అగ్నిపుత్రి – బి.కళాగోపాల్‌

జలజకు హృదయమంతా కలచివేయసాగింది. ఆవేదనతో ఆమె మనస్సంతా కుతకుతలాడసాగింది. గుండె గూడుపట్లను కుదుపుతున్న దు:ఖాన్ని మోస్తూ ఆమె నిలువెల్ల శోకతప్తగా నిలబడింది. హాస్పిటల్‌లో ఉరుకులు పరుగులు పెడుతున్న సిబ్బంది. తెల్లని డ్రెస్సులో నర్సులు లోపలికి వెళ్తూ బయటకు వస్తున్నారు. తమ బిడ్డను అలా హాస్పిటల్‌లో అచేతనంగా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేకపోయారు. జలజ, సుధాకర్‌ దంపతులు. విరిజ ఇరువైఏళ్ల మల్లెమొగ్గ. సుధాకర్‌ దంపతుల ఏకైక పుత్రిక. చూడచక్కని రూపు, మంచి ఛాయ ఆకర్షణీయమైన సోగకళ్ళతో చూపరులను ఇట్టే ఆకర్షించేది. సుధాకర్‌ అదే ఊర్లో కాంట్రాక్టు వ్యాపారం చేస్తూండగా, జలజ దగ్గర్లోని ఒక ప్రైవేట్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేది. తమ గారాలపట్టిని బాగా చదివించి, ఒక మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్ళి చేయాలని ఆ దంపతుల యోచన. విరిజ వాళ్ల అంచనాలకు తగట్టే క్లాసులో ఎప్పుడూ ఫస్టే. యం.బి.ఎ చేసి సిటికి కాస్త దూరంగా ఉండే యం.ఎన్‌.సిలో ఉద్యోగం సాధించింది. తన కూతురు జాబ్‌లో చేరిన తొలిరోజు గుర్తుకు తెచ్చుకుంది జలజ.

ఆ రోజు ఉదయమే లేచి తలారా స్నానం చేసి కుంకుమ రంగు చుడీదార్‌లో తాజా గులాబీలా తొందరగా రెడి అవసాగింది విరిజ. ”అమ్మా ఈ రోజు స్నేహితులు పార్టీ అడిగారు, వాళ్ళకు మంచి డిన్నర్‌ ఇచ్చి అట్నుంచటే అందరం కల్సి ఐమాక్స్‌కు వెళ్లి వస్తాం. లేట్‌ అవుతుందని టెన్షన్‌ పెట్టుకోకు మధ్యలో ఫోన్‌ చేస్తాలే” అంది నవ్వుతూ. ”కాని జాగ్రత్త. ఎలా వెళ్తారు?” అంది జలజ ఆర్దోక్తిగా. ”చూడండి నాన్నా అమ్మకన్నీ భయాలు, సందేహాల పుట్ట. ప్రతిదానికి కంగారు పడుతుంది. బయటకు వెళ్తానని చెప్తానో లేదో, సవాలక్ష సూచనలు చేస్తుంది” అంది ఇడ్లీ తుంచి నోట్లో వేస్కుంటు. నవ్వాడు సుధాకర్‌. ”అమ్మకు చెప్పమ్మా, నీతో బాటు నీ వుడ్‌బి కళ్యాణ్‌ కూడా మీ పార్టీలో ఉంటాడని, అపుడు దిగులు పడదులే” అన్నాడు భరోసగా. ”ఓహో, ఇది మీ ముగ్గురి ప్లాన్‌ అన్నమాట. మరి ముందే చెప్పవేం అల్లరి పిల్లా” అంటూ మొట్టికాయ వేసింది జలజ. ”ముందే చెప్తే ఏం మజా! అందుకని అరరే టైం అవుతోంది. మాధురి మెసేజ్‌ పెట్టింది. దాన్ని పికప్‌ చేస్కొని వెళ్లాలి. లేట్‌ అవుతే కష్టం. బై అమ్మా ” అంటూ తల్లి చేతిని ముద్దాడి బయటకు వేగంగా నడిచింది విరిజ. స్కూటీపైన కూతురు కనుమరుగయ్యే వరకు చేయి ఊపింది జలజ.

ఎంత దుర్దినం. ఇలాంటి కడుపుకోత ఏ తల్లితండ్రులకు రావద్దు. జలజ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. పచ్చిపుండులాంటి దేహంతో విరిజ మూలుగు విని ఈ లోకంలోకి వచ్చిందామె. వాడిన గులాబీలా చలనం ఉందో లేదన్నట్టుగా చిన్నగా కదల సాగింది, ఆ అమ్మాయి. చటుక్కున సుధాకర్‌ విరిజ చేయి పట్టుకున్నాడు. జలజ విరిజ తలపై చేయి వేసి ప్రేమగా నిమరసాగింది. ఆమె ఇంకుతున్న కళ్ళ నీళ్ళలా సలైన్‌ బాటిల్‌ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోసాగింది. ఓ నాలుగు గంటలు గడిచాయి. పంటి బిగువున బాధను నొక్కిపట్టి కళ్ళు తెరచింది విరిజ. ఆమె కళ్ళలో ఆ రోజు రాత్రి జరిగిన దుర్ఘటన తాలూకు నీలినీడలు కదలసాగాయి.

”ఏయ్‌ విరిజా! ఆరవుతోంది. ఐమ్యాక్స్‌కు లేటవుతుందా? ఆన్‌లైన్‌ టికెట్స్‌ బుక్‌ చేశావా?” సెల్‌లో మాధురి మెసెజ్‌ చదువుకొని బదులిచ్చింది విరిజ. అమ్మాయిలంతా కులాసాగా ఐమ్యాక్స్‌ వద్ద కలిసి షో చూశారు. రాత్రి తొమ్మిందింటికి అంతా కల్సి ముందే ప్లాన్‌ చేసుకున్న హోటల్‌కు బయలుదేరారు. ”ఏమైంది విరి! ఏమా పరధ్యానం” అంది మాధురి అనన్యమస్కంగా ఉన్న ఫ్రెండ్‌ను చూస్తూ. ”ఏం లేదే కళ్యాణ్‌ వస్తానన్నాడని అమ్మకు అబద్దం చెప్పా ఎంత ఎదురు చూస్తుందో ఏమో” అంది. ”డిన్నర్‌ కాగానే తొందరగా వస్తున్నానని మెసెజ్‌ పెట్టు” అంది మాధురి. స్నేహితులంతా కాసేపు కులాసాకబుర్లతో గడిపారు. రకరకాల భవిష్యత్‌ ప్రణాళికలను చర్చించుకున్నారు. సరదాగా ఒకర్నొకరు ఆటపట్టించుకున్నారు. డిన్నర్‌ అవగానే మాధురిని ఎప్పట్లా వాళ్లింట్లో దించేసి తమ కాలనీవైపు బయలుదేరింది విరిజ. దార్లో ఆటో ఒకటి తననే వెంబడిస్తున్నట్లుగా గమనించలేకపోయింది. ముందే రచించుకున్న పథకం ప్రకారంగా ఆటోలోని ఐదుగురు యువకులు ఆమె స్కూటీని ఢీకొట్టి, కిరాతకంగా విరిజ బతుకును బుగ్గి చేశారు. అత్యంత హేయంగా రేప్‌ చేసి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు చేతులు కట్టేసి రోడ్డు పక్కన పడేసి పోయారు.

రాత్రి పన్నెండయినా ఇంటికి రాని కూతురి కొరకై సుధాకర్‌ దంపతులు ఆందోళన పడసాగారు. మాధురికి ఫోన్‌ చేశారు. అప్పుడే బయలుదేరింది అంకుల్‌ అంది మాధురి అంతే టెన్షన్‌గా. ఏమైనా ఆక్సిడెంట్‌ జరిగిందా? కారుతీయండి మాధురి ఇంటికి వెళ్ళే తోవ నుండి వెదుకుతూ వెళ్దాం అంది జలజ హీన స్వరంతో. గబగబా కారెక్కి రోడ్ల వెంబడి వెతుకుతూ బయల్దేరారు ఇద్దరు. కాస్త చీకటిగా ఉండి వీధిలైటు పడని చోట తుప్పల్లో కుంకుమ రంగు చున్నీ కన్పించింది. కారు ఆపి ఒక్క ఉదుటున అటువైపు పరుగెత్తారు. తమ కన్నకూతురు నిర్జీవంగా పడి ఉంది. గాయాలకుంపటిలా ఉన్న ఆమెను చూడగానే భోరుమంది జలజ. సిటిలో పేరున్న పెద్ద నర్సింగ్‌హోంలో చేర్పించారు. ఇంటి నుండి లంచ్‌ ప్యాక్‌ చేసి తీసుకొచ్చాడు కళ్యాణ్‌. ”ఆంటీ, ప్లీజ్‌ ఏడవకండి. మనమంతా ఇప్పుడు విరిజకు సపోర్ట్‌గా ఉండాలి తనను మళ్లీ మాములు మనిషిని చేయాలి. అంకుల్‌ మీరు కూడా ఇలా ఐతే ఎలా? జరిగిన దాంట్లో విరి తప్పేమీ లేదు. ఇదంతా ఆ రాస్కెల్స్‌ చేసిన పైశాచిక నేరం. వాళ్లంతా అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. ఏదో ఒక రోజు పట్టుబడకపోరా?” కళ్యాణ్‌ కళ్ళలో ఆవేశం. ”ఫ్లీజ్‌ మీరు రెండు రోజులుగా ఏం తినటం లేదు. చాలా నీరసపడిపోయారు. విరికి మెలుకువ వచ్చిందా? హాస్పిటల్‌ బిల్లు పే చేసి వస్తాను. విరిని డిశ్చార్జి చేసికొని వెళ్దాం”. అంటూ కౌంటర్‌కేసి నడిచాడు కళ్యాణ్‌.

ప్రాణమున్న బొమ్మలా కూర్చుంది విరిజ బెడ్‌రూంలో. ఆ అమ్మాయిని పలకరించాలంటే ధైర్యం చాలటం లేదు వాళ్ళకు. అక్కడక్కడ గీరుకుపోయిన గాయాలతో సజల నయనాలతో చైతన్య రహితంగా ఉన్న విరిజను చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది జలజకు. ఇంకా కొన్ని నెలల్లో పెళ్ళి కళతో కళకళలాడాల్సిన విరిజ విషాద వదనంతో పోగొట్టుకున్న దానిలా నిలబడుతుందని వారూహిం చని చేదు నిజం. ఐనా సరే తమ కూతుర్ని ముందు గతం తాలూకు బాధామయ సందర్భం నుండి బయటపడవేయాలి. బయటకు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతూ విరిజ ఎప్పుడు ఏ అఘాయి త్యం చేస్తుందోనని బెదిరిపోతూ ఆమెను కంటికి రెప్పలా కాపాడు కోసాగారు వారు. దానికి తోడు అప్పుడప్పుడు కళ్యాణ్‌ వస్తూ పోతూ వారికి తన హితవచనాలతో ధైర్యం చెప్పసాగాడు. విరిజతో కూడా ఎప్పట్లా చనువుతో మొదలసాగాడు. ఓ నెల రోజులు గడిచాయి.

మేడ దిగి కిందికి వస్తున్న విరిజను చూసి నమ్మలేక పోయింది జలజ. ఏమండీ అటు చూడండి అంది సుధాకర్‌ వైపు తిరిగి పేపర్‌ మడచి కూతురి వైపు చూసి ఆశ్చర్య పోయాడు సుధాకర్‌. బ్రైట్‌ పసుపు రంగు కుర్తీ, గులాబీ రంగు లెగ్గిన్‌లో తలారా స్నానం చేసి వదిలేసిన కురులతో కుదుటపడ్డ మోముతో చకచకా మెట్లు దిగుతున్న కూతురి వంక ఆ దంపతులు చూశారు. ”అమ్మా! విరీ! ఎలా ఉందమ్మా ఈ రోజేమిటి విశేషం? ఎటైనా వెళ్తావా తల్లీ!” అనునయంగా అడిగాడు సుధాకర్‌. ”అవునాన్నా ! ఈ రోజు నుండి ఆఫీసులో జాయినవ్వాలనుకొంటున్నా. నాకు జరిగిన అన్యాయాన్ని తల్చుకొని ఎన్నాళ్లు కుమిలినా లాభం లేదు. నా గాయం శరీరానికే గాని మనసుకు కాదని సర్ది చెప్పుకున్నా, నాలో నేను కుములుతూ మీకు, కళ్యాణ్‌కు మనస్తాపం కల్గించలేను. ఎప్పట్లా ఉండటానికి ప్రయత్నిస్తున్నా నాన్నా. ఇది నా జీవితం, నా చేతుల్లోనే ఉంది. నిత్యం పేపరు తిరగేస్తే ముక్కు పచ్చలారని పసిమొగ్గల నుండి ముదివగ్గుల వరకు కామాంధుల కాటుకు బలి అవుతున్న వారే. ఎవరో చేసిన విష ప్రయోగానికి మేమెందుకు చావాలి నాన్నా. మా మనస్సును ఎందుకు శిక్షించుకోవాలి? మానసికంగా, శారీరకంగా స్త్రీని లైంగిక వేధింపులకు గురి చేసేవారికి ఉరే సరి. ఇన్నాళ్ళు అనుభవించిన మానసిక చిత్రహింస ఇక చాలు. నేనెప్పటిలా ఆఫీసుకు వెళ్లి తిరిగి పనిలో ఆనందాన్ని వెదుక్కుంటాను. నా గురించి మీరేమీ వర్రీ అవ్వొద్దు. మెల్లిగా నా దైనిందిక జీవితాన్ని గడపాలనుకుంటున్నా. అమ్మా, టిఫిన్‌ పెట్టు” అంటున్న కూతురి వంక చూస్తూ కంటతడి తుడుచుకుంది జలజ.

ఆఫీస్‌ లంచ్‌ అవర్లో మాధురి మెసెజ్‌ చూసుకుంది విరిజ. తాము ఎప్పుడూ వెళ్లే హోటల్‌లో టేబుల్‌ బుక్‌ చేశానని, సాయంత్రం స్నాక్స్‌కు రమ్మని మెసెజ్‌. ఆఫీస్‌ అయిపోగానే రోజూ కళ్యాణ్‌ వస్తున్నాడు. కళ్యాణ్‌తో పాటుగా బయల్దేరింది విరిజ. బైక్‌పార్క్‌ చేసి లోనకు అడుగు పెట్టారిద్దరూ. ”ఆగండి, టేబుల్‌ బుక్‌ చేసింది మీ కొరకే ఐతే ముందు బయటకు నడవండి” అన్న యాజమాన్యం నుండి ఊహించని ప్రతిఘటన వారికి ఎదురైంది. ”ఏం ఎందుకు?” గట్టిగా నిలదీశాడు కళ్యాణ్‌. ”ఎందుకంటే ఈ అమ్మాయి రేప్‌కు గురైంది, మా హోటల్లో ఇలాంటి వారికి పర్మిషన్‌ లేదు” అన్నారు. అప్పటికే వచ్చిన మాధురి, విరిజ చేయిపట్టుకుంది గట్టిగా. ”ఏమండీ! మీరు అసలు మనుషులేనా? రేప్‌కు గురైన అమ్మాయి ఏం పాపం చేసిందని? ఆమెనలా సాంఘికంగా వెలేస్తున్నారు. శిక్షించాల్సిన మృగాళ్లను మరిచి వంచితలనెందుకు బాధిస్తారు? ఐనా గాయం వారి శరీరానికే గాని మనసుకు కాదు. వారందరు మాలిన్యం అంటని అగ్నిపుత్రికలే. సమాజంలో నిత్యం ఏదో మూల అభాగినులు దాడికి గురవుతున్న వారే. కొన్ని కేసులు వెలుగులోకి వస్తే, చీకట్లో అంతమయ్యే మనకు తెలియని కేసులెన్నో. వారిపట్ల ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన యజమాన్యం మీరేనా ఇలాంటి పాపపు మాటలంటున్నది ” ”మనసున్న మనుషులగా ఇది మనమంతా ఖండిచాల్సిన అంశం” అంటూ నిప్పులు చెరిగాడు కళ్యాణ్‌. మరి కొంతమంది అక్కడ పోగయ్యి, జరుగుతున్న దానికి తమ వత్తాసును పలికారు. ఇదేదో పెద్దగా ముదరక ముందే క్షమాపణలు చెప్పాలనుకొని తోక ముడిచారు హోటల్‌ యాజమాన్యం. ”నీకేం ఫర్లేదు నేనున్నాంటూ” షాక్‌కు గురయిన విరిజ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కళ్యాణ్‌ మరెన్నటికి వీడని తోడంటూ. మాధురి తన ఫ్రెండ్‌కు జరిగిన అవమానాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఆమెకు సామాజిక మద్దతుగా ఎంతోమంది నిల్చారు. విష సంస్కృతిని ఎండగడుతూ ఎన్నో నిరసనలు వెలువెత్తాయి. విరిజ ఇప్పుడు వట్టి బేల కాదు. తనకెదురైన అవమానానికి ధీటుగా బదులిచ్చింది. నిబిడాశ్చర్యంతో మూఢ జనం చూస్తుండగా అగ్నిపుత్రిలా కణకణ మండుతూ నింగిని దూసుకుపోయే తారక ఆమె.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో