మీడియా వ్యవస్థకు బహిరంగ లేఖ

 

కృపాకర్‌ మాదిగ పొనుగోటి, రాష్ట్ర అధ్యక్షుడు
 మీడియా ఒక వ్యవస్థ.  దిన, వార, పక్ష, మాస…పత్రికలూ, రేడియో, టీవీ చానెళ్ళూ మీడి్యాలో భాగం.

 మీడియా ఒక పరిశ్రమ.

 నిజాలనూ, ఊహలనూ ఉత్పత్తి చేస్తుంది.  మీడియాకి ఆర్థిక స్వభావం ఉంది.  అది పెట్టుబడి స్వభావం.  మీడియాకి ప్రయెజనం ఉంది.  అది లాభాపేక్ష కలిగిన వ్యాపారం.  మీడియాకి కులం ఉంది.  అది అగ్రకులం.  మీడియాకి జెండర్‌ ఉంది.  అది మగది.  మీడియాకి ప్రాంతస్వభావం ఉంది.  అది కోస్తా లేక అభివృద్ధి చెందిన ప్రాంతం.  మీడియాకి మతం ఉంది.  అది హిందూమతం.  మీడియాకి సామాజిక బాధ్యత ఉండటం గొప్ప సంగతి కాదు.  అది ఒక అవసరం.  విధిగా ఉండాల్సిన బాధ్యత.  చిన్న పత్రికలు, చిన్న చానెళ్ళ గురించి ఇక్కడ రాయబోవడం లేదు.  వందలకొద్దీ సిబ్బందిని నియమించుకున్న మీడియా సంస్థల (పత్రికలు, చానెళ్ళ) గురించే ఇక్కడ ప్రస్తావన.
 మీడియా శ్రమశక్తిలో మాదిగలు, దళితులు, ఆదివాసులు, బీసీలు, మైనారిటీలు భాగస్తులా? కారా? రాష్ట్రంలో, దేశంలో మా(యీ)వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మీడియా ఎందుకు ప్రతిబింబించలేకపోతోంది?  దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ ముఖ్యమైన సమస్యలపై వ సామాజిక వర్గాల రచయితలు మీడియా ముఖంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు, అవకాశాలు కలిగి ఉన్నారా?  ఉదాహరణకు ఎంతోమంది మాదిగ ఉద్యమ కార్యకర్తలు, మేధావులు రాసిన వార్తలు, వ్యాసాల ప్రచురణ కోసం సాధారణ విలేకరుల దగ్గర నుండి ఆయా సంపాదక వర్గాల్లోని సీనియర్ల వరకు అర్థింపులు, బతిమిలాటలు చేసుకున్న సందర్భాలు కోకొల్లలు.  ఈ లేఖ రచయిత కూడా ఇలాంటి ఇబ్బందులెదుర్కొన్నాడు.  ఉద్యమనాయకుల దుస్థితి ఇలా ఉంటే, ఇక సామాన్య కార్యకర్తలు, చిన్న నాయకులు, కొత్త రచయితలు, కవుల విషయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఇట్టే ఊహించగలరు.
 దేశంలో, రాష్ట్రంలో మా వర్గాల ప్రజలు 85 శాతం ఉన్నారు.  రాష్ట్రంలో పది శాతం జనాభాగా మాదిగ కులస్తులున్నారు.  కాగా, అగ్రకులాల జనాభా అంతా కలసి 15 శాతానికి మించి లేదు.  ఈ 15 శాతం అగ్రకులాలవారే మీడియా సంస్థల యజమానులుగా, మీడియా విధాన నిర్ణేతలుగా, అగ్రవర్ణాల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రయెజనాల పరిరక్షకులుగా ఉండటం సరైందేనా?  యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందియుండి, 85 శాతం జనాభా శక్తి కలిగిన మాకు, ప్రతి వార్తాపత్రిక, ప్రతి టీవీ చానెల్‌ 85 శాతం స్థల, కాలాలను మా సమస్యల కోసం, మా ప్రయెజనాల కోసం వెచ్చించాలి.  కాని, ఏ వార్తాపత్రిక, ఏ రేడియో, టీవీ చానెల్ మాకు 85 శాతం స్థల, కాలాలను కేటాయించకపోవడం బాధ్యతారాహిత్యం కాదా?  మీడియా వివక్ష కాదా?  దండోరా ఉద్యమం గురించి దళితుల నిధులు దారిమళ్ళింపు గురించి, హాస్టళ్ళలో బడుగు బాలల కష్టాల గురించి, వాకపల్లి సంఘటన గురించి, వోబీసీ రిజర్వేషన్ల గురించి రాస్తున్నాం, చెబుతున్నాం, చూపిస్తున్నాం కదా అని మీడియా యాజమాన్యాలు అనవచ్చు.  నిజమే కావొచ్చు.  కొన్ని ముఖ్యమైన దోపిడి సంఘటనలపై వార్తలో, కథనాలో వస్తే సరిపోవు.  దారిద్య్రం, నిరక్షరాస్యత, అంటరానితనం, దోపిడి, పక్కకి తీసివేయబడటం అంతా మాదిగలు, దళితులు, బీసీలు, ఆదివాసులు, మైనారిటీలమైన మాపైనే కొనసాగుతోంది.  అసలు సింహభాగం, ఆ మాటకొస్తే మొత్తం ప్రజలం మేమే గనుక, మేమెదుర్కొంటున్న సమస్యల కంటే, ముఖ్యమైన సమస్యలు దేశానికి లేవు గనక వార్తాపత్రికలు, రేడియో, టీవీ చానెళ్ళు వాటి మొత్తం స్థల, కాలాలను మా ప్రయెజనాల కోసమే కేటాయించాల్సి ఉంటుంది.  ఇలా జరగడం లేదు.  అడపా దడపా వార్తలు, కథనాలు కాదు, మేం కోరేది.  మీడియా నేడు ఈ కొద్దిపాటి చోటునీ, కాలాన్నైనా మాకు కల్పిస్తున్నదంటే అదీ కొన్ని దశాబ్దాలుగా మనుషులుగా గుర్తింపు, గౌరవం, హక్కుల కోసం మా సామాజిక వర్గాలు సాగిస్తున్న నిరంతర పోరాటాలు, ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యింది తప్ప, వేరే కాదు.  ఇప్పుడు మీడియాలో మాకు లభిస్తున్న యీ కొద్దిపాటి స్థల, కాలాలు ఒక్కోసారి యాజమాన్య అవసరాల కోసం, ఒక్కోసారి మీడియా సంస్థలో సిబ్బందిలో ఉండే మా సానుభతిపరుల వల్లా, చాలా సందర్భాల్లో హక్కుగా సాధించుకోవడం వల్లా వచ్చిందే.  కాని, మీడియా మాకిప్పుడిస్తున్న కొద్దిపాటి స్థల, కాలాలు సరిపోవు.  మీడియా మొత్తం స్థల, కాలాలను మా సామాజిక వర్గాల ప్రయెజనాల కోసం వెచ్చించాలని డిమాండు చేస్తున్నాం.  జనాభాలో 85 శాతం ఉన్న మాకు మీడియాలో 85 శాతం స్థల, కాలాలను ఎందుకు కేటాయించలేకపోతున్నారో మీడియా సంస్థల యాజమాన్యాలు మాకు సమాధానాలు చెప్పాలి.  మీడియా మాకు తగినంత స్థల, కాలాలను కేటాయించకపోవడం మమ్మల్ని వర్జినలైజ్‌ చెయ్యడంగా ఎందుకు భావించకూడదని ప్రశ్నిస్తున్నాం.  85 శాతం స్థల, కాలాలను కేటాయించలేమని మీడియా సంస్థలు అంటాయా?  అలాగైతే, సామాజిక బాధ్యత వంటి ఆదర్శాలు వల్లించడం మానివేసి మీడియా సంస్థలు వార్తా వ్యాపారాలు చక్కబెట్టుకుంటే సరిపోతుంది.  ఇది మంచిదంటారా?
 దినపత్రికల విషయనికొద్దాం.  సాధారణంగా మొదటి ఒకటీ, రెండు పేజీలను అగ్రకుల రాజకీయ ప్రతినిధులకు కేటాయిస్తున్నాయి.  అలాగే రెండు పేజీలు వ్యాపారానికి, రెండు పేజీలు సినిమా పరిశ్రమకి, రెండు పేజీలు క్రీడారంగానికి, కొంతభాగం ఆధ్యాత్మిక అంశాలకి, మరికొంతభాగం వ్యాపార ప్రకటనలకి కేటాయించడం మనం చస్తున్నాం.  టీవీ, రేడియో చానెళ్ళ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు.  తెల్లారి నిద్రలేచింది మొదలు మాదిగలు, దళితులు, ఆదివాసులు, బీసీలు, మైనారిటీలు ఇవన్నీ ఎందుకు చదవాలి?  ఎందుకు చూడాలి? మాకు సంబంధం లేని వార్తాంశాలను మాపై రుద్దడం అన్యాయం కాదా?  మా అణగారిన కులాలు, జాతులు, తెగల పట్ల మీడియాకి తగినంత శ్రద్ధ, సౌహార్ద్రత, మద్దతు లేదనడానికి ఇంతకంటే ఇంకేం రుజువులు కావాలి?
 ముస్లిముల సమస్యలపై ముస్లిం జర్నలిస్టులు రాయడాన్ని, మహిళల సమస్యలపై మహిళా జర్నలిస్టులు రాయడాన్ని, బీసీ సమస్యలపై బీసీ జర్నలిస్టులు రాయడాన్ని మీడియా సంస్థలు కొద్దిమేరకు అనుమతిస్తున్నాయి.  తగినంతగా కాదు.  కాని, మాదిగల, దళితుల, ఆదివాసుల సమస్యలపై మా వర్గాల జర్నలిస్టులను, రచయితలను రాయడాన్ని అనుమతించే, ప్రోత్సహించే సౌహార్ద్రతా కార్యాచరణ మీడియా సంస్థలకు లేకపోవడం ఆశ్చర్యకరం.  బాధాకరం.  ఇది నిజం కాదా?  అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం, ప్రోత్సాహం లేకుండా మీడియా సంస్థల్లో ప్రజాస్వామ్యం ఉంటుందా?
 మీడియా కార్యాలయాల్లో మాదిగల, దళితుల, ఆదివాసుల, బీసీల, మైనారిటీల ప్రాతినిధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి?  ఎడిటర్లు, న్యూస్‌రీడర్లు, యాంకర్లు, జర్నలిస్టులు, జాకీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు మొదలగు ఉద్యోగుల్లో మాదిగలు ఎంతమంది ఉన్నారు?  మాదిగేతర దళితులు, ఆదివాసులు, బీసీలు, మైనారిటీ సామాజికవర్గాలకు చెందినవారు ఎంతమంది ఉన్నారు?  అసలు ఉన్నారా? మహా అయితే, మీడియా సంస్థల క్యాంటీన్లలో పనివారిగా, ఊడ్చేవారిగా, టాయిలెట్లు శుభ్రం చేసేవారిగా, ప్యాకింగు, ప్రింటింగు, ట్రాన్స్‌పోర్టు, కాపలా విభాగాల్లోనూ, సరుకు ఎత్తుడు, దింపుడు దగ్గర మావాళ్ళు కొద్దిమంది ఉన్నారేమో?  ఉంటే ఉండవచ్చు?  కాని, మీడియా సంస్థల యజమానులు, సంపాదకవర్గాలు తీసుకునే కీలక విధాన నిర్ణయాల్లో మాదిగలకు, దళితులకు, ఆదివాసులకు భాగస్వామ్యం శూన్యమనే చెప్పవచ్చు.  కాదంటారా?  మీడియా సంస్థల్లో సాంఘిక ప్రాతినిధ్యం, వైవిధ్యం, భిన్నత్వం పెద్దస్థాయిలో కొరవడింది.  మీడియా సంస్థల్లో కులాల, జాతుల ప్రాతినిధ్యం అసమానతలతో నిండి ఉంది.  మీడియా సంస్థల్లోను, వాటి ఉత్పత్తులలోనూ తగినంత స్థల, కాలాలు కేటాయించని, ప్రాతినిధ్యం కల్పించని మీడియా వ్యాపారులను మాదిగలు, మాదిగేతర దళితులు, ఆదివాసులు ఎందుకు నెత్తిన మొయ్యాలి?  ఎందుకు గౌరవించాలి?  మీడియా సంస్థల యాజమాన్యాలు, సంపాదకవర్గాలు ఈ అపసవ్య పరిస్థితులను చక్కదిద్ది, మీడియా సంస్థల్లో ప్రజాస్వామిక విలువల పునరుద్దరణకు కార్యాచరణ ప్రణాళికలేమైనా సమీప భవిష్యత్తులో చేపడతారని మేం ఆశించవచ్చునా?
 రాష్ట్రంలో ముగ్గురు పత్రికా యజమానులు పార్లమెంటు సభ్యులు కావడం వెనుక, మీడియా రంగ ప్రముఖుడొకరు, యమ్మెల్సీ కావడం వెనక, పాత్రికేయ ప్రముఖులు ఒకరు అధికార భాషా సంఘం అధ్యక్షుడు కావడం వెనక, మరొకరు ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌ కావడం వెనక కేవలం అనుభవం, ప్రతిభేనా? కులం లేదా? ఉంది. అనుభవం, ప్రతిభేనని ఎవరైనా వాదిస్తే, ఆ వాదంలోనూ కులం ఉందని మేం అంటాం.  పదవులు పొందిన మీడియా రంగ ప్రముఖుల్లో ఏ ఒక్కరైనా మాదిగ, దళిత, ఆదివాసీ సామాజిక వర్గాల వారు లేకపోవడానికి అన్ని రంగాలనూ శాసిస్తున్న అగ్రకుల వ్యవస్థే కారణం కాదా?  రాష్ట్రస్థాయిలో ఉన్న వివిధ జర్నలిస్టు సంఫల్లో అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఏయే కులాలకి చెందినవారున్నారో బయటపెట్టగలిగితే, పత్రికారంగంలో కుల వివక్ష ఎంత లోతుగా వేళ్లూనుకొని ఉందో అందరికీ అర్థమౌతుంది.  సీనియర్‌ పాత్రికేయులారా! ఇద్దరో ముగ్గురో మాల జర్నలిస్టులను మినహాయిస్తే, మీ సుదీర్ఘ వృత్తి జీవితంలో ఒక మాదిగ జర్నలిస్టుతో, ఒక ఆదివాసీ జర్నలిస్టుతో, ఒక దళిత జర్నలిస్టుతో కలిసి పనిచేసిన సౌహార్ద్ర సందర్భాలున్నాయేమో దయచేసి ఒక్కసారి గుర్తుచేసుకోగలరా?  ఇప్పటివరకూ ఎంతమంది మాదిగలను, ఆదివాసులను, దళితులను పాత్రికేయ వృత్తిలోకి ప్రోత్సహించారో మీడియా సంస్థల యాజమాన్యాలు ప్రకటించగలవా?
 మీడియా సంస్థల యాజమాన్యాలు వేరు.  మీడియా సిబ్బంది (పాత్రికేయ, సాంకేతిక, శ్రామిక సిబ్బంది) వేరు.  మీడియా సంస్థల యాజమాన్యాల ప్రయెజనాలకు పాపులారిటి, ఆర్థిక, రాజకీయ, అగ్రకుల లాభాపేక్ష కోణాలు ఉండటం నిజం కాదా?  మీడియా సంస్థల యాజామాన్యాలకు ఉండే ప్రజావ్యతిరేక ప్రయెజనాలకు పాత్రికేయులు, మీడియా ఉద్యోగులు అండగా నిలవకూడదని మా అభ్యర్థన.  అణగారిన సామాజిక వర్గాల ప్రయెజనాలకు, మీడియా సంస్థల యాజమాన్యాలకు వివాదాలు ఏర్పడ్డ సందర్భాల్లో పాత్రికేయులు, వారి సంఘాలు అణగారిన సామాజిక వర్గాల ప్రయెజనాల వైపు నిలబడాలని కోరుతున్నాం.  గతంలో ఒక మీడియా సంస్థలో పాత్రికేయులు యూనియన్‌ పెట్టాలని ప్రయత్నించినపుడు ఆ మీడియా సంస్థ పాత్రికేయుల్ని ఎన్ని కష్టనష్టాలకు గురిచేసిందో సీనియర్‌ పాత్రికేయులందరికీ తెలిసిందే.  అలాగే, ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రిక – యమ్మార్పీయస్‌, బీసీ నాయకుల మధ్య జరుగుతున్న వివాదంలో క్రియ మీద చర్చ జరగకుండా ప్రతిక్రియ మీద చర్చ జరపడం మీడియా యాజ్యమాన్యం కుట్ర.  కారణం మీద కాకుండా కార్యంమీద చర్చ జరపడం మోసం కాదా?
                       మాదిగలపై, దళితులపై, ఆదివాసులపై, బీసీ, మైనారిటీలపై మీడియాలో జరుగుతున్న కులవివక్ష ఇప్పుడు చర్చకు రావాలి.  హిందూ అగ్రకుల, ఆంధ్ర, మగ వ్యాపారుల, పెట్టుబడిదారుల ప్రయెజనాలు కాపాడడమే లక్ష్యంగా మీడియా విధానాలు ఉండడంపై ఇప్పుడు అన్నిచోట్ల విస్తృతంగా చర్చ జరగాలి.  మా వర్గాల వార్తలపై కత్తిరింపులు, దేబిరింపులు, అదృశ్యాలు, అవాచ్యాలు, వక్రీకరణలు, చిన్నవిగా చూపెట్టే ప్రయత్నాలు, నామమాత్రపు వ్యక్తీకరణలు – ఇవన్నీ వ్యవస్థీకృతంగా మీడియారంగం మాపై జరుపుతున్న అత్యాచారాలే.  మీడియా యాజమాన్యాలు కర్తలు, క్రియలై మమ్మల్ని, మావారిని కర్మల స్థానంలోకి నెట్టడం న్యాయమా?  సబబా?
అందుకే ఇప్పుడు మీడియాలో మాదిగీకరణ జరగాలి.  మాదిగీకరణ అంటే నలిగిపోయిన మానవీయతే నని  గుర్తించాలి.  అగ్రకుల మీడియా వారి కార్యాలయాల్లో కుర్చీల దగ్గర నిలబడి వార్తలు, వ్యాసాలు, కథనాల ప్రచురణ కోసం సరైన స్థల, కాలాలు కేటాయించమని అడుక్కునే దుస్థితి మాకు తొలిగిపోవాలి.  మాదిగలు తమ గొంతుకలను, డప్పులను ప్రచార, ప్రసార సాధనాలుగా వర్చి, చరిత్ర నిండా సమాజానికి సేవలందించారు.  అలాంటి మాదిగలకు ఆధునిక మీడియా అందుబాటులోకి రాకపోవడం ఒక విషాదం.  ఆధునిక మీడియాకి మాదిగలు యజమానులు కాలేకపోవడం అంతకన్నా పెనువిషాదం.  మా సమాజాలను మేం ప్రతిబింబించుకోవడానికి మాకు మాదిగ మీడియా కావాలి.  దళిత మీడియా కావాలి.  బీసీ మీడియా కావాలి.  ఆదివాసి మీడియా కావాలి.  మైనారిటీ మీడియా కావాలి.  పెట్టుబడికీ, కట్టుకతకీ మధ్య నలిగిపోకుండా ఎదగటం ఇప్పటి మా అవసరం.  చరిత్రను తాటాకులపై బొమ్మలుగా మలిచి చూపిన డక్కలోళ్ళకి, నరాలను తీగెలుగా జమిడికె పై మీటి చరిత్రను పాడిన బైండ్లోళ్ళకి డప్పుతో సమాజాన్ని మేల్కొలిపి, చెప్పుతో చరిత్రను ముందుకు నడిపించిన మాదిగలకు ఆధునిక మీడియాలో స్థల, కాలాలు కావాలి.  యాజమాన్య హక్కులు కావాలి.  మీడియా రంగ విధానాలకు దిశానిర్దేశం చెయ్యాలి.  అవకాశాలు కావాలి  అందితే సంతోషం. అందుకోసం పోరాడుతాం.

 

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో