ప్రేమోన్మాదానికి మూలం

లోకే రాజ్‌పవన్‌
గంగాభవాని..శ్రీలక్ష్మి.. మహలక్ష్మి.. లక్ష్మీసుజాత.. ఆయేషా మీరా..కొత్తగా మీనాకుమారి…అందరిదీ ఒకే తరహా ముగింపు.

ప్రేమోన్మాదానికి బలైన పసి జీవితాలు..కొన్ని పురుష ప్రేమలు కోరిన బలికిగాను బలిపీఠాలెక్కిన అమాయకులు..

తమ ప్రేమను తిరస్కరించి నందుకు మహిళలపై పురుష మార్గంలోని ఒక సెక్షన్‌ చేస్తున్న పాశవిక దాడులకు ప్రాణాలు కోల్పోయి తమ వారిని శోక సముద్రంలోకి నెట్టడమేకాదు, సభ్యసమా జాని(?)కి సటిగా ప్రశ్నలు సంధిస్తూ బోనులో నిలబెడుతున్నారు.

                    మనదేశంలో ఉన్మాద హత్యలు కొత్తేమీకాదు. అయితే ఇటీవల పెచ్చు మీరుతున్న ప్రేమోన్మాద హత్యలు మాత్రం అందరినీ తీవ్రంగా కలవరపెడుతున్నాయి.స్త్రీలకు ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్లు మరొక కొత్త సమస్య ‘ప్రేమోన్మాదం’ భిన్నమైనది. ఇతర సమస్యల విషయంలో పురుషుడు తన ఆధిక్యతను నిలుపు కుంటనే సమాజాన్ని కూడా తనవైపు మరల్చుకునేలాగా సమస్యను సాధారణీ కరించేందుకు కృషి చేస్తాడు.

సమాజం కూడా చాలావరకు అందుకు మద్దతు నిస్తుంది. ఉదాహరణకు కట్నం తీసుకోవడం తప్పు అనే భావన కనుమరుగైపోయి సమాజం కూడా కట్నం సర్వసాధారణమే అనే ఆలోచనకు వచ్చింది. కానీ ప్రేమోన్మాద సమస్య అలాంటిది కాదు. దీనిని పురుష మార్గం సమర్ధించుకోన లేదు. సమాజమూ మద్దతివ్వలేదు. ఎటొచ్చీ పురుష మార్గాన్ని దోషి నిలబెట్టడమే అంతిమంగా జరుగుతుంది.
                ప్రేమోన్మాద సమస్యకు పరిష్కారం వెతకటం అంటే ప్రభుత్వాల దృష్టిలో ఉన్మాదులను శిక్షించడమే. సమాజం దృష్టిలోనైతే కౌన్సిలింగులు నిర్వహించడం,మీడియను నియంత్రించటం. అయితే  ఏ సమస్యకు పరిష్కారమైనా పైపైన జరిపే సిమెంటు పూతలు కావు. పగుళ్ళకు కారణమైన పునాది లోపాలను, బలహీనత లను వెతికి పట్టుకోవటం.
             వేలాది సంవత్సరాల పరిణామ క్రమంలో మనం ప్రస్తుతం అధునాతన నాగరిక జీవనం కొనసాగిస్తున్నాము.  అందులోనూ నూతన ఒరవడి, సంస్కృతి, సాంప్రదాయాలను పుణికి పుచ్చుకుంటు న్నాము. అయిననూ తరతరాల మకిలిగా వెంటాడుతున్న పురుషస్వామ్యం మాత్రం సమాజం నుంచి ఇంకనూ చెదిరిపోలేదు. రూపాలు మార్చుకుంటూ, కొత్త వేషాలు వేస్తూ అది సుస్థిరంగా నేటికీ కొనసాగుతూనే ఉంది. సీతను అగ్నిప్రవేశం చేయించిన రామునితో సహా పురుషస్వామ్యం పోయి భర్త చితిలోనే భార్యను అగ్నికి ఆహుతి చేసిన (సతీసహగమనం) పురుషస్వామ్యం వచ్చింది. అదీ పోయి నేడు అదనపుడు కట్నాల కోసం  స్త్రీని అగ్నికి బలిపెడుతున్న నయా పురుషస్వామ్యం కూడా వచ్చింది. పురుషస్వామ్యం కేవలం రూపాలు మాత్రమే మార్చింది. పురాణేతిహాసాలలోనూ, రాచరిక నియంతృత్య పాలనలోనూ ఆధునిక తరహా సామాజిక, రాజకీయ జ్ఞానాలు పెంపొందక పోవటంవలన ఆనాటి జీవన స్థితిగతులు పురుషులకే అనుకూలంగా ఉంటూ వచ్చాయి. శారీరకంగా, ఆర్ధికంగా, సామాజికంగా  పురుషుని ముందు స్త్రీ బలహీనురాలై, లొంగి ఉంటూ వచ్చింది. కనుకనే ఆనాటి పురుషుడు స్త్రీపై సాగించిన హింస కుటుంబ పరిధిలో ప్రత్యక్షంగాను, సమాజ పరిధిలో పరోక్షంగాను ఉండేది. అటు కుటుంబానికైనా, ఇటు సమాజా నికైనా, చివరకు బాధిత స్త్రీకైనా అదొక ‘అంగీకార హింస’.

కానీ ఈనాడు ప్రజాస్వామిక, సోషలిస్ట్‌ జ్ఞానం ప్రజలలో పెరిగింది. ఆయ సిద్ధాంతాలకు అనువైన ప్రభుత్వాలు ఏర్పడిన దరిమిలా నూటికి ఒక్క శాతమైనా అవి ఆయ భావనల ఆచరణకు పూనుకున్నాయి.  తద్వారా  పురుషులకు ధీటుగా స్త్రీలు ఎదిగే వాతావరణం చాలా ఆలస్యంగానైనా భారతదేశంలాంటి దేశాలలో ఏర్పడింది.

ఈ దశలో యుగాలుగా పురుషునికి సహకరించిన ‘అంగీకార హింస’ క్రమంగా పురుషుని నుంచి దూరమవుత వచ్చింది. స్వేచ్ఛా భావనల వికాసం ఇందుకు కారణమైంది. అంతేకాదు స్వేచ్ఛా భావనలు ‘అవగాహనాత్మక సహజీవనానికి’ బీజాలు  వేశాయి. బయటి మాటల్లో ‘ప్రేమ’గా పిలవబడే ఈ అవగాహనాత్మక సహజీవనం  స్త్రీ పురుషుల భవిష్యత్‌ జీవన ప్రయాణానికి   చక్కని దిశానిర్దేశం చేయగల శక్తి గలది. మానసికమైన పరిపూర్ణతను సాధించగల పాత్రను పోషించగలదు. ఇది ఒక రకంగా సహచరుల ఎంపిక స్వేచ్ఛ, సహజీవన సమానత్వం అనే అంతర్లీన అంశాల విషయంలో స్త్రీ పురుష భేదాలను తొలగించి, సమానత్వ ప్రాతిపదికపై పనిచేయగలదు. క్రమేపి పురుషస్వామ్య ఆధిక్యతను కనుమరుగు చేయగలదు. ఎంపిక స్వేచ్ఛ  మొదలు సహజీవన సమానత్వం పురుష మార్గాన్ని కొన్ని పరిమితులలో ఉంచగలదు.
                  అయితే ఈ పరిణతి పురుష మార్గాన్ని తీవ్రంగా కలవరపెట్టింది. తన అస్తిత్వానికే ముప్పువాటిల్లే ఈ పరిణామాన్ని పురుషస్వామ్యం లేశమాత్రమైనా అంగీకరించలేదు. క్రమంగా ఎంపిక పద్ధతిని సయానత్వ ప్రాతిపదికన నిర్వహించుకుని, వివాహానంతర  సహజీవనంలో మాత్రం పురుష మార్గం సమానత్వానికి తిలోదకా లిచ్చింది. ఆ విషయంలో అది విజయం సాధించగలిగింది. ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత కూడా కట్నాలు, అపోహలు, కులమతాల పట్టింపుల పేరిట జరుగుతున్న కుటుంబహింస, స్త్రీ హత్యలు ఈ కోవకు చెందినవే. ఇదంతా నిన్నటి మాట. నిన్నటి వరకూ పురుషస్వామ్యం సహజీవన సమానత్వాన్ని కబళించిన ఉదాహరణలు కోకొల్లలు. కానీ నేడు పురుష స్వామ్యం మరొక ముందడుగు వేసింది. సహజీవన సమానత్వాన్ని  ఛిద్రం చేసిన తరహాలోనే ఇప్పుడు ఎంపిక స్వేచ్ఛన నాశనం చేసే మార్గంలో ప్రయాణం చేస్తున్నది. అందులో భాగమే అభాగినులపై ఈ ప్రేమోన్మాద పంజా.
             సహచరుణ్ణి ఎంపిక చేసుకునే స్వేచ్ఛను స్త్రీలనుంచి దూరం చేస్తూ, వారిని మానసిక ఒత్తిడులకు, శారీరక దాడులకు కొందరు ఉన్నాదులు గురిచేస్తున్నారు. నన్ను తప్ప మరెవరినీ ప్రేమించరాదంటూ పురుషస్వామిక అపరిమిత స్వేచ్ఛను ప్రయోగిస్తూ ప్రేమను యావత్తూ ‘పురుషస్వామిక ప్రేమ’గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రేమను నిరాకరించే హక్కు స్త్రీలకు లేకుండా చేసి వారిని, వారి స్వేచ్ఛను గుప్పెట్లో ఉంచుకునే నియంతృత్వ పోకడలు పురుష స్వామ్య విషసంతానం కాదని అనగలమా? ఇది తరతరాల పురుష అహంకారాన్ని విస్తరించుకునే వికృతమార్గం కాదని చెప్పగలమా? ఈ  తరహా ‘వ్యవస్థీకృత ఉన్మాదం’ తో స్త్రీలపై శారీరకంగా భౌతికంగా దాడులు జరిపేది కేవలం ఉన్మాదులే కాదని, వారిలో అంతర్గతంగా పేరుకుపోయిన పురుష అహంకార ధోరణులేనన్నది సుస్పష్టం. అందరు ప్రేమికుల, అందరు పురుషుల ఈ తరహా ధోరణులతోనే ఉన్నారని భావించటం పొరపాటే అవుతుంది కావచ్చు గానీ, పురుష మార్గంలో నిబిడీకృతమైన పురుషాధిక్య ధోరణులే ఒక్కొక్కటిగా తరచూ ఉన్మాదరూపాన్ని  తీసుకుంటున్నాయని మాత్రం ఖరాఖండీగా చెప్పవచ్చు.
            కనుక సమస్యకు మూలం పురుషస్వామ్యంలో ఉంది. శిక్షలు, కౌన్సిలింగులు అవసరమే అయినన అవి సమస్యకు పరిష్కారం కాజాలవు. ప్రేమోన్మాదం రూపువసిపోవాలంటే పురుషస్వామ్యం నడ్డి విరగాలి. అందుకు తగ్గట్టుగా బలోపేతమైన ఉద్యమాలు జరగాలి. మహిళా హింసకు వ్యతిరేకంగా సాగే ఈ పోరాటాలవల్లనే ప్రభుత్వాలు, సమాజాలు నిద్రలేస్తాయి. అప్పుడే అవి సమస్య మూలాలను గుర్తిస్తాయి. కాబట్టి మన అస్తిత్వం మన ఉద్యమాలతోనే పరిరక్షించు కోగలం. 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ప్రేమోన్మాదానికి మూలం

  1. Pingback: అగ్నిప్రవేశం , రామాయణం - ఈమాట,కొందరి మిత్రుల వ్యాసాలు , « శ్రీదీపిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో