చింటూ! – దినవహి సత్యవతి

ఎనిమిదేళ్ళ చింటూ రెండు రోజులనించీ ధీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు! ఇంట్లో, బయటా, బడిలో, నిద్రలో, మెలకువలో… ఇలా చెప్పాలంటే 24 x 7 ధోరణిలో!!!

నాన్నతో ఈ విషయం ఎలా మాట్లాడాలి? పోనీ ముందు అమ్మతో చెపితే?

”ప్చ్‌, లాభంలేదు”ఎన్నో సార్లు అమ్మ చెప్పిన మాట నాన్న వినకపోవటం తను చూస్తూనే ఉన్నాడు.

మరి నేను చెప్తే వింటాడా? ”నువ్వు నాకు చెప్పేంతవాడివయ్యావా?” అనికోపగించుకుంటే?”.

అలాగని భయపడి ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే నాన్నతో పాటు అమ్మకీ నాకూ కూడా ప్రమాదమేమో? ఇలా పరిపరివిధాల ఆలోచిస్తూ మధనపడసాగాడు చింటూ…

చింటూ చదివే బడికి ఆ చుట్టు పక్కల మంచిపేరుండటమూ, అదీకాక బడి స్థాపించి పాతికేళ్ళయిన సందర్భంగా ‘రజతోత్సవం” ఘనంగా జరపాలని బడి యాజమాన్యం నిశ్చయించింది. ఉపాధ్యాయులందరూ ఆ హడావిడిలో ఉన్నారు. రజతోత్సవం రోజున జరిగే కార్యక్రమాల గురించి చింటూక్లాసు టీచరు కూడా ఏదో చెప్తూ, చింటూ తాను చెప్పేదానిపై ధ్యాస పెట్టకపోగా ఏదో దిగులుగా ఉండటం గమనించారు. చింటూ అంటే ఆవిడకి ప్రత్యేకమైన అభిమానం.

చింటూ తల్లిదండ్రులు పేదవారు, పూర్తిగా నిరక్షరాస్యులు. చింటూ చాలా తెలివిగలవాడని గమనించిన క్లాస్‌ టీచరుగారు వాడి చదువుకి తాను సహాయం చేస్తానని చెప్పారు. అందుకే ఆవిడ చింటూ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. క్లాసు అయిపోయిన తరువాత ఆవిడ వాడిని దగ్గరికి పిలిచి ”చింటూ ఏమైంది? ఎందుకలా ఉన్నావు?” అని అడిగారు ఆప్యాయంగా…

బడి నించి వచ్చి ఆదోలా ఉన్న చింటూని ఏమైందని అడిగింది తల్లి. ఆ రోజు బడిలో జరిగిన విషయం అంతా తల్లికి వివరంగా చెప్పాడు చింటూ.

రజతోత్సవం సందర్భంగా విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో, అతిథులతో బడి ప్రాంగణమంతా సందడిగా

ఉంది. వేదికపై ఆశీనులైన పెద్దలందరి ఉపన్యాసాలూ, ప్రధానోపాధ్యాయుని ద్వారా బడి వార్షిక నివేదిక అయిన తదుపరి ముఖ్య అతిథి చేతులమీదుగా పిల్లలకి బహుమతి ప్రదానం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.

మొదటగా ”హెచ్చరిక” నాటకం అని ప్రకటన వినపడటంతో అందరూ ఆసక్తిగా వేదికవైపు చూసారు…

తెరపైకి లేచింది

మొదటి అంకం: (వేదికపైన తల్లి, తండ్రి, ఒక బాబు ఒక మంచం పక్కనే కూర్చుని ఉంటారు. మంచంపైన చిన్న పాప పడుకుని ఉంటుంది)

బాబు: ”అమ్మా! చెల్లాయికి ఏమైంది?”ఎందుకలా దగ్గుతోంది నిన్నటినించీ? (తల్లితో అంటాడు)

తల్లి: ”చెల్లాయికి బాగాజ్వరంగా ఉంది బాబూ”

బాబు: ”మరి చెల్లాయిని డాక్టరుగారి దగ్గరికి తీసుకువెళ్ళవా?”

తండ్రి: ”పద, ఆసుపత్రికి వెళదాము, నిన్నటినించీ పాపకి జ్వరంగానీ, దగ్గు కానీ తగ్గటంలేదు, ఇంకా ఆలస్యంచేయటం మంచిది కాదేమో?” (అంటాడు బాబు తల్లితో)

(తండ్రి పాపని ఎత్తుకుని ఆసుపత్రికి బయలుదేరుతాడు, వెనకాలే తల్లి, బాబు అనుసరిస్తారు)

రెండవ అంకం: (ఆసుపత్రి లో బెంచి పైన తండ్రి పాపని ఎత్తుకుని కూర్చుని ఉంటాడు. పక్కనే తల్లీ బాబూ కూడా

ఉంటారు. డాక్టరుగారి రూంలోంచి నర్సు వస్తుంది..)

నర్సు: ”డాక్టరుగారు పిలుస్తున్నారు, రండి”

డాక్టరు: ”పాపకి ఏమయింది?”

తండ్రి : ”పాపకి నిన్నటినించి దగ్గు, జ్వరం కూడా ఉందండి!” (డాక్టరుపాపని పరీక్ష చేస్తారు)

డాక్టరు: ”ఇది వరకు ఎప్పుడైనా పాపకి ఇలా వచ్చిందా?”

తల్లి : ”తరచూ ఇలా వస్తుంటుంది డాక్టరుగారూ”

డాక్టరు : ”సరే, ముందు పాపకి ఈ పరీక్షలన్నీ చేయించి, రిపోర్టులు తీసుకుని రండి నా దగ్గరకు.”

(డాక్టరు గారు చీటి మీద చేయవలసిన పరీక్షల లిస్టు రాసి ఇస్తారు. అది తీసుకుని అందరూ నిష్క్రమిస్తారు)

మూడవ అంకం: (రిపోర్టులు తీసుకుని పాప తల్లి డాక్టరుగారికి చూపించడానికి వస్తుంది).

డాక్టరు : ”పాప తండ్రి ఎక్కడ?”

తల్లి : ”ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళారండీ”

(ఇంతలో తండ్రి వస్తాడు)

డాక్టరు: ”పాపకి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షను చాలా ఎక్కువగా ఉంది. అందుకే అంతగా దగ్గుతోంది”.

తండ్రి : ”పాపకేం ప్రమాదం లేదుకదా డాక్టరుగారూ?

డాక్టరు: ”వెంటనే ఆసుపత్రిలో చేర్పించండి. రెండు రోజులు మందులు వాడితేగానీ ఏ విషయమూ చెప్పలేదు”

(అది విని తల్లి, తండ్రీ, బాబు డాక్టరుగారికేసి ఆందోళనంగా చూస్తారు. పాపని ఆసుపత్రిలో చేర్పించటానికి వెళతారు…)

(రెండు రోజుల తరువాత…)

డాక్టరు: ”మీరు సిగరెట్లు ఎక్కువగా తాగుతారా?” (అంటారు తండ్రిని ఉద్దేశించి)

(తాను సిగరెట్లు తాగటానికీ తన కూతురు ఆరోగ్యానికి ఏమిటి సంబంధమో అర్థం కానట్లు చూస్తాడు తండ్రి కానీ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు) ఇంతలో…

బాబు: ”అవును నాన్న రోజుకి కనీసం నాలుగు పెట్టెలైనా కాలుస్తాడు డాక్టరుగారూ, నేనేగా నాన్నకి సిగరెట్లు కొని తెచ్చేది”

(అంటాడు బాబు తనకి కూడా ఈ విషయం తెలుసు అన్నట్లుగా కించిత్‌ గర్వంగా డాక్టరుగారిని చూస్తూ)

డాక్టరు: ”మీరు సిగరెట్లు తాగడం వల్ల మీకెంత నష్టమో ఆ పొగ పీల్చే చుట్టుపక్కలవారికి అంతకంటే ఎక్కువగా నష్టం.మీ పాప ఇన్‌ఫెక్షన్‌కి అదే కారణం. ప్రస్తుతానికి పాప బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇలా జరిగితే మీ పాప బ్రతకటం కష్టం. అంతే కాకుండా మీ బాబుతో సిగరెట్లు తెప్పించుకుంటూ మీరు వాడికి ఏమి నేర్పించదలుచుకున్నారు? మిమ్మల్ని చూసి రేపు వాడుకూడా సిగరెట్లు కాల్చడం మొదలుపెడతాడు. అప్పుడు వాడికి అది తప్పు అని మీరు చెప్పగలరా?” (అని సూటిగా ప్రశ్నిస్తూనే గట్టిగా మందలిస్తారు తండ్రిని డాక్టరుగారు.)

తండ్రి: ”నన్ను క్షమించండి డాక్టరుగారూ. మీరు చెప్పినట్లే సిగరెట్లు తాగడం ఇప్పటినించే మానివేస్తాను.”

పాపని బ్రతికించినందుకు చాలా కృతజ్ఞతలు.

(పాపని ఎత్తుకుని తండ్రి, వెంట తల్లి బాబు అందరూ ఆనందంగా ఆసుపత్రినించి వెళ్ళిపోతారు)

నాటకం ముగిసింది.

నాటకంలో పాత్రధారులందరూ హెచ్చరిక: ”పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరం”అని వ్రాసి ఉన్న బోర్డులు పట్టుకుని వేదికపైకి వచ్చి నిలబడతారు. తరువాత పాత్రధారులందరూ వరుసగా తమని తాము ప్రేక్షకులకి పరిచయం చేసుకుంటారు. (నాటకంలో బాబు పాత్ర చింటూ పోషించాడు.)

బడి ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోతోంది. నాటకం మంచి సందేశాత్మకంగా ఎంతో బాగుందని అన్ని వైపుల నించీ అందరూ ప్రశంసిస్తుంటే ఒక వ్యక్తి మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

”ఈ నాటకం తనకి బుద్ధి చెప్పటానికే వేసినట్లుగా ఉందేమిటీ? అందులో చూపించినట్లుగా తన బిడ్డకి కూడా ఏదైనా జరిగి ప్రాణం మీదకి వస్తే తను తట్టుకోగలడా? ”అమ్మో!!” ఆ ఆలోచనే ఎంత భయంకరంగా ఉందీ?”అనుకున్నాడు మనసులోనే!

బడిలో కార్యక్రమాలు చూసి ఇంటికి వచ్చినప్పటినించీ తన భర్త ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని చింటూ తల్లి గమనించింది. సరదాగా ఏదో చెప్పబోయిన చింటూ కూడా తండ్రి మౌనం చూసి భయపడి తల్లి భోజనానికి పిలవటంతో అటు వెళ్ళిపోయాడు.

మర్నాడు ప్రొద్దునే నిద్రలేచి చూసిన చింటూ తల్లికి, భర్త బీడీ ప్యాకెట్లన్నీ చెత్తబుట్టలో పడేయటం కనిపించింది. అతనిలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏమిటా అని ఆలోచించగా ఆవిడకి ఒక రోజు చింటూ బడినించి వచ్చి చెప్పిన విషయం…

తన తండ్రి చాలా ఎక్కువగా బీడీ కాల్చడం చూసిన చింటూ తన తండ్రి చేత ఈ అలవాటు ఎలా మానిపించాలా అని మథనపడుతూ దిగులుగా ఉండటం గమనించిన క్లాస్‌ టీచరుగారు వాడిని దగ్గరికి పిలిచి ఏమైందని అడగటం, వాడు ఆవిడకి అసలు విషయం చెప్పటం, వాడికి దిగులుపడవద్దని ఈ విషయంలో వాడికి తాను తప్పక సహాయం చేస్తానని ధైర్యం చెప్పటం…. అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది.

అంటే బహుశ చింటూ టీచరుగారు వాడిసమస్యనే ఇలా నాటకంలా వ్రాసి దాని ద్వారా అందరికీ ఒక మంచి సందేశాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారని చింటూ తల్లి అర్థం చేసుకుంది.

భర్తచేత పొగత్రాగటం మానిపించాలని తాను చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఏదో ఒక విధంగా కనీసం ఇప్పటికైనా తన భర్తలో మార్పువచ్చింది. ఈ మార్పుకి కారణమైన తన కొడుకుని ”చింటూ” అంటూ అప్యాయంగా దగ్గరికి తీసుకుని కౌగలించుకుంది చింటూ తల్లి.

Share
This entry was posted in గల్పికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో