సవాళ్ళను ఎదుర్కొంటున్నా అడుగు ముందుకే!

మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనర్‌ మండలం నేరేడుగావ్‌ గ్రామంలో 30 మంది సభ్యులతో ఎల్లమ్మ మహిళా సంఘం 1996లో ఏర్పడింది.

 షెడ్యల్డు కులాలు, వెనకబడిన తరగతులు (కురువ) మరియు ముస్లిం స్త్రీలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు.

 బాలకార్మికులు, ఆడపిల్లల చదువు, స్త్రీల ఆరోగ్యం వంటి అంశాలపైన పనిచేయుటకు సంఘం వారు మొదటి నుండి ఉత్సాహం కనబరిచారు. గ్రామానికి ఎ.ఎన్‌.ఎం సక్రమంగా వచ్చేవిధంగా మరియు అక్షరాస్యతా నైపుణ్యాలను పొందుటకుగాను పెద్దవారి చదువు కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు.
ఎల్లమ్మ మహిళా సంఘంలో ఎల్లలింగమ్మ సభ్యురాలిగా ఎంతో చురుకుగా ఉండేది. ఆమె సామాజికంగా, సాంస్కృతికంగా వెనకబడిన కురువ కులానికి చెందినది. ముఖ్యంగా ఈ కులానికి చెందిన ఆడపిల్లలు విద్యను అభ్యసించడంలో అడ్డంకులతోపాటు, పశువులను కాయటంలోని కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ అడ్డంకులను దాటుకుంటూ ఎల్లలింగమ్మ 7వ తరగతి వరకు చదువుకోగల్గింది. సంఘం సభ్యుల్లో ఆమె విద్యావంతురాలవ్వడం సంఘానికి గొప్ప బలాన్నిచ్చింది.

2001 పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్‌ స్థాయిలో వెనకబడిన తరగతి మహిళకు రిజర్వేషన్‌ ఉండటం వల్ల సంఘం నుండి పోటీ చెయ్యడానికి ఆమెకు అవకాశం వచ్చింది. గ్రామంలో ఆ సంఘానికి ఉన్న గుర్తింపు లాభదాయకమైంది. ఇది ఎన్నికల విధానం సజావుగా సాగి ఎల్ల లింగమ్మ సర్పంచ్‌గా విజయం సాధించటానికి తోడ్పడింది. ఆమె సర్పంచ్‌గా కార్యాలయంలో బాధ్యత చేపట్టిన మొదటి రోజు నుండే ఆమెకు అసలైన సవాళ్ళు ఎదురయ్యాయి. ప్రారంభంలో గ్రామస్థులు, ఇతర పంచాయితీ సభ్యుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ, అవి ఎక్కువ కాలం నిలువలేదు. గ్రామంలో లోతుగా నాటుకుపోయిన పితృస్వామ్య విలువలు, కుల రాజకీయలు, అధికారంతో కూడిన గ్రామ రాజకీయలు తక్కువ కాలంలోనే గ్రామ పంచాయితీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒకపక్క మాజీ సర్పంచ్‌ జోక్యం, గ్రామ పెద్దల నుండి సహకార ధోరణి లేకపోవడం, మరో ప్రక్క ముఖ్యంగా అత్తగారింటి నుంచి సహకారం అందకపోవడం వల్ల ఆమె బాధ్యతలు నిర్వహించుటలో చాలా సమస్యలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె వాటిని లెక్కచేయక గ్రావభివృద్ధి సాధించటానికి కృషి చేయసాగింది. ఇది భరించలేని అత్తింటివారు ఆమెకు అక్రమసంబంధాలు అంటగట్టి నిందించేవారు. మెల్లగా రాజకీయ పరిస్థితి కూడా మారిపోయింది. వార్డు మెంబర్లు కూడా ఆమెను వేరు చేయడం మొదలుపెట్టారు. ఎల్లలింగమ్మకు గ్రామంలో పనులు నిర్వహించడానికిగానీ లేదా పంచాయితీ నిధులను ఉపయెగించడానికిగానీ పంచాయితీ సభ్యుల నుండి మద్దతు, అంగీకారం దొరక్క ఆమె పరిస్థితి చాలా కష్టతరంగా ఉండేది. గ్రామపెద్దలు, స్థానిక నాయకులు, ఇతర సభ్యులు అధికారులను కూడా తప్పుద్రోవ పట్టించారు.
వీటి ప్రభావం గ్రామంలో నిర్వహించవలసిన పనులకు ఏడు లక్షల రపాయలు మంజూరు కాగా, కేవలం రెండు లక్షల రపాయలు మాత్రమే విడుదల కావడం ద్వారా స్పష్టంగా తెలిసింది. అవసరం ఉన్న చోట కాకుండా ఇతర వార్డులలో రోడ్డు నిర్మాణం కొరకు ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చి నిధులను దారి మళ్లించడానికి కుల రాజకీయలు ముఖ్యమైన పాత్ర వహించాయి. పైగా ”పనికి ఆహార పథకం” క్రింద కేటాయించిన నిధులను దుర్వినియెగపరచిందని ఎల్లలింగమ్మని నిందించారు. ఈ విషయం జిల్లా కలెక్టరు గారి దృష్టి వరకు వెళ్ళి ఆయన గ్రామానికి స్వయంగా విచ్చేసి, ఆ విషయంపై ఆరా తీసి అక్కడ చేపట్టిన పనులను చూసి సంతృప్తి చెందారు.

ఎల్లలింగమ్మ వచ్చిన సమస్యలను ఎదుర్కొని తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించుటలో సంఘం మొదటి నుండి ఆమెకు అండగా నిలిచింది. మొదట్లో సహకారం అందివ్వని ఆమె భర్త కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆమె పట్టుదల చూసి అతని ధోరణి మార్చుకొని ఆమెకు సహాయం అందించాడు. ఎల్లలింగమ్మ సర్పంచ్‌గా వున్న పదవీకాలంలో రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణం పూర్తి చేయగల్గింది. అంగన్‌వాడీ సెంటర్‌, కమ్యూనిటీ హాలు కొరకు పక్కా భవనాలను నిర్మించడంలో ఆమె విజయం సాధించింది. వృద్ధాప్య పింఛన్‌లకు అర్హత కలిగిన మహిళలను గుర్తించి వారికి పింఛన్‌లు వచ్చేలాగా చేయడంపై ఆమె దృష్టి సారించింది. ఆమె కృషి, ధైర్యం చూసి గ్రామస్థులు కూడా వారి ఆలోచనలు, అభిప్రాయలను మార్చుకొని, క్రమంగా ఆమెకు సహకరించడం ప్రారంభించారు.
”సహకరించని గ్రామస్థులెందరో రోజూ ఎదురవుతుంటారు, కానీ వాటిని నేను లె
క్కచేయక, మా గ్రామం కోసం పనిచేస్తాను. నాతో సంఘం ఉంది. అది నాకు కొండంత బలాన్ని ఇస్తుంది”, అని ఎల్లలింగమ్మ మహిళా ప్రజా ప్రతినిధుల విజయెత్సవ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో  తెలియజేసారు. సర్పంచ్‌గా ఎల్లలింగమ్మ పదవీకాలం దిగ్విజయంగా ముగిసేనాటికి గ్రామంలో తగు అభివృద్ధి కనబర్చడం ద్వారా గ్రామస్థులందరు ఆమెను 2006 పంచాయితీ ఎన్నికల్లో జిల్లా పరిషత్‌ స్థాయికి పోటీ చేయడానికి ప్రోత్సహించి, ఆమెను గెలిపించారు.
మహిళలు ఏవిషయంపైనైనా చొరవ తీసుకోవటంతోపాటు, సంఘటిత శక్తితో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకొని సమస్యలను ఛేదించడానికి ఎప్పుడూ ముందుంటారని, వారు ఎందులోనూ తక్కువకాదని నిరూపించింది ఎల్లలింగమ్మ.
(ఎ.పి. మహిళా సమత బ్రోచర్‌ నుండి)
కథానిక

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో