నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

మాండూ ఎన్నికలు :
1968 సం||లో సంయుక్త సోషలిస్టు పార్టీ తరపున నేను ఎన్నికలలో నిలబడాలన్న ఉద్దేశ్యంతో మాండూకి వచ్చాను. మాండూ పరిధిలో కౌదలా, కుజు, చురుచు, గోమియా క్షేత్రాలు వస్తాయి. ఎన్‌.సి.డి.సి. గిద్దీ, రైల్‌ గఢా, రాయ్‌ బచర్‌, స్వాంగ్‌, కథారా మొదలైన బొగ్గు గనులు ఇక్కడే ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఇంటర్‌ యూనియన్లు ఉండేవి. కొన్ని చోట్ల ఎటక్‌ యూనియన్లు ఉండేవి. సోషలిస్టు పార్టీ ఒక యూనియన్‌ అర్‌గడాలో ఉండేది. ఈ యూనియన్‌ని బసావన్‌ సింహ్‌ నడిపేవాడు. గోమియా పార్టీ యూనియన్లు ఎచ్‌.ఎమ్‌.ఎస్‌ కి సంబంధించినవి. ఈ రెండు కర్పూరీ ఠాకుర్‌కి వ్యతిరేకమైనవి. కర్పూరీ గారు సంయుక్త సోషలిస్టు పార్టీకి చెందినవాడు. వీళ్ళు సోషలిస్టు పార్టీకి చెందినవాళ్ళు. మేము ఎచ్‌.ఎమ్‌.పి. (జార్జ్‌ ఫర్నాండిస్‌) కేంద్రీయ గ్రూపుకి చెందిన వాళ్ళం. ఈ ఎచ్‌.ఎమ్‌.పి (హిందూ మజుదూర్‌ పంచాయత్‌) మీ తరువాత ఎచ్‌.ఎమ్‌.కె.పీ (హిందూ మజుదూర్‌ కిసాన్‌ పంచాయతి) గా రిజిష్టర్‌ అయింది.

1968 సం||లో సంయుక్త సోషలిస్టు పార్టీ నేత కర్పూరీగారు ‘ఎక్కడ నుండి ఎన్నికలలో నిలబడతావు’ అని అడిగారు. అసలు ఈ పార్టీ పేరు కూడా తెలియని చోటు నుండి పోటీ చేయమన్నా చేస్తాను. పోటీలో నేనే గెలుస్తాను. అని అన్నాను.

మాండూ నుండి సంయుక్త సోషలిస్టు పార్టీ నాకు టికెట్‌ ఇచ్చింది.

ఎన్నికలకి ఒక నెల ముందు నన్ను మాండూకి పంపించారు. మోహన్‌ సింహ్‌ ఒబరాయ్‌ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు సంవిద్‌ ప్రభుత్వం ఉండేది. సోషలిస్టు పార్టీ కూడా దీనితో కలిసి ఉండేది. రాజా సాహెబ్‌ కామ్‌ భ్యా నారాయణ్‌ డబ్బు తీసుకుని తన ”జనతాపార్టీ” టికెట్‌ని ఒబరాయ్‌కి అమ్మేసారు. బహుశ ఆయనకి ఇట్లా చేయడం అలవాటే. ఆ రోజుల్లో రాజా సాహెబ్‌ పార్టీ సంవిద్‌ ప్రభుత్వంతో కలిసిపోయింది. అందువలన మేం అందరం కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం కోసం హజారీ బాగ్‌కి వెళ్ళాము. నేను భోలా ప్రసాద్‌ సింహ్‌ కూడా ప్రచారం చేయడానికి సోషలిస్ట్‌ పార్టీ తరపున హజారీబాగ్‌ వెళ్ళాము. అప్పుడు నాకు మాండూకి వెళ్ళే అవకాశం లభించింది. మాండూ సీటు కామాఖ్యా నారాయణ సింహ్‌ (పద్మ నరేష్‌) గారిది ఆ సీటు ఖాళీ అయింది. ఇప్పటికి విరోధి పార్టీ వాళ్ళు జమానత్‌ని జప్తు చేస్తూనే ఉన్నారు. తరువాత రాజాసాహెబ్‌ తను పెట్టిన జనతా పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్‌కి చెందిన సత్యనారాయణ సింహ్‌ ఆయనని రాజ్‌పూత్‌ (క్షత్రియులు) అని ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఆయన అసలు కొంత భయస్తుడు. ఆయన రాజా సాహెబ్‌ని పార్టీ లోపల కాని బాహాటంగా కాని ఎదిరించేవారు కాదు. ఆయన రాజాకి విరోధులైన వాళ్ళతో చేతులు కలిపి తమ కోపాన్ని శాంతింప చేసుకునేవారు. మాండూ ఎన్నికలలో రాజాని తక్కువ చేసి చూపించాలనే నాకు సహాయం చేసారు.

”నా కుక్క నిల్చున్నా సరే అది గెలుస్తుంది” అని రాజా సాహెబ్‌ ఎప్పుడు అంటూ ఉండేవారు. నేను ఆయన మాటలనే ఆయనపై ప్రయోగించాను. ”ప్రజలను కుక్కలుగా భావించే వాళ్ళు కుక్కలాగే తోకముడుచుకుని పారిపోయే వాళ్ళనే గెలిపించాలన్న మనస్తత్వం వాళ్ళది. అందువలన రాజా సాహెబ్‌ తన పార్టీలోని కాండిడేట్‌ను తనతో తీసుకువెళ్ళరు.” ఆయన తన ఎన్నికలలో నిల్చున్నానంటూ అందరికి చెప్పేవారు. ఇంటి – ఇంటికి వెళ్ళి సిందూరాన్ని పంచేవారు. దీనికి వ్యతిరేకంగా నేను ఊళ్ళో వాళ్ళ పిల్లలను ఎత్తుకుని వాళ్ళ ముక్కులను శుభ్రం చేసేదాన్ని. వంటకి కట్టెలు, తాగే నీళ్ళ కోసం పోరాడమని వాళ్ళకు చెప్పేదాన్ని. ఈ సీటు కోసం రామానంద్‌ తివారి, భోలాబాబు కూడా కాంటెస్టు చేయాలని అనుకున్నారు. లోలోపల నన్ను వ్యతిరేకించేవారు. భోలా ప్రసాద్‌ సింహ్‌ కుర్మీ కులం వాడైనందు వలన ఈ సీటుకోసం పోరాటం మొదలుపెట్టారు. మాండూ క్షేత్రంలో అరవై శాతం కుర్మీలే ఉన్నారు. ఈ ఎన్నికలయిన చాలా సంవత్సరాల తరువాత నితీష్‌ ఎన్నికలలో నిల్చోవాలనుకున్నారు. ఇక్కడ ఉన్న కుర్మీలకు బిహారు,  నలందాలలో ఉండే కుర్మీలకు మధ్య చాలా తేడా ఉంది. వీళ్ళు వాళ్ళ కన్నా వెనుకబడ్డ వాళ్ళు. వీళ్ళు ఉండే విధానం, కట్టు, బొట్టు, తిండి అలవాట్లు ఆదివాసీలకు దగ్గరగా ఉన్నాయి. బ్రీటిష్‌ వాళ్ళ సమయంలోనే మానభూమ్‌ కుర్మీ నేతలు కుర్మీ – మహతోలను ఆదివాసీల సూచిక నుండి తీసివేసి ‘సుదాన్‌’ సూచికలో చేర్చాలని అర్జీ ఇచ్చారు. అంతే కాదు దీని కోసం వాళ్ళు ఉద్యమం కూడా నడిపారు.

మధులిమియే, కర్పూరీ ఠాకుర్‌ నా కోసం ఇంటి- ఇంటికి తిరిగేవారు. శ్రీ కృష్ణ సింహ్‌ (సోషలిస్టు పార్టీ ఎక్స్‌ మినిస్టర్‌) రాజపూత్‌ అయినందుకు, మాండూ నుండి పోటీ చేస్తున్న శాలీగ్రామ్‌ సింహ్‌తో రాత్రిపూట రహస్యంగా చేతులు కలిపేవారు. కాని పగలు నాకోసం నాతో పాటు సభలు ఏర్పాటు చేసేవారు. నేను, తానేశ్వర్‌ ఆజాద్‌, ఒక మహిళ, ఒక దళితుడు మాండూ రోడ్ల పక్కన చాపలు పరుచుకుని పడుకునే వాళ్ళం. ఎన్నికల ప్రచారపు ప్రణాళికలో వీటన్నింటిని అందరి దృష్టికి తెచ్చేవాళ్ళం. తానేశ్వర్‌ ఆజాద్‌ ‘లోహియాగారు చెప్పేదాంట్లో పదహారణాల సత్యం ఉంది. మహిళ ఏ కులానికి చెందినా ఆమెకి విలువ ఉండదు. ఏ మొగవాడు ఆమెని నేతగా అంగీకరించడు.” అని అంటూ ఉండేవారు. తానేశ్వర్‌ ఆజాద్‌ సంవిద్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు.

సోషలిస్టు పార్టీలో కూడా ఇటువంటి రీతే ఉండేది. స్త్రీ ఎంత శక్తి వంతురాలైనా, ఎంత చదువుకున్నా ఆమెని ముందు ఒక ఆడదానిగానే చూస్తారు. ఎన్నికల్లో శ్రీకృష్ణ సింహ్‌ మా వాళ్ళందరూ పోగుచేసిన చందాను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టసాగారు. మేము కళ్ళు తెరిచాం. మేం స్వయంగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాము. ఊరు – వాడా తిరగడం మొదలుపెట్టాము. నేను ధన్‌ బాద్‌ నుండి కమర్‌ మఖ్‌ దుమీ, నిత్యానంద సింహ్‌, పటేల్‌ సింహ్‌ లని తీసుకువెళ్ళాను. కమర్‌మఖ్‌ దుమీ కవి కూడా ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నేను ఒక సెకెండ్‌ హాండ్‌ స్టేషన్‌ వేగన్‌ని కొన్నాను. ఆ కారు మధ్య – మధ్యలో పాడవుతూ ఉండేది. తోసాక మళ్ళీ స్టార్ట్‌ అయ్యేది. అడవుల మధ్యలో ఆగిపోయేది. మేం కాలినడకన, ఎద్దుల బండి మీద, సైకిల్‌ మీద గోమియా, మాండూలకు  వెళ్ళే వాళ్ళం. ఊరి వాళ్ళు నా బండిని తోస్తూ గోమియాకి తీసుకువచ్చే

వాళ్ళు. అక్కడ దాన్ని బాగు చేసేవాళ్ళు. మేం ప్రతీ ఊరికి వెళ్ళే వాళ్ళం. వెస్ట్‌ బొకారో, ఘాటో, బంజీ, గోమియాల నుండి నాకు చాలా ఓట్లు పడ్డాయి. రాజు సాహెబ్‌ అసలు ముఖం గురించి కొంత అందరికి తెలసింది. ప్రజల స్నేహం, సమర్థన లభించాయి. ఎన్నికల సమయంలో గోమియాలో నీళ్ళ కోసం ఉద్యమాన్ని చేపట్టాను. ఇందులో ఎందరో యువకులు, మహిళలు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇక్కడి నుండే నా జీవితంలో కొత్త మలుపు వచ్చింది. ఊళ్ళో ఒక జటాధారి మహతో, పాత సోషలిస్టు కార్యకర్త భీమ్‌సింహ్‌ మాతో కలిసి పని చేసారు. ఎన్నికలయి పోయాక అడవుల ఉద్యమంలో కూడా మాకు ఎంతో సహాయం చేసారు. వీళ్ళు కాలి నడకన ఎన్నికల ప్రచారం చేసేవారు. సామాన్యంగా ఈ కుగ్రామాలకు ఏ కాండిడేట్‌లు వెళ్ళే వాళ్ళు కాదు. సంతల దగ్గర చిన్న చిన్న సభలు పెట్టి నేతలు ప్రజలని కలుస్తూ ఉండేవాళ్ళు. రాజా సాహెబ్‌ తన హెలికాప్టర్‌లో సంతల దగ్గర, పెద్ద పెద్ద ఊళ్ళ దగ్గర దిగేవారు. అందుకే వారి హెలికాప్టర్‌ ప్రభావం ప్రజలపై చాలా ఉండేది. ఆ ఊళ్ళకి కాలి నడకన వెళ్ళి ప్రచారం చేసి రాత్రిపూట అక్కడే ఉన్న మొదటి అభ్యర్థిని నేనే.

కాంగ్రెస్‌ అభ్యర్థి శాలి గ్రామ సింహ్‌ ఎన్నికలలో గెలుపొందారు. నేను 700 ఓట్లతో ఓడిపోయాను. నా 322 ఓట్లు రద్దయినాయి. ‘నోటు ఓటు రెండు కావాలి’ అన్న నినాదానికి వాళ్ళు జవాబుగా ఓటుతో పాటు నోటుని జత పరుస్తున్నాం’ అని రాసారు. నోటు ఖాజానాలోకి వెళ్ళిపోయింది. ఓటు చెత్త డబ్బాలోకి నిజానికి ఎంతో ఉత్సాహంగా నేను పని చేసాను. కాని ఓడిపోయాను. రాజా సాహెబ్‌ ద్వారా ప్రత్యర్థుల జమానుతీను జప్తు చేసే ఆచారం మారింది. ఆ రోజుల్లో రాజాసాహెబ్‌ హెలికాప్టర్‌ పైన ఎగురుతుంటే కింద జోహార్‌ … జోహార్‌ అంటూ ఆదివాసీల సాష్టాంగ నమస్కారం చేసేవారు. నేను ఆదివాసీల ఇళ్ళల్లోకి వెళ్ళే దాన్ని వాళ్ళ బాష నేర్చుకున్నాను. ఆకుకూరలు, జోండరా (మొక్కజొన్న) ఘట్టా (అంబలి) వాళ్ళతో కూర్చుని తిన్నాను. వాళ్ళు నన్ను ‘రాణీమా!’ ‘గుప్తారానీ’ అని పిలిచేవాళ్ళు.

‘ఓడిపోయినా సరే నేను ఇక్కడే ఉంటాను’ అని ఎన్నికల సమయంలో మాండూ ప్రజలకు చెప్పాను. చెప్పినట్లుగా అక్కడే

ఉండటం మొదలుపెట్టాను. ఓడిపోయాను అని తెలియగానే హజారీ బాగ్‌ కోర్టు కాంపౌండులో ప్రజల గుంపు ముందు జీపు పైన కెక్కి టాటా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తానని ప్రకటించాను. హైస్కూల్‌ని నిర్మించాలని డిమాండ్‌ చేసాను. మేము మగన్‌ సింహ్‌(భగవాన్‌ సింహ్‌) దగ్గర ఘాటోలో డేరా లేసాము. ఘాటో నుండి నిజామ్‌ భాయి, అషరఫ్‌, బాతేస్వర సింహ్‌, అఖిలేశ్వర్‌ సింహ్‌, మురారీ తివారి, శ్రీవాస్తవ్‌ మొదలైనవారు ముందుకు వచ్చారు.

(ఇంకా వుంది..)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో