కొండవీటి సత్యవతికి జాతీయ మీడియా అవార్డు

డా.laadli media award” /> జె. భాగ్యలక్ష్మి
laadli
భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతికి ఉత్తమమైన సంపాదకీయం కోసం ప్రింటు మీడియాలో ‘జాతీయ అవార్డు’ లభించింది.

భూమిక సంపాదకురాలు, భూమిక సంపాదకవర్గం, భూమిక పాఠకులు ఆ మాటకొస్తే తెలుగు ప్రజలు గర్వించదగిన విషయమిది, మాములుగా అభినందించి పండుగలా జరుపుకోవటానికి ఇది ఏదో ఒక అవార్డు కాదు. ఇది దేశం హర్షించే విషయం. ఆధునిక సమాజపు తీరుతెన్నులు తెలిసిన వారెవరయినా తీవ్రంగా ఆలోచించదగ్గ విషయం. అంతర్జాతీయంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం. ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాలన్నీ ఏదో ఒక రూపంలో తమ విధానాలలో పొందు పరచిన విషయం. అదే ఆడపిల్లలను ఆదరించే విషయం. లింగవివక్ష లేకుండా పిల్లలను సరి సమానంగా, సమానావకాశాలతో పెంచవలసిన అవసరం గుర్తుకు తెస్తూ, జన్మించిక ముందే ఆడపిల్లల హత్యకు పాల్పడి దేశ జనాభాకు, దేశ భవిష్యత్తుకు చేస్తున్న అపకారాన్ని తెలియజెప్పే సందర్భం.
మే 15, 2008 భూమిక చరిత్రలో సంపాదకురాలు కొండవీటి సత్యవతి సువర్ణాక్షరాలతో రాసుకోదగిన దినం. యు.యన్‌.యఫ్‌.పి.ఏ – లాడ్లీ కలిసి అందజేసిన మీడియా అవార్డులు 2007లో జాతీయ స్థాయిలో కె.సత్యవతిగారి సంపాద కీయం ఎన్నికయింది. ప్రింటు మీడియా వర్గంలో దీనికి అవార్డునిచ్చారు.
న్యఢిల్లీలోని ఫిక్కీ ఆడిటోరియంలో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యు.యన్‌, యఫ్‌.పి.ఏ) – లాడ్లీ వారు కలిసి జెండర్‌ సెన్సిటివిటీ (లింగవివక్ష విషయమై చైతన్యం) కోసం కృషిచేసిన మాధ్యమాలకు మే 15న జాతీయ అవార్డులు ప్రకటించారు. ముంబయ్‌కి చెందిన పాపులేషన్‌ ఫస్ట్‌ అనే సంస్థ ఈ ఉత్సవం ఏర్పాటు చేశారు.
ఫిక్కీలో జరిగిన సమావేశం గొప్ప మీడియా ఈవెంట్‌ అయింది. ఎన్నో ఛానళ్ళ టెలివిజన్‌ కెమెరాలు, ప్రెస్‌ ఫోటోగ్రాఫర్లు, కరస్పాండెంట్లతో సభ కిటకిటలాడింది. చాలా రంగాలలో అగ్ర గాములైన వారు ప్రేక్షకులుగా ఈ సభను అలంకరించి తమ హర్షాన్ని ప్రకటించారు.
ముఖ్య అతిధిగా డిల్లీ ముఖ్యమంత్రి శీలా ధీక్షిత్‌ వచ్చారు. యు.యన్‌. యఫ్‌.పి.ఏ.కు గుడ్‌విల్‌ ఎంబాసెడర్‌ (సద్భావన రాయబారి) లారాదత్తా (ప్రపంచసుందరి, సినివతార) ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఆ సాయంకాలం అందరి కళ్ళను ఆకట్టుకొని, అన్ని కెమరాలు తన మీద కేంద్రీకరింపబడినపుడు చురుకుగా, చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ, పాట కూడా పాడి ప్రేక్షకులను అలరించిన వ్యక్తి లాడ్లీ ఆఫ్‌ది సెంచరీ ( ఈ శతాబ్దానికి ముద్దుల కూతురు) అవార్డు పొందిన జొహరాసైగల్‌. నాటక రంగంలోను, సినిమారంగంలోను ఎంతగానో కృషిచేసి ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచిన 95 ఏండ్ల జొహరాసైగల్‌ అంటే అందరికీ అంతులేని ప్రేమ, గౌరవం. ఇక్కడి ప్రేక్షకులకు అమె ఇంటింటికీ చెందిన వ్యక్తిలా అనిపిస్తారు. మొదటి నుండి చివరిదాకా ప్రేక్షకుల దృష్టి ఆమె మీదే ఉంది.
పాప్యులేషన్‌ ఫస్ట్‌కు ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ శ్రీ యస్‌.వి.సిస్టా మాట్లాడుతూ ”ఈ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీలు చూస్తే ఎంతో ఆనందం కలిగింది. ప్రసార మాధ్యమాలలో, వృత్తిపరంగా సమాచారాన్ని అందజేసే వారిలో లింగవివక్షకు సంబంధించిన చైతన్యం త్వరలోనే ఒక విలువైన అంశంగా రూపొందుతుందనే నమ్మకం కలుగుతోంది” అన్నారు.
పాపులేషన్‌ ఫస్ట్‌కు ప్రోగ్రామ్‌ డెరక్టరు ఎ.యల్‌.శారద మాట్లాడుతూ ”ఈ అవార్డులను పోటీకి చెందినవిగా మేము పరిగణించటం లేదు. ప్రసార మాధ్యమాలు స్త్రీ పురుషులకు సంబంధించిన విషయాలలో చురుకుగా చర్చలలో పాల్గొనటానికి ఇవి అనుకూలమైన సాధనంగా పనిచేస్తాయచని మేము బావిస్తున్నాము.” అన్నారు.
లింగవివక్ష చైతన్యానికి సంబంధించి మీడియాలో పనిచేస్తున్న వారికి సినిమా, ప్రింటు, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో ఉన్నవారికి – ప్రాంతీయ స్థాయిలోను, జాతీయ స్థాయిల్లోను అవార్డులివ్వడమన్నది మొదటి సారిగా జరిగింది. లింగవివక్షతను, మూససోసినట్లు స్త్రీలను ఫిల్ములద్వారా, ప్రకటనద్వారా సృష్టించటాన్ని వ్యతిరేకించి ధైర్యంగా వాటిని అందరిదృష్టికీ తెచ్చిన మాధ్యమాల కృషిని ఈ అవార్డుల ద్వారా గుర్తించడమయింది. అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లోను వీరి కృషిని గుర్తిస్తూ, హర్షిస్తూ అవార్డులిచ్చారు. జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎలక్ట్రానిక్‌ మీడియా
1. నవీన, టి.వి. 9, హైద్రాబాద్‌ (ఛానల్‌లో ఉత్తమ కార్యక్రమానికి)
2. రక్ష్‌ ఛటర్జీ, సి.ఎన్‌.ఎన్‌ – పి.బి.యన్‌. ముంబయ్‌ (ఉత్తమ న్యూస్‌ ఫీచర్‌, రిపోర్టింగు)
ప్రింట్‌ మీడియా
1. అదితిభాదురీ, (ఉత్తమమైన వ్యాసానికి)
2. కొండవీటి సత్యవతి, భూమిక, హైద్రాబాద్‌ (ఉత్తమమైన సంపాదకీ్యానికి)
3. అన్న ఆనంద్‌, ప్రెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియ, ఢిల్లీ (ఉత్తమమైన ఫీచర్‌కు)
4.సిబీ కట్టమ్‌పల్లి, మలయాళం మనోరమ, తిరువనంతపురం (పరిశోధనాత్మకంగా ఉత్తమమైన రిపోర్టింగుకు)
5. సంధ్యనారె -పాదర్‌, చిత్రలేఖ, ముంబయ్‌ (నిలకడగా రిపోర్టింగుకు)
6.గంగపుత్ర టైమ్స్‌, హార్యానా (నిలకడగా రిపోర్టింగు ప్రచురణకు)
సినిమా
షిమిట్‌ అమీన్‌, చక్‌దే ఇండియ (ఉత్తమమైన సినిమాకు)
ఈ ఉత్సవం సందర్భంగా చిన్నపాపలు ఒక అబ్బాయితో సహా.. కొవ్వొత్తులు చేతుల్లో పట్టుకొని ”తారే జమీన్‌ పర్‌” ధోరణిలో పాడిన పాట ఎంతో స్పూర్తిదాయకంగా ఉంది. లుషిన్‌ దుబే ”బిట్టర్‌ చాకోలేట్‌” (చేదు చాకోలేట్‌) నాటకం, మల్లికా సారాభాయ్‌ దర్పణ్‌ అకాడెమీ ప్రదర్శించిన ”సీతాస్‌ డాటర్స్‌” (సీత కూతుర్లు) ఆడపిల్లలు సంఘంలో ఎదుర్కొనే భిన్నమైన దురాగతాలను, సమస్యలను చిత్రించాయి.
విజేతల పేర్లు, ఫోటోలతో సహా ఫిక్కీ ఆడిటోరియమ్‌లో సమావేశం జరుగుతున్నంతసేపు ప్రదర్శిస్తూనే ఉన్నారు. జాతీయ అవార్డు పొందిన కొండవీటి సత్యవతిగారి గురించి ఈ వివరాలు ఇచ్చారు. ”కొండవీటి సత్యవతి స్త్రీల విషయలగురించి స్త్రీవాద పత్రిక “భూమిక” ఎడిటరుగా ఇతర ప్రచురణలలో కాలమ్స్‌లో ఏకధాటిగా రాస్తూనే ఉన్నారు. ఆమె సంపాదకీ్యాలు ఎంతో ధైర్యాన్ని ప్రకటిస్తాయి. లింగవివక్ష విషయాలపట్ల ఆమె నిబద్ధతను చూపుతాయి.”
సత్యవతిగారిని అభినందిస్తూ ఈ అవార్డుకు ఆమెను తన స్పందన అడిగితే ఆమె ”తనకు ఎంతో ఆనందదాయకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక చిన్న పత్రికకు జాతీయ స్థాయిలో గౌరవం దక్కటం గొప్ప విషయం” అన్నారు. భిన్నమైన పత్రికను ప్రారంభించి, 15 ఏండ్లు ఎన్నో ఒడిదుడుకులకోర్చి పడిన శ్రమ ఫలించిందా అంటే అవునని అన్నారు. ”భూమిక” ఇబ్బందుల్లో ఉందన్నారు. అవి తీరినట్లేనా అంటే తీరినట్టేనన్నారు. స్త్రీల విషయంలో, బాలికల విషయంలో మరింత నిబద్ధతతో నిష్టగా ”భూమిక” పనిచేస్తుందని ఆశిస్తూ “భూమిక”కు సత్యవతిగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

3 Responses to కొండవీటి సత్యవతికి జాతీయ మీడియా అవార్డు

  1. varala anand says:

    శుభాకాంక్షలు

  2. Rakesh says:

    హృదయపూర్వక అభినందనలు!!

  3. ఆనంద్ గారూ,రాకేష్ గారూ ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో