అమ్మ ముద్దు – టి. భూమిక, 5వ తరగతి, సమత నిలయం

అనగనగా ఒక ఊరు.  ఆ ఊరులో రామయ్య సీతమ్మ అని ఇద్దరు భార్య భర్తలు. వాళ్లుకు ఒక కూతురు ఉంది. కుతూరు పేరు శాంతి రామయ్య ఒక రోజు పొలానికి వెళ్ళాడు. పొలం చూసి ఇంక కొన్ని రోజులు అయితే పంట పండుతుంది అనుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు పొలం పక్కన మామిడి చెట్టు ఉంది. శాంతి పొలానికి వెళ్దాము అనుకుంది. శాంతితోపాటు తన స్నేహితురాళ్లను కూడా తీసుకెళ్దాము అనుకొని వాళ్ళు స్నేహితుల దగ్గరకు వెళ్ళింది. మనం పొలానికి వెళ్దామం అక్కడ మామిడి చెట్టు ఉంది మామిడి పండు తెంపుకొని తిని ఆడుకొని వద్దాం, వస్తారా అని అడిగింది. వస్తాం అని అన్నారు. శాంతి స్నేహితురాళ్లను తీసుకొని పొలంకి వెళ్తుండగా మధ్యలో వర్షం వచ్చింది. అప్పుడు శాంతికి చాలా సంతోషం వేసింది. వెళ్ళి వర్షంలో ఆడింది. తన స్నేహితురాళ్లు చెట్టు కింద కూర్చున్నారు. శాంతి రండి మీరు ఆడుకోండి అన్నాది. మేము రాము అన్నారు. అప్పటికి వర్షం తగ్గింది. శాంతి వాళ్లు స్నేహితురాళ్లను తీసుకొని ఇంటికి వెళ్ళింది. శాంతి డ్రెస్‌ మర్చుకొని స్నేహితులకు టవల్‌ ఇచ్చి తుడ్చుకో అన్నాది. వాళ్ళు తుడ్చుకొని శాంతికి ఇచ్చారు. అప్పుడు వాళ్ల అమ్మ వచ్చి ఎందుకు డ్రెస్‌ మార్చావు అంటే జరిగింది చెప్పింది. వాళ్ల అమ్మ ఇంకొకసారి ఆడకు, జ్వరం వస్తుంది అని చెప్పింది. సాయంత్రం వరకు ఇంట్లో వాళ్ళ స్నేహితులతో ఆడుకుంది. సాయంత్రం శాంతి మళ్ళీ పొలానికి వెళ్దామని అమ్మ నేను పొలానికి వెళ్తాను. అని చెప్పింది వెళ్ళి తొందరగా రా అని చెప్పింది. రోడ్డు మీద వెళ్తూ శాంతి స్నేహితురాలతో పెద్దవాళ్ళు చెప్పేది మన గురించే కదా! మరి మనం వినకపోతే మనమే చేడిపోతాం, బాధపడ్తాం అని చెప్పింది. అప్పుడు తన స్నేహితులు మనం పెద్దవాళ్లు చెప్పినవి విందాం అని అన్నారు. అప్పటికి వాళ్ల పొలానికి చేరుకున్నారు. వెళ్ళి మామిడి పళ్ళు తెంపుకొని తిసుకుంటూ పొలం మొత్తం చూపించింది. ఆడుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. శాంతి ఇంటికి వచ్చి రాసుకొని, చదువుకుంది. వాళ్ల అమ్మ తిని పడుకున్నది. శాంతి తిని పడుకుంది. పొద్దున్న లేచి శాంతి స్నానం చేసి చక్కగా రెడి అయ్యి ఉంది. అమ్మ శాంతికి అన్నం పెట్టింది. అన్నం తిని స్కూల్‌కు వెల్తోంది. అప్పుడు అమ్మా ఈ రోజు పరీక్షలు అని చెప్పింది. అమ్మ వెంటనే ఒక పెన్సిల్‌ కొనుకొన్ని ఇచ్చింది మంచిగా రాయి అన్నది శాంతి బడికి వెళ్లి పరీక్ష రాసింది ఇలా మూడు రోజులు పరీక్షలు రాసింది. వాళ్ల అమ్మ క్లాసులో ఎవరు ఫస్ట్‌ అని అడిగింది. అమ్మ ఇంకా గ్రేడులు, మార్కులు వేయలేదు అని చెప్పింది. శాంతి ప్రొద్దునే స్కూల్‌కు వెళ్ళింది. మేడం మార్కులు వేసారు. శాంతి క్లాసులో ఫస్ట్‌ అని చెప్పారు. సెకండు రమ అని చెప్పారు. శాంతి వాళ్ళ అమ్మకి చెప్పాలనుకుంది. బడి వదలగానే శాంతి పరుగు తీసి వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్ళింది. అమ్మ నేను క్లాసులో ఫస్ట్‌ వచ్చాను అని చెప్పింది. వాళ్ళ నాన్నకి కూడా చెప్పింది. వాళ్ళు అమ్మ, నాన్న చాలా సంతోష పడ్డారు. శాంతి వాళ్ళ అమ్మ శాంతిని పిలిచి ఒక ముద్దు పెట్టింది.

– టి. భూమిక, 5వ తరగతి, సమత నిలయం, వర్ని

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.