”మిస్సింగ్…”

 

2001 మార్చి మొదటి తారీఖు నాటికి భారతదేశ జనాభా ఒక బిలియన్‌. అంటే వందకోట్లు.

ఈ ఏడేళ్ళ కాలంలో మరిన్ని కోట్ల మంది  పుట్టి వుంటారు. ఈ విషయంలో మనం నెంబర్‌ టూ పోజిషన్‌కు చేరుకున్నాం.

చైనా ప్రపంచం మొత్తం మీద అత్యధిక జనాభా కల్గిన దేశంగా మొదటి స్థానం దక్కించుకుంది. మన దేశంలో 1991-2001 మధ్యకాలంలో జనాభా 21.34% పెరిగింది. అయితే విషాదమేమిటంటే ఈ పెరుగుదల అనేది ఆడపిల్లలకు సంబంధించి దిగజారడం. అంటే దేశంలో  ఛైల్డ్‌ సెక్స్‌ రేషియో ఘోరంగా పడిపోయింది.

మగపిల్లలు ఎక్కువగా పుడుతున్నారు. ఆడపిల్లలు పుట్టకుండానే పిందడశలోనే చచ్చిపోతున్నారు. ఛైల్డ్‌ సెక్స్‌ రేషియోను 0-6 వయస్సు పిల్లల్లో 1000 మంది మగపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలున్నారు అనే పద్ధతిలో లెక్కిస్తారు.
                ఈ లెక్కల లోతుల్లోకి వెళితే గత దశాబ్ద కాలంలో ఈ ”పుణ్యభూమి, ఈ దేవభూమి” ఆడపిల్లల పాలిట మరుభూమిగా మారడాన్ని అర్ధం చేసుకుంటాం. కోటి మంది ఆడపిల్లల్ని కరుణా కటాక్షం లేకుండా చంపేసాం. ప్రతిరోజు వందలాది ఆడపిల్లల్ని చంపుకుంటనే వున్నాం. ఈ పరిస్థితి ధనిక ప్రాంతాలుగా పేరుపడ్డ హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో భయనకంగా ఉంది. ఇక్కడ గర్భం దాల్చిన ప్రతి స్త్రీ లింగ నిర్ధారణ పరీక్షను చేయించుకోవాల్సిందే. ఆడబిడ్డ అని తేలితే ఇంక అంతే సంగతులు.

కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగడ్‌లో అయితే అల్ట్రాసౌండ్‌ సెంటర్లు గల్లీ కొకటి వెలిసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి.  మొబైల్‌ సెంటర్లు కూడా నడుస్తున్నట్టు సమాచారం. పంజాబ్‌ సెన్సెస్‌ని  పరీక్షిస్తే 1991లో ఛైల్డ్‌ సెక్స్‌ రేషియో ఆ రాష్ట్రంలోని  చాలా ప్రాంతాల్లో 800-950 మధ్యలో వుంది. రాష్ట్రం మొత్తం సరాసరిని లెక్కిస్తే 1000-875 మాత్రమే. వెయ్యిమంది పురుషులు – 875 మంది స్త్రీలు. అది 2001 వచ్చేటప్పటికీ 1000-798 కి పడిపోయింది. ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా వుందో అర్ధం చేసుకోచ్చు. ఎంత మంది ఆడపిండాల్ని నదురు బెదురూ లేకుండా దుంపనాశనం చేసారో చూస్తుంటే ఈ దేశంలో పుట్టిన ఆడదానిగా నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను.
           ఆస్తులు, అంతస్తులు, పొలాలు, ఫ్యాకర్టీలు, బంగారాలు, వజ్రాలు, వైఢర్యాలు ఇవన్నీ ప్రాణం లేనివి. స్వర్గం, నరకం, దేవుడు, దెయ్యం  పున్నామ నరకం, తలకొరివి, మతాచారాలు వగైరా వగైరాలన్నీ భావనలు. దేవుడున్నాడో లేదో ఎవరికీ తెలీదు. కొడుకు తలకొరివి పెడితే సీదా స్వర్గానికే పోతామన్న గ్యారంటీ ఏమీ లేదు. పున్నామ నరకం, ఆ నరకంలో  సలసలా కాగే నూనె మూకుళ్ళు, చీమూ నెత్తురు ప్రవహించే కాసారాలు ఉన్నాయో లేదో ఎవరు చూసోచ్చారు? పుత్రుడు పుట్టి తల్లిదండ్రుల్ని ఈ పున్నామ నరకం దాటిస్తాడో లేదో ఎవరికి తెలుసు? ఇవన్నీ భావనలు మాత్రమే, మత నమ్మకాలు మాత్రమే.

          ప్రాణం లేని ఆస్తులు, ఐశ్వర్యాలకోసం, ఋజువుల్లేని నమ్మకాలకోసం, ఎప్పుడో చచ్చినపుడు స్వర్గానికీడుస్తాడనే వెర్రి నమ్మకంతో కొడుకుల్నే కంటున్న తల్లిదండ్రలకు నాదొక సూటి ప్రశ్న. ఆడపిల్లల్ని మీ స్వార్ధం కోసం చంపేస్తున్న మీరంతా హంతుకులు కారా? హంతకులకు సోకాల్డ్‌ స్వర్గంలో చోటెలా దొరుకుతుంది? పుణ్యకార్యాలు చేసినోళ్ళకే స్వర్గం అని మీరే విర్రవీగుతుంటారు కదా! ఆడపిల్లల్ని పుట్టకుండాను, పుట్టాక కూడా కసాయిల్లా చంపేసే మీకు ‘స్వర్గం’లో రిజర్వేషన్‌ వుందని ఎలా అనుకుంటున్నారు? ఇంత స్వార్థమా?
          మీ నమ్మకాల ప్రకారమే భూమి మీద పుట్టమని మీ దేవుడు పంపిస్తున్న పసివాళ్ళను మీరు చంపేస్తున్నారంటే మీ దైవ భక్తి ఏపాటిది?  ఆస్తుల ముందు, అంతస్తుల ముందు, పున్నామ నరకాల భయాల ముందు అన్నీ బలాదూరేనా?
           ఒకరా, ఇద్దరా, ముగ్గురా ఏకంగా కోటి మంది ఆడపిల్లల్ని చంపేసారు. భూమి మీద బతుకుతున్న ఏ ప్రాణీ కూడా ఇంత క్రౄరంగా అవసరం లేకుండా  ప్రవర్తించదు. మీ కసాయితనానికి జోహర్లు. మీ కాఠిన్యానికి వందనాలు. చంపేయండి. ఆడపిల్లలందరిన్నీ చంపేయండి. పున్నామ నరకం దాటించేందుకు కొడుకును కనడానికి ఆడవాళ్ళే వుండరప్పుడు. మీరు మాత్రమే చిరకాలం చిరంజీవులుగా వర్ధిల్లుతూ ఉట్టి కట్టుకుని ‘స్వర్గాని’కెగిరిపోదురుగాని.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to ”మిస్సింగ్…”

  1. Anonymous says:

    చాలా బావుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో