అస్థిత్వాల చెలమలో ఎగిసిన పాదరసం సుమతీ నరేంద్ర కవిత్వం

‘నా సృజనాత్మక హృదయంలో భావుకతలో, రచనలో యింకొక ఇల్లు వుంది.  అదే నా పదాల నివాసగృహం.’

అని   ‘నిమాన్‌ శోభన్‌’ భావించినట్లుగానే డా|| సుమతీ నరేంద్ర గారు కూడా కవిత్వ పదాల గృహాన్ని కొత్తగా ఆవిష్కరించారు.

సుమతి గార్ని చూసినప్పుడల్లా పూజ్యులు నాయని కృష్ణకుమారి గారు గుర్తొచ్చేవారు.  అత్యంత ప్రతిభావంతురాలు, స్నేహశీలి, సౌమ్యులు, జానపద విజ్ఞానగని, ఆర్ద్రత నిండిన కవయిత్రి, శిష్యుల పట్ల వాత్సల్యానురాగాలను వర్షించే మబ్బుతునక.  సరిగ్గా యివే లక్షణాలను పుణికి పుచ్చుకున్న వ్యక్తి సుమతీ మేడమ్‌.  ఆమె శిష్యురాలైనందుకు ఒకింత గర్వపడ్డ సందర్భాలు లేకపోలేదు.
‘మొలకెత్తిన అక్షరం’ అనే కవిత్వ సంపుటిని 2006లో వేశారు.  ‘నన్ను నేను పారేసుకున్నాను’ అనే అస్తిత్వగీతితో మొదలై అన్వేషణ కొనసాగిస్తూ ‘అంతరంగంలోనే ఆ గాలిపాట/అది మాసి పోతుందా?’ అనే ప్రశ్నను వేస్తూ కవిత్వానికి తాత్కాలిక చుక్కను పెట్టారు.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా, అనేకమంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకురాలిగా, ఉత్తమ అధ్యాపకురాలిగా, విమర్శకురాలిగా, ప్రసంగకర్తగా బహుముఖ ప్రజ్ఞను కనపరిచిన సుమతిగారు మనస్సు విప్పి స్వచ్ఛంగా కవిత్వంగా అక్షరాలను వెదజల్లుతూ వచ్చారు.
ఇన్నాళ్ళ అనుభవం, జీవితం ఆమెలోని ఆర్ద్రత, నైపుణ్యానికి యీ అక్షరాలు తార్కాణాలు.  జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీలో ప్రతిక్షణం జీవించమన్నట్లుగానే ‘జీవితం జీవితమే/జీవించడమే దాని పరమార్ధం’ అనే నిజాన్ని (కాబట్టి) ప్రకటిస్తారు.
స్త్రీ పురుషుల మధ్య అంతరాలను, వివక్షతలను, జెండర్‌ విధానాన్ని అనేకచోట్ల ప్రశ్నించారు. 

ఇంటిపని, పిల్లల పెంపకం స్త్రీలదేననే శాసనాలను విమర్శించారు, స్త్రీవాద దృక్పథంతో, ఆధునికురాలు అనడానికి ఆమె చేయించిన పరిశోధనలు కూడా సాక్ష్యాలే.  జయప్రభ చేసిన యం.ఫిల్‌ సిద్ధాంత గ్రంథం ‘భావకవిత్వంలో స్త్రీ’కి మార్గదర్శకత్వం వహించి ఒక కొత్త ఒరవడిని సిద్ధాంత గ్రంథాలలో ప్రవేశపెట్టారు.  ‘నా వేగానికి నీవందడం లేదు/నీ వేగానికి నేను చాలడం లేదు/నేను నీ కవసరం లేదనే నిజాన్ని నేను గ్రహించలేను ఎన్నటికీ అనే వాస్తవాన్ని దృశ్యమానం చేశారు.  సాత్విక పోరాటం, పురోగతి, వాళ్ళకు కూడా ధాతుస్పర్శ, ఒకప్పుడు, కలలే, కవి సమయం, కోయిలౌటాదె…, మానవత, జిక్కికోసం…, మా అమ్మ, స్త్రీ, పాదరసం వంటి అద్భుతమైన కవితల్ని రాశారు.
స్త్రీపురుషులిరువురూ ఒకరినొకరు అర్థం చేసుకుని సమస్థితిని కలిగివుండే కుటుంబాలే సమాజ ప్రగతికి కావాలనే బలీయమైన ఆకాంక్షను చాలా కవితల్లో మెత్తటి ఇసుకలాంటి మాటల్తో కవిత్వీ కరించారు.  స్త్రీ మెదడు, హృదయం పాదరసం లాంటి శక్తిమంతమైనవని చెబ్తున్న కవిత.  ఇది పాదరసం నా బుద్ధి/పట్టి ఉంచాలని చూడకు/అమృతం నా హృదయం ఆస్వాదించి చూడు/నేను భూమినే/నువ్వు సూర్యుడివి కావు/నీ చుట్ట తిరగలేను/కుటుంబానికి కేంద్రాన్ని నేనే/నాది గురుత్వాకర్షణే/అతిక్రమించాలని చూడకు/తెగిన గాలిపటానివై పోతావు/ఈ చక్రాన్ని తిప్పడంలో చేయికలుపు/నీ మనుగడకు అస్తిత్వాన్ని కూర్చిపెడతా/నా పిల్లలు నక్షత్రాలు/వెలుగును ప్రసాదిస్తారు/కాదంటావా, నీ జీవితమంతా చీకటే. – ఒక వాస్తవాన్ని, హెచ్చరికను, స్త్రీ శక్తిని వెలిబుచ్చిన కత్వమిది.
గొప్ప జీవితానుభవమూ, తార్కికతా, లోతైన పరిశీలనా గుణము వున్న వ్యక్తులు కవిత్వ రంగంలోకి వస్తే ఇలాంటి పరిణితి నిండిన కవిత్వమే కనిపిస్తుంది. నేనెంత రాసినా అది తక్కువే.  ఐతే, గురువుపట్ల నాకు గల గౌరవ ప్రకటనగానే భావిస్తున్నాను.
డా. శిఖామణికి రాష్ట్ర ప్రభుత్వ ఉగాది విశిష్ట పురస్కారం
సర్వధారి ఉగాది వేడుకల సందర్భంగా కవితా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి అవార్డ్‌తో శిఖామణికి సత్కరించారు.

Share
This entry was posted in మనోభావం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో