పిల్లలకు/ శిశువులకు హెచ్ఐవి వైద్యం అందించే పద్ధతి

భారతదేశంలో మొదటిసారిగా 2000 మంది బాధిత పిల్లలకు వారికోసం తయారు చేయబడ్డ, ప్రాణాన్ని రక్షించే మందుల ప్రవేశం ఇటీవలే జరిగింది.

న్యూఢిల్లీః మొత్తానికి హెచ్ఐవి వాత పడ్డ పిల్లలకి వైద్యాన్ని అందించే పద్ధతి క్రియారూపం దాల్చగా, భారతదేశంలో మొట్టమొదటి సారిగా 15 సంవత్సరాలలోపున్న 2000 మంది పిల్లల హెచ్ఐవి వైరస్ నయం చెయ్యడానికి, ప్రాణరక్షణ మందులు ఇవ్వడం ప్రారంభమైంది.

ఇంతవరకు హెచ్ఐవి/ ఎయిడ్స్ బాధితులకు నయం చెయ్యడానికి కేవలం ఏంటిరెట్రోవైరల్ థెరపీ (ఎఆర్‌టి) లో మందులు వాడడం జరిగేది. ఈ పద్ధతిలో పెద్దలకోసం తయారుచేసిన మందుల్లో భాగాల్ని విభజించి, వాటిని వయసు బట్టి ఆయా పిల్లలకు ఉపయోగించేవారు. కాని అలా చెయ్యడంతో తరచు మానవ తప్పిదాలకి ఆస్కారం వుండి ఒక్కోసారి, మరీ తక్కువగా ఒక్కోసారి కావలసిన దానికన్నా ఎక్కువ మోతాదులో మందులు పిల్లలకు ఇవ్వడం జరిగి వ్యాధి నిరోధక శక్తి తగ్గడం జరుగుతూ వచ్చింది. భారతదేశ ఎయిడ్స్ నిరోధక కార్యక్రమం (ఎన్.ఎ.సి.ఒ), సిడి-4 కౌంటు 15 శాతం కన్నా ఎక్కువగా వున్న పదివేల హెచ్ఐవి పాజిటివ్ పిల్లల్ని గుర్తించి ఈ పరిధిలోకి తీసుకురావాలని ఆశిస్తోంది. ఈ ప్రక్రియని యుఎస్ మాజీ రాష్ట్రపతి బిల్క్లింటన్ భారతదేశ పర్యటనకు వచ్చేనాటికి ముగించాలని ఆశిస్తోంది. 2007 అంతానికల్లా ఈ పిల్లలకి ఏంటిరెట్రోవైరల్ థెరపీని అందించాలని ఉద్ధేశ్యం.

క్లింటన్ భారతదేశంలో వున్న మూడు రోజుల్లో ముంబై, ఢిల్లి, తమిళనాడులో హెచ్ఐవితో బాధపడుతోన్న పిల్లల్ని కలుస్తారు. ఇది కాకుండా పిల్లలకోసం ప్రత్యేకంగా రెట్రోవైరల్ థెరపి మందులు తక్కువ ఖరీదుల్లో అందుబాటులో వుంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ ఎయిడ్స్ నిరోధక కార్యక్రమం, నాలుగు పీడిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో 12,000 హెచ్ఐవి బాధిత పిల్లల్ని గుర్తించింది. అందులో సిడి-4 కౌంటు 15 శాతం కంటే తక్కువ పిల్లలకి ఏంటిరెట్రోవైరల్ థెరపీ ఇవ్వడం జరిగింది. మిగిలినవారిని కౌన్సిలింగ్� మరియు అబ్సర్వేషన్‌లో వుంచారు. భారతదేశం, సిడి-4 కౌంటు పరీక్ష పిల్లలకు ఉచితంగా అందిస్తోంది. పెద్దవారు మాత్రం 250/- చొప్పున కట్టవలసి వస్తుంది. ఈ సిడి-4 కౌంటు ద్వారా వైద్యుడికి, ఒక వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి ఎంత బలంగా వుందో, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఏ దశలో వుందో తెలుస్తుంది. ‘నాకో’ డైరెక్టర్ జనరల్ కె. సుజాతారావు మాట్లాడుతూ ఇలా అన్నారు. “మేము భారతదేశంలో హెచ్ఐవి బాధితులైన పిల్లల ఇన్ఫెక్షన్ తీవ్రతను గుర్తించడానికి ఒక అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనాన్ని వ్యాధి అధికంగా ప్రబలిన నాలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టాం. ఒకసారి పిల్లల్ని హెచ్ఐవి పాజిటివ్‌గా గుర్తించిన తర్వాత సిడి-4 కౌంట్ పరీక్ష వారిలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో వుందో తెలుపుతుంది. క్లింటన్ మన దేశంలో పదివేల హెచ్ఐవి బాధితులైన పిల్లలకు మందులు అందచెయ్యడానికి ఆమోదం తెలిపారు కనుక, హెచ్ఐవి పాజిటివ్ మందుల అవసరం వున్న పిల్లలను గుర్తించాలని ప్రయత్నిస్తున్నాం” అన్నారు.

భారతదేశం కూడా 19 క్వాలిటీటివ్ పొలిమోరెస్ చైన్ రియాక్షన్ మెషిన్ను (పిసిఆర్) 13 సంవత్సరాలలోపు వున్న పిల్లలలో హెచ్ఐవి వైరస్‌ను చాలా నైపుణ్యంతో గుర్తించగలిగే ఏకైక వైద్య సాధనాన్ని దిగుమతి చేసుకోబోతోంది. ప్రతీ సంవత్సరం 33,000 మంది కొత్తగా పుట్టిన శిశువులకి, వారి తల్లినుండి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సంక్రమిస్తోందని అనుమానిస్తున్నారు. ఇందులో 50 శాతం పిల్లలు పుట్టిన రెండు సంవత్సరాలలోపే మరణిస్తే, 80 శాతం పిల్లలు వచ్చే 5 సంవత్సరాల్లో మరణించబోతున్నారు. యుఎన్ ఎయిడ్స్ ప్రకారం, 2004 వ సంవత్సరంలో 120,000 పిల్లలు హెచ్ఐవి వైరష్తో నివసిస్తున్నారు. నేషనల్ ఎయిడ్స్ నిరోధక కార్యక్రమ లెక్కల ప్రకారం, గత సంవత్సరం దాదాపు 60,000 ల పిల్లలకి కొత్త ఇన్ఫెక్షన్లు రావడం జరిగిందని, అందులో 250,000 మంది పిల్లలు హెచ్ఐవి పాజిటివ్ అని తేల్చారు. హెచ్ఐవి తో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి సుమారు 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది.

అమాయక బాధితులుః

ఏటా 700,000 మంది పిల్లలు హెచ్ఐవి ఇన్ఫెక్షన్‌కి గురౌతున్నారు. 2005 వ సంవత్సరంలో 570,000 మంది, 15 సంవత్సరాలలోపు వున్న పిల్లల ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో మరణించారు. ప్రస్తుతం వున్న 18 శాతం ఎయిడ్స్ సంబంధిత మరణాలల్లో, పిల్లలు మొత్తం ఇన్ఫెక్షన్‌ల సంఖ్యలో 6 శాతం కన్నా ఎక్కువ వున్నారు. వీరిలో 80 శాతం మంది పిల్లలకు ఎఆర్‌టి సకాలంలో అంది వుండివుంటే వారు ఇంకో 10 సంవత్సరాలు అదనంగా జీవించి వుండేవారు. ఈ ఎఆర్‌టి ఇవ్వకపోతే 50 శాతం హెచ్ఐవి పాజిటివ్ పిల్లలు మొదటి రెండు సంవత్సరాలలోనే మరణిస్తారు. ఇంకొక 80 శాతం పిల్లలు వారికి 5 సంవత్సరాలు వచ్చేసరికి మరణిస్తారు. ప్రతి ఆరు ఎయిడ్స్ మరణాలలో ఒకరు చిన్న పిల్లలు అవ్వడం గమనించదగ్గ విషయం కాని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 30 వ్యక్తుల్లో ఒక చిన్నారికి వైద్యం అందడం జరుగుతోంది. 95 శాతం మంది పిల్లలకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వారి తల్లుల నుంచి సంక్రమిస్తోంది.

(‘ద హిందూ’ సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో