్టూన్న కలలు కల్లలు గానె మిగిలి పొవాలా? జీవించె హక్కు అందరిది అని యెలుగెత్తిన ఆ గౌంతులన్ని ఎక్కడ పొయాయి ? కుల , వర్గ, స్వార్ద సమాదుల్లొ చెరి మొద్దు రాచిప్పలుగా శాస్వత నిద్రలొ …..

    ఏ ఒక్క సమాదిలొ కదలిక వచ్చి …. ఒక్క గొంతు వినపడదా అని మీరు చెసిన ఈ ప్ర్యత్నానికి నా అభినందనలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.