రవీంద గేయం – మూలం: రవీంద్రనాధ టాగోర్‌; అనువాదం: అరుణ

నీ మెడలోని గులాబీదండని
అడుగుదామనుకున్నాను.
కాని, ధైర్యం చేయలేకపోయాను.
శయ్యపై నీవు వదలి వెళ్ళిన
కొద్దిపాటి పూరేకుల తునకలకై
వేకువ వరకు వేచి వున్నాను.
రాలిపడిన వకటి రెండు పూరేకులకై
బిచ్చగత్తెలాగ వెదికాను.
ఆహా! ఏమిచూశాను నేను?!
ఏమి వదిలావు నీ ప్రేమ చిహ్నంగా!
అది పూవు కాదు.. సుగంధ ద్రవ్యంకాదు
పన్నీటి పాత్రకాదు
అది నీ శక్తివంతమయిన ఖడ్గము
అగ్నిజ్వాలలా మెరిసేది.
వజ్రాయుధంలా బరువయినది.
వేకువ లేత కాంతి కిటికీ నుండి ప్రసరించి
ప్రక్క అంతా పరచుకొంది.
ప్రాభాతపక్షి ముసిముసిగా నవ్వుతూ అడిగింది
”అమ్మాయీ! నీవేమి సంపాదించావు?”
అది పూవు కాదు.. సుగంధ ద్రవ్యం కాదు
పన్నీటి పాత్రకాదు
అది నీ భయంకర కరవాలము.
ఈ నీ కానుక ఎటువంటిది!!
నివ్వెరపడి కూర్చుండిపోయాను.
దానిని ఎక్కడ దాచను? అబలనైన నేను
దానిని ధరించ సిగ్గుపడ్డాను
దానిని నా గుండెకు హత్తుకుంటే
అది నాకు గ్రుచ్చుకుంది.
అయినా ఈ నీ బహుమతిని, వ్యథాభరిత గౌరవాన్ని
నా హృదయంలో మోస్తాను.
ఇక ఇప్పటి నుండి ఈ లోకంలో
నన్ను భయపెట్టేది ఏదీ లేదు.
నా పోరాటాలన్నిటిలో నీవు విజేతవు.
మృత్యువును నాకు సహచరుని చేశావు.
నా జీవితంతో అతనిని అభిషిక్తుని చేస్తాను.
నా బంధాలన్నీ తెగటార్చుటకు
నీ ఖడ్గం నాతో ఉంది.
ఈ లోకంలో నాకింక భయం లేదు.
ఇక నుండి ఈ అల్పమయిన
అలంకారాలన్నీ త్యజిస్తాను.
హృదయేశ్వరా! ఇక నా ముందు
ఈ నిరీక్షణలు, మూలనజేరి దుఃఖించడం
లజ్జ, భయ సంకోచాలు ఉండవు.
ధరించడానికి నీఖడ్గం నాకిచ్చావు.
నాకిక ఆటబొమ్మల అలంకారాలు అక్కరలేదు

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.