తండుల్రూ – కూతుళ్ళూ – జి. వెంకటకృష్ణ

ఒక వుదయం

ఇంధ్రధనుస్సు మన పెరట్లో వచ్చి వాలినవేళ

ఆ నవ వసంతశోభ వెంట తోటలో విహరిస్తున్నప్పుడు

‘నాన్నా యిది చూశావా’ అంటూ సంభ్రమంగా

ఒక కేరింతను కోకిల గొంతులా వింటాం

మన చేతుల్లో పెరిగిన లేతకొమ్మ

బుగ్గలు ఎరుపెక్కుతూ మొగ్గ వేస్తున్న దృశ్యానికి

అలలు అలలై సువాసనలు వేస్తున్న

బిడ్డ సంభ్రమానికి మనం విస్మయులమవుతాం

తోటలోకి వసంతం వచ్చిందనీ తెలుసూ

మన అడుగుల పక్కన కిషోరశోభై

అనుసరిస్తున్నదనీ తెలుసు

మన చేతుల్లో పెరిగిన బిడ్డలు

మనం పాదులు తీసీ నీళ్లు పోసీ

ముని వేళ్ల ప్రేమను పొదిగీ పెంచిన చిన్నారులు

గుల్మాలై ఎదిగీ లతలై ఎగసి పువ్వై విరిసీ

మన ముందు నిలబడే అనుభవం గురించీ

మన నుండీ దూరం జరుగుతున్న బంధం గురించీ

ఎలా అన్వయించుకోవాలి?

మనలోని చిన్నిభాగం యింతై ఎదిగీ

యింకెంతో ఎత్తుకెదుగుతున్నప్పటి

కాలం భవిష్యత్తును గుర్తు చేస్తుంది.

ఒక రైతు తన పంటను చూసుకున్నట్లు

ఒక రైతు తన శ్రమ నుండీ తానే పరాయీ అయినట్లు

తను అపురూపంగా పొదిగిన రత్నం

తన ప్రాణ సమానమైన వుత్పత్తి

యితరమ పోతున్నట్లూ యిక్కట్లు పడుతున్నట్లూ

మన కళ్ల ముందు నవనవలాడే వసంతం

ఎవరి మెడలోకో యింకెవరి జడలోకో

లేదూ ఏ దున్న అడుగుల కిందో నిలిగిపోతుందనే ఎరుక

మనసు నిమ్మలంగా వుండనీదు.

అందానిది ఏ రంగంటే

వసంత వేళ

‘ఆడపిల్ల నవ్వే’ అంటుంది.

పచ్చని పావడా ప్రకృతిలో భాగమై

తొలి యవ్వనం ముంగారు కుచ్చిళ్లు పడుతుంది.

దుక్కులు దున్ని శిశు మొలకలేసిన పొలంలా

చాళ్ళ చాళ్ల నవ్వులు విరిసినట్లుంటుంది

నడిచొచ్చే బిడ్డ కదిలొచ్చే బంగారు పంటలా వుంటుంది

వసంత కాలాన తోటనావేసించే యవ్వనంలా

ప్రకృతి నిండిన దేహం

కొత్తరంగులు తొడుగుతుంది

కొత్త చిత్రాలను గీస్తుంది.

ఆ రంగులనూ ఆ రేఖలనూ

తండ్రి కళ్లతో చూస్తే

బరింపరాని ఆనందంలోనే

ఒకవేదనా ఛాయా మిళితమై ప్రతిఫలిస్తుంది.

రైతు విత్తనం విత్తి

నడిపొలంలో నిలబడి నడినెత్తు ఆకాశాన్ని

చూసినప్పటి దిగులు

ఎన్ని తెంపుల కలుపును ఏరివేసినా, ఏ తెగులుకళ్ల కుళ్లు

సోకుతుందోనని గట్టు మీద చెంపకు చేయి ఆనించినట్లు.

ఏ దిష్టి తగలకుండా తనే దిష్టిబొమ్మై నిలబడ్డప్పుడు

అనూహ్యమైన అసహ్యచూపులను పసిగట్టిన దిగులు

చేతికొచ్చిన పంట పచ్చి కరువుకో వొట్టి కరువుకో చిక్కి

చేతికి అప్పు మిగిలినట్లు.

తండ్రుల దిగులు విడతలు మిడతలుగా పట్టుకుంటుంది.

పెట్టుబడుల చేతుల్లో

పట్టుబడి గిలగిల లాడుతున్న

పేద తండ్రుల గుండె దిగులు

పంటైనా పెళ్ళైనా వ్యాపారంగా మారి

బాధ్యతను కొయ్యకు వేలాడదీస్తున్న

సంతల వేలంలో

విముక్తికై దారులు పేనుకునే

అభాగ్యులూ అభాగినులూ

నిత్య వుదాహరణలవుతున్న సంధికాలంలో

తోటలోకి నవశోభ వచ్చిందంటే

కొత్త తుమ్మెదలు ముసిరాయంటే

ఆ కోకిల స్వరంలో ఆనంద విషాదాలు

ముప్పిరిగొనే వ్యాపిస్తాయి.

తండ్రులూ కూతుళ్లూ కలసి నడిచే దారుల్లో

చిరుగజ్జల సవ్వడితోపాటు

గుండె గుంతుకలోన కొట్లాడే స్థితులూ

వెంట నడుస్తాయి.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో