చలం – స్త్రీ – సాంఘిక వ్యవస్థ – కె. లలిత

”స్త్రీల సమస్యల గురించి ఎవరు రాసినా మాట్లాడినా వెంటనే వాళ్ళు చూపిన పరిష్కారం ఏమిటి అని అడగడం మామూలే. అంటే అట్లా రాసిన వాళ్ళందరూ తప్పకుండా అన్ని సమాధానాలూ ఇవ్వగలగాలి. లేకపోతే పనికిరారు. అంతేగాక ప్రతి విషయంలోనూ మనకు సంపూర్ణమైన సిద్ధాంతం అందివ్వాలి. ఒక వ్యవస్థగా సమస్యల్ని పరిశీలించి. విశ్లేషించి మనకు ఒక మూసలో ఇవ్వాలి అని ఆశిస్తారు.”

అధికారం, లైంగికత,కుటుంబ వ్యవస్థ, మాతృత్వం బిడ్డల పెంపకం, వైయక్తికత,స్త్రీల పని అనే ఎన్నో రకాల అంశాలను ఫెమినిస్టు ఉద్యమం ‘రాజకీయాలలో’ ప్రధాన భాగాలుగా రూపొందించటంలో విజయం సాధించింది. వీటి గురించి విస్తృతమైన చర్చలు ప్రపంచమంతటా, మనదేశంలోనూ జరుగుతున్నాయన్న విషయం తిరిగి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ ప్రస్తుత వాతావరణంలో చలం దృక్పథం – ఆయన ప్రధానంగా స్త్రీల గురించి, సాంఘిక వ్యవస్థ కట్టుబాట్ల గురించి చేసిన ఎన్నో రచనలను పునర్విమర్శ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన రచనల్లో మనకు ప్రధానంగా కనిపించే విలువలు ఏమిటి? ఆ రచనలను ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? వీటిని ఎవరు ఆమోదించారు? ఎవరు వ్యతిరేకించారు ? – అనే ప్రశ్నలు వేసుకోవలసిన అవసరం ఉంది.

చలం స్త్రీకి చూపిన పరిష్కార మార్గం ఏమిటి అనే ప్రశ్న మనకు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలోఎన్నో అర్థాలు కనపడతాయి. స్త్రీల సమస్యల గురంచి ఎవరు రాసినా మాట్లాడినా వెంటనే వాళ్ళు చూపిన పరిష్కారం ఏమిటి అని అడగడం మామూలే. అంటే అట్లా రాసిన వాళ్లందరూ తప్పకుండా అన్ని సమాధానాలూ ఇవ్వగలగాలి. లేకపోతే పనికి రారు. అంతేగాక ప్రతి విషయంలోనూ మనకు సంపూర్ణమైన సిద్ధాంతం అందివ్వాలి. ఒక వ్యవస్థగా సమస్యల్ని పరిశీలించి, విశ్లేషించి మనకు ఒక మూసలో ఇవ్వాలి అని ఆశిస్తారు. నా ఉద్దేశ్యంలో చలం అట్లాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. మొత్తం సమాజానికి ఒక పరిపూర్ణమైన సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించినట్లు గాని, అటువంటి సిద్ధాంతాల్ని ఆయన నమ్మినట్టుగానీ మనక్కనిపించదు. కాకపోతే ఆయన రచనల న్నింటిలోను ప్రధానంగా స్త్రీల గురించే రాశాడనటంలో ఏం సందేహం లేదు. కాని విషయాలను సిద్ధాంతాల కింద మార్చే ప్రయత్నం చేయలేదు. తన జీవితంలో చూసినవీ, అనుభవించినవీ, అర్థం చేసుకున్నవీ, ఊహించినవీ అన్నీ తన రచనల్లో వ్యక్తం చేశాడు. అప్పటి కాల పరిస్థితులను పట్టి ఆయన చైతన్యాన్ని, చూసిన వాస్తవాల పట్ల ఆయన అవగాహనను పరిశీలిస్తే చలం రాసిన విషయాలకు ఒక పరిమితి ఉండవచ్చు. కానీ ఇవాళ మనకున్న అవగాహనతో, 1920ల నుంచి 50 వరకు రచనలు చేసి ఒక సంచలనాన్ని సృష్టించిన చలంను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయ్యాలే తప్ప మన దృక్పథాన్ని ఆయన నెత్తిన రుద్దకూడదు. ఇవాళ మనను చాలా మంది అడిగే ప్రశ్నలు కూడా ఇవే. మీరు స్త్రీ విముక్తి ఎలా కలుగుతుందంటారు? మొత్తం సమాజంలో భాగంగానేనా లేక స్త్రీ విప్లవం ప్రత్యేకమైనదా? స్త్రీ విముక్తి అంటే సెక్స్‌ విశృంఖలత్వమా? అసలు మీకొక సిద్ధాంతం ఉందా?

మనం ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా తయారు చేసి అందివ్వకపోతే మనం చెప్పేదానికేమీ విలువ ఉండదన్న మాట. మనం చాలా గందరగోళంలో ఉన్నామనీ, ఏ పాశ్చాత్య దేశాల ప్రభావంలోనో మన ఉనికినీ, మన పరిస్థితుల ప్రత్యేకతనీ మర్చిపోతున్నామనో దాడి మొదలవుతుంది. పరిపూర్ణమైన సిద్ధాంతాల్ని నమ్మేవాళ్ళు చేప్పే దానిలోకూడా ఎన్నో అంతుపట్టని విషయాలుంటాయని మనం మర్చిపోకూడదు. అందుకే ఏ విషయాన్నయినా అర్థం చేసుకోవడానికి ముందు దాని మంచీ, చెడూ గమనించే అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20లలో సంస్కరణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆ ఉద్యమంకంటే ఎన్నో అడుగులు ముందుకెళ్ళి రచనలు చేసిన చలాన్ని ఇదే ప్రశ్న అడిగితే ఇల్లా సమాధానం చెప్పాడు. ”స్త్రీలని తిరగబడమనటమే కాని అభ్యుదయమిచ్చే మార్గం చూపలేదుట చలం, దేని కోసం తిరగబడమనడం! చావు, ఒదులు, దూకు అనే రాజకీయ నాయకున్ని అడగరేం ఆ మాటలు? చచ్చి, దూకి, ఒదిలి, మనుషులు ఒక బానిసత్వం నుంచి ఇంకో బానిసత్వానికి పాకడం కనపట్టం లేదా? .. ఒక్క గంతులో స్వతంత్రం పొందే మంత్రం స్త్రీకి చలం చూపాలా? ఎన్నిబైట దాస్యాలు వదిలితే లోపలి భావదాస్యం వదులుతుంది మనుషులకి!…. ”(మ్యూజింగ్స్‌ పే. 380)”

తను చెప్పిందే సరైన మార్గమని చెప్పే అధికారం తనకు లేదని గుర్తించిన చలం ”ప్రజల మీదా, వారి స్వంత అభిప్రాయాల మీదా, వారి స్వేచ్ఛ మీదా నాకు గౌరవం ఉండటం చేత ప్రతి వారి మీదా, వారి స్వేచ్ఛ మీదా నాకు గౌరవం ఉండటం చేత ప్రతి వారి మార్గము, సత్యమనే విశ్వాసం చేత – నా మార్గం కొంత కొంత సూచనలకే గాని, యావత్తు నాకు గాక, ఇంకెవరికీ సరిగా సరిపోదు అని తెలీటం వల్ల ప్రజలకి మొత్తం మీద ఈ మార్గం మంచిదనిరాయడమున్నూ, ప్రత్యేకం ఒకరితో ఇది నీకు మంచిదని చెప్పడమన్ను రెండూ వేరే సంగతులు” అందుకే పరిష్కార మార్గం అనేకంటే, స్త్రీల సమస్యనర్థం చేసుకోవటానికి మనకు చలం చేసిన రచనలు ఎంత వరకు ఉపయోగపడతాయని అడగటం సమంజసం. అప్పటి స్త్రీల పరిస్థితిని రచయిత ఏ విధంగా చిత్రించాడు? అది వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది? జీవితంలో ఎటువంటి అనుభవాన్ని ఆయన చూశాడు? ఆయన అనుభవాన్నించి రచనల్నించి మనం ఇప్పుడు నేర్చుకో గలిగేదేమిటి? – అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించటానికి ప్రయత్నించదలచుకున్నాను.

చలం రచనలు రాకముందు స్త్రీ పరిస్థితి ఎట్లా ఉండేది? అప్పటి సాంఘిక పరిస్థితులు ఏమిటి? అని క్లుప్తంగా పరిశీలిస్తే వాటి నుంచి చలం ముందుకు వెళ్లిందీ లేనిదీ మనకు బోధపడుతుంది. 1850 ప్రాంతంలో బెంగాల్లోని మేధావి వర్గంలో మొదలైంది సంఘ సంస్కరణోద్యమం. (1825లో ప్రారంభమైంది బ్రహ్మ సమాజం) బ్రిటీషు వాళ్ల దృష్టిలో భారతీయులు – మనల్ని మనం పాలించుకోలేని అసమర్ధులం. తక్కువజాతి వాళ్లం. స్త్రీలని హింసించే మూర్ఖులం, తెల్లవాళ్లకి సమాధానం చెప్పటానికి, మన జాతి ఔన్నత్యాన్ని తెలియజెయ్యటానికి మొదలైంది సంఘ సంస్కరణ ఉద్యమం. దీని ధ్యేయం ముఖ్యంగా మనం గుడ్డి విగ్రహారాధన చేసే హిందూ మత మూఢులం కాదనీ, సతీసహగమనం లాంటి సంప్రదాయాలతో స్త్రీలని దారుణంగా హింసించే జాతి కాదనీ నిరూపించుకోవటం. అదే మొదలు బ్రహ్మ సమాజానికి. ఈ ఉద్యమంలో సంస్కర్తలందరూ వారి వారి రచనలలో భారతీయ స్త్రీ ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నదో చూపించేందుకు ప్రయత్నం చేశారు.

ఈ ఉద్యమం తొలిదశలో సంస్కర్తలు సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. తర్వాత్తర్వాత స్త్రీ ఆరోగ్యం, స్వేచ్ఛ, స్త్రీ విద్య, ఆస్తి హక్కుల వంటి విషయాలను గురించి కృషి చేయటం ప్రారంభమైంది. ఆంధ్రలో బ్రహ్మసమాజం 1864లో ప్రారంభమైంది. 1916 ప్రాంతంలో చలం బ్రహ్మ సమాజంలో చేరాడు. (ఆంధ్రలో చలం పే. 604) దాదాపు 1920ల వరకు అందులో పనిచేశాడు. బ్రహ్మ సమాజంలో చేరక ముందే తన ఇంట్లో ఆడవాళ్లనీ, పిల్లల్నీ పొట్టి నిక్కర్లేయించి బాడ్మింటన్‌ ఆడటానికి తీసుకెళ్లటం లాంటిపనులు చేశాడు. ఈనాడవి అంత గొప్ప విషయాలనిపించకపోవచ్చు. కాని అప్పటి వాళ్లకవన్నీ విపరీతంగా కనిపించాయనడంలో ఆశ్చర్యంలేదు. వీళ్లు బజార్ల గుండా వెళ్తుంటే ఎంతో మంది విపరీత వ్యాఖ్యానాలు చేసేవారు. ఉమ్ములూసే వారు అట్లా చలం తన వ్యక్తిగత జీవితంలోనే సమాజాన్నెదిరించి తాను చెప్పింది చేశాడు. బ్రహ్మ సమాజంలో విగ్రహారాధనని, కులభేదాలనీ, వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాడు. ముందు హేతువాదాన్ని నమ్మిన బ్రహ్మ సమాజం ఆ తర్వాత సంప్రదాయంతో రాజీపడటాన్ని చలం విమర్శించటం మొదలు పెట్టాడు. హిందూమతాన్ని విమర్శించిన బ్రహ్మ సమాజం కుటుంబ జీవితంలో స్త్రీ పురుష సంబంధాలు అనే హిందూ విలువలను పుణికి పుచ్చుకుంది. దాంట్లోని ప్యూరిటానిజంని చలం విమర్శించాడు. రత్నమ్మతో చలానికి సంబంధం ఏర్పడ్డప్పుడు బ్రహ్మసమాజం ఆయన్ని వెలివేసింది. ఇక జాతీయోద్యమం సంగతి చూస్తే, అదీ చలంను అంతగా ఆకర్షించలేదని చెప్పాలి. ”కుటుంబ జీవితంలోనూ, స్త్రీ విషయంలోనూ, సాంఘిక నీతుల విషయంలోను, చాలా సంకుచితంగా, దుర్మార్గంగా ప్రవర్తించే వారినీ, కులమత భావాల్ని వదలని వారినీ, వ్యక్తిగతంగా నిజాయితీ లేని వారినీ, అవకాశ వాదుల్నీ జాతీయోద్యమంలో ఎక్కువగా చూసి, ఆ ఉద్యమ రాజకీయాల వల్ల ప్రభావితుడు కాలేకపోయారు”. (చలం సాహిత్యం – రంగనాయకమ్మ – పే. 130) దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా స్త్రీకి సంపూర్ణ స్వతంత్రం ప్రభుత్వపు కాగితాలలో మాత్రమే ఉండటాన్ని గురించి 52లో రాశాడు చలం. (1952 సంపుటిలో స్త్రీకి రాసిన ముందు మాట ”ఇంకోసారి మళ్లీ తప్పలేదు” పేజీ 20-25) ”ఆస్తినంతా లాగేస్తూ, ఆస్తి హక్కుని స్త్రీకి ఇచ్చి ఏం లాభం? బతుకంతా బానిసత్వం చేసి, భర్తనుంచి స్వేచ్ఛనిచ్చి ఏం లాభం?” అంటూ ఆస్తి హక్కు, విడాకుల చట్టాలకున్న పరిమితులను బయటపెట్టాడు. ఇది వరకు భర్తను వదిలి స్త్రీ ఇంకొక పురుషున్ని పెళ్లి చేసుకోవచ్చని చట్టం చెప్పగానే ఇంత వరకు ఆ స్త్రీని వ్యభిచారిగా లెక్క గట్టిన సంఘం ఒక్కసారి ఆమెను పతివ్రతనెట్లా చేసిందని ఎద్దేవ చేశాడు. వ్యక్తి జీవితాన్ని సంఘం అదుపు చేయడం చలానికి ఆమోదయోగ్యం కాదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఎంత మంది పిల్లల్ని కనాలి. ఎప్పుడు కనాలనే ప్రశ్నలన్నీ కూడా ”జాతీయం” అయిపోయాయని బాధపడ్డాడు. మనం ఈ రోజు చర్చిస్తున్న సాంఘిక వ్యవస్థ, నీతి, ధర్మాలు, ప్రభుత్వం / రాజ్యం – నీతి. ధర్మాలు – వాటిలో వ్యక్తికున్న స్వేచ్ఛ అనే అంశాలన్నీ స్ఫురిస్తాయనడం అతిశయోక్తి కాదు.

1921 నుంచి ప్రారంభించి 1945 వరకు చాలా వరకు నాటకాల్ని, నవలల్ని ఇతర రచనల్నీ చలం రాయటం జరిగింది. 24లో ఆయన రాసిన వాటిల్లో బిడ్డల శిక్షణ, ఇంగ్లీషులో మాన్‌ ఆండ్‌ ఉమెన్‌లు., 25లో స్త్రీ… 1939లో మ్యూజింగ్స్‌ ముఖ్యమైనవి. ఆయన తన రచనల్లో వివాహం, సెక్స్‌ సంబంధాలు, విద్యా విధానం, సంస్కరణ, వ్యక్తిత్వం, వ్యక్తి చైతన్యం, వ్యక్తి విలువలు, సమాజంలోని ద్వంద్వ విలువలు, కళలు, సంగీతం, సాహిత్యం – ఒకటి కాకుండా తను చూసినవన్నీ విమర్శనాత్మకంగా పరిశీలించి రాశాడు. అన్నింటికంటే ఎక్కువ మొదటి నుంచి ఆయన్ని బాధించింది స్త్రీ స్వేచ్ఛ అనే అంశం. తన స్వంత చెల్లెలు అమ్మణ్ణి విషయంలో తాను పడ్డ బాధ, ఎదుర్కొన్న వైరుధ్యాల గురించి ఆత్మకథలో రాశాడు. తన చెల్లెలి అనుభవం అయిన మొదలు ”అత్తవారింట స్త్రీ ఏం బాధలు పడుతుందో, ఏ విధంగా వాళ్ల మెదళ్లని అత్తవారు ఎలా నలిపివేస్తారో అర్థమయింది. ఆ రోజున స్త్రీ జనరక్షణోద్యమానికి ప్రారంభోత్సవం జరిగింది. స్త్రీ సంస్కరణ అంటే ఏమిటో తెలిసి వచ్చింది నాకు” (ఆత్మకథ పేజీ – 23) అంటూ రాస్తాడు. ”నేను వాంఛించే మార్పు వివాహంలో ఉన్న అక్రమాలు అన్యాయాలు పోవాలని. ఈ దుర్మార్గాలు వదిలించినంత మాత్రాన అసలు చచ్చేటంత దుర్భరం కాదు వివాహం…. వివాహం అయినంత మాత్రాన సర్వమూ నీతిగా తలచడమూ, కానంత మాత్రాన అవినీతి అనడమూ మూర్ఖమని నా వాదన! ఇట్లాంటివి బోధిస్తే ఈ ప్రజలకి కోపమెందుకంటే వాళ్ళ హృదయాలు విప్పి చూపగల యంత్రమో, మంత్రమో ఉంటే అర్థమవుతుంది. పురుషులకి – స్త్రీ మీద తమకి చలామణి అవుతున్న హక్కులు పోతాయి అనీ, స్త్రీకి – పురుషులు పెడుతూ ఉంటే సుఖంగా బద్దకంగా బతికే భాగ్యం వదులుకోవలసి వస్తుందని భయం… (మ్యూజింగ్స్‌ పేజీ -34) అంటూ వివాహవ్యవస్థని చీల్చిచెండాడాడు. అది వరకు ఇంత సాహసం ముందెవరూ చేయలేదు. సమాజం స్త్రీని ఒక మనిషిగా చూడదనీ, ఇంటి కోసం, యజమానికీ, పిల్లలకీ తన అభిరుచుల్ని, సుఖాన్ని, సంతోషాన్ని, శరీరాన్ని, ఆత్మ గౌరవాన్ని అన్నిటినీ వదులుకునేట్లు చేస్తుందని సమాజం మీద దాడి చేశారు (మాన్‌ అండ్‌ ఉమెన్‌లో 1924), స్త్రీని భార్యగా, తల్లిగా గుర్తించి గౌరవిస్తున్నామంటూనే, ఆమె ‘సుకుమారమైన’ చేతులు గిన్నెలు తోమడానికీ, ‘బలహీనమైన మెదడు’ ఇంటిని నడపడానికీ, ‘వంకరబుద్ధి’ ముందు తరాన్ని తయారు చెయ్యడానికీ ఉపయోగిస్తారన్నాడు. ఇవన్నీ కాకుండా చట్టాలు ఆస్తి హక్కుల విషయంలో కూడా స్త్రీల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో వివరించాడు. మగవాళ్ల లాగానే స్త్రీలూ గొప్ప, మధ్యతరగతి, బీద అని మూడు వర్గాలనీ మొదటి రెండు వర్గాలూ తమ స్వంత సంపాదనైనా లేకుండా భర్తల మీద ఆధారపడతారనీ, బీద వర్గం స్త్రీకి ఆ సంపాదనున్నా అది భర్త అజమాయిషీలోనే ఉంటుందని, భర్త ఆధీనంలో స్త్రీ శ్రమ, సంపాదన ఉన్నంత వరకూ బీద స్త్రీకైనా స్వతంత్రత లేదనీ వాదించాడు. మగవాళ్ల అవసరాలు ఇంటి దగ్గిర తీరుస్తూ స్త్రీలు వాళ్లని ప్రపంచంలోకి వెళ్లే స్వేచ్ఛని కలిగిస్తున్నారన్న మాట ఆనాడే (1924లో) చలం చెప్పాడు.

పిల్లల్ని కన డం అనే ప్రకృతి సహజమైన అంశం కోసం స్త్రీ తన ఇతర బాధ్యతలు (పని, ఉద్యోగం) వదులుకోవడం కృత్రిమమని అందుకే పిల్లల్ని చూసే కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ కూడా చెప్పాడు. ”బిడ్డలు ఆఖ్ఖర్లేదనుకుంటే గర్భనిరోధక సాధనాలు ఉపయోగించడం న్యాయం కాని గర్భం కలుగుతుందేమోనని భయంతో బతకడం ఘోరం… బిడ్డలు ఆఖ్ఖర్లేదనుకున్న వాళ్లకి గర్భం కలిగితే, తగిన డాక్టర్ల చేత అది తీయించుకోవడం ఉత్తమం” (బిడ్డల శిక్షణ పే. 130) అని గర్భనిరోధం, అబార్షన్ల గురించి చట్టవిరుద్దమని తెలిసే ధైర్యంగా సూచనలిచ్చాడు. మనం ఇవాళ స్త్రీకి తన శరీరం మీద సెక్సువాలిటీ మీద తనకే హక్కుండాలి అని నమ్మే విషయాన్ని ఆనాడే చలం చెప్పాడంటే అది మామూలు మాట కాదని గుర్తుంచుకోవాలి. పిల్లలు పుడితే సంఘంలో ఎదురయ్యే చిక్కులు గుర్తించిన చలం కొందరు స్త్రీలు అసలు పిల్లలు కావాలనుకోక పోవచ్చునని కూడా అన్నాడు. అటువంటి వాళ్లు బలవంతంగా పిల్లల్ని ఎందుకు కనాలని సంఘాన్ని నిలదీసిన వాళ్లు (ఇప్పుడు ఫెమినిష్టులే కాని) ఇంకొకరెవరూ కనిపించరు. గర్భనిరోధక మార్గాల్ని గురించి వివరంగా రాశాడు చలం (గర్భనివృత్తి మార్గాలు). ఇప్పుడు ఫెమినిస్టులు మంచి పద్ధతిగా చెప్పే డయాఫ్రమ్‌ స్పొంజిలు గురించి, కాండోమ్‌ల గురించి (స్త్రీ పేజి 177-79) రాశాడు. ఇన్ని విషయాల గురించి ఇంత వివరంగా స్త్రీని సంబోధిస్తూ రాశాడు గనకనే చలాన్ని అంతగా ఆసహ్యించుకుంది ఈ సంఘం. ఆయన పుస్తకాలు చదివితే చెడిపోతారని నెత్తీనోరు బాదుకుంది. స్త్రీలకు విశృంఖలత్వం నేర్పిస్తున్నాడని దూషించింది. ఈ పెద్ద మనుషులంతా స్త్రీ స్వేచ్ఛ అంటేనే ఆశ్లీలం అనుకునే రకాలు. అందుకే ఫెమినిస్టు

ఉద్యమంపైన కూడా అదే విమర్శ ఉంటే ఆశ్చర్యమేముంది?

స్త్రీ స్థానానికి సంబంధించి మతాన్ని, కులాన్ని, సంప్రదాయాన్ని, సంఘాన్ని అన్నింటినీ తప్పుపట్టాడు చలం. ఆమెని తన స్వంతం చేసుకోవటానికి పురుషుడు ఎట్లా ప్రయత్నిస్తాడో ఎద్దేవా చేశాడు.

ఒక గార్డియన్‌గా రక్షకుడు అనే పేరుతో, నిజానికి సిఐడి ఆఫీసరుగా, పోలీసువాడిగా, మేజిస్ట్రేటుగా చివరికి హైయస్ట్‌కోర్ట్‌ ఆఫ్‌ అప్పీలుగా, జైలరుగా, ఉరితీసే వాడుగా అన్ని రూపాల్నీ భర్త ఎట్లా ధరిస్తాడని చాలా వ్యంగ్యంగా చెప్పాడు. ఆమె మీద తను చెలాయించే పెత్తనాలన్నిటినీ వదిలేయాలని (మాన్‌ అండ్‌ ఉమెన్‌) ఆయన చెప్పాడు. ఆ జ్ఞానం ఇప్పటికి మాత్రం ఎంత మందిలో

ఉంది? కాలక్రమంలో మారిన పురుషులకి అనుగుణంగా మాత్రమే స్త్రీ కూడా మారుతూ వచ్చిందని చలం చెప్పినది ఈ నాటికీ నిజమే. మీదా, వారి స్వేచ్ఛ మీదా నాకు గౌరవం ఉండటం చేత ప్రతి వారి మార్గము, సత్యమనే విశ్వాసం చేత – నా మార్గం కొంత కొంత సూచనలకే గాని, యావత్తు నాకు గాక, ఇంకెవరికీ సరిగా సరిపోదు అని తెలీటం వల్ల ప్రజలకి మొత్తం మీద ఈ మార్గం మంచిదనిరాయడమున్నూ, ప్రత్యేకం ఒకరితో ఇది నీకు మంచిదని చెప్పడమన్ను రెండూ వేరే సంగతులు” అందుకే పరిష్కార మార్గం అనేకంటే, స్త్రీల సమస్యనర్థం చేసుకోవటానికి మనకు చలం చేసిన రచనలు ఎంత వరకు ఉపయోగపడతాయని అడగటం సమంజసం. అప్పటి స్త్రీల పరిస్థితిని రచయిత ఏ విధంగా చిత్రించాడు? అది వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది? జీవితంలో ఎటువంటి అనుభవాన్ని ఆయన చూశాడు? ఆయన అనుభవాన్నించి రచనల్నించి మనం ఇప్పుడు నేర్చుకో గలిగేదేమిటి? – అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించటానికి ప్రయత్నించదలచుకున్నాను.

చలం రచనలు రాకముందు స్త్రీ పరిస్థితి ఎట్లా ఉండేది? అప్పటి సాంఘిక పరిస్థితులు ఏమిటి? అని క్లుప్తంగా పరిశీలిస్తే వాటి నుంచి చలం ముందుకు వెళ్లిందీ లేనిదీ మనకు బోధపడుతుంది. 1850 ప్రాంతంలో బెంగాల్లోని మేధావి వర్గంలో మొదలైంది సంఘ సంస్కరణోద్యమం. (1825లో ప్రారంభమైంది బ్రహ్మ సమాజం) బ్రిటీషు వాళ్ల దృష్టిలో భారతీయులు – మనల్ని మనం పాలించుకోలేని అసమర్ధులం. తక్కువజాతి వాళ్లం. స్త్రీలని హింసించే మూర్ఖులం, తెల్లవాళ్లకి సమాధానం చెప్పటానికి, మన జాతి ఔన్నత్యాన్ని తెలియజెయ్యటానికి మొదలైంది సంఘ సంస్కరణ ఉద్యమం. దీని ధ్యేయం ముఖ్యంగా మనం గుడ్డి విగ్రహారాధన చేసే హిందూ మత మూఢులం కాదనీ, సతీసహగమనం లాంటి సంప్రదాయాలతో స్త్రీలని దారుణంగా హింసించే జాతి కాదనీ నిరూపించుకోవటం. అదే మొదలు బ్రహ్మ సమాజానికి. ఈ ఉద్యమంలో సంస్కర్తలందరూ వారి వారి రచనలలో భారతీయ స్త్రీ ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నదో చూపించేందుకు ప్రయత్నం చేశారు.

ఈ ఉద్యమం తొలిదశలో సంస్కర్తలు సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. తర్వాత్తర్వాత స్త్రీ ఆరోగ్యం, స్వేచ్ఛ, స్త్రీ విద్య, ఆస్తి హక్కుల వంటి విషయాలను గురించి కృషి చేయటం ప్రారంభమైంది. ఆంధ్రలో బ్రహ్మసమాజం 1864లో ప్రారంభమైంది. 1916 ప్రాంతంలో చలం బ్రహ్మ సమాజంలో చేరాడు. (ఆంధ్రలో చలం పే. 604) దాదాపు 1920ల వరకు అందులో పనిచేశాడు. బ్రహ్మ సమాజంలో చేరక ముందే తన ఇంట్లో ఆడవాళ్లనీ, పిల్లల్నీ పొట్టి నిక్కర్లేయించి బాడ్మింటన్‌ ఆడటానికి తీసుకెళ్లటం లాంటిపనులు చేశాడు. ఈనాడవి అంత గొప్ప విషయాలనిపించకపోవచ్చు. కాని అప్పటి వాళ్లకవన్నీ విపరీతంగా కనిపించాయనడంలో ఆశ్చర్యంలేదు. వీళ్లు బజార్ల గుండా వెళ్తుంటే ఎంతో మంది విపరీత వ్యాఖ్యానాలు చేసేవారు. ఉమ్ములూసే వారు అట్లా చలం తన వ్యక్తిగత జీవితంలోనే సమాజాన్నెదిరించి తాను చెప్పింది చేశాడు. బ్రహ్మ సమాజంలో విగ్రహారాధనని, కులభేదాలనీ, వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాడు. ముందు హేతువాదాన్ని నమ్మిన బ్రహ్మ సమాజం ఆ తర్వాత సంప్రదాయంతో రాజీపడటాన్ని చలం విమర్శించటం మొదలు పెట్టాడు. హిందూమతాన్ని విమర్శించిన బ్రహ్మ సమాజం కుటుంబ జీవితంలో స్త్రీ పురుష సంబంధాలు అనే హిందూ విలువలను పుణికి పుచ్చుకుంది. దాంట్లోని ప్యూరిటానిజంని చలం విమర్శించాడు. రత్నమ్మతో చలానికి సంబంధం ఏర్పడ్డప్పుడు బ్రహ్మసమాజం ఆయన్ని వెలివేసింది. ఇక జాతీయోద్యమం సంగతి చూస్తే, అదీ చలంను అంతగా ఆకర్షించలేదని చెప్పాలి. ”కుటుంబ జీవితంలోనూ, స్త్రీ విషయంలోనూ, సాంఘిక నీతుల విషయంలోను, చాలా సంకుచితంగా, దుర్మార్గంగా ప్రవర్తించే వారినీ, కులమత భావాల్ని వదలని వారినీ, వ్యక్తిగతంగా నిజాయితీ లేని వారినీ, అవకాశ వాదుల్నీ జాతీయోద్యమంలో ఎక్కువగా చూసి, ఆ ఉద్యమ రాజకీయాల వల్ల ప్రభావితుడు కాలేకపోయారు”. (చలం సాహిత్యం – రంగనాయకమ్మ – పే. 130) దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా స్త్రీకి సంపూర్ణ స్వతంత్రం ప్రభుత్వపు కాగితాలలో మాత్రమే ఉండటాన్ని గురించి 52లో రాశాడు చలం. (1952 సంపుటిలో స్త్రీకి రాసిన ముందు మాట ”ఇంకోసారి మళ్లీ తప్పలేదు” పేజీ 20-25) ”ఆస్తినంతా లాగేస్తూ, ఆస్తి హక్కుని స్త్రీకి ఇచ్చి ఏం లాభం? బతుకంతా బానిసత్వం చేసి, భర్తనుంచి స్వేచ్ఛనిచ్చి ఏం లాభం?” అంటూ ఆస్తి హక్కు, విడాకుల చట్టాలకున్న పరిమితులను బయటపెట్టాడు. ఇది వరకు భర్తను వదిలి స్త్రీ ఇంకొక పురుషున్ని పెళ్లి చేసుకోవచ్చని చట్టం చెప్పగానే ఇంత వరకు ఆ స్త్రీని వ్యభిచారిగా లెక్క గట్టిన సంఘం ఒక్కసారి ఆమెను పతివ్రతనెట్లా చేసిందని ఎద్దేవ చేశాడు. వ్యక్తి జీవితాన్ని సంఘం అదుపు చేయడం చలానికి ఆమోదయోగ్యం కాదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఎంత మంది పిల్లల్ని కనాలి. ఎప్పుడు కనాలనే ప్రశ్నలన్నీ కూడా ”జాతీయం” అయిపోయాయని బాధపడ్డాడు. మనం ఈ రోజు చర్చిస్తున్న సాంఘిక వ్యవస్థ, నీతి, ధర్మాలు, ప్రభుత్వం / రాజ్యం – నీతి. ధర్మాలు – వాటిలో వ్యక్తికున్న స్వేచ్ఛ అనే అంశాలన్నీ స్ఫురిస్తాయనడం అతిశయోక్తి కాదు.

1921 నుంచి ప్రారంభించి 1945 వరకు చాలా వరకు నాటకాల్ని, నవలల్ని ఇతర రచనల్నీ చలం రాయటం జరిగింది. 24లో ఆయన రాసిన వాటిల్లో బిడ్డల శిక్షణ, ఇంగ్లీషులో మాన్‌ ఆండ్‌ ఉమెన్‌లు., 25లో స్త్రీ… 1939లో మ్యూజింగ్స్‌ ముఖ్యమైనవి. ఆయన తన రచనల్లో వివాహం, సెక్స్‌ సంబంధాలు, విద్యా విధానం, సంస్కరణ, వ్యక్తిత్వం, వ్యక్తి చైతన్యం, వ్యక్తి విలువలు, సమాజంలోని ద్వంద్వ విలువలు, కళలు, సంగీతం, సాహిత్యం – ఒకటి కాకుండా తను చూసినవన్నీ విమర్శనాత్మకంగా పరిశీలించి రాశాడు. అన్నింటికంటే ఎక్కువ మొదటి నుంచి ఆయన్ని బాధించింది స్త్రీ స్వేచ్ఛ అనే అంశం. తన స్వంత చెల్లెలు అమ్మణ్ణి విషయంలో తాను పడ్డ బాధ, ఎదుర్కొన్న వైరుధ్యాల గురించి ఆత్మకథలో రాశాడు. తన చెల్లెలి అనుభవం అయిన మొదలు ”అత్తవారింట స్త్రీ ఏం బాధలు పడుతుందో, ఏ విధంగా వాళ్ల మెదళ్లని అత్తవారు ఎలా నలిపివేస్తారో అర్థమయింది. ఆ రోజున స్త్రీ జనరక్షణోద్యమానికి ప్రారంభోత్సవం జరిగింది. స్త్రీ సంస్కరణ అంటే ఏమిటో తెలిసి వచ్చింది నాకు” (ఆత్మకథ పేజీ – 23) అంటూ రాస్తాడు. ”నేను వాంఛించే మార్పు వివాహంలో ఉన్న అక్రమాలు అన్యాయాలు పోవాలని. ఈ దుర్మార్గాలు వదిలించినంత మాత్రాన అసలు చచ్చేటంత దుర్భరం కాదు వివాహం…. వివాహం అయినంత మాత్రాన సర్వమూ నీతిగా తలచడమూ, కానంత మాత్రాన అవినీతి అనడమూ మూర్ఖమని నా వాదన! ఇట్లాంటివి బోధిస్తే ఈ ప్రజలకి కోపమెందుకంటే వాళ్ళ హృదయాలు విప్పి చూపగల యంత్రమో, మంత్రమో ఉంటే అర్థమవుతుంది. పురుషులకి – స్త్రీ మీద తమకి చలామణి అవుతున్న హక్కులు పోతాయి అనీ, స్త్రీకి – పురుషులు పెడుతూ ఉంటే సుఖంగా బద్దకంగా బతికే భాగ్యం వదులుకోవలసి వస్తుందని భయం… (మ్యూజింగ్స్‌ పేజీ -34) అంటూ వివాహవ్యవస్థని చీల్చిచెండాడాడు. అది వరకు ఇంత సాహసం ముందెవరూ చేయలేదు. సమాజం స్త్రీని ఒక మనిషిగా చూడదనీ, ఇంటి కోసం, యజమానికీ, పిల్లలకీ తన అభిరుచుల్ని, సుఖాన్ని, సంతోషాన్ని, శరీరాన్ని, ఆత్మ గౌరవాన్ని అన్నిటినీ వదులుకునేట్లు చేస్తుందని సమాజం మీద దాడి చేశారు (మాన్‌ అండ్‌ ఉమెన్‌లో 1924), స్త్రీని భార్యగా, తల్లిగా గుర్తించి గౌరవిస్తున్నామంటూనే, ఆమె ‘సుకుమారమైన’ చేతులు గిన్నెలు తోమడానికీ, ‘బలహీనమైన మెదడు’ ఇంటిని నడపడానికీ, ‘వంకరబుద్ధి’ ముందు తరాన్ని తయారు చెయ్యడానికీ ఉపయోగిస్తారన్నాడు. ఇవన్నీ కాకుండా చట్టాలు ఆస్తి హక్కుల విషయంలో కూడా స్త్రీల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో వివరించాడు. మగవాళ్ల లాగానే స్త్రీలూ గొప్ప, మధ్యతరగతి, బీద అని మూడు వర్గాలనీ మొదటి రెండు వర్గాలూ తమ స్వంత సంపాదనైనా లేకుండా భర్తల మీద ఆధారపడతారనీ, బీద వర్గం స్త్రీకి ఆ సంపాదనున్నా అది భర్త అజమాయిషీలోనే ఉంటుందని, భర్త ఆధీనంలో స్త్రీ శ్రమ, సంపాదన ఉన్నంత వరకూ బీద స్త్రీకైనా స్వతంత్రత లేదనీ వాదించాడు. మగవాళ్ల అవసరాలు ఇంటి దగ్గిర తీరుస్తూ స్త్రీలు వాళ్లని ప్రపంచంలోకి వెళ్లే స్వేచ్ఛని కలిగిస్తున్నారన్న మాట ఆనాడే (1924లో) చలం చెప్పాడు.

పిల్లల్ని కన డం అనే ప్రకృతి సహజమైన అంశం కోసం స్త్రీ తన ఇతర బాధ్యతలు (పని, ఉద్యోగం) వదులుకోవడం కృత్రిమమని అందుకే పిల్లల్ని చూసే కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ కూడా చెప్పాడు. ”బిడ్డలు ఆఖ్ఖర్లేదనుకుంటే గర్భనిరోధక సాధనాలు ఉపయోగించడం న్యాయం కాని గర్భం కలుగుతుందేమోనని భయంతో బతకడం ఘోరం… బిడ్డలు ఆఖ్ఖర్లేదనుకున్న వాళ్లకి గర్భం కలిగితే, తగిన డాక్టర్ల చేత అది తీయించుకోవడం ఉత్తమం” (బిడ్డల శిక్షణ పే. 130) అని గర్భనిరోధం, అబార్షన్ల గురించి చట్టవిరుద్దమని తెలిసే ధైర్యంగా సూచనలిచ్చాడు. మనం ఇవాళ స్త్రీకి తన శరీరం మీద సెక్సువాలిటీ మీద తనకే హక్కుండాలి అని నమ్మే విషయాన్ని ఆనాడే చలం చెప్పాడంటే అది మామూలు మాట కాదని గుర్తుంచుకోవాలి. పిల్లలు పుడితే సంఘంలో ఎదురయ్యే చిక్కులు గుర్తించిన చలం కొందరు స్త్రీలు అసలు పిల్లలు కావాలనుకోక పోవచ్చునని కూడా అన్నాడు. అటువంటి వాళ్లు బలవంతంగా పిల్లల్ని ఎందుకు కనాలని సంఘాన్ని నిలదీసిన వాళ్లు (ఇప్పుడు ఫెమినిష్టులే కాని) ఇంకొకరెవరూ కనిపించరు. గర్భనిరోధక మార్గాల్ని గురించి వివరంగా రాశాడు చలం (గర్భనివృత్తి మార్గాలు). ఇప్పుడు ఫెమినిస్టులు మంచి పద్ధతిగా చెప్పే డయాఫ్రమ్‌ స్పొంజిలు గురించి, కాండోమ్‌ల గురించి (స్త్రీ పేజి 177-79) రాశాడు. ఇన్ని విషయాల గురించి ఇంత వివరంగా స్త్రీని సంబోధిస్తూ రాశాడు గనకనే చలాన్ని అంతగా ఆసహ్యించుకుంది ఈ సంఘం. ఆయన పుస్తకాలు చదివితే చెడిపోతారని నెత్తీనోరు బాదుకుంది. స్త్రీలకు విశృంఖలత్వం నేర్పిస్తున్నాడని దూషించింది. ఈ పెద్ద మనుషులంతా స్త్రీ స్వేచ్ఛ అంటేనే ఆశ్లీలం అనుకునే రకాలు. అందుకే ఫెమినిస్టు

ఉద్యమంపైన కూడా అదే విమర్శ ఉంటే ఆశ్చర్యమేముంది?

స్త్రీ స్థానానికి సంబంధించి మతాన్ని, కులాన్ని, సంప్రదాయాన్ని, సంఘాన్ని అన్నింటినీ తప్పుపట్టాడు చలం. ఆమెని తన స్వంతం చేసుకోవటానికి పురుషుడు ఎట్లా ప్రయత్నిస్తాడో ఎద్దేవా చేశాడు.

ఒక గార్డియన్‌గా రక్షకుడు అనే పేరుతో, నిజానికి సిఐడి ఆఫీసరుగా, పోలీసువాడిగా, మేజిస్ట్రేటుగా చివరికి హైయస్ట్‌కోర్ట్‌ ఆఫ్‌ అప్పీలుగా, జైలరుగా, ఉరితీసే వాడుగా అన్ని రూపాల్నీ భర్త ఎట్లా ధరిస్తాడని చాలా వ్యంగ్యంగా చెప్పాడు. ఆమె మీద తను చెలాయించే పెత్తనాలన్నిటినీ వదిలేయాలని (మాన్‌ అండ్‌ ఉమెన్‌) ఆయన చెప్పాడు. ఆ జ్ఞానం ఇప్పటికి మాత్రం ఎంత మందిలో

ఉంది? కాలక్రమంలో మారిన పురుషులకి అనుగుణంగా మాత్రమే స్త్రీ కూడా మారుతూ వచ్చిందని చలం చెప్పినది ఈ నాటికీ నిజమే. పూర్వం పురుషుడికి ”పొట్టి చేతుల రవిక, కొప్పూ, అందెలూ, రాగిడీ ఇష్టమైతేస్త్రీ ఆ వేషమే వేసింది. ఇంగ్లీషు విద్య నేర్పిన పురుషుడికి జాకెట్లు, నాగరం, గాజులు, చిన్న బొట్టూ, కొంచెం సంగీతం, ఇంగ్లీషు ముక్కలు ఇష్టమైతే ఆ స్వరూపమే దాల్చింది” (స్త్రీ పేజీ-43) అంటూ భర్త పెళ్లయిన మరుక్షణం నుంచీ భార్యను తన ఇష్టానుసారంగా ఎట్లా మలుచుకుంటాడో చక్కగా రాస్తాడు. ”ఆమె ఊహలకి తను ఆకారమిస్తాడు. ఆమె అభిరుచులకి తను రంగులేస్తాడు. ఆమె ఏ పుస్తకాలు చదవాలో… అసలు చదవాలో లేదో, ఆమె ఎవరితో మాట్లాడాలో, అసలు మాట్లాడాలో లేదో, ఎట్లాకూచోవాలో, ఎన్ని గంటలకి లేవాలో, పడుకోవాలో ఆజ్ఞాపిస్తాడు. ఆమెకిది వరకే ఉన్న పాత అభిప్రాయాలలో తనకి నచ్చనివి ఉంటే వాటిని వెక్కిరించి, యేడిపించి వదిలిస్తాడు…” చివరికి అతని మాటలు పలికే చిలుకగా, గ్రామ్‌ఫోన్‌ ప్లేటుగా మారుతుంది. చీర కొనేటప్పుడు కూడా ఆ రంగు అతనికిష్టమేనా, పచ్చడి చేసేటప్పుడు ఆ రుచి అతనికి సయిస్తుందా, ఈకొత్త వూహ అతనికి నచ్చుతుందా అని ఆలోచిస్తుంది…” ఈ విధంగా మలచిన స్త్రీ ఆత్మ ఎలా ఉంటుంది? ”హత్య చేసేవాడు శరీరాన్ని చంపుతాడు. ఈ భర్త ఆత్మని నాశనం చేస్తాడు” అన్నాడు చలం ఆనాడు. ఇప్పటికీ ఈ స్థితే కొనసాగుతోంది. పుట్టినప్పటినుంచి మనం పెరిగిన పద్ధతీ, వాతావరణం, పొందినజ్ఞానం, మన పైన సమాజపు పోలీసింగ్‌ పెళ్లికాగానే మారిపోతాయి. ఇంటిపేరుతో సహా ఎగిరిపోతాయి. మనకున్న వ్యక్తిత్వాన్ని, ఉనికినీ, గతాన్ని భార్యలుగా, తల్లులుగా కావటానికి ప్రోత్సహించే పరిస్థితులు ఊపిరాడనివ్వవు.

మామూలు మానవ సంబంధాల్లో నెలకొని ఉన్న ఆధిపత్యాన్ని నిరసించాడు చలం. అన్ని రకాల డామినేషన్‌, సబ్మిషన్‌లను ఆయన విమర్శించాడు. చివరికి తల్లి ప్రేమలో కూడా బలవంతం కూడదు. అది అక్రమం అంటాడు. ప్రేమ బంధాలే కాని అధికార బంధాలుండ కూడదని ఆయన అభిప్రాయం. సంఘ సంస్కర్తలు కూడా స్త్రీ స్వేచ్ఛ సంస్కరణల గురించి వితంతు వివాహాలు కావాలనీ, బాల్య వివాహాలు కూడదనీ స్త్రీ బాగుపడాలనీ కృషి చేశారు. వాళ్లందర్నీ ఎత్తి పొడవనట్టుగా చలాన్ని సమాజం ఎందుకు ఎత్తి పొడిచింది? వెలివేసింది? ఆయన సంఘానికి దూరమైపోయి ఎందుకంత ఒంటరిజీవితాన్ని భరించాల్సి వచ్చింది? ఆయన మూలంగా ఆయనకుటుంబం అంతా కూడా ఎందుకు బాధలను భరించింది? చలం ఎందుకంత వివాదాస్పదమైన వ్యక్తి అయ్యాడు?… అనే ప్రశ్నలు తలెత్తక మానవు.

ఈ ప్రశ్నలకి సమాధానం వెతకాలంటే తాను నమ్మిన దాన్ని నిర్మొహమాటంగా గంట కొట్టినట్టుగా, సూటిగా, తీక్షణంగా చెప్పడం మూలంగానే అనుకుంటే సరిపోదు. నిజమే అలాగే చెప్పాడు. అట్లా చెప్పిన వాళ్లెంత మంది? కాని చెప్పిన విషయం ఏమిటనేదికూడా ముఖ్యం. ఒకటి ‘ఆయన మాట్లాడిన దాంట్లో ప్రతిచోటా వైరుధ్యాలు కనబడతాయి. దేన్నీ ఒక సిస్టమాటిక్‌ పద్ధతిలో పరిశీలించలేదు’అనే విమర్శ. కాని ఈవిమర్శ ఎక్కువ ఇప్పటి కాలానికి సంబంధించినది. ఆయన రచనలు అప్పటికీ ఇప్పటికీ ఇంత సంచలనాన్ని కలిగించటానికి కారణం ప్రధానంగా వివాహమనే వ్యవస్థను దెబ్బతీయటం. స్త్రీ, పురుష సంబంధాల్ని,సెక్స్‌, సెక్సువాలిటీల గురించి ఆయన ఎక్కువ రాయటం. ఇవే చాలా మందిని తల్లకిందులు చేశాయనటంలో అతిశయోక్తి లేదు. స్త్రీ పురుషుల మధ్య సహజంగా ఉండే ఆకర్షణ గురించి ప్రతీసారీ ప్రస్తావించాడు చలం. ఈ సమాజం తన స్వార్థం కోసం స్త్రీని సెక్సువల్‌గా ఎట్లా అణచిపెట్టిందో అర్థం చేసుకోవాలనీ, స్త్రీ ఎదురు తిరగాలని వాదించాడు. ఆయన నవలల్లో మనకు ప్రధానంగా కనిపించేది తానే స్వయంగా చెప్పినదీ స్త్రీ శారీరక స్వేచ్ఛనే. సెక్స్‌కీ, వ్యక్తి స్వాతంత్య్రానికీ సంబంధించినది.

1940లో ‘స్త్రీ’కి రాసిన ముందు మాటలో ”సెక్స్‌ అంటే జీవితపు సూత్రం. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్లయిందాకా, అందర్నీ, వాళ్లకి తెలిసినా, తెలియకపోయినా, ప్రోత్సహించి పాలిస్తోంది. తమలో ఆ ప్రోద్బలం లేదనీ, అక్కర్లేదనీ ఎంత వంచన చేసుకునీ లాభం లేదు” (స్త్రీ పేజీ-10) అని రాశాడు. స్త్రీకుండే సెక్సు వాంఛల గురించి, స్త్రీ పురుషుల సెక్సు సంబంధాలలో ఆమెకు అవసరమైన తృప్తి ఆనందాల గురించి రాసిన మొదటి వాడు చలం. తనకు కోర్కె ఉందని చెప్పుకోవడమే స్త్రీకి పెద్ద సమస్య అని స్త్రీ మీద సంఘ ప్రభావాన్ని ఎత్తి చూపాడు. చిన్నప్పటి నుంచీ సెక్స్‌ అంటే దుర్నీతి అని, అసహ్యమనీ, రహస్యమనీ, నీచమని నేర్చుకున్న స్త్రీలు ఒక్కసారి పెళ్లవగానే ఆనందంపొందనూ లేరు. ఒకరికి అందివ్వనూ లేరు అని కచ్ఛితంగా చెప్పాడు (స్త్రీ పేజి-159). అందుకే ఈ రోజుకీ చలాన్ని అభిమానిస్తామని ఎవరైనా అంటే వెంటనే వారిని సెక్స్‌ విశృంఖలత వాంఛించే వాళ్లుగా ముద్రవేస్తారు. అంత ప్రమాదకరం చలం. అందుకే ఇతర సంఘ సంస్కర్తల మీద జరగని దాడి ఈయన మీద జరిగింది. ఏ సమాజంలోనైనా సరే స్త్రీకున్న స్థానం, హోదా అర్థం చేసుకోవాలంటే దానికి గీటురాయి ఆమె సెక్సువాలిటీ పట్ల ఆ సమాజం అవలంబించే వైఖరే. సెక్సువాలిటితోపాటు స్త్రీ శ్రమ,ఆమె పిల్లల్ని కనడం కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఈ మూడింటినీ విశేషంగా ప్రస్తావించాడు గనుకనే అతని మీద విరుచుకుపడింది లోకం. అందులోను 1920లలో ఇట్లాంటి మాటలు ఎవరూ విని కూడా ఉండని సందర్భంలో చలం ఇవన్నీ రాశాడు. కనుక ఆయన మీద దుమ్మెత్తి పోయడంలో ఆశ్చర్యం లేదు.

ఆయనకొక సిద్ధాంతం లేదన్న ఇప్పటి విమర్శ పరిశీలిద్దాం. చలం వేటి గురించయితే నమ్మినట్లు రాశాడో వాటిని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని సందర్భాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాడు. అయితే అట్లా రాయడానికి ఒక సమయమూ, సందర్భమూ లేవని కాదు. ఆయనలోఎప్పుడూ ఉన్న గందరగోళం అదే అని మనంకొట్టి పారేయటం సరైనదికాదు. చలంలో ఉన్న గొప్పతనం తను ఏ క్షణంలో ఎట్లా ఫీల్‌ అయ్యాడో దాన్ని కాగితం మీద పెట్టడం. ఆది తను ఇంతకు ముందు చెప్పి దానికి అనుకూలంగా ఉందా లేదా అని ఆయన దాన్ని జాగ్రత్తగా ఎడిట్‌ చెయ్యలేదు. నిజాయితీగా రాశాడు. మొదటి నుంచి చివరి వరకూ ఆయన్ని కలవర పెట్టిన సమస్యలు ఈశ్వరుడున్నాడా లేడా అని, స్త్రీ స్వేచ్ఛ గురించి. బ్రహ్మసమాజంలో చేరిప్పుడు ఈశ్వరుడు లేడు అనే నిర్ణయానికొచ్చినా, అనుక్షణం నిత్య జీవితంలో దాన్ని గురించి ఆలోచనల్తో సతమతమయ్యాడు. ఒకచోట ”గాంధీగారి సిద్దాంతాలూ, కమ్యూనిస్టుసిద్దాంతాలూ, నాపుస్తకాలమీద విమర్శలూ నన్ను కలవరపెడ్తున్నాయి.వీటన్నిటిలో కూడా ఈశ్వరుడు, స్త్రీ అనే రెండు సమస్యలు నన్ను ఎడతెరిపిలేకుండా తలక్రిందులు చేస్తూనే ఉన్నాయి” అని రాశాడు. అట్లాగే కమ్యూనిజం గురించీ ”కమ్యూనిజం వంటి గొప్ప మార్పు వచ్చి వరదమల్లే ఈ చెత్తనంతా ఊడ్చేసిందాకా ఈ మనుషులు ఎట్లానూ కదలరు. ఎన్ని ఇట్లాంటి వ్యాసాలు వ్రాసినా, ఏ యుద్ధాలో, ఉద్యమాలో, కమ్యూనిజాలో కదిలించవలసిందే గడ్డకట్టిన ఈ సంఘాల్ని. ఇట్లాంటి వ్రాతలన్నీ అట్లాంటి గొప్ప మార్పులు రావడానికి సోపానాలు” (స్త్రీ పేజి-13) అని అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి చచ్చు విలువల గురించి రాస్తూ వాటిని ఎదిరించి తిరుగుబాటు చెయ్యాలని అయితే ఒక్కసారి తిరుగుబాటు చేస్తే సరిపోదనీ కూడా చెప్పాడు. ”ప్రత్యేకమైన హక్కుల కోసం తిరుగుబాటు చెయ్యడం వల్ల హక్కులు రావచ్చును గాని, ఆ హక్కులు పొందడం వల్ల సౌఖ్యం రాదు. అధికారం వల్ల కలుగుతున్న ఇరుకులోంచి ఆత్మ వికాసం కోసం, అభివృద్ధి కోసం, తిరుగుబాటు చెయ్యడం వొక్కటే హర్షణీయం” (పేజి-16) కాని అదే తిరిగుబాటుతో సాధించిన స్వతంత్రాన్ని ఇతరుల స్వతంత్రానికి అడ్డుపడి అధికారాన్ని చలాయించడానికి వినియోగించటం నచ్చదు చలానికి. తిరుగుబాటు అవసరం గురించి మాట్లాడుతూ, తన తిరుగుబాటు వల్ల తనకి గాని ఇతరులకుగాని మేలు జరగాలంటే తనుకోరే స్వేచ్ఛని అందరికీ అంగీకరించాలి. ”తన స్వంత వారి మీద తన అధికారాన్ని వదులుకోవాలి. తన తిరుగుబాటు వల్ల వచ్చే కష్టాల్ని గర్వంతో ఎదుర్కోవాలి”. (స్త్రీ పేజి-11)

”స్వతంత్ర దేవత కలకత్తా కాళీకన్నా భయంకరమైనది. నిరంతరమూ సుఖనైవేద్యాన్ని అశ్రు అభిషేకాన్ని కోరుతుంది. ఆమెని చివరి దాకా ఆరాధించగల జవసత్వాలున్న వాళ్లు అరుదు. చాలా మంది తమ ప్రత్యేక కష్టంలోంచి తప్పించుకునే స్వతంత్రాన్నే గాని, జీవితంలో ఆ దేవతని భరించలేరు.” (స్త్రీ పేజి-7)

”ఈకొత్త స్వతంత్రం ఎంత భారమైనా పురుషుడి ఆధికారానికి లొంగి ఉండే పాతరకపు సంసారంలోకి స్త్రీ తిరిగి వెళ్లడమనేది

ఉత్తమాట…” అని ఆశ వెలిబుచ్చాడు చలం. స్వేచ్ఛ నిరంతరంగా తిరుగుబాటులతో సాధించవలసిందే కాని ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడేది కాదని కచ్చితంగా చెప్పాడు చలం. ”సహాయం చేయదలచినా స్త్రీకి సహాయం చెయ్యలేడు పురుషుడు – ఆమె ఆత్మలోంచి స్వాతంత్య్రాభిలాష రానిది..” (స్త్రీ పేజి-75) ”ఎవరైనా అధికారమంతులు తమంతట తాము అధికారాన్ని వదులుకోవడమెరుగుదుమా?” (స్త్రీ పేజి-76) అని నిలదీశాడు. ఇలా ప్రశ్నించినతీరులో సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమాలను కూడా విమర్శించిన ధోరణి కనిపిస్తుంది. అప్పటి సంఘ సంస్కరణోద్యమం స్త్రీలను బాగు చెయ్యాలనీ, నూతన స్త్రీగా భారతనారిని తీర్చిదిద్దాలంటే స్త్రీకి విద్య అవసరం అనీ నొక్కి చెప్పింది. అయితే ఆ విద్య గురించి చలం ఏమన్నాడో చూద్దాం. ”పురుషుడి విద్య స్త్రీకి పనికిరాదనీ, ఆమెకినేర్పే విద్యా ప్రణాళిక ఆమె పిల్లల్ని పెంచడానికి, వంటకీ, పాతివ్రత్యానికి తయారు చేసేదిగా ఉండాలనీ, పురుషాధిక్యతా, స్త్రీ నైచ్యతా బోధించే పాత పురాణాలు, నీతి శతకాలు, స్త్రీకి ముఖ్యమని అరుస్తూ ఉంటాడు పురుషుడు. స్త్రీ దీనికి లోబడకూడదు. పురుషుడి వలెనే తానూ సమానంగా నూతన శాస్త్ర జ్ఞానాన్ని, ఈ నవయుగ సాంప్రదాయాల్ని గ్రహించాలి” (స్త్రీ పేజి-77) అని మరీ కచ్ఛితంగా ఎందుకు చెప్పాడు చలం అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఒక విషయం బోధపడుతుంది. సంఘ సంస్కరణోద్యమం స్త్రీకే నిర్దేశించిన విద్యలో పుక్కిటి పురాణాలు, నీతి శతకాలు,కుట్లెలా కుట్టాలి. వంటలెలా చేయాలంటే హోం సైన్సులు కనిపిస్తాయే కాని స్త్రీ పురుషుడితో సమానంగా అన్ని విద్యలు నేర్వాలని ఎక్కడా కనిపించదు. అప్పుడు కానీ, ఆ తర్వాత జాతీయోద్యమం సాధించిన స్వతంత్రతలో కానీ, ఇప్పటికీ కానీ సమాజంలో స్త్రీ స్థానాన్ని మార్చగల విద్యావిధానం మనకు కనిపించదు. విద్యావిధానంలో లింగ వివక్ష గురించి పరిశోధనలు ఫెమినిస్టు ఉద్యమం మూలంగా ఇప్పుడిప్పుడు మొదలవుతున్నాయి.

(పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురణ ‘మన చలం’ సౌజన్యంతో)…

(భూమిక జూలై-సెప్టెంబరు, అక్టోబరు – డిసెంబరు 1994 నుండి పునఃముద్రణ) (ఇంకావుంది)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 
S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 
తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో