”లాల్‌బట్టీ ఎక్స్‌ప్రెస్‌” – ఉదయమిత్ర

(కామాటిపురా అంతరంగ ఆవిష్కరణ)
(ఇప్పటిదాకా షేక్‌స్పియర్‌, బెర్నార్డ్‌ షానాటకాల్తో తరించిన సమాజానికి, కామాటిపురా వేశ్యలకూతుళ్ళు వొక కొత్తనాటకాన్ని పరిచయం చేయబోతున్నారు.)
తను శవమై – ఒకరికి వశమై, తనువుపుండై – ఒకడికిపండై, ఎప్పుడూఎడారై.. –    ఎందరికోఒయాసిస్సై… – అలిశెట్టి ప్రభాకర్‌
సాధారణంగా వేశ్యల పిల్లలు తమమీదగలమచ్చల్ని చెరిపేసుకోవడం అసాధ్యమే.. అయినప్పటికీ.. చీకట్లను చీల్చుకొచ్చే కిరణాల్లాగ, అప్పడప్పుడూ వాళ్ళపట్టుదలనూ, చైతన్యాన్నీ పొడసూపేసంఘటనలు విషాదవాతావరణాన్ని తొల్చుకు బయటి కొస్తుంటాయి. కామాటిపురా… ఆసియాఖండంలోనే అతిపెద్దరెడ్‌లైట్‌ ఏరియా (వేశ్యావాటిక)గా అందరికీ గుర్తు… ఈ నరకకూపంలోని పదమూడుమంది అమ్మాయిలు తమసంకోచాల్ని, సంకెళ్లను తెంచుకొని తామేమిటో నిరూపించుకోవడానికి ముందుకొస్తున్నారు… వాళ్ళ మేనెలలో అమెరికాదాంక ప్రయాణంజేసి, అక్కడ ”లాల్‌బట్టి ఎక్స్‌ప్రెస్‌” అనేనాటకాన్ని ప్రదర్శిస్తారు… కామాటిపురాప్రాంతంలో పనిజేసే ”క్రాంతి” అనే స్వచ్ఛంద సంస్థ చోరవలోవాళ్ళ సదవకాశం దక్కింది. ఈ సంస్థ వేశ్యల పిల్లలకూ, కొత్తగా వేశ్యావృత్తిలోకి వొస్తున్నవారికీ చదువుసంధ్యలునేర్పి, వాళ్ళను చైతన్యపరుస్తుంటది.
సుమారుగ గంటనిడివిగల ఈనాటకం, వేశ్యలు, వాళ్ళపిల్లల గాధలకూ, బాధలకూ అద్దంపడ్తుంది. ఈనాటకంలోని ఇతివృత్తం మొత్తంగావాళ్ళ జీవితాల్లోంచి తీసుకున్నదే. 14-19 సం||ల వయస్సుగల అమ్మాయిల బృందం. న్యూయార్క్‌, లాస్‌వెగాస్‌, చికాగో, శాన్‌ఫ్రాన్సి స్కో ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తుంది.
వేశ్యావాటికల్లోని చాలామంది పిల్లలకు బడిలో అడ్మిషన్లు ఒక గండమయితే, వాటిని నిలబెట్టుకోవడంమరో గండం… సుమారుగా నాలుగేళ్ళనుండి పనిజేస్తోన్న ”క్రాంతి” సంస్థ చొరవ ద్వారా కొంతమంది అమ్మాయిలైనా మెరుగైన జీవితాల్ని చూడగల్గుతున్నారు. ఈ సంస్థకు చెందిన శ్వేతఖట్టి అనే అమ్మాయికి న్యూయార్క్‌లోని బార్డ్‌ కాలేజీలో చదువుకోవటాన్కి స్కాలర్‌షిప్‌ దొరికింది. ఆమెకు”U.N. Youth Courage Award” కూడా లభించింది. ”ఈనాటకం ఒక రకంగా మా ప్రశ్నల్ని సందేశాల్నీ సమాజానికి చేరవేసే ప్రయత్నమే.. మా రెడ్‌లైట్‌ ఏరియాలో ఎవరూ ఊహించని దారుణఘటనలు జరుగుతుంటాయి.. అయితే సమాజంలోని ఈ మర్యదస్తులే మా ప్రాంతాన్ని మురికికూపంగా మార్చివేశార” ని చెప్పుకొస్తుంది. అమెరికాకు చెందిన రాబిన్‌ చౌరాసియా, ఈ సంస్థకు వ్యవస్థాపక సభ్యురాలిగా పనిజేస్తుంటది. ఆమెమాట్లాడుతూ, ”ఈనాటకం ఒక రకంగా” ”క్రాంతి సంస్థకు నిధులకోసమే అయినా, ఇది వేశ్యల జీవితాలపట్ల లోతయిన అవగాహన కలిగించగల్గు తుంద”ని చెబుతుందామె. అమెరికాలోని మిలటరీలో పనిజేసిన ఆమె, థియేటర్‌ అనేది వేశ్యలపిల్లల్లో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కల్గించడమేగాక వాళ్ళకు ధారాళంగా మాట్లాడేశక్తి వొస్తుందని ఆమె అభిప్రాయం. ”ఇది మార్పుకు ఒక వాహకంవంటిది. ఈ అమ్మాయిలు తమజీవితాల్ని తామే వేదికపై ప్రదర్శిస్తున్నపుడు… ఇప్పటిదాంక కళంకితమనుకున్నజీవితాల్ని భిన్నకోణం నుంచి పరిశీలించినట్ట వుంద.”ని అంటుందామె.. ”లాల్‌బట్టీఎక్స్‌ప్రెస్‌” పైకి కనబడేదాని కన్నా, ఎక్కువ అర్థాన్నేసూచిస్తుంది. అత్యంత నరకకూపమైన కామాటిపురాప్రాంతం నుండి ఒక గౌరవప్రదమైన, విజయవంతమైన జీవితందాంక వేశ్యాల పిల్లలు జేసిన మహత్తర ప్రయాణాన్ని ఈ నాటకం పట్టి చూపుతుంది.. (విఐపి సంస్కృతిని ఎర్రలైట్‌ వాహనాల్తో సూచిస్తుంటారు.)
ఈ నాటకాన్ని రచించి, నటించి, నిర్మించింది వేశ్యల కుమార్తెలేగావడం ఓ విశేషం – వాళ్ళు తమను తాము” క్రాంతి అమ్మాయిలు”గా చెప్పుకుంటుంటారు. పింకీషేక్‌ (19) అనే అమ్మాయి, ఈనాటకంలో వేశ్యాగృహపు యజమానురాలిగ నటించింది. ఇప్పటిదాంక, అనేకానేక సందేహాల్తో, కళం కాల్తో నిండి ఉన్న వేశ్యల జీవితాల్లోకి, థియేటర్‌ కొత్త వెలుగుల్ని తీసుకొచ్చిందని చెబుతుందామె. తాను మరాఠీస్కూల్లో చదివేటప్పుడు, అక్కడివాళ్ళు పదేపదేతన నేపథ్యాన్ని (వేశ్యాజీవితాన్ని) గుర్తుచేయడం, సూటిపోటి మాటలనడం గుర్తుకు తెచ్చుకుంటుందామె… ” వాళ్ళునాపట్ల చాలాకఠినంగా ఉండేవాళ్లు… నన్నెప్పుడూ అంటరాని దాన్నిజేసి, చివరి బెంచీలోకూర్చో బెట్టేవాళ్ళు. 12 సం||ల వయస్సులో పింకేషేక్‌ కలకత్తానుండి వోచ్చేసి, క్రాంతి సంస్థ ఆరంభంనుండి అక్కడే పనిజేస్తున్నది తాగుడుకుబానిసైన తన తండ్రి రెండేళ్ళ కిందనే చనిపోయాడు-తల్లిమాత్రం, ఇంకావేశ్యావృత్తిలోనే కొనసాగుతుంది. తన నేపథ్యం విసిరిన సవాలులో ఆమె పట్టుదలగా చదివి, ఓ చక్కటి మానసిక విశ్లేషకురాలు (Psychologist) అయ్యింది. అయితే అది జంతువులకు సంబంధించిగావడం విశేషం. ”వాటికికూడా చికిత్స అవసరం” అంటుందామె. ”సాధారణంగా వేశ్యలపిల్లలు వేశ్యావృత్తిని స్వీకరించాల్సిందే.. ఆనవాయితిగా వొస్తున్న ఈ అభిప్రాయాన్ని ప్రజలిప్పుడు మార్చుకోవాలి. మేం ఈ వృత్తిని ఎంచుకోవడమో, తుంచుకోవడమో జరగొచ్చు… మేం ఇంకా చాలావిషయాలు సాధించగలం.. ప్రజలు దీన్ని గుర్తిస్తే మంచిద”ని గొప్పవిశ్వాసంలో చెబుతుందామె.
(మార్చి11, 2015 హిందుపత్రిక సౌజన్యంలో…)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో