ప్రపంచీకరణలో – స్త్రీ – అస్తిత్వం – డా. వి. శాంతిలక్ష్మి

మహిళ అన్న పదంలోనే చాలా హూందాతనం దాగివున్న భావన కలుగుతుంది. ‘మహిళలూ… మహరాణులూ…’ అంటూ ఒక సంగీతకారుడు పాటకు పదాలను ూర్చినా, ‘ఆడదే ఆధారం’ అంటూ స్త్రీ లేనిదే జీవితానికి అర్థమే లేదంటూ ఓ చిత్ర నిర్మాత చిత్రాన్ని నిర్మించినా, నేను అలసిపోయానంటూ ‘అమ్మ రాజీనామా’ చేయాలని ప్రయత్నించినా, స్త్రీ జాతి మొత్తం స్త్రీ చైతన్యాన్ని కోరుతూ అనేక ఉద్యమాలు, ఉపన్యాసాలూ చేసినా నేటి ప్రపంచీకరణ శకంలో ూడా మహిళ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతను తలపించే విధంగా సర్వ స్వాతంత్య్రాలకై పోరాటం చేస్తూనే ఉంది. స్వేచ్ఛలేని మరబొమ్మలా మిగులుతూనే ఉంది, కథ సాగుతూనే ఉంది.
ఒక ప్రక్క స్త్రీని మాతృ మూర్తిగా, ఇంటికి దీపంగా, త్యాగశీలిగా పరిగణిస్తూనే మరొకప్రక్క బానిసగా, వ్యక్తిత్వం, స్వేచ్ఛ లేనిదానిగా, పరాధీనగా చూస్తూనే ఉన్నారు. మనువు నుండి మొదలుకుని నేటి ప్రపంచీకరణ మానవుడి వరకు స్త్రీ స్థానం మగాడి తరువాతే అంటున్నారే తప్ప ఇరువురి సమాన ప్రతిపత్తిని గురించి ఆలోచించడం కానీ, ఆచరించడం కానీ కనిపించదు. స్త్రీలు విద్యా ఉద్యోగాలలో చాలా ముందడుగు వేస్తున్నారు. వారి స్థాయిని పెంచుకుంటున్నారు. వారికంటూ ఒక గుర్తింపును పొందగలు గుతున్నారు. మగాడితో ఏమాత్రం తీసిపోనంత సంపాదనా పరులుగా ూడా నిలుస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగాలలో తాజాగా జరిగిన పరిశోధనలు ూడా స్త్రీలు మగవాళ్ళ కన్నా బాగా తమ ఉద్యోగనిర్వహణలో రాణిస్తున్నారని ప్రకటిస్తున్నాయి. కానీ ఈ మార్పు, ఈ విజయం నిజంగా స్త్రీలు ఆనందంగా అనుభవించగలుగుతున్నారా, ఇంత అభివృద్ది కనిపిస్తున్నా, ఇంత ముందడుగు వేసినా మహిళ ఎందుకు మగాడి తరువాతే అవుతోందన్న విషయాలను ప్రపంచీకరణ కథా సాహిత్యం తెలిపే ప్రయత్నం చేసింది. ఈ కథల ఆధారంగా ప్రపంచీకరణ మహిళలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.
ప్రపంచీకరణ మన జీవితంలో భాగమైపోయిన తర్వాత, ఆర్థిక పరంగా, సాంస్కృతిక పరంగా స్త్రీ జీవితం చిన్నాభిన్నమై పోవడాన్ని ప్రపంచీకరణ కథకులు చాలా వాస్తవికంగా చిత్రించారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంభవించే మార్పులన్నిటి పట్లా స్త్రీలు ఎంత అప్రమత్తంగా ఉండాలో, అభివృద్ధి పేరిట జరిగే ప్రతి పరిణామం   స్త్రీలను మరింతగా ఎలా మూలకు నెట్టేస్తోందో, స్త్రీ ప్రాముఖ్యాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలా కించపరుస్తోందో ఈ కథలు చెప్తున్నాయి. కుటుంబంలోని వివక్ష, సమాజంలోని అసమానతల చిత్రణ పరిమితం కాక, ప్రాపంచిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ూడా ప్రయత్నిస్తున్నాయి.
1. పురుషాధిక్య ప్రపంచీకరణలో – స్త్రీ- అస్తిత్వం:
స్త్రీలకు అనాదిగా ఎదురవుతున్న సమస్యలు తమ అస్తిత్వానికి విఘాతాలని స్త్రీలు గుర్తించగలిగినా, పోరాట పటిమను ప్రదర్శించినా పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించలేదనే చెప్పవచ్చు. నెమ్మదిగా మాట్లాడటం, గట్టిగా నవ్వకపోవడం, ఒదిగి ఒదిగి నడవడం, పదిమందిలో తన అభిప్రాయాలు ప్రకటించకపోవడం, మగవాణ్ణి చూడగానే సిగ్గుపడటం, తప్పుకుపోవడం, తన అలంకరణపై, అలవాట్లపై సకల హక్కులు తన జీవితంలోని పురుషుడికి ధారాదత్తం చేయడం, సమాజంలో తన ఉనికి తన వ్యక్తిత్వం మీద కాక తనపై అధికారం ఉన్న పురుషుడితో ముడిపడి ఉండడం ఇవన్నీ ూడా స్త్ర్రీని స్త్రీగా గుర్తించలేదనడానికి నిదర్శనాలుగా చూపవచ్చు.
స్త్రీ తన కుటుంబం ముందు, సమాజం ముందు ఆత్మ గౌరవంతో నడుచుకోగల మనస్థితీ, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందన్న సంగతి తెలియచెప్పే ప్రయత్నం కనిపిస్తున్నా పూర్తిగా చేరుకోలేక పోతోంది. నీ జీవితం నాది అంటున్న పురుషాధిక్యం ముందు ప్రపంచీకరణ సైతం స్త్రీకి న్యాయం చేయలేకపోతోంది.
2. ప్రపంచీకరణ కథల్లో దర్శనమిస్తున్న స్త్రీ:
స్త్రీ జీవితంలో శీలం, వివాహం, మాతృత్వం అతి ముఖ్యమైన అంశాలు. భార్యా భర్తల సంబంధాల్లో అసమానత్వం, యాంత్రికత, హింస, విశ్వాసరాహిత్యం, పెత్తనం, అధికారం, అణచివేత మొదలైనవి అనేక కథలకు ప్రధాన వస్తువుగా కనిపిస్తుంది. వివాహం నుండి బయటపడ్డానికీ, వివాహం కంటే అతీతంగా తమకొక అస్తిత్వం ఉందని గుర్తించడానికీ స్త్రీలు ఈ నాటికీ వెనకాడుతూనే ఉన్నారు. ధైర్యం చేసి స్త్రీ తన భర్తకు విడాకులివ్వడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం జరిగినా దాన్ని లోకం హర్షించదు. కంప్యూటర్‌ యుగమైనా, ప్రపంచీకరణ శకమైనా ఇది అనివార్యంగా కొనసాగుతూనే ఉంది. ప్రపంచీకరణ కొత్తగా స్త్రీలకు చేసింది అంటూ ఏమీ లేదు. నేటి స్త్రీలు చదివి మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ తన మానసిక సంఘర్షణలో మాత్రం తేడా ఉండటం లేదు. మహిళల పట్ల, కుటుంబంలో సమాజంలో వారు నిర్వహించవలసిన పాత్ర పట్ల మన ఆలోచనా విధానంలో తరతరాలుగా ఉన్న ధోరణి మారాలి. పిల్లల్ని కని, పెంచే బాధ్యత మహిళలదే అయినా పిల్లల్ని కనాలా, వద్దా, కనాలనుకుంటే ఎపుడు కనాలి, ఎంతమందిని కనాలి అనే విషయాన్ని నిర్ణయించే హక్కు మా ఉంది అంటున్న పురుషుడి ధోరణిలో మార్పు రానంత వరూ ఈ సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది.
అమ్మ అనే పాత్రకు పురుషుడి జీవితంలో చాలా గొప్ప స్థానం ఉంది. కానీ ఆ అమ్మకు ఏ హక్కులూ లేవు, అవసరం లేదు ూడా. స్త్రీ తన జీవితంలో అన్ని పాత్రలనూ అంటే ూతురిగా, చెల్లిగా, భార్యగా, తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోతే ఆమె జీవితం సఫలమైనట్టే. స్త్రీ జీవితానికి వివాహమే పరమార్థం, మాతృత్వమే పరమ పదం. లైంగిక జీవితం అన్న స్పృహ స్త్రీకి అవసరం లేదు. అది స్త్రీలు చర్చించాల్సిన, ఆలోచించాల్సిన విషయం కాదు. స్త్రీ కాస్త ముందడుగు వేసినా బరితెగించిన ఆడదిగా సత్కరింపబడుతుంది.
డబ్బు సంపాదనే ధ్యేయంగా పురాతన వస్తువుల్ని ఎన్నెన్నో సేకరించి, ఇంటి నిండా అలంకరించి తన గొప్పతనానికి తానే గర్వపడుతున్న మనసులేని వ్యక్తి కథ ”శిథిల శిల్పాలు”. డబ్బు వ్యామోహంలో, మత్తులో కన్నతల్లిని ూడా భారంగా భావించి అనాథ శరణాలయానికి పంపిన కసాయి కొడుకు కథ ఇది. ప్రాణం లేని వస్తువులకు ఉన్న విలువ కన్న తల్లికి లేకపోవడం ఈ కథలో చూడవచ్చు.మనిషిలో కరుడుగట్టిన స్వార్థాన్ని హృద్యంగా చూపి మనసును స్పందింపచేసే మరో కథ సలీవ్‌ు రూపాయి చెట్టు కథాసంపుటిలోని చావు కథ.
నరేందర్‌ నాతి చరామి కథా సంపుటిలోని కథలన్నింటిలో సమాజంలో స్త్రీ పట్ల కనిపిస్తున్న అలసత్వం, స్త్రీల మానసిక క్షోభ, ప్రపంచీకరణ ప్రభావంలో కొట్టుకు పోతూ తప్పని పరిస్థితిగా తమను తాము మార్చుకుంటున్న వైనం, భార్యా భర్తల బంధాల్లో ఏర్పడుతున్న విలువలు, వాటిని శాసిస్తున్న ఆర్థిక సంబంధాలు ప్రధానంగా చర్చించబడ్డాయి.
3. ప్రపంచాన్ని కొనేద్దామన్నంత ఆశకు బలవుతున్న స్త్రీ:
డబ్బు అనంతంగా సంపాదించాలనుకోవడం, ప్రపంచంలో లభ్యమవుతున్న సర్వ సౌఖ్యాలు అనుభవించాలనుకోవడం ప్రపంచీకరణ తెచ్చిపెట్టిన నూతన దృష్టి. ఆర్థిక ఇబ్బందులు మనిషిని కుదురుగా ూర్చోనీయవు. పరిష్కారంగా డబ్బు సంపాదించాల నుకోవడం, అవసరాలను తీర్చుకోవాలనుకోవడం సమంజసమే అయితే అందుకు ఎన్నుకునే మార్గాలు సరైనవిగా ఉండాలి. లేకపోతే జరిగేవి అన్ని అనర్థాలుగా మిగిలిపోతాయి.
అయిదు లక్షల పారితోషకం కోసం ఆశపడి తన భార్య సువర్చలను బలవంతంగా వేరెవరికో టెస్ట్‌ ట్యూబ్‌ బేబీని కనివ్వడానికి ఒప్పిస్తాడు రాజేష్‌. బిడ్డ పెరిగే కొద్దీ తన సొంతం కాని బిడ్డ గురించి మమకారం పెంచుకోవడమా, తెంచుకోవడమా తెలియని అయోమయ పరిస్థితి, కొడుకు బంటీతో నీకు తమ్ముడో, చెల్లినో పుడుతుందిరా అని మనసారా చెప్పుకోలేని స్థితి, ఎత్తుగా పెరుగుతున్న కడుపుతో బయటికి వెళ్ళడానికి భయం ఇలా ఎన్నో సంఘర్షణలు ఆమెను చిత్రవ్యధకు గురిచేస్తాయి. ఏ భర్తకోసమైతే తాను ఈ త్యాగానికి అంగీకరించిందో ఆ భర్తనే తనను దగ్గరకు రానీకుండా దూర దూరం పెట్టడం చూసి ఏడవాలనిపించినా ఏడవలేని అసహాయస్థితి. తల్లి పేగులు ప్రయోగాల పేర దిగజార్చిన సైన్స్‌ ని దూషించినా, మాతృత్వం శపించినా, డబ్బు శాసించింది. సువర్చల బ్రతుకును మాత్రం ఛిద్రం చేసింది. స్కానింగుల్లో ఆడపిల్ల అని తేలినప్పుడల్లా అబార్షన్‌ పిల్స్‌ మింగించినవాడు డబ్బుకోసం చివరికి ఇంత అన్యాయానికి ఒడిగట్టాడన్న బాధతో ఆమె చివరికి బిడ్డను ప్రసవించి తన ప్రాణాలను పోగొట్టుకోవడం పరిహారం కథలో కనిపిస్తుంది. (నాతిచెరామి కథల సంపుటి, . వి. నరేందర్‌, ఈనాడు ఆదివారంలో ప్రచురితం)
రాజేష్‌ లాంటి మగాళ్లు ఈ సమాజంలో పెద్దమనుషుల్లా చలామణి అవుతూనే ఉన్నారు. ఆడదాని చెర పడుతూనే ఉన్నారు.
గృహిణుల్లోనే కాక ఉద్యోగాలు చేస్తూ, రాజకీయాల్లో రాణిస్తూ మంచి పదవి, ¬దా కలిగివున్న మహిళల్లో ూడా మగాడి నుండి ఎదురవుతున్న వత్తిడి హింసధ్వని (నాతిచెరామి కథల సంపుటి, ఆంధ్రభూమి ఆదివారంలో ప్రచురితం), అవిశ్వాసం (నాతిచెరామి కథల సంపుటి, ఆదివారం-ఆంధ్రప్రభలో ప్రచురితం) మొదలైన కథల్లో కనిపిస్తుంటే మహిళలు ముందడుగు వేసి రాకాసి భర్తల నుండి విడాకులు తీసుకోగలిగినా ఆ తరువాత వారు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన కథలు అలసిపోయాను ప్రభూ (నాతిచెరామి కథల సంపుటి, ఈనాడు ఆదివారంలో ప్రచురితం), నిన్నటిదాకా శిలనైనా మొదలైనవి.
అసలు ఆడపిల్ల బతు ఒక అగాథం. ఆడపిల్ల ఉనికిని సైతం భరించలేని సమాజంలో ఆడపిల్ల బతుకు ప్రశ్నార్థకం. దేవుడు విసిరిన రాళ్లు (నాతిచెరామి కథల సంపుటి, ఉదయం-వీక్లీలో ప్రచురితం), దొరుంచుకున్న దేవక్క (నాతిచెరామి కథల సంపుటి, వార్త-ఆదివారంలో ప్రచురితం), అద్దంలో అబద్దం (నాతిచెరామి కథల సంపుటి, ఉదయం-వీక్లీలో ప్రచురితం), వెంటాడే పిలుపు (నాతిచెరామి కథల సంపుటి, సుప్రభాతం-వీక్లీలో ప్రచురితం), గుండెనెందుకిచ్చావురా… దేవుడా (నాతిచెరామి కథల సంపుటి, పల్లకి-వీక్లీలో ప్రచురితం) మొదలైన కథల్లో ఛిధ్రమవుతున్న ఆడపిల్ల బతుకులు సజీవంగా కనిపిస్తున్నాయి.
ప్రేమ పేరుతో దేశంలో బలవుతున్న అమ్మాయిల సంఖ్యకు కొరత లేదు. ఇక విదేశాల్లో స్థిరపడిపోయిన కుటుంబాల్లో అక్కడే పుట్టి పెరిగిన ఆడపిల్లల జీవితాలు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతకు లోను కావడాన్ని ఎ బిసిడి (నాతిచెరామి కథల సంపుటి, ఈనాడు-ఆదివారంలో ప్రచురితం) కథలో చూడవచ్చు. ఎక్కడ పొరపాటు జరిగినా దాని ప్రభావానికి మహిళలే ఎక్కువగా బలి కావడమన్నది ఆదికాలం నుండి నేటి ప్రపంచీకరణ కాలం వరూ సంభవిస్తూనే ఉంది. అరటి ఆకుపై ముల్లు పడినా, ముల్లుపై అరటి ఆకు పడినా అన్న సామెతను కాపాడుకుంటూనే వస్తూ ఉంది సమాజం. అమ్మాయిలు సున్నిత మనస్కులే కానీ మనసు లేని మరబొమ్మలు కాదు, ముందడుగు వేయండంటూ ప్రోత్సహించే సంస్కృతి సమాజంలో పెంపొందించ వలసిన అవసరం నేటి సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా కనిపిస్తుంది.
మగపిల్లాడు పుట్టాలని వరుసగా నాలుగురాడపిల్లలు కలిగినా ఎదురుచూసిన సుబ్బారావు అయిదోసారి కవలలు, అందునా ఆడపిల్లలు పుట్టడంతో విసిగి వేసారి భార్యను అసహ్యించుకుని, పిల్లలను ఛీదరించుకుని, ఆస్పత్రిలో పెళ్లాన్ని, కళ్ళు ూడా తెరవని ఆ పసిపిల్లలను అనాథలుగా వదిలి బారును తన గమ్యస్థానంగా ఎంచుకుని తాగి మత్తుగా ఇల్లు చేరి, తన ముగ్గురు ూతుళ్ళు శవాలుగా మారి పడివున్న దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడై శిలాప్రతిమలా నిలిచిపోతాడు.
నాన్నా…

మీ ముగ్గురి బిడ్డలకీ మృత్యువుతో పెళ్ళయింది. ఆశీర్వదించు నాన్నా. బొడ్డు పేగుతో పుట్టింటికొచ్చాం, కొబ్బరితాడుతో అత్తారింటిల్తుెన్నాం. నువ్విక నిశ్చింతగానే ఉండొచ్చు, నీకిప్పుడు ఇద్దరే బిడ్డలు. ఆస్పత్రిలో ఈ లోకం కుళ్ళు తెలీక ఆడుకుంటున్నారు. అమ్మ వస్తే అత్తారింటికి దారి వెదుక్కుంటూ వెళ్ళిపోయామని చెప్పు. పసుపు ముడుల్లో చిక్కి పైట చిరిగినా మౌనాన్ని కప్పుకున్న అక్క మాకు ఆదర్శం1
అక్క తాళిని ఉరిచేసుకుంది. మంటపంలో దాని అగ్ని సమాధిని చూసుకుంది. ముస్తాబులో బలిపశువును గుర్తు చేసుకుంది. కటిభాగంలో సిగరేట్‌తో కాల్చిన మచ్చలు, బూటు తన్నులకు దాని నరాలు తెగిపోయాయి. మగాడిది అనువంశిక తీర్పు నాన్నా2
మీరు, అమ్మా కొడుకు కోసం కలవరించారు. అనాదిగా తల్లిదండ్రులు కొడుకుల్నే ఎందుకు ప్రేమిస్తారు. కాళ్ళ మధ్య జారిపడ్డవాడు, కాలెత్తి తన్నడానికి సిద్ధపడినా, కొడుకునే ప్రేమిస్తారెందుకు3
ఆడపిల్లలు పుడితేనే పాపం అనుకునే కసాయితనం నేటికీ ప్రబలివుందన్న సత్యాన్ని ఈ కథ ఆవిష్కరించింది. కన్నవారింటా కష్టాలే, మెట్టినింటా కష్టాలే తప్ప స్త్రీకి కొత్తదనం ఏమీ లేదు. కసాయి తండ్రి నుండి ముగ్గురు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుని దూరం కావలసిన పరిస్థితికి పరోక్షంగా నయినా ఈ సమాజం కారణం.
చదువుకున్నదీ, సంస్కారం కలదీ, ఎన్నో రాత్రుళ్ళు అతన్ని తృప్తిపరిచింది, అయినా అతడు సుఖాన్వేషణలో మరో ఆడదాన్ని వెతుక్కుంటూ పోయాడు4 – ఓ ఇల్లాలి మానసిక క్షోభ అద్దంలో అబద్దంగా చిత్రించబడింది.
పెళ్లి ఒక అవసరమేనా? చేసుకునే వాళ్ళకి శారీరకంగా, చేయించే వాళ్ళకి ఆర్థికంగా, అర్థేచ, మోక్షేచ, కామేచ అన్నారు గానీ మనసేచా అనలేదు. వీటికోసమే ‘నాతిచెరామి’ అనిపిస్తే అర్థమేముంది?5
పదహారేళ్ల లలిత మదిలో నాటుకున్న ఈ ప్రశ్నలకు దొరకని జవాబులను వెతుక్కుంటూ తన ప్రాణాలు సైతం వదలవలసిన పరిస్థితి ఆ పసివయసులో ఎందుకు వచ్చింది. ఇది సమాజం మొత్తం ఆలోచించవలసిన విషయం.
4. ప్రపంచీకరణ కథలలో  స్త్రీ – రాజకీయ జీవిత చిత్రణం:
రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లు స్త్రీల విజయమా లేక మగాడికి బానిసగా ఇంకా పూర్తిగా ూరుకు పోతూ, మగాడి విజయానికి పరిచిన పూల రహదారా అన్నది ప్రశ్నగానే మిగులుతోంది. రాజకీయంగా, ఆర్థికంగా స్త్రీలు ఎంత ముందడుగు వేసినా వారి జీవితాలింకా బానిసత్వంలోనే మగ్గుతున్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా స్త్రీలు ఎంత ముందడుగు వేసినా, ముందడుగు వేస్తున్నా స్వేచ్ఛగా స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కుకానీ, స్వంత ఖర్చులు పెట్టుకోగల స్వేచ్చకానీ ఆడదానికి లేదని ప్రపంచీకరణ శకం నాటి కథల్లోని స్త్రీ జీవన చిత్రణ నిరూపిస్తుంది.
రాజకీయాల్లో మహిళల రిజర్వేషన్ల పుణ్యమాని తన భర్త ఒత్తిడి మీద రాజకీయాల్లో ప్రవేశించి, మండలాధ్యక్షురాలిగా పదవి స్వీకరించిన శ్వేత ప్రజాభిమానం సంపాదించి మండలంలో, జిల్లాలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. సంసార జీవితానికి, రాజకీయ జీవితానికి వారధిలా నిలిచి ఎన్నో ఒడిదుడుకులను రాజకీయంగా, సంసార పక్షంగా ఎదుర్కొంటుంది. స్త్రీ ఎంత సమర్థవంతురాలు, తెలివిమంతురాలు అయినప్పటికీ భర్తకు మాత్రం తానొక బానిస మాత్రమే. మగాడి చేతిలో కీలుబొమ్మగా మారిన ఆడదానికి ప్రపంచీకరణే కాదు ఇందోే అద్భుత ప్రపంచం ఆవిర్భవించినా ఆమె ఇలా కాలుతూనే ఉంటుందనడానికి అవిశ్వాసం కథలోని శ్వేత పాత్ర నిదర్శనంగా నిలుస్తూ మహిళలను హెచ్చరిస్తున్నట్లుగా ూడా కనిపిస్తుంది. పదవిలో ఉన్నపుడే బాగా సంపాదించుకోవాలన్న తపనతో శ్వేత భర్త రామకృష్ణ శ్వేత నుండి అక్రమంగా డబ్బు సంపాదనకు బలవంతపెడతాడు. ఆమెకు బదులు అతనే లంచం తీసుకుంటూ, తాను లంచం తీసుకున్నాడు కాబట్టి ఆ పనులన్నీ శ్వేతను చేయవలసిందిగా అజ్ఞాపిస్తాడు. కాదంటే చేయి చేసుకోవడం, ఇలా రోజుకొక హింస.
ఇది మహిళలపై మగాడి రాజకీయం. పదవీ, పలుకుబడి, డబ్బుపై వ్యామోహాలు మనిషిని ఎంతగానో దిగజార్చటం ఒక ఎత్తయితే వాటికోసం మనసుకు కష్టమయినా ఇష్టం లేని పనిని చేయవలసిన అనివార్య స్థితి ఏవిధంగా నెలకొంటూందో, మహిళలు అడకత్తెరలో పోకచెక్కలా ఎలా విలవిలలాడుతున్నారో వివరిస్తున్నాయి ఈ కథలు.
ప్రజానాయకులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండూడదు. పంచాయత్‌ రాజ్‌ చట్టం 1994 ఆర్టికల్‌ 19 (3) ప్రకారం మూడో బిడ్దని కనగానే అదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలాధ్యక్షురాలిని పదవినించి సస్పెండ్‌ చేశారు. అసలే ఇక్కడ నాకు ఎమ్డీవో గాడికి పడిచావట్లేదు. మూడో బిడ్డ పుడితే నీ పదవి పోతుంది. అందు అబార్షన్‌ అంటున్నాను6 – అంటున్న రామకృష్ణ మాటలు ఆడపిల్ల పుట్టబోతోందన్న ఆనందంలో మునిగి ఉన్న శ్వేతకు పిడుగు పడ్డ భావనను కలుగచేస్తాయి.
తన భార్య మనసుకు గాయమవుతుందేమో అన్నది ప్రక్కన పెడితే అసలామెకు మనసే లేనట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చిన రామకృష్ణలాంటి స్వార్థ పూరిత భర్తలు ఎంతోమంది నేటి సమాజంలో ఉన్నారు. బయటికి పెద్దమనుషుల్లా చెలామణి అవుతూ, స్త్రీని ఎన్ని విధాలుగా దగా చేయవచ్చో, మరెంతగా నరకయాతనకు గురిచేయవచ్చో అన్నీ చేస్తూ తాము మాత్రం విలాసవంతంగా, హుందాగా కాలం గడుపుతున్నారు.
కడుపులో పిండాలతో రాజకీయమాడుకునే మనల్ని ఏ బిడ్డా క్షమించదేమో7
కడుపులో పిండాల్ని రాజకీయాలకోసం ూడా చంపుకో వలసిన దౌర్భాగ్యం   స్త్రీకి వాటిల్లిందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే!
ఒకవేళ కాదని మొండిగా నిలబడినా చివరికి ఎన్ని ప్రయోగాలయినా చేసి ఆడదాని తలవంచేలా చేయడమే మగాడి కర్తవ్యం. శ్వేత విషయంలో అలానే జరుగుతుంది. ఆమె తల్లితనమే గొప్పనుకుంటుంది, దాంతో ఆమె కడుపుపై బలంగా పిడికిలి తాకడం, కళ్ళు మూసుకుని ముడుచుకు పడుకున్న పసిగుడ్డు శాశ్వతంగా కళ్ళు మూయడం క్షణాల్లో జరిగిపోతుంది. ఈ దృశ్యం కనుల ముందు సజీవంగా ప్రత్యక్షమయ్యేలా ఈ కథలో చిత్రించబడింది.
రాజీనామా చేస్తానన్న శ్వేతతో నేను విడాకులిస్తానన్న భర్త ఆఖరి అస్త్రం ప్రయోగింపబడుతుంది. చివరికి శ్వేత మౌనం దాల్చక తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇది ఆడదాని అసహాయ స్థితి. భార్యలకు మాత్రమే అవసరమవుతున్న భర్త అండ దుస్థితి.
ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులనుండి స్త్రీలు బయటపడే మార్గాలు స్త్రీలే సృష్టించక తప్పదన్న సత్యాన్ని మనముందుంచుతోంది అవిశ్వాసం కథ.
5. ప్రపంచీకరణ స్త్రీ – ఉద్యోగం – సంసారం – స్త్రీ పురుష సంబంధాలు:
మగాడు ఆడదాన్ని ఏనాడూ సమాన దృష్టితో చూడడు. అలా చూస్తున్నాడూ అంటే దాని వెనక ఖచ్చితంగా తన స్వార్థం ఉండనే ఉంటుందన్న విషయం నిరూపిస్తున్న కథ హింసధ్వని (నాతిచరామి కథల సంపుటి)
ప్రభాకర్‌ తన భార్య రజనికి వంటింట్లో సహాయం చేస్తూ మా తరం వాళ్ళు వెనకటి మగాళ్లలా కాదు, స్త్రీలను తలుపుచాటుకి ఉంచట్లేదు. ఇంటి పనిలో, వంటపనిలో మేము చేస్తున్నంత హెల్ప్‌ ఏ కాలంలోనూ, ఏ మగాళ్లూ చేయలేదు. అందు మా తరం మగాళ్లే గొప్పంటాను8 అంటూ గొప్పలు పలుకుతున్న ప్రభాకర్‌ నిజస్వరూపం తన భార్య రజని తాను ఆరునెలల పాటు ఉద్యోగానికి సెలవు పెడుతున్నాననడంతో బయట పడుతుంది. ఆర్నెల్లు ఉద్యోగం మానేస్తావా, నెలకు ఆరువేల చొప్పున ముప్పైయారు వేలు నష్టం. నీమేయినా మతి పోయిందా, నువ్వు లీవ్‌ పెడితే చంపేస్తాను అంటాడు.
డిగ్రీ కాగానే ఉద్యోగం, ఉద్యోగం రాగానే పెళ్లి, పెళ్లితో పిల్లలు, రోజూ ఆఫీస్‌, రొటీన్‌ రొటీన్‌, ఎడతెగని శ్రమ. ఎల్‌ జీే చదువునుంచీ అలసట-అలసట. ఎందుకో నాలో సహజసిద్దమైన ఆడతనం ఆర్నెల్లయినా గృహిణిగా ఉండాలని కోరుకుంటోంది. అనుభూతులను కోల్పోతుంటే జీవితం నిస్సారమై ఏదో వెలితి ఏర్పడుతోంది. ముఖ్యంగా మా ఉద్యోగినుల్లో అంతరాంతరాల్లో పేరుకుంటున్న అసంతృప్తి ఇది. ఆ అనుభూతుల్ని తిరిగి పొందడం కోసమే ఆర్నెల్లయినా లీవ్‌ పెడదామనుకుంటున్నాను9 అన్న రజనీ మాటలకు ప్రభాకర్‌ అది చాలా చిన్న విషయమనీ, నువ్వు సెలవు పెట్టడానికి వీల్లేదనీ కోప్పడతాడు. పైగా ఇంతపని చేసి పెడుతున్నాం కనిపించట్లేదా అంటూ అప్పటిదాకా తరిగిపెడుతున్న ఉల్లిగడ్డల ప్లేటు ఎత్తి పడేస్తాడు.
మీ సహకారంలో స్వార్థముంది. సంపాదించే భార్యని కనుక టైవ్‌ు అడ్జెస్ట్‌ మెంటు కోసం, మేం తెచ్చే జీతం కోసం మీరు ముసుగు వేసుకుంటున్నారు తప్పితే ఆర్నెల్లు లీవ్‌ పెడుతున్నాననగానే మీ ఉల్లిగడ్డలు తరగడం ఆగిపోయి పావుగంటయింది. జీతం రాదని తెలిసాక మీ నిజ రూపమేంటో తెలుస్తోంది అని ఆవేశంగా అన్న రజని చెంప చెళ్ళుమనిపిస్తాడు ప్రభాకర్‌.
ఇది రజని విషయంలోనే కాదు ఉద్యోగాలు చేస్తున్న సగం పైగా మహిళలు అనుభవిస్తున్న సమస్య. ఉద్యోగాలు చేస్తున్న మగువల జీతాలపై ూడా సర్వ హక్కులూ మగవాడివే అన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మగువలు ముందడుగు వేయడమంటే గడప దాటి ూడా మగావడిని ఏవిధంగా ఉద్ధరించవచ్చో తెలుసుకునే స్థాయికి చేరుకున్నారన్నమాట. మగాడి స్వార్థంలో చిక్కుకుని బయట పడలేక విలవిలా కొట్టుకుంటున్నారు.
ఆర్థిక పరిస్థితులు లేదా మగవాడి బలవంతం ఏదో ఒకటి ఈ ఉద్యోగం చేయిస్తాయి తప్ప కావాలని ఎవరూ ఇలాంటిది కోరుకోరు10  అంటున్న లేడీ బస్‌ కండక్టర్‌ మాటలద్వారా, మరియు డిగ్రీ డిస్కంటిన్యూ అయి ఏడేళ్లయింది. మావారి బలవంతం మీద డిగ్రీ చేశాను. అలాగే ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా చేయించారు. ఉద్యోగం చేయాలని పెద్దగా నాకు లేదు కానీ మా ఆయనేమో నీం ఇబ్బంది? నేనే ఆఫీస్‌ దగ్గిర దింపేసి మళ్లీ తీసుకొస్తా కదా, వంటింటి పని ూడా సగం షేర్‌ చేసుకుంటా ననడంతో తప్పదని ట్రై చేస్తున్నాను11 అంటున్న సంధ్య మాటల ద్వారా తప్పక చేయటం అన్నది కనిపిస్తుంది. స్త్రీకి స్వేచ్ఛ లేదంటున్న మాటల్లో సత్యాసత్యాలు అవగతమవుతాయి.
ఇటువంటి ఒక సంఘర్షణ ఇరుగు పొరుగు ఉద్యోగినుల విషయంలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఉద్యోగం ఉంది కానీ ఆర్థిక స్వాతంత్య్రం లేదు, ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి అంటున్న మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. పాకీ పని చేసుకునే పనిమనిషి నుండి మంచి ¬దా గల ఉద్యోగంలో ఉన్న మహిళ వరూ ఎవరికీ ఆర్థిక స్వాతంత్య్రం లేదు. ఆశ పడి కడుపు నిండా రుచికరమైన భోజనం తినడం కోసం తన జీతం ఖర్చు పెట్టి అలాగే ఒక చీర కొనుక్కున్న ఆఫీస్‌ పనిమనిషి భర్తకు లెక్కచెప్పడానికి భయపడి ఆ లోటు తీర్చటం కోసం సిగ్గు విడిచి ¬టల్‌ యజమాని పక్కకు చేరి, వాడిని తృప్తిపరిచి సర్దుబాటు చేసుకున్న హింసధ్వని కథలోని మరో పాత్ర ఈ విషయాన్ని దృఢపరుస్తుంది. మరి ఈ పాపం ఎవరిది. ఆ పనిమనిషికి అటువంటి ఆలోచన రావడానికి దారితీసిన పరిస్థితులకు బాధ్యత ఎవరు వహించాలి? ఇటువంటి మహిళలు ఈ కథల్లోనే కాదు నిజ జీవితంలో తారస పడుతూనే ఉంటారు. అందు ప్రపంచీకరణ ముసుగులో ఇంకొంచెం ముందడుగు వేస్తున్న మహిళ చివరికి ఎక్కడ ఆగుతుంది అన్న ప్రశ్నను మొలత్తిెస్తున్నారు కథకులు.
ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం గొప్ప మార్పు అయినప్పటికీ తద్వారా మహిళలు ఏం సాధిస్తున్నారు అన్నది ఆలోచించవలసిన విషయం.
మగాడు మారలేదమ్మా, ఆడదానికి ఉద్యోగావకాశాలు పెరగటంతో మారినట్టు నటిస్తున్నాడు. మనం ఉద్యోగాలు చేయటం నే గొప్ప సామాజిక మార్పు వెనక ఒక నిశ్శబ్ద దోపిడి సాగుతోంది12
మగాడిలో ఇపుడు కనిపిస్తున్న సహానుభూతి తెచ్చిపెట్టుకున్నదే కానీ, శాశ్వతం కాదు. గృహిణికుండే సర్దుబాటు ఉద్యోగిని కోల్పోతుంది. జీవితానికి తప్ప వ్యక్తిత్వానికి విలువివ్వకపోవడం పట్ల కల్లోల సంద్రమైపోతుంది. ఆ సంఘర్షణలో నుంచే మగాడే దిక్కనుకునే కన్నా విడాకులే ఉత్తమం అనుకునే ధోరణి మనదేశంలో ూడా చొచ్చుకోస్తోంది. ఒకప్పుడు భర్త ూరంగా ప్రవర్తిస్తేనే విడాకులకు ప్రధాన కారణంగా కన్పించేది, కానీ ఇప్పుడు భర్తనించి భార్యకు, భార్యనించి భర్తకు ఆశించిన మద్దతు లభించకపోతేనే విడాకులు. అన్ని సంబంధాలూ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న గొ0గళి పురుగు దశ ఇది13 అంతా ఆర్థిక మయమే, సమాజమే భ్రష్టు పట్టబోతున్న దశ ప్రపంచీకరణ.
6. ఉపసంహారం:
ప్రపంచీకరణ ఆరంభమైనప్పటి నుండీ సమాజంలో వచ్చిన మార్పులు అనేకం. స్త్రీలలో ఆత్మ స్థైర్యం పెరిగింది. తమ కాళ్లపై తాము నిలబడ్దమే కాక ఆదర్శవంతంగా జీవిస్తున్నారు. అయితే ఆ ముందడుగులో స్త్రీ పూర్తిగా స్వతంత్రరాలుగా కనిపించడం లేదు. స్త్రీల స్వంత నిర్ణయాలను గౌరవించే మనస్తితికి పురుషుడు ఇంకా చేరలేదన్న నిజాన్ని పరిశీలించిన కథలు వెల్లడిస్తున్నాయి.
7. పాదసూచికలు:

1..వి. నరేందర్‌-దేవుడు విసిరిన రాళ్లు, నాతి చెరామి కథా సంపుటి పుట-125, 2..వి.నరేందర్‌-దేవుడు విసిరిన రాళ్లు-నాతి చెరామి కథా సంపుటి పుట-125, 3..వి.నరేందర్‌-దేవుడు విసిరిన రాళ్లు-నాతి చెరామి కథా సంపుటి పుట-125, 4..వి. నరేందర్‌-అద్దంలో అబద్దం, నాతి చెరామి కథా సంపుటి పుట-96, 5..వి. నరేందర్‌-గుండెనెందుకిచ్చావురా:దేవుడా, నాతి చెరామి కథా సంపుటి పుట-108, 6..వి. నరేందర్‌ – అవిశ్వాసం, నాతి చెరామి కథా సంపుటి – పుట-79, 7..వి. నరేందర్‌ – అవిశ్వాసం, నాతి చెరామి కథా సంపుటి – పుట-81, 8..వి. నరేందర్‌ – హింసధ్వని, నాతి చెరామి కథా సంపుటి పుట-60, 9..వి. నరేందర్‌ – హింసధ్వని, నాతి చెరామి కథా సంపుటి పుట-60, 10. .వి. నరేందర్‌ – హింసధ్వని, నాతి చెరామి కథా సంపుటి పుట పుట-65, 11. .వి. నరేందర్‌ – హింసధ్వని, నాతి చెరామి కథా సంపుటి పుట-68, 12. .వి. నరేందర్‌ – హింసధ్వని, నాతి చెరామి కథా సంపుటి పుట-68, 13. .వి. నరేందర్‌  – హింసధ్వని, నాతి చెరామి కథా సంపుటి, పుట-70

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.