తేడా – ఎస్‌.అరుణ

నీతో
నువ్వున్నప్పుడు మాత్రమే
ఆది ఏకాంతం.నీకు నువ్వు స్పష్టంగాకనపడుతూ
కవిత్వంతో మాట్లాడుతుంటే
అదొక మౌనకావ్యం.
మౌనం కూడా భాషే
వ్యాకరణానికందని
స్వచ్ఛంద ఘోష.
ఇక ఒంటరితనమంటావా
అది కోరుకునేది కాదు
దాపురించేది.
స్నేహాలు శూన్యమైనప్పుడు
ఆత్మీయతలు కరవైనప్పుడు
చుట్టూ జనం ఉండి
అందులో మనం లేప్పుడు
జీవితంలోని మలుపులు
వక్రరేఖలైనప్పుడు
మీదిమీదికి పొడుచుకొస్తుంది
ఏకాకి కాకి.
అందుకే
ఒంటరితనంతో
అలసిపోయినప్పుడల్లా
ఏకాంతాన్ని ఆహ్వానిస్తాను

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో