ఎద్దుపుండు కాకికేమి ముద్దు …- జూపాక సుభద్ర

పోయిన్నెల ఫిబ్రవరిలో జాతీయ మహిళా కమీషన్‌ (23-2-15) ‘భారతదేశ దేవ దాసీ సమస్యల మీద హైద్రాబాద్‌లో ఒక హోటల్లో రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌ బెట్టింది.మామూలుగ జాతీయ మహిళా కమిషన్‌ ఏ మహిళా సమస్యల మీద ఎప్పుడొస్తుందో! ఏ మహిళలల్ని కలుస్తుందో ఏమ్మాట్లాడ్తదో తెలువకుండె. యీ సారి దేవదాసీ, జోగినీ సమస్యల మీద మాట్లాడనీకి రావడం ఆశ్చర్యమైనా మంచి ఎజెండా. మట్టి మహిళల దురాచారాల మీద చర్చించడానికి మీటింగ్‌ బెట్టడము బాగుంది యీనాటి కైనా!

అయితే మహిళా కమిషన్‌ సభ్యులకు, చైర్‌పర్సన్‌లకు అణగారిన జెండర్‌ సమస్యలు పట్టించుకొని ఎజెండాజేసి పరిష్కరించిన దాఖలాలు చాలా తక్కువ. ఎందుకంటే యిప్పటి దాకా జాతీయ, రాష్ట్రీయ మహిళా కమీషన్‌లో ఒక్క దళిత మహిళను కూడా చైర్‌ పర్సన్‌గా లేదా సెక్రెటరీగా చూడలేదు. పై పై కులాల మహిళల్ని మాత్రమే కమీషన్‌ ప్రధానమైన బాధ్యతల్లో పెట్టడం వలన అణగారిన మహిళల కుల జెండర్‌ సమస్యలు, కుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు అర్థం చేసుకొనే పరిస్థితులుండవు. అదే బహుజన కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్ని కమీషన్‌లో పెడితే అట్టడుగు మహిళలు ఎదుర్కుంటున్న బాల్య వివాహాలు, ఆవిద్య, శ్రమ దోపిడి, లైంగిక దోపిడి, మానవ హక్కులు లేని అమానవీయ పరిస్థితుల్ని సమాజానికి, ప్రభుత్వాలకు బహిర్గతం చేసే వారు కొంత మేరకైనా.

యిక తెలంగాణ రాష్ట్రంలో షీ టీములతో మహిళా రక్షణ వంద పర్సెంటు చేస్తున్నామని చేతులు దులుపుకొని తెలంగాణ మహిళా కమిషన్‌ వేసే మాటే మర్సిపోయినట్టుంది తెలంగాణ గవర్నమెంటు. మహిళా కమిషన్‌ ముచ్చటే దీస్తలేదు తెలంగాణ ప్రభుత్వము. సప్పుడు సరి లేకుంట సర్దుతుండ్రు. గంత సర్దుకునే, సర్దే కష్టమేమొచ్చిందో, తెలంగాణల మహిళలే లేరా, కమిషన్‌ చైర్మన్‌ చేసే శక్తి వున్న మహిళలు తెలంగాణకు కరువా! ఏందో గీ అవమానం తెలంగాణ మహిళలకు మన్సంత కలికలి అవుతుంది.

జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఒక్కరే చైర్‌పర్సన్‌గా వున్న ఆ మీటింగు చూసిన తెలంగాణ మహిళల ఆత్మగౌరవం గాయపడింది. జోగినీ, బసివి, మాతమ్మలు, దేవదాసీలు తెలంగాణలోనే ఎక్కువ. రాయలసీమ, ఆంధ్రలో ప్రకాశం నెల్లూరు లలో కొంత వున్నరని రిపోర్టులు చెప్తున్నయి. జోగినీ వ్యవస్థ దేశమంతట వుంది. అస్సాంలో నత్తిగా, ఒరిస్సాలో గనికా, గోవాలో బన్సి, మహారాష్ట్రాలో మధ్యప్రదేశ్‌లో ‘మురా’ లుగా, హర్యానలో ‘పొలికి’ గా వుందట.     జాతీయ, రాష్ట్రీయ మహిళా కమిషన్‌ మీటింగుకి మహిళల కంటే మగవాళ్లే ఎక్కువొచ్చిండ్రు. పరిశోధకులము అనే పేరు మీద, జోగిని ఎన్‌జివోలనే పేరు మీద మగవాళ్లే ఎక్కువొచ్చి, వాళ్లే ఎక్కువ మాట్లాడిండ్రు. కొద్ది మంది జోగిని మహిళలొచ్చిండ్రు. కొద్ది మంది యితర మహిళలొచ్చిండ్రు. ఆ యితరుల్లో తెలంగాణ మహిళలే ఎక్కువ.

ఆ జోగినీ సమస్యల మీద మీటింగ్‌ పెట్టిన జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌ వాల్లకు జోగినీలు, బసివీలు, దేవదాసీలు, మాతమ్మలు ఏ కులాల ఆడవాల్లు? ఎందుకు కుల, మత సంప్రదాయాలనే పేరుతో యీ దురాచారానికి బలవుతున్నారు! వూరు పచ్చగా వుండాలంటే దళిత మరీ ముఖ్యంగా మాదిగ మహిళల్ని దేవునికి పెండ్లిజేసి బసవమ్మలుగా, జోగమ్మలుగా జేసి బిక్షాటనే వృత్తిగా చూపిస్తూ వారిని వూరుమ్మడి లైంగికాస్తిగా చేసిన దుర్మార్గపు వ్యవస్థనీ, యీ పీడ మహిళలందరు ఎదిరించి రూపుమాపాలనే దాని మీద అవగాహన వున్నట్టు కనిపించలే. వుంటే జోగినీ నిర్మూలనకు ఒక కార్యాచరణతో కూడుకున్న పగడ్బందీ నివేదికను ప్రభుత్వాలకంద జేసే వారేమో! జోగినీల్లేని బోనాలు జరపాలని తీర్మానం జేసిండ్రు.

జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ని ‘యీ మార్చ్‌ 8్‌ష్ట్రని జోగినీ వ్యతిరేక మార్చ్‌ 8్‌ష్ట్రగా కాంపెయిన్‌ చేయాలనే సూచనని, అదెట్లా అది ఇంటర్నేషనల్‌ వుమెన్‌ షశీఅషవతీఅవస ది జోగినికి ఎట్లా కలుపుదాం అని దాటవేసింది. కొంచెం మనసులో కూచుండెటట్లు చెప్తే వచ్చే మార్చికి చూద్దామంది. యీ మీటింగ్‌లో జోగినీలకు, విడో పెన్షన్‌ వృద్దుల పెన్షన్‌ రావట్లేదు. వీల్లకు స్పెషల్‌ పెన్షన్‌ యివ్వాలని ప్రభుత్వానికి సూచన చేయమని అడిగితే ‘సింగిల్‌ వుమెన్‌ పెన్షన్‌’ కి అడుగుదామంటరు కమిషన్‌ వాల్లు. సింగిల్‌ వుమెన్‌, జోగినీ వుమెన్‌ ఒకటెట్లయితరు? దీని మీద వాదన బాగనే సాగింది.

కమిషన్‌ వాల్లు జోగినీ వ్యతిరేక మార్చ్‌8 కాంపెయిన్‌ చేయకుంటేంది మనంజేద్దామన్న తెలంగాణ పై కులం మహిళలు పోస్టర్లలో బ్యానర్‌లలో ఆ అంశమే రాయకుండా రాకుండా మీటింగ్‌ బెట్టడం, 2011లో జోగినీ సమస్యల మీద వేసిన రఘునాథరావ్‌ కమిషన్‌ నాలుగేండ్లు శోధించి 1988 నాటి ఎస్సీ కార్పోరేషన్‌ జోగినీ లెక్కల్నే చూయించడంను ఏమనాలి?

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.