కూతురు వీడ్కోలు – డా. జరీనా బేగం

కూతురి వీడ్కోలు ఓ మధురమైన బాధ
మననుండి ఓ అపురూప భాగం విడిపోతున్నట్టుఓ అంటు కట్టిన కొమ్మ మరో మానుగా ఎదుగుతుందని తెలుసు
మరో కుటుంబానికి నీడగా మారుతుందని తెలుసు
ఐనా ఇన్నాళ్ళు పదిలంగా పెంచుకున్న ప్రతి కొమ్మా
చెట్టుకు అపురూపమే ఇక
అమ్మా అదిచేయనా ఇది చేయనా అన్న పిలుపులు ఇక వినిపించవు
నాన్న ఇది కొనిపించావా అది కొనిపించావా అన్న అందమైన
అధికారిక కోరికారాగాలు ఇక వినిపించవు
పెళ్లి పేరిట కూతురు వీడ్కోలు ఏర్పరిచే శూన్యమ్‌ అందమైనదే
కాని ప్రకృతిలో వసంతం వచ్చి పొయినట్లు
వర్షం తరువాత చెట్ల చుట్టూ పరుచుకున్న తడిచిన
పూల తివాచీల నిశ్శబ్దత
తిరిగి వసంతం కోసం ఎదురు చూసినట్లు
కూతురి రాక కోసం
కొత్త ఆలోచనలతో కొత్త రూపులతో
కొత్త బాధ్యతతలతో కొత్త పొందికతో
కొత్త పెద్దరికంతో కొత్త ప్రాధాన్యాలతో
కొత్త కబుర్లతో వచ్చే కూతురు
తిరిగి గలగలా రాగాలు కిలకిలా స్వరాలూ
సమయాన్ని మరిపించే సరిగమ శ్రుతులు
కాని కొంత సమయమే
ఓ ఆత్మీయ భాగం ఓ అథిదిగా మారినవేళ
కూతురి ప్రస్తానం ఇదే
ప్రతి ఇంట్లో ప్రతి లోగిలిలో

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో