వర్తమాన లేఖ – డా. శిలాలోలిత

ప్రియమైన ఓల్గాకు,

ఎలా ఉన్నారండి? మనం కలుసుకుని చాలా రోజులైంది. రష్యన్‌నదీ ప్రవాహమైన మీరు, లలిత స్వరంతోనే తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మీరంటే గొప్ప గౌరవం నాకు. జీవితం చాలా చిత్రమైంది. ఎవర్ని ఎప్పుడు ఎలా కలుపు తుందో తెలీదు. ఒక ఆత్మీయ బంధం మీతో పెనవేసుకు పోయింది. నేను ఎం.ఏ చదివే రోజుల్లో మీరు రాసిన ‘స్వేచ్ఛ’ నవల చదివాను. నేనొకచోట నిలవలేక పోయాను. ఎంత ఉద్వేగమో. జీవితాన్ని ఇలా కూడా అర్ధం చేసుకోవచ్చా? బతకొచ్చా! స్వేచ్ఛ ఇంత అద్భుతమైన సౌందర్యమా? అని ఒకటే ఆశ్చర్యం. ఎలాగైనా మిమ్మల్ని కలవాలనుకున్నాను. కానీ ఎలాగో తెలీదు. అసలు అంత బాగా రాసిన రచయిత్రిని నా జీవిత కాలంలో కలుసుకోగలనా అనే తపన ఉండేది. ఎట్లాగైనా కల్సుకోవాలనే ప్రేమ ఉండేది. ఆ తరువాత మీ ఒక్కొక్క రచనా చదవడం, ఏకలవ్య శిష్యురాలిగా మారటం, ఇలా కొంత కాలం గడిచిపోయింది. కాలం చాలా చిత్రమైంది. కనబడదుకానీ, కనికట్టు మంత్రాలన్నీ తెల్సు. ఎలా, ఎప్పుడు కలిసామో తెలీదుకానీ, కలుసుకున్న మరు నిముషం నుంచి మీ మీద ప్రేమ రెట్టింప యింది. స్త్రీల జీవితాన్ని గురించి మీరు పడుతున్న తపన, వేదన, వాళ్ళ జీవితాల్లో మార్పు ఖచ్చితంగా రావాలన్న మీ నిర్ణయ ప్రకటనలు నన్నెంతో ఆకర్షించాయి. స్త్రీవాద సిద్ధాంతాన్ని తెలుగునాట విస్తృతంగా ప్రచారం చేశారు. రకరకాల మీ సాహితీ ప్రక్రియల్లో అవి ప్రతిఫలించాయి. కవిత (1975లోనే రాశారు), కథలు, నవలలు, నాటికలు, ఏకాంకలు, విమర్శా వ్యాసాలు, సిద్ధాంత గ్రంధాల అనువాదాలు, స్త్రీవాద సిద్ధాంత వ్యాప్తి కొరకై రచనలు నృత్య రూపకాలు, సాహిత్య వ్యాసాలు, సంపాద కత్వం వహించిన ‘మాకు గోడలులేవు, నీలిమేఘాలు, మహిళావరణం వంటివి 10కిపైగా పుస్తకాలు, కథా సంకలనాలు, ప్రసంగాలు, ఉపవ్యాసాలు, సెమినార్‌ పేపర్లు, వివిధకార్యక్రమాల్లో మీరు వెలి బుచ్చిన అభిప్రాయాలు, దర్శకత్వం వహిం చిన మీ ప్రతిభా, ఇలా ఒకటేమిటి? బహురూపాల్లో మీ సాహితీకృషి నిరంతరం ఇలా … సాగుతూనే ఉంది. పాఠ్యాంశాల్లో కూడా మీ రచనలు ఉండటం వల్ల రేపటి తరానికి కూడా మీరు పరిచయమయ్యారు. గ్రూప్స్‌కి ప్రిపేర్‌ అయ్యే స్టూడెంట్స్‌ ఇప్పటికీ మీనంబర్‌ ఇవ్వగలరా అంటూ ఫోన్లు చేస్తుంటారు. ఒక తరాన్ని ప్రభావితం చేసిన అపురూపమైన వ్యక్తి నా దృష్టిలో మీరు. మీతో పరిచయం, స్నేహం నాకెంతో ఆనందాన్ని కల్గించే విషయం. నాపై మీ రచనల ప్రభావం చాలా ఉంది. ‘నీలిమేఘాలు’ తీసుకు రావడంలో మీ కృషి ఆ కాలంలో జరిగిన అద్భుతం. మళ్ళీ అలాంటి సంకలనం రావాల్సిన అవసరం ఇప్పుడుంది స్త్రీలకు తమ గొంతులను విన్పించే అవకాశాన్ని ఆ సంకలనం కలిగించింది. యూనివర్సిటీ స్థాయిలో పరిశోధనలు కూడా చాలా జరిగాయి. ఆ మధ్యన కల్సినప్పుడు నేనంటే నువ్వు కూడా చేస్తే కలిసి తీసుకొద్దాం అన్నారు గుర్తుందా? రైటర్స్‌ టూర్‌ మద్రాసు కి అస్మిత తరపున తీసుకెళ్ళారు. మిమ్మల్ని మరింత దగ్గరగా చూసే అవకాశం కలిగిం దప్పుడు. మీతో స్నేహం కూడా గాఢమైన సందర్భమనుకుంటా. నేనూ, కొండవీటి సత్యవతీ ఒక రూమ్‌లో ఉన్నామప్పుడు. విమల, రజని, సత్యవతిగారు, నిర్మల స్క్వేర్‌లు బాగా దగ్గరకొచ్చింది అక్కడే. ఇంతెందుకు గానీ ఒక్కమాటలో చెప్పాలంటే మీ ప్రేమికురాల్ని నేను. ఈ మధ్యన భూమికలో మీరు రాసిన కొత్త కథ చాలా ఆలోచనాత్మకంగా ఉంది. బయట కూడా చాలా మంది నాతో అదే మాటన్నారు. ‘పంచాది నిర్మల వారసురాల్ని’, చాలా పవర్‌ఫుల్‌ లాంగ్‌ పోయమ్‌ అది మెహందీ స్త్రీల గురించి, ఇంటిచాకిరీతో విసిగి పోతున్న స్త్రీల గురించి రాసిన కవితలు మరుపురానివి.

మీదగ్గర నేను నేర్చుకున్న విద్యలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మనిషెప్పుడూ నిత్య విద్యార్ధేకదా! ఏదయినా చెయ్యాలని సంకల్పిస్తే, ఎన్ని అవాంతరా లొచ్చినా, ఆగిపోరు అలిసిపోరు, ఓడిపోరు. కడదాకా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ చిర్నవ్వులో ఓ ప్రత్యేకత ఉంది. అదిష్టం కూడా నాకు. ఎందుకంటే అది మామూలు నవ్వుకాదు. మీకు ఏదైనా విషయం నచ్చనప్పుడు, ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా వినరు. వాళ్ళను కన్విన్స్‌ చేయడం కూడా అవసరం. అనుకున్నప్పుడు, నీ స్థాయి ఇదాఅనే అర్థంలో ఓ చిర్నవ్వు వాళ్ళ మొఖానపడేసి వెళ్ళిపోతారు. నాకెంత ఆశ్చర్యమో ఇప్పటికీ. జవాబును ఇంత క్లుప్తంగా కూడా చెప్పొచ్చా అని. మీరంటే నాకూ, యాకూబ్‌కే కాదు పెన్ను క్కూడా ఇష్టమే. ఎంతకీ ఆగడం లేదు. కానీ, ఒకపేజీకే పరిమితమైన ఉత్తరం రాయాలి కాబట్టి ఇవ్వాల్టికి రాయడం ఆపేస్తున్నాను. మీ గురించి రాయాల్సినవి ఎన్నో

ఉన్నాయింకా. ఆ మధ్యన టివి వాళ్ళు మమ్ముల్ని ఇంటర్వ్యూ చేస్తూ, నన్ను, సీతారాంను మీ గురించి మాట్లాడమన్నారు. వాళ్ళిచ్చిన టైంలో మీ గురించి మొత్తం చెప్పడం అసాధ్యమ నిపించింది. ఐనా చెప్పడానికే ప్రయత్నించా ననుకోండి.

ఆ మధ్యన మీ ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టిందని విన్నాను. ఎలా ఉన్నారు. ఇప్పుడిక మీ నుంచి ఇంకా విస్తృతంగా రచనలు రావాలని ఎదురు చూస్తుంటాను.

ఇట్లు మీ ప్రేమికురాలు

డా|| శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో