ప్యారీ ”లాడ్లీ”కి జేజేలు

సుజాత పట్వారి

ఈ నెల భూమిక రచయిత్రులు మీటింగును ‘భూమిక’ సంపాదకురాలు, రచయిత్రి అన్నింటికి మించి మమ్మల్నందరిని ఒక చోట చేర్చే  inspiring force కు జాతీయ అవార్డు లభించిన అరుదైన, గౌరవప్రదమైన సందర్భాన్ని పురస్కారించుకుని ఈ సంబరాన్ని విభిన్నమైన రీతిలో జరుపుకున్నాం.

కొండవీటి సత్యవతికి ఉత్తమమైన సంపాదకీయం కోసం ప్రింటు మీడియాలో ‘జాతీయ అవార్డు (2007) లభించింది. మే 15, 2008 తెలుగు సాహిత్యం ముఖ్యంగా ప్రతి సాహితీ అభిమాని, ప్రతి రచయిత్రి గర్వించదగ్గ రోజు. ఈ అవార్డుల ఫంక్షన్‌ న్తూఢిల్లీలోని ఫిక్కీ ఆడిటోరియంలో యునైటెడ్‌ నేషన్స్‌ పాఫ్యులేషన్‌ ఫండ్‌ -లాడ్లీ వారు సంయుక్తంగా జెండర్‌ సెన్సిటివిటీ (లింగవివక్ష విషయమై చైతన్యం) కోసం కృషి చేసినందుకు సత్యవతిగారి సంపాదకీయలకు అవార్డు ప్రకటించారు.

 అందుకే మా మీటింగు (జూన్‌2008) ఆఫీస్‌లో కాకుండా శిలాలోలిత ఇంట్లో జరుపుకున్నాం. వారింటిపైన కొత్తగా కట్టిన భాగంలో టెర్రస్‌ విశాలంగా వుండి మా అందర్ని ఆకట్టుకుంది. కవి సమయాలకు, టెర్రస్‌ తగినట్టుగా వుందంట కుప్పంలో వున్న యకూబ్‌ను, మా ముందున్న శిలాలోలితను అందరం అభినందించాం.

తెల్లటి లిల్లీ పువ్వు గులాబీ రంగు చీర కట్టుకొని లలితగీతం పాడటం విన్నారా? బయట హోరున వర్షం- లోపల శారదా శ్రీనివాసన్‌ గారి గాత్రంలో జాలువారుతున్న లలిత గీతాలు- అదో అద్భుతమైన రాగం – ఋతుపవనపు మేళవింపు. శారదగారు అప్పటి పాటల తీరును, తెలుగు ఉచ్ఛారణను వివరిస్తూ, బాలసరస్వతిగారి గొంతులో ఎంతటి కఠినమైన తెలుగు పదమైన ఎలా లలితంగా, మృదువుగా మారిపోయేదో వివరించారు. ఘంటశాల నిర్మల, శీలాసుభద్రాదేవి, ఎంకి పాటల్ని, పాత మధుర గీతాల్ని పాడి ఆ సాయంత్రానికి ఓ రోమాంటిక్‌ టచ్‌ నిచ్చారు. కె.బి.లక్ష్మి, వారణాసి నాగలక్ష్మి వారితో గొంతు కలుపుతూ ఉషారునిచ్చారు. శిలాలోలిత మధ్య మధ్యలో అందరికీ మంచి కాఫీ, స్నాక్స్‌ అందిస్తూ మంచి ‘హోస్ట్’ అవార్డు కొట్టేశారు. అంతవరకు వర్షం, వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తున్న మాకు గచ్చిబౌలి నుండి ‘వెన్నెల’ను వెంటబెట్టుకుని సునీతారాణి వచ్చేసరికి ఇంకా సందడి. ఎక్కడో ఆ కొసన అతుక్కుపోయి మాపై శీతకన్నేసారని తనపై అభియెగాలు, నవ్వులు. ఈ లోపల గీత ( అసలు అంత వూపులో పాడుతుందని మాకెవ్వరికీ తెలియదు) జానపదగీతం ‘కోడి’ పాట ఎంత నవ్వించి, ఆలోచింపజేసిందో…పాటకంటే తను ఆ పాట ఎందుకు పాడిందో, పాటకు, ఆడదాన్ని జీవితానికి ఎంత దగ్గరితనముందో చెప్పిన తీరు చూసి ఆశ్చర్యమేసింది. నాకు సాహిత్యం తెలియదు తెలియదంటనే ఎంత గొప్ప literary interpretation  ఇచ్చిందో! పాపం సుమతిగారు కమ్యూనికేషన్‌ గ్యాప్‌వలన చాలా దూరం తిరిగి, శ్రమకోర్చి వచ్చారు. ఇంకా మొదటిసారిగా వనం పద్మజ, దేవకిగార్లు వచ్చారు.
సత్యవతి పుట్టిన ‘సీతారామపురం’ నుండి నేటి న్యూఢిల్లీ వరకు ప్రయాణంలో ఎన్ని మలుపులు విని ఆశ్చర్యానంద దు:ఖాలు! కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలు, సాధించిన విజయాలు కనిపిస్తే మనిషికి ఎంత ఉత్సాహం, సత్యవతి బెర్నాడ్‌షా రచనల్లో మనకు కనిపించే ‘లైఫ్‌ఫోర్స్‌’లా వుంటారు. అలాంటి మహిళా సంపాదకురాలికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఎంత గొప్ప విషయం! ఇంతటి అపూర్వమైన గౌరవానికి ఏ తెలుగు సాహిత్య సంస్థలు కూడా సత్యవతిని సత్కరించలేకపోయాయి కదా అని శారదా శ్రీనివాసన్‌గారు బాధను వెలిబుచ్చారు. నాకు మాత్రం రచయిత్రులం ఇలా ఆత్మీయంగా ఈ వేడుకను కలిసి  జరుపుకోవడంలోనే ఓ ప్రత్యేకత కనిపించింది. అందరి హృదయ పూర్వక అభినందనల మధ్య సత్యవతిగారికి శిలాలోలిత దుశ్శాలువా కప్పి సత్కరించారు. స్ఫటికంగా, స్వచ్ఛంగా మెరిసిపోతున్న అవార్డును అందరం ముద్దాడి, సత్యవతి ఇంకా, ఇంకా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకుని వాటికి వన్నె తేవాలని అందరం ముక్త కంఠంతో కోరుకున్నాం.
అస్వస్థత కారణంగా వేడుకకు రాలేకపోయిన అబ్బూరి ఛాయాదేవి, శాంతసుందరిగారిని మేమంతా మిస్‌ చేశాం. వారు కూడా రాలేకపోయినందుకు బాధపడుతూ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
కొసమెరుపు : సాయంకాలపు వేళ..చిటచిటచినుకుల్లో సత్యవతిగారి చేతిలో కారు పంచకళ్యాణిలా పరిగెడుతుంటే పాత జావళీలు వింటూ వెళుతుంటే అదే అసలయిన రొమాన్స్‌ అనిపించింది. ఇది నాకు, గీతకు మాత్రమే దక్కిన చినుకుల జావళి.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

One Response to ప్యారీ ”లాడ్లీ”కి జేజేలు

 1. G.S.Lakshmi says:

  స హృద యులు సుజాత ప ట్వారీ గారికి
  భూమిక సంపాద కురాలు కొండ వీటి స త్య వ తి గారి కి అరుదైన జాతీయ అ వార్డు ల భించిన సంద ర్భంగా అంద రూ క లిసి ఆ ఆనందం పంచుకున్న తీరు చాలా ఆహ్లాదాన్ని క ల గ చేసింది. అది చ దివి అ క్కడున్నట్లే అ నిపించింది. మ న కు సంలోషంగా అనిపించిన దానిని న లుగురితో క లిసి పంచుకోవ డంలో ఆ ఆనందం ద్విగుణీకృత మ వుతుంది. చ దివిన నాకు కూడా చాలా సంతోష మ నిపించింది.
  కోట్ల మంది ప్ర జలున్నా సూర్యుడు ఒక్క రి కోస మే ఉద యిస్తాడుట. ఆ ఒక్క రి వ ల్లా కోట్ల మంది బ్ర తుకుతున్నారు. అలాగే
  స త్యవ తిగారు కూడా. వారి వ ల్ల చాలామంది స్త్రీలు ఉ త్తేజితుల వుతున్నారు.
  మ హిళా లోక మంతా గ ర్వించ ద గ్గ స త్య వ తి గా రికి భ గ వం తు డు ఆయురారోగ్యాలు ప్ర సా దిం చా ల ని కోరుకుంటూ,
  అభివంద న ముల తో,
  జి.ఎస్. ల క్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో