కాలువ మల్లయ్య కథలు – స్త్రీ జీవనం – బుట్టి సునీత

శ్రీకాలువ మల్లయ్యగారు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాలో శ్రీకాలువ ఓదేలు, శ్రీమతి పోచమ్మ దంపతులకు 12-1-1952 సం||లో జన్మించారు. వీరు అతిసామాన్య కుటుంబం నేపధ్యంగా గల సామాజిక వాస్తవిక స్పృహ ఉన్న (కథా) రచయిత వీరి సాహితీ ప్రస్థానంలో 875 కథలు, 16 నవలలు, 600 వ్యాసాలు, 200 కవితలు వెలుబడ్డాయి. విశిష్టమైన ”ఆటా” పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందారు. వీరు స్పృశించని సామాజిక అంశం లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ప్రాంతీయ స్పృహతో రాసిన వీరి కథల్లో తెలంగాణ ప్రాంత స్త్రీల జీవితాల్లోని వివిధ కోణాలు దర్శింపచేసారు.
భారతీయ సమాజంలో స్త్రీని ఆదిశక్తిగా,పరాశక్తిగా అభివర్ణిస్తూనే, ఇంటికి దీపం ఇల్లాలు అని కీర్తిస్తూనే వంటింటికి పరిమితం చేసారు. మన సమాజంలో ఏర్పర్చుకున్న కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు కూడ స్త్రీ అణిచివేతకు కారణమయ్యాయి. రాజారామ్‌మోహన్‌రాయ్‌, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగు సంఘసంస్కర్తలు స్త్రీల జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేసారు. సమాజంలో మాతృస్వామ్యం ఏనాడు ఉండేదోకాని చిరకాలంగా ఇదిపురుషనిర్మిత సమాజమే. ప్రాచీన కాలం నుండి స్త్రీని రెండవ శ్రేణి వ్యక్తిగానే సమాజం గుర్తించింది. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇందుకు దోహదం చేశాయి. స్త్రీ స్పందనను, స్త్రీ శక్తిని గుర్తించడానికి నిరాకరించాయి. ఇందుకోసం ఆమెను అపరంజి బొమ్మగా చిత్రించి, ఆరాధ్యనీయురాలిగా స్తుతించాయి. క్రమంగా స్త్రీని పురుషుల చేతిలో మరబొమ్మగా మార్చాయి. ఇందుకు దోహదపడే విధంగా పతివ్రతా ధర్మాలు, దాంపత్య సర్దుబాట్లు, వ్రతాలు, పూజలు, ఆదర్శాలు మొదలగు పేర్లు చెప్పి ఆమెను ఒక చట్రంలో బంధించాయి. క్రమంగా స్త్రీ జాతంతా బలహీనమైనదని ముద్రను వేసాయి.
ఈ పరిస్థితి స్త్రీ విద్యావంతురాలు కావడం వల్ల తారుమారు అయింది. స్త్రీ చదువు ఆమెలోని స్వతంత్ర భావాలు వెలుగు చూడడానికి దోహదపడింది. తద్వారా పితృస్వామిక భావజాలం తమను ఎంతగా అణిచివేతకు గురిచేసిందో స్త్రీజాతి గుర్తించ గలిగింది. శారీరక కారణాల వల్ల స్త్రీని కొన్ని రంగాలకే పరిమితం చేయడం క్రమంగా వారిని అణిచివేతకు, అవమానాలకు గురిచేసినపరిస్థితులను స్వయంగా స్త్రీయే ఆర్ధం చేసుకునే స్థాయికి ఎదిగింది. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనేకాంక్ష వారిలో బలంగా వ్యక్తమయింది. అదే స్త్రీవాదాన్ని ఉద్యమస్థాయికి తీసుకువచ్చింది.
స్త్రీవాద దృక్పథంతో కాలువ మల్లయ్యగారి కథల్ని పరిశీలించినట్లయితే తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ నుండి నేటి వరకు గల స్త్రీల జీవితాల్లోని సమస్యల్ని కథా వస్తువులుగా స్వీకరించారు. ఇవి తెలంగాణాలోని మూడు తరాల స్త్రీల జీవితాల్ని ఆకళింపు చేసుకోవడానికి ఉపకరిస్తాయి. భూస్వామ్యవ్యవస్థలో దొరలది తిరుగులేని అధికారం. అయితే దొరల భార్యలైన దొర్సానులది మాత్రం పీడితబ్రతుకే. భర్తలు ఏం చేసినా ప్రశ్నించే హక్కు. స్వాతంత్రంలేక అణిగిమణిగి బతకాల్సి వచ్చింది. ఈ దొర్సానుల బతుకు వెతల్ని కాలువ మల్లయ్యగారు తన కథల్లో చిత్రిస్తూ వచ్చారు. సమస్యలన్నవి అట్టడుగు వర్గాల వారికి మాత్రమే కాదు. అగ్రవర్ణపు స్త్రీలకు కూడా ఉన్నాయని తన కథల్లో నిరూపించారు.
భూస్వామ్య-జమీందారీ వ్యవస్థకు ప్రతినిధులైన దొరల ఇండ్లలో స్త్రీల జీవితాలు పంజరంలోని చిలుకల్లా గడిచిన వైనాన్ని చిత్రించిన కథ ‘పంజరం’.
ఈ కథలో ఆర్ధికంగా చితికిపోయిన దొరల కుటుంబంలోని ఇరవైయేళ్ళ మంజులాదేవని గొప్పస్థితిమంతుడైన యాభైయేళ్ళ పైబడిన మాధవరావు దొర రెండవ భార్యగా తెచ్చుకుంటాడు. దొరగడిలో అడుగు పెట్టేనాటికి తనంత వయస్సున్న కొడుక్కి, పదిహేనేళ్ళ కూతూరికి తల్లిగా మారాల్సి వస్తుంది మంజులాదేవి. రెండేళ్ళకే విధవగా మారి తన జీవితాన్ని ఆ కుటుంబానికే ధారబోయాల్సి వస్తుంది. దొర కొడుకు అధికారం చేలాయిస్తూ మంజులాదేవికి స్వంత వ్యక్తిత్వమంటూ లేకుండా చేస్తాడు. ఆ తర్వాత తరంలోంచి వచ్చిన మనవరాలు చదువుకుంటూ చైతన్య ఉద్యమాల్లో పాల్గొంటుంది. అగ్రవర్ణ స్త్రీల బతుకులు స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కోల్పోయిన పంజరపు బతుకులని, పురుషాధిక్య భావజాలం వారిని పంజరపు బతుకులకు అంకితం చేసిందని మంజులాదేవికి మనవరాలు తెలియజెప్తుంది.
ఈ విధంగా భూస్వామ్య వ్యవస్థలో స్త్రీ స్థానం గత యాభై ఏళ్ళు నుండి ఎట్లా మారుతూ వస్తున్నదో రచయిత ఈ కథ ద్వారా వ్యక్తపరిచారు.
తెలంగాణ గ్రామాల్లో నక్సలైట్‌ విప్లవోద్యమాల ప్రభావం అధికంగా ఉన్నకాలంలో దొరలు తన నివాసాన్ని పట్టణాల్లోకి మార్చారు. పట్టణాల్లో స్థిరపడ్డాక భూస్వామ్య  కుటుంబ స్త్రీల జీవితాలు మరింత దిగజారిన పరిస్థితుల్ని తెలియజేసే కథ ‘పాపం దొర్సాని”.
గడపదాటి బయటకు రావడమే దుస్సాహసమని భావించే అగ్రవర్ణ, భూస్వామ్య వర్గాలలో స్త్రీవిద్య మనోధైర్యాన్ని, స్వయం నిర్ణయాన్ని, ఆలోచనాశక్తిని ఇచ్చినట్లు చేసిందని తెలిపినకథ చిందొర్సాని.
రచయిత గత మూడు తరాలుగా స్త్రీల జీవితంలో ఆర్ధిక స్వేచ్ఛలేకపోవడాన్ని చిత్రించిన కథ ”పరాధీన”. నేత కార్మికుని ఇంట్లో పుట్టిన మల్లవ్వకు యవ్వనంలోకి అడుగు పెట్టేనాటికి పట్టుపీతాంబరం కావాలన్న కోరిక కల్గింది. తండ్రిని అడిగితే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నామని పెళ్ళినాటికి చూస్తాంలే అని దాటవేస్తాడు. పెళ్ళయిన తర్వాత భర్తను అడిగితే వాయిదాలు వేసుకుంటూ వస్తాడే తప్ప ఆమె కోరిక నెరవేర్చడు. మరికొన్నాళ్ళు గడిచాక ఉద్యోగం చేసున్న కొడుకు పట్టుచీర తెస్తాడని భావిస్తే మాములు చీర తెస్తాడు. మూడు తరాలలో తన కోరిక తీరనందుకు తనలో తాను కుమిలిపోతుంది. ఒకరోజు భర్త మంచం పక్కన నేలపై చాపవేసుకొని పడుకున్న మల్లవ్వ శాశ్వత నిద్రలోకి జారిపోతుంది.
ఈ కథలో తండ్రి, భర్త, కొడుకు మల్లవ్వ కోరిక తీర్చలేకపోయారు. పట్టుచీర కావాలన్న చిన్నకోరిక తీరని ఆమె బతికినన్ని నాళ్ళు పరాధీన జీవితాన్ని గడిపింది.
స్వేచ్ఛలేని జీవితం నుండి విముక్తి కోరుకుంటున్న స్త్రీల జీవితాల్ని చిత్రించిన కథ ”గలుమ” ఇందులో మల్లీశ్వరి చదువుకున్న స్త్రీ పై చదువులకు వెళ్తానంటే తండ్రి అంగీకరించడు. పెళ్ళయిన తర్వాత భర్తనడిగితే అతనూ తిరస్కరిస్తాడు. ఆడవాళ్ళుకు చదువు అవసరం లేదని, చదివి రాజ్యాలు ఏలేదిలేదని అతని అభిప్రాయం. స్త్రీ వంటపని, ఇంటిపని కాక బండెడు చాకిరీ చేసినా ఆ పనులకు ఏ మాత్రము విలువలేదనడం మల్లీశ్వరిని కలచివేస్తుంది. తనకు అందని ఉన్నత చదువులు కూతురికి అందిస్తుంది. కూతురు బాగా చదువుకొని స్త్రీవాద ఉద్యమాల్లో పాల్గొంటూ ఆడవాళ్ళ జీవితాలు గలుమల వద్ద ఎదురుచూడడం కాకూడదని, స్వంత వ్యక్తిత్వం కల్గి ఉండాలని తల్లికి చెప్తుంది. అంతేకాకుండా ”అమ్మా పైటల్ని తగలెయ్యడమే కాదు, గలుమలను తగలెయ్యాలి” అంటుంది.
ఇందులో స్త్రీలు గడపదగ్గర కూర్చుండి బాల్యంలో తండ్రి కోసం, యవ్వనంలో భర్తకోసం, వృద్ధాప్యంలో కొడుకుల కోసం ఎదురు చూడడమే జీవితంగా గడిపిన వీరు క్రమక్రమంగా స్త్రీవాద ఉద్యమస్ఫూర్తి పొందడం కన్పిస్తుంది.
స్త్రీలలో అందమంటే పైపై మెరుగులు కావని, కాల్పనిక భ్రమలు కావని, శ్రమైక జీవనంలోనే అసలు సౌందర్యం ఉందని, పని సంస్క ృతే స్త్రీలకు సహజ అందాన్ని తెచ్చిపెడ్తుందని తెలియచెప్పిన కథ ”శ్రమైక జీవన సౌందర్యం”.
సమాజంలో కుటుంబ పరిస్థితులు, ఆర్ధిక పరిస్థితులు ఇంకా అనేకపరిస్థితులు అనుకూలించని అభాగినులైన స్త్రీలు వేశ్యలుగా మారుతున్న పరిస్థితులను విశ్లేషిస్తూనే, రచయితలకు విధివంచితుల పట్ల ఉండాల్సిన స్పృహను సూచించిన కథ ‘శిల-శిల్పం’.
బావమరదళ్ళ పవిత్రప్రేమను చిత్రిస్తూనే, పేదరికం శాపంగా మరో బతుకు దెవుడు కోసం వలస వెళ్ళిన ఆ బావ రాక కోసం పరితపించే యువతి జీవితంలో ఎదురైన దురదృష్టాన్ని తెలియజేసే కథ ”నిరీక్షణ”.
నేటి సమాజంలో స్త్రీలు స్వంత వ్యక్తిత్వం, సమానత్వం, ఆర్ధిక స్వావలంబన కోరుతున్న వైనాన్ని చిత్రించిన కథ ‘ఉద్ధరింపు’.
తెలంగాణ సామాజిక జీవనంలో నిజాంపాలనలో భూస్వామ్య వ్యవస్థ కాలం నుండి నేటి వరకు గల స్త్రీల జీవితాల్లోని వివిధ పార్శ్వాలను కాలువ మల్లయ్యగారు తన కథల్లో ప్రతి ఫలింపజేస్తూ వచ్చారు. ప్యూడల్‌ భూస్వామ్య వ్యవస్థలో స్త్రీ నెప్పుడు మనిషిగా చూడలేదు. ఆమె మగాడి అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉపయోగపడింది. శ్రామిక, పీడిత వర్గాలలోని స్త్రీలు చదువు వల్ల ప్రభావితులైన అనాదిగా ఉన్న పరాధీన భావననుండి విముక్తి పొంది స్వావలంబన దిశగా అడుగులేస్తున్నట్లు కాలువ మల్లయ్యగారు సామాజిక పరిణామాల్ని చిత్రించారు. అంతేకాకుండా ఆధునిక కాలంలో స్త్రీ కోరుకుంటున్న స్వేచ్ఛ, మగవాళ్ళతో సమానంగా గుర్తింపబడాలనే ఆకాంక్షను ఆయా కథల్లో విశ్లేషించారు. మహిళా చైతన్యానికి దోహదపడే విధంగా కథలు రాసిన కాలువ మల్లయ్య గారు స్త్రీ జాతి పట్ల తనకున్న గౌరవాన్ని నిరూపించుకోగలిగారు.
బుట్టి సునీత, పరిశోధన విద్యార్ధిని, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌.
ఆధార గ్రంధాలు
1. కాలువ మల్లయ్య కథలు – తెలంగాణా జన జీవితం – ప్రొఫెసర్‌ బన్న     అయిలయ్య
2. తొమ్మిది పదుల తెలంగాణ కథ – డా|| కాలువ మల్లయ్య
3. యాభై ఏళ్ళ తెలుగు కథ తీరుతెన్నులు – బి.ఎస్‌.రాములు

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో