పిల్లల భూమిక

”ఇండియాస్‌ డాటర్‌”

సోదరభావం, శాంతి, ప్రేమ, అహింసలకి ప్రతికగా నిలిచిన ఈ భారతదేశం ఇప్పుడు సోదరభావం, శాంతి, ప్రేమ, స్త్రీలపట్ల గౌరవం వీటన్నిటిలో భారతదేశం అట్టడుగులో ఉంది స్త్రీలు భారతదేశంలో చెప్పలేనన్ని బాధలుపడుతూ వచ్చారు, పడుతున్నారు కూడా మన సంస్కృతే స్త్రీలను ఎన్నో రకాల బాధలు పడేలాగా చేస్తుంది. స్త్రీలు ఎన్నో దుర్మార్గాలకు, దారుణకృత్యాలకు గురవుతున్నారు.
ఆడవాళ్ళ, పురుషులు అందరూ సమానమే అని అంటున్నారు కానీ ఆ సమానత్వం కనిపించట్లేదు. పురుషులు పొద్దున  లేస్తే గ్రౌండుల్లో ఉంటారు కానీ ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఏమన్నా కొనాలన్నా పంపరు అమ్మాయిలు మినీ స్కర్టులు వేసుకుంటే ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్లు, 8వ వింతను చూసినట్లు, ఏదో తప్పు చేసినట్లు చూస్తారు. ఆడవాళ్ళు కూడా ఆ అమ్మాయిని అనరాని మాటలు అంటారు. చీరకట్టు కూడా కొంచం స్టైలిష్‌గా కట్టినా హీరోయిన్లా కట్టుకున్నావేంటి అని కామెంట్‌ చేస్తారు.  ఎక్కడైనా ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడితే ప్రపంచం చూసే తీరు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద అనర్థం జరిగిపోతుంది అన్నట్లు ఉంటుంది. అమ్మాయిలు జీన్స్‌లాంటి ఆ దుస్తులు వేసుకోకుండా (ఉండాలంటే) లంగా ఓణీలు, పంజాబీలు వేసుకొని తిరగాలంటే, అబ్బాయిలు కూడా పంచలు, షేర్వానీలు కట్టుకొని తిరగాలి అందరికీ సమన్వయ న్యాయం జరగాలంటే పురుషులు కూడా అలానే పంచలు, షేర్వానీలు వేసుకొని తిరగాలి. నాకు ఇప్పుడు ఏమని అనిపిస్తుందంటే భారతదేశంలో అమ్మాయి పుడితే అది తన దురదృష్టం అవుతుంది. ఇలాంటి దేశంలో పుట్టేకన్నా వేరే దేశాలలో పుట్టడం మంచిది. శాంతికి సౌధం భారతదేశం కాని ఇపుడు భారతదేశం అహింస, అకృత్యాలు, దుర్మార్గాలకు సౌధం. సమాజంలో మార్పురావాలంటే అడవాళ్ళ, దృష్టిలోను పురుషుల దృష్టిలోను మార్పురావాలి అమ్మాయిలు సంప్రదాయబద్ధంగా ఉంటేనే మార్పు చేకురుతుంది అంటే అక్కడ సమానత్వం లేనట్టు అయినా సంప్రదాయబద్దంగా నడుచుకుంటున్నా కానీ ఇలాంటి అకృత్యాలు తగ్గట్లే ఎన్ని వసంతాలు వచ్చి వెళ్ళిపోయినా భారతదేశంలో మార్పు అనేది చోటుచేసుకోదు అని నా మనస్సులో గట్టి అభిప్రాయం నాటుకుపోయింది. – బి.హెచ్‌.జాహ్నవి.

భారతదేశపు కూతురు

ఈనాటికి కూడా మన దేశం ఎంత నీచానికి దిగజారిందో తెలుస్తుంది ఇంత నీచమైన దేశంలో నేను పుట్టానా అని నాకు అనిపిస్తుంది ఒక స్త్రీకి గౌరవం లేని చోట పుట్టడం ఒక పుట్టుకేనా అని అనిపిస్తుంది. మన దేశం ఒక ఆడపిల్ల పుడితే ఎంత బాధపడుతుందో! ఒక ఆడపిల్ల పుడితే దానికి కట్నం ఇచ్చిపెళ్ళి చేయాలి, పెద్దైతే ఒక పండుగలా చేయాలి, సీమంతం చేయాలి అని అనుకుంటారే కాని ఒక ఆడపిల్ల పుడితే మన దేశాన్ని మార్చే ఒక ఆడపిల్ల అబ్బాయితో సమానంగా ఉండేది పుట్టింది అని అనుకోరు ప్రతి చిన్నదానికి ఒక పండగలా చేయాలి అని అనుకోవడంలో అర్థం లేదు. గర్భంలో ఉన్న పిండాన్ని చంపేస్తారు. ఒక స్త్రీ కడుపులో ఒక స్త్రీని చంపేస్తున్నాప్పుడు ఆ స్త్రీ పడుతున్న బాధ ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. అది తెలియకే అలా చంపేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళ అమ్మ నాన్నలని సుఖపెడదాము, ఏ బాధనైనా ఎదురుకొని ముందుకి సాగుదాము అబ్బాయితో సమానంగా ఉందాం అని భావనతో. జీవితంలో ముందుంటారుకాని కొంతమంది అమ్మాయిలు కావాలని అబ్బాయిలని రెచ్చగొడతారు. ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎంత కుమిలిపోతారో కొంతమంది అమ్మాయిలు తాగుడుకి, పొగత్రాగడానికి అలవాటుపడతారు. ఇది తప్పో కాదో తెలియటంలేదు.
కొన్ని ఇళ్ళల్లో అమ్మాయిలని ఎంత నీచానికి దిగజారుస్తారో! ఒక అమ్మాయిపుట్టగానే పనిలో పెట్టేస్తారు. బడిలో చదివించడానికి మాత్రం పెట్టరు ఎందుకు పుట్టావే, ఎందుకు పుట్టావే అంటూ కొంత చంపేస్తారు. అన్ని పనులు చేయిస్తూ పూర్తిగా చంపేస్తారు. ఇప్పుడు మనకి ఉగాది వచ్చేసింది. ఈ ఉగాదితోనైనా స్త్రీని ఒక స్త్రీలాగా చూస్తారేమో అని కోరుకుంటున్నాను స్త్రీ గర్భంలో ఆడపిల్ల

ఉంది అని ముందే తెలుసుకోవడం నేరం అని అంటున్నా లంచాలు ఇస్తూ ఎలాగైనా తెలుసుకుంటున్నారు. చంపేస్తున్నారు. మన ప్రభుత్వం ఎన్ని చట్టాలు పెట్టినా అవి పట్టించుకోకుండా లంచాలు ఇస్తు. ఆ చట్టాలని చట్టాలుగా ఉంచటంలేదు ఇన్ని ఘోరాలు భరిస్తూ వస్తున్నా ఒక స్త్రీకి నా ”జోహార్‌” నా ”జై జై లు”.  – ఆయేషా బేగం

”ఇండియాస్‌ డాటర్‌”

ఇదివరకటిి కాలంలో భారతదేశాన్ని చూసి అన్ని దేశాలవాళ్ళు గర్వపడేవాళ్ళు కాని ఈ కాలంలో భారతదేశాన్ని చూసి అన్ని దేశాల వాళ్ళు ఏంటిది భారతదేశం ఇలా ఉందా అని అనుకుంటున్నారు. దానికి గల కారణం స్త్రీలను చులకనగా చూడటం తక్కువ భావనతో చూడటం మొన్న ఢిల్లీలో నిర్భయ అనే అమ్మాయి రేప్‌ జరిగింది.
ఈ సంఘటన మన భారతదేశాన్నే కాదు, మొత్తం ప్రపంచాన్నే కదిలించింది. ఇదివరికటి కాలంలో లాగ ఇప్పు తల్లిదండ్రులు ఆడపిల్లలను బయటికి పంపాలంటే బయపడుతున్నారు. ఆడవారిని మనం బలం లేనివారు, బలం లేనివారు అని అంటున్నాం. కానీ ఒక్కసారి వారి బలం వారు తెలుసుకొని ముందుకు నడిస్తే మనం వారి కాలిగోటికి కూడా సరిపోము. వారి బలం ముందు మనబలం శూన్యం. ఆడవారికి ఓర్పు, సహనం వంటి బలాలకు హద్దు ఉండదు. ఒక్కసారి వారు వాటిని మర్చిపోతే, మనం వాళ్ల ముందు చాలం. వసంతకాలంలో చెట్లకి చిగురు వచ్చినట్లు. ఆడవారి జీవితంలో కూడారావాలి.   – టి. వరప్రసాద్‌

(అరవింద హైస్కూలు పిల్లలు, కుంచనపల్లి)

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.