ఎడిటర్ కి ఉత్తరాలు

జోలెపాలెం మంగమ్మ, మదనపల్లి

భూమిక మే సంచిక అందింది. ఎప్పటిలాగే ఎవరెవరు ఏమేమి రాశారని పత్రిక అందుకోగానే విహంగ వీక్షణం చేశాను.

కొమ్మూరి పద్మావతిగారి పేరు ఆకర్షించింది. ఎందుకంటే వారి అమ్మాయి ఉషారాణి భాటియా, మేమంతా ఢిల్లీలో చాలా సంవత్సరాలు ఒకే చోట నివశించాం. ‘పెద్దమ్మ’ కథను నాకు నేను అన్వయించుకున్నాను. పెద్దమ్మకు సాయాప్యం కనబడింది. మా చెల్లెలి పిల్లలు, తమ్ముని పిల్లలు వాళ్ళ అమ్మను ‘అమ్మ’ అని పిలుస్తారు. నన్ను అంటే పెద్దమ్మను ‘మమ్మీ’ అంటారు. ఇప్పుడు వారి పిల్లల పిల్లలు (మూడో తరం) కూడా మమ్మీ అనే పిలుస్తారు. ఆంగ్లం మీద వ్యామోహ౦ కాదు. అదే ఒక పేరు లాగ.. మా పిన్ని కూతురు ‘సుభద్ర’ (వారు తొమ్మండుగురు). వారింట్లో మూడు తరాల పిల్లలు ( అమెరికాలో ఉన్నా సరే) ఆమెను పెద్దమ్మ అనే పిలుస్తారు. కాబట్టి పెద్దమ్మ, మమ్మీ అనే పదాలు బంధుత్వాన్ని కాకుండా వ్యక్తిలోని ఆప్యాయతనే చూపుతున్నాయి.
ప్రతినెలా ముఖ్యమయిన ఒకటి, రెండు వ్యాసాలు, కథలో చదివేదానను. ఈ సారి భూమిక కొద్దిగా చిక్కిపోయినా అందులోని విషయాలు బలుపెక్కాయి. శ్రీ నుండి తధాస్తు వరకు ఏకబిగిన చదివించాయి అన్ని శీర్షికలూ. రచయితలసంఘం కార్యదర్శి అండమాన్‌ వెళ్ళి వచ్చానవాడు . నన్ను తప్పకుండా ఒకసారి వెళ్ళి రమ్మనేవాడు. నాకు అంత శ్రమ లేకుండా అక్కడ పొందవలసిన ఆనందాన్నంత మీ వ్యాసంలో అందించి నాకేమీ ఖర్చు లేకుండానే ఆ అనుభవాన్ని కలిగించి అండమాన్‌లో పర్యటించినంత ఆనందాన్ని కలిగించిన మిమ్ములను అభినందించకుండా ఉండలేను.  ఇంతవరకు పేపర్లలో సెజ్‌వలన పేదలపాట్లు గురించి చదివినా ఈ సంచికలో సెజ్‌లోని సాధక బాధకాలను సమగ్రంగా గ్రహించాను.  మహిళాభ్యుదయానికీ, మహిళల్లో జాగరూకత కల్పిస్తూ మీరు చేస్తున్న ఒంటరి పోరాటానికీ మరి మరీ ధన్యవాదాలర్పస్తూ

ముందుగా Heartiest Congrats. మే భూమికలో డా. జి. భారతి వ్యాసం నాకు నచ్చింది. హిందు (డైలీ)లో 2-3 వారాల క్రిందట వచ్చిన ఒక వ్యాసం చదివి దాచి ఉంచాను, 8-12 ఏళ్ల మధ్య వయస్సు ఆడపిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారనే విషయం మీద. దాని ఆధారంగా భూమికకి ఒక చిన్న వ్యాసం రాయాలని అనిపించింది. వేరే పనులలో పడి అది వెనక్కి పోయింది. మీరు చదివారా? పనికొస్తుందంటే రాసి పంపుతాను.  మా అమ్మకి ‘లంబాడీల వివాహ వ్యవస్థ’ వ్యాసం చాలా నచ్చిందట.
శాంతసుందరి, హైద్రాబాద్‌
డా. భారతిగారు చాలా బాగా రాశారండి. ఈ రోజుల్లో అమ్మాయిలు సన్నగా అవ్వడానికి ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో చక్కగా చెప్పారు.

విజయలక్ష్మి ,
డా. భారతిగారి ‘అందమంటే సన్నబడటమేనా’ అనే వ్యాసం చాలా బాగుంది.
రమాదేవి,


భారతి గారు రాసిన ఈ అద్భుత వ్యాసాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేర్చేదారి కనిపెట్టండి
రాజేంద్ర, ఇమెయిల్‌
భూమిక ఏప్రిల్‌ సంచికలోని కథ ‘రూపాయిచొక్కా’చదివాను అమొఘ౦గా, అత్యద్భుతంగా, మనసుని, మెదడునీ కదిలించిన కథ. విదేశాల్లో ఉన్న, ఇక్కడ పెద్ద పెద్ద మెట్రోల్లో బ్రతుకుతున్న ప్రజలు తమ ఇళ్ళనీ, ఊళ్ళనీ వదిలి ఉండలేక పోవడం ”రూపాయిలు” ”డాలర్ల” కోసం వలసలు వెళ్లిపోవడం.. అవన్నింటికి ఒక రపాంతరం ఈ కథ. దీన్నే ఒక ”ఆర్ట్‌” సినిమాగా తీస్తే…అని ఒక భావన.
ఎంత అందమైన కథ రాశారు శ్రీదేవిగారు. ”అందం” అంటే ఆ అర్ధంలో లేదు. ఇది భరించలేని నిజాన్ని ఇంకో కోణంలో చూపించిన భయంకరమైన అందం. (బెంగాలీ వాళ్ళు ఎంతో బావుంటే ”దారుణ్‌ ఆచ్చే” అంటారు. మనకి ”దారుణం అనేది వేరే అర్ధం ఇస్తుంది.
కథ చివర ”అది రూపాయి అందులో నేను ఇరుక్కుపో్యాను దాన్ని ఇవ్వలేను. అందులో ఉండలేను” అన్న మాటలు ”ఓ హేన్రీ” కథల్లో ముగింపుని గుర్తుకు తెస్తున్నాయి. హాట్సాఫ్‌టూ ఎస్‌. శ్రీదేవి. భూమిక గురించి ఎంత రాయాలన్నా తనివి తీరదు. కవితలు, కథలు, వ్యాసాలు అన్నీ. ముఖ్యంగా అంతర్జాతీయ, అంతర్రాష్ట్రీయ వివరాలు మాదాకా తేవడానికి మీ ప్రయాస మెచ్చుకోదగినది.భూమిక ఎడిటర్‌గారికి. నేను భూమిక పాఠకురాలిని. భూమికలో వచ్చే అంశాలన్నీ చాలా బాగుంటున్నాయి. మా యింట్లో అందరం భూమిక చదువుతాం.  గత కొంతకాల౦గాచందా కట్టలేదు. మీ బాధ చదివాక చాలా బాధ కలిగింది. జీవిత చందా పంపుతున్నాను.
బాలాదేవి, భువనేశ్వర్‌

Share
This entry was posted in ఎడిటర్ కి ఉత్తరాలు. Bookmark the permalink.

4 Responses to ఎడిటర్ కి ఉత్తరాలు

 1. P.S.L.CHAITANYA says:

  థన్క్స ఫొర యౌర లొవెల్య మెస్సగె థన్కు యౌ.మె.బెచౌసె అఫ యౌర మెస్సగె ఇ హద చొమ్ప్లెతెద మ్య ప్రొజెచ్త

  థన్క యౌ వెర్య ముచ

 2. Mallesh.E says:

  ఎడిటర్ గారికి ధన్యవాదములు
  మీరు మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మీయోక్క పత్రికలొ రాస్తున్నారు. మనం ఆందరం కలిసి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను అరికడదాం.మహిళలను సంఘటితం చేసి గ్రామ స్థాయి,మండల స్థాయి లల్లొ మహిళ హక్కుల పరిరక్ష కమిటిలు తయారు చెసి వివిధ(ప్రభుత్వ,ప్రభుత్వెతర) సంస్థల సహకారంతొ న్యాయం చెద్దాం.
  ఇట్లు
  మీ విశ్వాసపాత్రుడు
  ఇ.మల్లేష్.
  రూరల్ ఎన్విరొన్మెంట్,హెల్త్ & ఎడ్యుకేషన్ డెవెలప్ మేంట్ సోసయిటి.
  రిజిస్టర్ నం.748/2009. (ఎన్.జి.ఓ)

 3. suvarchala says:

  # suvarchalaon 23 Aug 2011 at 9:08 am
  నమస్సులు కొండవీటి సత్యవతి గారు..
  కొన్ని నెలలుగా భూమిక చదువుతున్నా. ఇది పత్రిక మాత్రమే కాదు.. ఓ ఉద్యమ0 అనిపిస్తోంది. నేను సైత0 ఎందుకు పాలుపంచుకోకూడదనిపించింది. మొన్నీ మధ్య ఫోను చేసి మెడికో శ్యాం గారు కూడా నా మనసులో ఉన్న మాటనే ప్రస్తావించారు. నా కథలు కొన్ని కౌముది,వాహిని (వెబ్ పత్రికలు), రచన, ఆ0ధ్రప్రదేశ్, ఆ0ధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు ఆదివార0,విపుల పత్రికల్లో వచ్చాయి. నా అనువాద కథలు విపులలో వచ్చాయి. నేను కొన్నాళ్లు ఈనాడులో పనిచేసిన అనుభవ0 కూడా వుంది.
  దయచేసి భూమిక పత్రికలో అనువాదకథలు రాసేందుకు అవకాశ0 కల్పించవల్సిందిగా కోరుతున్నాను. నేను ఇంగ్లిష్, హింది కథలు అనువాద0 చేయగలను.
  విత్ రిగార్డ్స్
  చింతలచెరువు సువర్చల
  23/8/2011.

 4. సెక్స్‌వర్కర్ల పత్రిక గురించి భూమికలో సోదరి పసుపులేటి గీతగారి కథనం చదివి స్పందిస్తున్నాను. మూడువందల ఏళ్ళ క్రితం బ్రిటిష్‌ సైనికుల లైంగిక అవసరాల్ని తీర్చడానికి ముంబయి శివార్లలో ఏర్పరచినట్లు చెబుతున్న ఈ కామాటిపుర ప్రాంతం (రెడ్ లైట్ ఏరియా) ఇప్పటికీ మహిళలపాలిట భూలోక నరకంగా అలాగే కొనసాగుతుండటం నిజంగా సిగ్గుచేటు. స్త్రీకి భారత సంస్కృతి అత్యంత విలువనిస్తుందని ఒకపక్క చెప్పుకుంటూనే లక్షలాది మంది మన చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు ఈ నిప్పులు కొలిమిలో మాడి మసైపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్నాం. ఈ ముంబై నగరం ఒక రాష్ట్ర రాజధాని, దేశానికి ఆర్థిక రాజధాని, రాష్ట్ర ప్రభుత్వం కొలువై ఉన్న చోటు. ఇప్పటికీ ఈ కామాటిపుర ప్రాంతమనేది కొనసాగుతుండటం నిర్వీర్యమైన మహిళా శిశు సంక్షేమ చట్టాలు, భద్రతా వ్యవస్థల ఘోర వైఫల్యానికి, పాతరేసిన విలువలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయో అందరికీ తెలిసిందే అయినా ఎందుకని అక్కడి బాలికలు, మహిళల్ని మనం రక్షించి బయటకు తీసుకురాలేకపోతున్నాం ? మన కళ్ళెదురుగా ఇంత దారుణంగా చట్టాలు విఫలం కావడం ఏ అభివృద్ధికి సాక్ష్యం? చిన్న చిన్న ఊళ్ళలో సైతం వ్యభిచారాన్ని ప్రోత్సహించే లాడ్జీలపై పోలీసులు దాడులు నిర్వహించి విటులను పట్టుకుంటారు. మరి భూమ్మీద అతిపెద్ద వ్యభిచార వాటిక అయిన కామాటిపుర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని ఏమీ చేయడంలేదు? పాలకులు అక్కడి రౌడీ శక్తులపై సైనిక చర్య చేపట్టి అయినా స్త్రీమూర్తులను కాపాడాలి. భారతదేశంలో కామాటిపుర అనే ప్రాంతం కొనసాగినంత కాలం మనమంతా ప్రతి క్షణం సిగ్గుతో కుంచించుకుపోయి తలదించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>