చలాన్ని మేమెందుకు మొయ్యాలి

జూపాక సుభద్ర

ఈ సారి పత్రికలు చలాన్ని మల్లా పెద్ద ఎత్తున చర్చకు తేవడం జరిగింది.

 కొన్ని పత్రికలు చలం సాహిత్యమ్మీద సమాజంలో వివిధ నేపధ్యాల నుంచి వచ్చిన స్త్రీల అభిప్రాయల్ని కూడా సేకరించడం మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు.  ఇది ఇన్నేండ్లు జరగలేదు.

ఇప్పటిదాకా చలంను, చలం సాహిత్యాన్ని సమాజంలోని స్త్రీలందరి మీద గంపగుత్తగా రుద్దిండ్రు.  అనేక రకాల సామాజిక నేపథ్యాల స్త్రీలు చలాన్ని ఎట్లా చూస్తున్నారనే ఆలోచన లేకుండా చలాన్ని స్త్రీలందరికీ సంస్కర్త అని ప్రచారం చేశారు.  అదే చెల్లుబాటనిపించుకున్నారు.  దళిత, కింది కులాల స్త్రీల మాటలు, గొంతులు నొక్కిపెట్టి చలం స్త్రీ సమాజాన్నంత ఉద్ధంచాడని ఏకపక్షంగా ప్రకటించుకున్నారు.  యిట్లాంటి సందర్భాల్లో కిందికులాల స్త్రీల అభిప్రాయాల్ని కూడా వినడం, గుర్తించడం ప్రజాస్వామికమైన అంశం.
చలం సాహిత్యం అగ్రహారాల స్త్రీల చుట్టూతనే తిరిగింది.  ఆ పరిధి వరకే చలం సాహిత్యాన్ని లెక్క గట్టాల్సిన అవసర వుంది.  ఆ పరిధిలో చలం గొప్ప సంస్కరణవాదే అనొచ్చు.  మంచి సాహిత్యకారుడని చెప్పొచ్చు.  కాని ఆ సంస్కరణ, సాహిత్యం సమాజానికంతటికి సంబంధం లేనిదైన ప్పుడు సమాజంలోని మిగతా దళిత కిందికులాల స్త్రీలందరు చలాన్ని ఎందుకు భరించాలి?
చలం బ్రాహ్మణ స్త్రీ సమస్యలకు సున్నితంగా, నిశితంగా, ఆర్ధ్రంగా, మానవీయంగా స్పందించొచ్చు.  ఆచారాల పేరుతో మూఢనమ్మకాల పేరుతో మగపెత్తనాల్ని అసమానతల్ని నిరసించి ఆ స్త్రీల స్వేచ్ఛకోసం రచనలు చేయొచ్చు.  కాని దళిత కులాల స్త్రీల పట్ల ఆ వైఖరి ఆ స్పందన ప్రదర్శించలేక పోయడు.  అగ్రహారాల స్త్రీల మెదడు గూర్చి, హృదయం గూర్చిన ఆలోచనలు, స్పందనల గూర్చి దుక్కపడిన చలంకు, స్త్రీలకు మెదడు, హృదయాలే కాదు, కులం, శ్రమ కూడా వున్నాయనే స్పృహ ఎందుక్కలగలేదో…
అట్లనే…. హృదయం, మెదడుతో పాటు కులం, శ్రమ వున్న ఆడవాళ్ళకు ఏమి అందించాలి అనే చర్చ చేయలేదు.  అట్లాంటప్పుడు కుల అణచివేతలు, శ్రమ దోపిడి, మగపెత్తనాలతో జోగిని, బసివి లాంటి దురాచారాలతో పీడించబడుతున్న దళిత కింది కులాల స్త్రీలు చలాన్ని నెత్తికెందుకు ఎత్తుకోవాలి?
సామాజిక ఉత్పత్తిలో దళిత కులాల స్త్రీల భాగస్వామ్యం కీలకం, అధికం.  కాని సాహిత్యంలో ఈ స్త్రీల సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద యిప్పటిదాకా ఎటువంటి భాగస్వామ్యాలు, ప్రాతినిధ్యాలు లేకపోవడం యాధృచ్ఛికం అనుకోవాలా! సమాజంలో వివిధ సామాజిక నేపథ్యాలున్న స్త్రీల ప్రత్యేక సమస్యల వైపు తొంగి చూడలేదు.  జెండర్‌ కంట్రోలు గూర్చే మాట్లాడిండు. సోషల్‌ కంట్రోల్‌లో వున్న జెండర్‌ కంట్రోలు సమస్యల్ని కన్నెత్తి చూడలేదు.
విషయమేంటంటే కింది కులాల స్త్రీల సమస్యలు దళిత కులాల స్త్రీల సమస్యలు రాయాలా, వద్దా, అనేది ఒక రచయితగా అతని సామాజిక స్పృహకు, వ్యక్తి స్వేచ్ఛకే వదిలేద్దాం.  కాని అభ్యంతరమల్లా చలం సాహిత్యాన్ని సమాజంలోని స్త్రీలందరి పరం చేయడంవల్లనే. 
చలాన్ని అగ్రహారాల స్త్రీ సంస్కర్తగానే చూస్తే మాకభ్యంతరం లేదు.  కాని స్త్రీలందరికి సంస్కర్తంటేనే వ్యతిరేకిస్తాం.   
– మాదికాని సాహిత్యాన్ని మా సమస్యల్తో ఎలాంటి ప్రమేయం, ప్రస్తావనలేని సాహిత్యాన్ని దళిత కింది కులాల స్త్రీలం ఎందుకు మోయాలి.
– బ్రాహ్మణ స్త్రీల పురోగతికి ఆటంకంగా వున్న సామాజిక రుగ్మతలను తొలగించడానికి చలం పెద్ద ఎత్తున సాహిత్య కృషి చేశాడు. 
– అంబేద్కర్‌ చెప్పినట్లు ఇండియాలో సంఘసంస్కరణ అంటే కుల నిర్మూలనే… స్వాతంత్ర్యానికి ముందు సంఘాన్ని సంస్కరించకపోతే ఎటు తిరిగితే అటు అడ్డం వచ్చే భూతంలా కుల వివక్ష నిలబడ్తుంది.  ఈ చైతన్యాలు చలానికి పట్టలేదు.
– సమాజం చూసినట్లే చలం కూడా దళిత స్త్రీలను వల్నరబుల్‌ సెక్స్‌సింబల్‌గానే చూసిండు తప్ప దానికి భిన్నంగా చూడలేదనేది ‘మాదిగమ్మాయి’  కథ చదివితే అర్థమవుతది.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to చలాన్ని మేమెందుకు మొయ్యాలి

  1. ఇది చలం సమస్యా…? మీ సమస్యా? లేక చలాన్ని మీ నెత్తిన రుద్దడానికి ప్రయత్నించిన పాతతరం మహిళా సాహితీవేత్తల సమస్యా?

    చలంకి అందరూ సెక్సుసింబల్సే, దళిత స్త్రీనికూడా చూస్తే తప్పొచ్చిందా?

    ప్రతి రచయితా అన్ని సమస్యలూ పట్టించుకొని వాటి గురించి రాయాలని లేదే, తనకు అనిపించిందీ, తను అనుభవించిందీ రాసాడు. బాపనోడు కాబట్ట్టి బ్రాహమణ్యాన్ని పీకిపాతరేసాడు. మనమూ మనకులాలలోని కుళ్ళుని అలాగే కడుగుదాం. సిద్దమేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో