ఉద్వేగంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవం

భూమిక వరుసగా మూడోసారి నిర్వహించిన కథల పోటీకి ఈసారి కూడా మంచి స్పందన రావడం సంతోషకరమైన విషయం.

ఈ పోటీ నిరాఘాటంగా జరగడానికి స్సూర్తినిస్తున్నారు మిత్రులు, ఆరిసీతారామయ్యగారు. వీరికి  కథ పట్ల వుండే ప్రేమ అపారమైంది. ఆయన ప్రోత్సాహాంతోనే ఈ పోటీలు జరుగుతున్నాయి.

అయితే ఈసారి కథల పోటీ నిర్వహణకి సీతారామయ్యగారితోపాటు మరెందరో మిత్రులు కలిసి వచ్చారు. శాంతసుందరి, పి. చంద్రశేఖర్‌ రెడ్డి, ఘంటశాల నిర్మలలు తమని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయిన  ఆత్మీయుల సంస్మరణార్ధం బహుమతులను ఏర్పాటు చేసి, విజేతలకు ప్రదానం చెయ్యడం విశేషం.
ఏప్రిల్‌ రెండున విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం, సుందరయ్య కళానిలయం మినీ హాలులో అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఉత్సాహంగానే కాక విలక్షణంగా, ఎమోషనల్‌గా కూడా జరిగింది. బహుమతుల ప్రదానానికి ముఖ్య అతిధులూ, విశిష్ట అతిధులూ, ఆత్మీయ అతిధులలాంటి విభజనలేమీ లేకుండా నిరాడంబరంగా కూడా జరిగింది. సభకు వచ్చిన వారందరూ నా దృష్టిలో విశిష్టులూ, ఆత్మీయులే. అప్పటికప్పుడు తురగా జానకీరాణిగారిని ఈ నిరాడంబర సభకి అధ్యక్షత వహించమని కోరగానే ఆవిడ హాయిగా నవ్వేస్తూ, నేనా?  అంటే  ఆ…మీరే రండి.. అని పిలవగానే వచ్చి వేదికనలంకరించారు.
 ఈ సంవత్సరం బహుమతులను స్పాన్సర్‌ చేసిన శాంతసుందరిగారిని, పి. చంద్రశేఖర్‌రెడ్డిగారిని, ఘంటశాల నిర్మలని వేదిక మీదికి ఆహ్వానించడం జరిగింది. శాంతసుందరి వాళ్ళ అమ్మమ్మ కొమ్మూరి పద్మావతీ దేవి గారి పేరు మీద మొదటి బహుమతి రూ. 4000లను, పి.సి.రెడ్డి గారు వారి సహచరి  పి. లలిత స్మృతి సూచకంగా రెండో బహుమతి రూ.3000లను, ఘంటశాల నిర్మలవారి తల్లి ఘంటశాల సరళాదేవి పేరు మీద రూ.2000 లను ప్రకటించి వున్నారు. అవార్డులను కూడా వారి చేతనే ఇప్పించాలని నిర్వాహకులు భావించారు. మొదట శాంతసుందరి తమ అమ్మమ్మ కొమ్మూరి పద్మావతి గారి గురించి మాట్లాడుతూ ఈ సంవత్సరం పద్మావతిగారి వందేళ్ళ పండుగ సంవత్సరమని, ఆమెని స్మరించుకుంటూ ఈ క్యాష్‌ అవార్డును విజేతలకు ఇవ్వగలగడం తనకు చాలా సంతోషంగా వుందని చెప్పారు. ఆ తర్వాత కథల పోటీలో ప్రధమ బహుమతి పొందిన ఎస్‌. శ్రీదేవికి బహుమతిని అందజేసారు.
      తర్వాత పి. చంద్రశేఖర్‌రెడ్డిగారు తన సహచరి గురించి, తన సినిమా వ్యాసంగం గురించి వివరించారు. బడిపంతులు, మానవుడు-దానవుడులాంటి చక్కటి సినిమాలకు దర్శకత్వం వహించిన రెడ్డి గారు మాట్లాడుతున్నపుడు సభికులు చక్కగా స్పందిస్తూ హర్షధాన్యాలు చేసారు. ఆయన లలితగారి గురించి మాట్లాడుత ఆవిడ తెలివిలో వందోవంతు తనకున్నా ఎంతో బాగుపడి వుండేవాడినని చెబుతూ, తాము ఒకసారి బొంబాయి వెళ్ళినపుడు ఆవిడ ఎంత కరెక్టుగా దారి కనుక్కున్నారో వివరించారు. ఆవిడ ఎంతో చైతన్యంతో, అందరికీ సహకరిస్తూ వుండేవారని వివరించారు.
        ఆయన తన సహచరి పి. లలితగారి జ్ఞాపకార్ధం ప్రక టించిన క్యాష్‌ అవార్డు రూ.3000లను రెండో బహుమతి గెలుచుకున్న తమ్మెర రాధికకు అందించారు. ఆ తర్వాత ఘంటశాల నిర్మల వారి మాతృమూర్తి గురించి వివరించారు. ఘంటశాల సరళాదేవి మామూలు గృహిణి అయినప్పటికీ తన పరిధిలోనే చుట్టు పక్కల వారికి ఎంతో సహాయం చేసేవారనీ, భార్యాభర్తల సమస్యలను కూడా పట్టించుకుని వారికి కౌన్సిలింగు చేసేవారని చెప్పారు. ఆవిడ తమకు కొండంత అండగా వుండేవారని ఆమె పేరు మీద బహుమతిని ఇవ్వడం తనకు చాలా సంతోషంగా వుందంట మూడో బహుమతి గెలుచుకున్న ఎ.పుష్పాంజలికి క్యాష్‌ అవార్డు కింద రూ.2000 అందజేసారు.
           ఈ కథల పోటీకి న్యాయనిర్ణేతగా వున్న పి. సత్యవతి ప్రత్యేకంగా అంద జేసిన మరో మూడో బహు మతి రూ.2000 లను సభకు అధ్యక్షత వహించిన తురగా జానకీరాణి ఎమ్‌. హేమలత గారికి అందజేసారు.
        బహుమతుల ప్రదానం పూర్తయిన తర్వాత బహుమతి స్వీకర్తల స్పందన కార్యక్రమం మొదలైంది. ఎస్‌. శ్రీదేవి, తమ్మెర రాధికలు చాలా క్లుప్తంగా తమ గురించి, తమ కథల నేపధ్యం గురించి వివరించారు. మూడో బహుమతి గ్రహీత ఎ. పుప్పాంజలిగారు స్పందిస్తూ తన కథల నేపధ్యం గురించి మాట్లాడారు. భూమిక పత్రిక అంటే తనకు చాలా ఇష్టమని, ఈ పత్రిక ఆర్ధిక కారణాలవల్ల ఆగిపోవడం మొత్తం స్త్రీలకే అవమానమని మనమందరం తప్పనిసరిగా ‘భూమిక’ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయలని చాలా ఉద్వేగంతో మాట్లాడారు. భూమికకు లబ్దప్రతిష్టులైన సంపాదకవర్గం వున్నారని వారంతా తలుచుకుంటే ఏమైనా చేయవచ్చని, భూమిక మార్చి నెల సంపాదకీయం తనను చాలా బాధ పెట్టిందని చెబుతూ తన బహుమతి మొత్తాన్ని, తన జీవిత చందాతో సహా సభాముఖంగా తిరిగి ఇచ్చేసారు. పుష్పాంజలి గారి ఈ ఉద్వేగపూరిత స్పందన సభికులను ఎంతో కదిలించింది. వేదిక మీద కూర్చున్న సత్యవతికి కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. ఆవిడ మాట్లాడుతున్నంత సేపు సభలో అందరూ నిశ్శబ్దంగా విన్నారు. హఠాత్తుగా బహుమతుల ప్రదానోత్సవ సభ కాస్తా భూమిక మీద కేంద్రీకృతమైపోయింది. హేమలతగారు కూడా తమ స్పందనని విన్పించి కూర్చోగానే ఆవిడ సహచరులు ఆంజనేయులుగారు అధ్యక్షుల వారి అనుమతితో మాట్లాడడానికి వచ్చి భూమిక మార్చి నెల సంపాదకీయం తనను బాగా కదిలించిందని, ఇలాంటి సీరియస్‌ పత్రికలు ఆగిపోకూడదని, తన వంతు సహకారంగా తన భార్యని తన బహుమతి మొత్తాన్ని భూమికకు విరాళం కింద ఇవ్వాల్సిందిగా కోరతానని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించగానే హేమలత గారు తిరిగి స్టేజి మీదకు వచ్చి తన బహుమతి మొత్తాన్ని భూమికకు అందజేసారు. ఒక దశలో సత్యవతి కల్పించుకుని ”దయచేసి మీరిలా చెయ్యకండి. ఇవి మీరు గెలుచుకున్న మొత్తాలు. భూమిక పట్ల మీ నిబద్ధతకు నాకు కళ్ళు చెమరుస్తున్నాయి. మీ సహకారం వుంటే చాలు అంటుండగానే తమ్మెర రాధిక సహచరుడు వీరభద్రరావు మాట్లాడవచ్చునా అని అడిగి, వేదిక మీద కొచ్చి, తమ్మెర రాధికకి తాను అన్ని విధాలుగాను సహకరిస్తానని, ఆవిడకు తెల్లకాయితాలు, పెన్నులు తానే తెచ్చిస్తానని, చివరికి ఆవిడ రాసి వదిలేసిన రచనల్ని తానే వివిధ పత్రికలకి పోస్ట్‌్‌ చేస్తానని చెప్పారు. భూమిక చాలా విశిష్టమైన పత్రిక అని ఇలాంటి పత్రిక ఆర్ధిక ఇబ్బందులవల్ల ఆగిపోకూడదని తాను కోరుకుంటున్నానని, తన భార్యకు బహుమతిగా వచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వడం భావ్యం కాదని, అంతకన్నా ఎక్కువే విరాళంగా యివ్వదలిచానని చెబుతూ తన జేబులోంచి రూ. 3500 తీసి ఇచ్చేసారు. దీంతో సభికుల చప్పట్లు హాలంతా మారు మోగాయి.
వెంటనే సత్యవతి స్పందిస్తూ ”ఉత్సాహంగా, సరదాగా మొదలైన సభ ఎమోషనల్‌గా మారిపోయింది. ఈ భావోద్వేగం నా కళ్ళల్లో నీళ్ళు  పెట్టించింది. మీరందర భూమిక పట్ల చూపుతున్న ప్రేమ నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. బహుమతుల ప్రదానోత్సవం కాస్తా భూమిక విరాళాల స్వీకరణోత్సవంగా మారడం  నాకు నిజంగా చాలా బాధగా అన్పిస్తోంది. అదే సమయంలో ఇంతమంది అండవుండగా భూమికకు భయమే లేదు అన్పిస్తోంది. మీకందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బహుమతులను స్పాన్సర్‌ చేసిన వారందరికీ ధన్యవాదాలు. సభలో లేని శ్రీ ఆరి సీతారామయ్యగారికి కృతజ్ఞతలు. అబ్బూరి ఛాయదేవిగారు నాకు భూమికకు అత్యంత ఆత్మీయులు. వారు ప్రసంగించకుండా ఈ సభ పరిసమాప్తి కాదు. ఛాయదేవిగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను” అని ముగించగానే ఆవిడ వేదిక మీదికొచ్చి  క్లుప్తంగా ‘సత్యవతి నాకు కూతురు అయితే భూమిక నా మనవరాలు’ అంటూ సభికుల నవ్వుల మధ్య ప్రకటించారు. ఎన్‌. గీత వందన సమర్పణ తో సభ ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

8 Responses to ఉద్వేగంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవం

 1. lyla yerneni says:

  భలేగా ఉంది. డ్రామా. మరి నాకెందుకో కళ్ళ నీళ్ళు రాలేదు. నవ్వొచ్చింది. పత్రిక మూసేస్తారంటే పోన్లే, ఇప్పటికైనా స్త్రీలను దిక్కుమాలినవాళ్ళ లాగా చూపే ఒక డొక్కు పత్రిక వదిలిపోతుంది. అనుకున్నా అన్నీ వట్టిదే. ఇట్లా కథలు రాశారు అని ఒక చేత్తో బహుమతులిచ్చారు. మళ్ళీ రెండో చేత్తో ఆ బహుమతులకన్నా ఎక్కువ డబ్బులు పత్రిక నడుపుకోటానికి వెనక్కి పుచ్చుకున్నారు. సభలో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏమిటో ఏ పత్రికైనా మూసేస్తే స్త్రీలకు అవమానమెందుకో నాకర్థం కాదు. ఇది ఆడంగుల పత్రికా? జనానానా? ఈ రోజుల్లో స్త్రీలకు పురుషులకు వేరే వేరే పత్రికలు కావాలా. అంతకన్నవేరే సిగ్గుమాలిన విషయం ఉన్నదా? దానికి మళ్ళీ పురుషుల సహకారమా? భలేగా ఉంది మెలిక. అసలు స్త్రీలకు సర్వ స్వతంత్రం ఉంది. ఐనా మీరు లేదంటూ స్త్రీలను ఏదో రక్షించేస్తున్నట్లు, భూమిక అనే ఒక పత్రికను రక్షించుకోడానికి మాత్రమే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈ పత్రిక నడిపే వాళ్ళకు నిజంగా స్త్ర్రీల మీద అభిమానమే ఉంటే ఈ దిక్కుమాలిన పత్రికను ఆపేసి, ఆడా మగా అని తేడా లేని పత్రికలకు రచనలు పంపవచ్చు. కాని ఈ చచ్చు రచనలు వేసుకోరేమో. మనకో పత్రిక ఉంటం, మన బొమ్మ రోజూ ఎవరైనా చూట్టం మన ఈగోకు అవసరమెమో. దానికోసం స్త్రీలను రోజూ ఏ గోతిలోకో నూతిలోకో లాగాలేమో. వారిని ఉద్ధరించిన వారిగా మనకు బహుమతులు కావాలేమో. ఏదో ఒక స్టేజీ మనం ఎక్కో వేరో వారిని ఎక్కించో కిక్కు తెచ్చుకోవాలేమో. నిజంగా ఒక సభ ఒక ఉద్దేశంతో మొదలయ్యి, భూమిక అనే పత్రిక విరాళాల సభగా మారటం అసహ్యమైన విషయం. ఒక స్త్రీ ఎడిటర్గా ఉంటూ, ఒక్క మగాడి ప్రోత్సాహం వల్లనే, ఆమె పత్రిక కథల పోటీలు నడుస్తున్నాయనటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ ఊరది? స్త్రీలని పనిగట్టుకుని పురుషులకన్నా తక్కువగా ఉన్నట్లు చూపించటం, పైగా అలాటి సన్నాసి పత్రిక నడిపి స్త్రీలకు మేలు చేస్తున్నట్లు, ఈ రోజుల్లో రాసుకోటం ఎంత సిగ్గుపడాల్సిన విషయం. కార్చండి! సభలు చేసుకు మరీ కన్నీళ్ళు కార్చండి. జేబురుమాళ్ళు, పదో పరకో డబ్బులు, పురుషులు అందిస్తూనే ఉన్నారుగా. అదో వినోద భూమిక.
  లైలా

 2. psathyavathi says:

  లైలా గారెవరో ఎక్కడుంటారో తెలీదుగానీ,వారి వ్యాఖ్యానాలు చదివాక ఒకటి అర్ధమైంది.తను సుఖంగా ఉంటే ప్రపంచమంతా ఆనందడోలికల్లో మునిగితేలుతోందనుకునే అక్కయ్యలు ఇంకా ఉన్నారని.ఇంకా ఒంటికంటి తో చూడ్డం అలవాటుమానుకోని అక్కయ్యలు కూడా ఉన్నారని..స్త్రీలు తక్కువగా వున్నారని పనిగట్టుకునీ నిరూపించక్కర్లేదు లైలమ్మా,ఒకసారి మా దేశానికొచ్చి పొద్దున్నే ఒక దినపత్రిక చదవండి.గేటెడ కమ్యూనిటీల్లోనూ ఐలెండ్లలోనూ కాక ఒక ధరవి లోనూ ఒక అల్లాంటీ స్లం లోనూ స్త్రీలని ఒకసారి చూడండి.ఎవరూ నిరూపించక్కర్లేకుండానే ప్రపంచం మొత్తం మీద స్త్రీలింకా తక్కువగానే వున్నారని అందరికీ తెలుసు.మీ స్వప్నసీమల్లో మీరు మునిగి తేలకుండా మధ్య మధ్య ఇలాంటీ స్టింకు బాంబులు వదలడం మంచిది కాదు.మీరు వదిలిన స్టింకు మీ ముక్కుకే చుట్టుకుంటుంది..మీ అత్యుత్సాహాన్నీ,అతి తెలివినీ ఏమాత్రం అభినందించలేని భూమిక సుమిత్ర

 3. ఎల్. సుజాత says:

  ఏమిటీ ఈ లైలా దాష్టీకం? ఎంత అమెరికాలో వున్నా, ఎంత డబ్బుతో పులిసిపోయి వున్నా, ఇంత అహంభావం పనికిరాదు. తనకి లేని సమస్యలు ప్రపంచంలో వేరే ఎవరికీ లేవనుకోడం ఎంత మూర్ఖత్వం?

 4. Dr. Ramani says:

  while having all the social problems of a man, a woman has an extra problem – domination from men. It does not mean all men. Majority of the men show domination over women in many forms. A few men will be sensitive in this matter. A magazine is really needed to show sympathy to woman related issues and to discuss about them. As this is a good thing, men who do feel social equality for women, do also work towards women’s problems. Due to money issues, if this type of magazine is closed, it is an insult to all women and good men, who are sympathetic to women’s problems. Of course, people including some women and men, do not care about other women’s problems. They would be generally highly educated like doctors, and very rich. So those people would want this inequality in the society to continue, as they accept this superiority of men dominated customs and other related issues.
  Why should Laila carry a lastname which she got either from her father or husband? Why isn’t she ashamed of herself for such male dominated issue? Because she accepted these men dominated customs. Because she submitted herself to such social situations.
  It is a shame to Laila to write such a harsh comment.

  – Dr. Ramani

 5. రామారావు says:

  కొండవీటి సత్యవతిగారూ,
  ఈ లైలా కామెంట్లకి మీరు మౌనం వహించటం ఏమీ బాగోలేదు.మంచితనాన్ని అలుసుగా తీసుకునే మనుషులున్నారు.
  రామారావు

 6. భూమిక పత్రిక అందరికి నచ్చకపోవచ్చు.చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు.మనం ఒక పనిని ప్రేమతో,ఇష్టంతో చేసుకుంటూపోతాం.ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటే వాళ్ళు మనతో ఉంటారు.భూమిక పత్రికను కూడా నేను నెల నెలా ఎంతో కష్టంతో తీసుకొస్తున్నాను.కధల పట్ల ప్రేమతో,కొత్త రచయిత్రులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పోటీలు పెడుతున్నాము.విజేతలకు బహుమతులివ్వడం కూడ మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈసారి జరిగిన సభ చాలా భిన్నంగా ఉండి గ్రహీతల స్పందన నన్ను చాలా కదిలించింది.
  నేను మీరు గెలుచుకున్న సొమ్ము ను ఇలా తిరిగి ఇవ్వొద్దు అని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను.నిజానికి నాకూ చాలా ఇబ్బందిగా అనిపించింది.ఈ విషయం రిపోర్ట్ లో ఉంది కూడా.
  లైలా గారు అంత పరుషంగా స్పందిచడం చాలా బాధాకరం.భూమిక పొగడ్తలను,విమర్శలను ఒకేలా స్వీకరిస్తుంది.
  ఈ అంశం మీద స్పందిస్తూ రాసిన మిత్రులందరికి ధన్యవాదాలు.ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి.దయచేసి వ్యక్తిగత దూషణలు చెయ్యొద్దు.వ్యక్తిత్వాల మీద బురద చల్లొద్దు.వ్యక్తులు ధరించే దుస్తులు వారి వారి ఇస్టం.కామెంట్ చెయ్యడానికి మనమెవ్వరం?
  భూమికను డొక్కు పత్రిక అని ఒక్క లైలాగారన్నంత మాత్రాన డొక్కు అయిపోదుగా.
  కాని 15 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి పరుష స్పందన మాత్రం ఎరుగను.
  మిత్రులారా!మరొక్క సారి మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు,క్రుతజ్ఞతలు తెలియచేస్తున్నను.

 7. READER says:

  Lyla’s comment has the following points:
  a. Why should there be separate magazines for women?
  b. Why should women magazines take support from men?
  c. Women have total freedom, but Bhumika is projecting that they don’t have.
  d. Why did the award ceremony became a donation collection ceremony?
  e. It is very surprising that due to one man’s encouragement only the magazine has been conducting story competitions.
  f. All writings in Bhumika are trash and they would not be published in any other magazine.
  g. Why is it an insult to all women if this women magazine is closed?

  Response to these points in brief:

  a. When women in the society have issues that men don’t have, a separate magazine is needed. It does not mean what only women should read this magazine or only women should work for. Whoever is sympathetic to women’s issues, can support this magazine. As a whole in the society, still there is no equality. There is always discrimination towards women in this male dominated society. We are not talking about a few women, but a majority of women in the society. Take 100 working women’s families. In more than 90 families, the women work at home (mainly in the kitchen) and at an office. Men’s outside work will be limited to bringing groceries and paying bills, etc. Still there is a major dowry problem in India where they are murders and suicides of women. There are so many issues for women in the society today. And they need a set of separate magazines to express themselves. Not only other women, but also other good men will be sympathetic
  b. As we explained, all good people in the society should work towards various issues including women’s issues. In this scenario, it is very normal for good men to work for women’s problems. It is not an insult to take men’s support for women’s issues. Actually, in the society, men and women are not enemies. They need to coexist and work together. For whatever reasons they are, it is not the case always. Hence, it is very natural for good men to work on women’s issue in the society towards progressive society.
  c. It is not correct to say that all women have all the freedom in the society. It might be the case for a few women. Based on education and other social and economical background, some women might have all the freedom. When you consider a society, you consider the majority, not a few women. In the society, majority of women are still facing problems due to male dominated society. Bhumika is bringing out the facts into people. It is not projecting the women as weak unnecessarily. Actually, with the stories and other encouraging and supporting writings, the magazine is helping women to some extent.
  d. Bhumika magazine people did not plan to convert award ceremony to donations ceremony. In fact the editor was rejecting the donations. It is up to the people how to react. When people are moved by the objectives of the magazine, they do want to donate whatever they can. It’s very natural. The writers who donated their prize money and more, are not innocent to be manipulated. They have all rights to do whatever they like. Don’t they have freedom to do so? If they have freedom to donate, why should anybody comment on it?
  e. Initially only Ari Sitarammayya supported the story competition financially. Now more people are joining. For many activities, there will be a person, whether a woman or man, who would take initiative and start the activity. It is very human to show gratitude to that person by respecting that person. It is not at all an insult if a man takes the initiative to support the story competition for a women’s magazine, if that man has sympathy towards women’s issues. In case of good people, there is no discrimination if it is a man or a woman. Only in case of bad deeds, we need to look into this matter.
  f. About the writings in Bhumika being trash – it is an individual opinion. Nobody in this world can convince a person to change his/her opinions. Everybody is entitled to his/her opinions. If they are expressed in public without any proof, it would hurt people, and there would be nothing to discuss logically. If somebody explains why something is trash in a logical manner, then anybody would answer correctly with the proof.
  g. As somebody else pointed out already, it is an insult not only to all women, but also to good men if a women supporting magazine is closed. Here, “all women” means the women supporters of women’s issues. If this magazine closes down, it will be very sad.

  It is not possible to comment more than this in the comments section.

 8. Ireni surya prakash goud says:

  నెను మీ పత్రికలొ చంద దారునిగా చెరలనుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో