బహుముఖ ప్రజ్ఞాశాలి డా.భార్గవి రావ్

వారం రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడారు. అండమాన్‌యాత్రా విశేషాలు చదివి చాలా సంతోషపడ్డానని, నీ వచనం కవిత్వంలా వుంది. ‘దుప్పట్లో దూరిన సముద్రం సన్నగా గురకలు పెట్టినట్టు చిరు కెరటాల సవ్వడి’ ఈ వాక్యం చాలా బావుందోయ్‌.

ఈ సారి మన ట్రిప్‌ అండ మాన్‌కి వెయ్యి’ అంటూ ఎంతో అభి మానంగా  మాట్లాడతూండగానే ఆవిడకు విపరీతంగా దగ్గొచ్చింది. నాకు చాలా భయమేసి ఫోన్‌ కట్‌ చేసేసాను. మళ్ళీ చెయ్యాలంటే కూడా భయమన్పించింది. ఇబ్బంది పెడతానేమో! అనే బెరుకుతో ఇంక మాట్లాడలేదు. అవే డా. భార్గవీరావుగారి చివరి మాటలవుతాయని నేను కల్లో కూడా అనుకోలేదు.

శుక్రవారం మధ్యాహ్నం వారణాసి నాగలక్ష్మి ఫోన్‌చేసి భార్గవీరావుగారు మనకు దూరమైపోయారు అని చెప్పినపుడు షాక్‌ తగిలినట్టయింది. ఆ వెంటనే ఛాయదేవిగారు, శారదా శ్రీనివాసన్‌ గారు మాట్లాడారు. అందరి గొంతులోను అదే ఆవేదన.  అదే దు:ఖం. సుజాతా పట్వారీ గొంతు మరింత వొణికింది. వరుసగా ఫోన్‌లొస్తూనే వున్నాయి. ఆవిడకు సంబంధించి ఎవరి జ్ఞాపకాలను వాళ్ళు తవ్వుకోవడం, కళ్ళు చెమ్మగిల్లడం, గుండె బరువెక్కిపోవడం అర్ధమవుతూనే వుంది. చంద్రలత, ప్రతిమ, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, అనిశెట్టి రజిత, అమెరికా నుంచి అత్తలూరి విజయలక్ష్మి తమ దు:ఖాన్ని నాతో పంచుకున్నారు.

డా. భార్గవీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత్రి అనువాదకురాలు, నాటక ప్రయోక్త, ఆంగ్లభాషలో ప్రొఫెసర్‌గా పదవీవిరమణ చేసారు. ఆవిడ సంకలనం చేసిన రేళ్ళపంట- వందమంది రచయిత్రుల కథల్ని ఏరి, ఎంతో శ్రమకోర్చితెచ్చిన పుస్తకం తెలుగు సాహిత్యానికి ఎంతో విలువైన చేర్పు. ఆమె కథలు, నవలలు రాయడంతో పాటు అనువాదకురాలిగా ఎంతో కృషి చేసారు. గిరీష్‌ కర్నాడ్‌ కన్నడ నాటకాలాను తెలుగలోకి అనువదించారు. ఆవిడ అనువదించిన ‘తలెదండ’కి 1995లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇంకా ఎన్నో అవార్డులను ఆవిడ అందుకున్నారు.
భార్గవీరావు ఆగష్టు 14, 1994లో కర్నాటకలోని బళ్ళారిలో జన్మించారు. తల్లి శాంతి తగత్‌, తండ్రి నరసింహరావు. ఐదుగురు సంతానంలో ఈవిడే పెద్ద. చిన్నప్పుడు భార్గవి గారు రెండు సినిమాల్లో కూడా నటించారు. రేడియెలో ప్రసంగాలు చేసేవారు. 1960లో భార్గవిగారి వివాహం ప్రభంజన్‌రావుగారితో జరిగింది. వారికి ముగ్గురు అమ్మాయిలు.

భార్గవీరావు ఎప్పుడూ సరదాగా, సంతోషంగా వుండేవారు. ఉత్సాహంతో ఉరకలేస్తూ కొత్త కొత్త పనుల్లోకి దూకుతుండేవారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక పుస్తకం ఆవిడ పేరు మీద బయటకొచ్చేది. క్రితం సంవత్సరం భార్గవిగారి ‘కలగంటి..కలగంటి..’ నవలని భూమిక ఆవిష్కరించింది. భూమికతో ఆవిడ అనుబంధం ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతోంది. సుడిగాలిలా ఆఫీసుకొచ్చేవారు. ‘మంచి కాఫీ ఇవ్వవోయ్‌. నీతో మాట్లాడుతుంటే దు:ఖాలన్నీ దూరమైపోతాయోయ్‌’అనేవారు. తనకి షుగర్‌ వచ్చిన కొత్తల్లో చాలా డ్రిప్రెస్‌ అయ్యారు. అలాంటి స్థితిలో ఒకసారి భూమికకొచ్చి ‘నాకెందుకోయ్‌ ఈ తీపిరోగమొచ్చింది’ అంటూ కదిలి కదిలి కళ్ళనీళ్ళ పర్యంతమైనారు. ఆ రోజు మేమిద్దరం చాలా సేపు కాఫీల మీద కాఫీలు తాగుతూ కబుర్లాడుకున్నాం.”హమ్మయ్య! నీతో వట్లాడాక నా డిప్రెషన్‌ పారిపోయిందోయ్‌’ అంటూ ఆ రోజు ఖులాసాగా నవ్వుకుంటూ వెళ్ళారు.
నాకున్నట్టుగానే, ప్రతి రచయిత్రికి ఆవిడతో ఎన్నో అద్భుత మైన అనుభవాలుండి వుంటాయి. అందరితో చాలా స్నేహంగా, ఆత్మీయంగా వుండేవారు. భార్గవీరావుగారి ఉత్సాహం, ఉల్లాసం ఏ స్థాయిలో వుంటాయో ‘తలకోన’ క్యాంప్‌లో రచయిత్రులందరికీ అనుభవమే. చిన్నవాళ్ళల్లో   చిన్న పిల్లలా కలిసిపోయే పసిమనస్తత్వం ఆమెది.

తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన భార్గవిగారి మాతృభాష కన్నడం అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. 64 సంవత్సరాలకే ఆవిడ కన్ను మూయడం నిజంగా చాలా బాధాకరం. ఓ మంచి మిత్రురాలిని కోల్పోయిన భావన ఆవిడ అభిమానులందరినీ కలిచివేస్తోంది. ఈ సంపాదకీయం ద్వారా వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ, ఆవిడకు అశ్రునివాళి అర్పిస్తున్నాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to బహుముఖ ప్రజ్ఞాశాలి డా.భార్గవి రావ్

 1. subbarao says:

  నూయార్కు సాహితి సదస్సు లొ
  ఆమెతొ
  చిన్న పరిచయం
  చెరగని ముద్ర
  తీయని అనుభూతి.
  ఇంత చిన్న వయసులొ..
  చాలా అన్యాయం జరిగి పొఇంది.
  ఆమెకు..తెలుగు భాషకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో