పురాణాలలో స్త్రీలపై నాయక – ప్రతినాయకుల దౌర్జన్యాలు- రేఖా చంద్రశేఖరరావు

పురాణాలన్నీ కట్టుకథలపై ఆధారపడి సమర్థవంతులైన రచయితల ద్వారా వ్రాయబడి, వివిధ కాలాల్లో అనేక ప్రక్షిప్తాలకు గురయి పెద్ద బరువయిన గ్రంథాలుగా తయారయ్యాయి. పురాణాలలోని పాత్రలు రాముడు, కృష్ణడు, పరశురాముడు తదితరుల్ని కొన్ని ఉన్నత విలువలకు ప్రతినిధులుగా హిందు మతవాదులు చెబుతూ వుంటారు.

20వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో వచ్చిన అభ్యుదయ ఉద్యమాలు పురాణాల్ని విమర్శనాత్మకంగా విశ్లేషించ ప్రారంభించాయి. కమ్యూనిస్టు ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలు అలా విమర్శనాత్మకంగా పురాణాల్ని చూశాయి. ప్రత్యేకించి హేతువాద ఉద్యమ రచయితలు పెరియార్‌, త్రిపురనేని రామస్వామి, రావిపూడి వెంకటాద్రి, చార్వాక రామకృష్ణ తదితరులు పురాణాల్ని విశ్లేషించుతూ అనేక రచనలు చేశారు సమాజంలో నూతన ఆలోచనా ధోరణులకు కారకులయ్యారు. పురాణాలలోని రాముని అన్యాయాలను ఖండిస్తూ రావణున్ని ప్రస్తుతించడం ద్వారా; పాండవుల్ని ఖండిస్తూ దుర్యోధనుడ్ని ప్రస్తుతించడం ద్వారా హేతువాద దృష్టిలో పురాణాల్ని పరిశీలించడం రాష్ట్రంలో పెరిగింది. పురాణ నాయకుల స్థానంలో ప్రతినాయకుల ఔన్నత్యాన్ని చెప్ప ప్రయత్నించారు. ఈ సందర్భంలో ఏకలవ్యునికి జరిగిన అన్యాయాన్ని శూద్ర శంబూకుని పట్ల జరిగిన అమానుషాన్ని సత్యకామజాబాలి, బలి చక్రవర్తి, కర్ణుడు, వాలి తదితరులపై జరిగిన వివక్షతల్ని అక్రమాల్ని కూడా ఎండగట్టారు. వీటి ఫలితంగా ప్రజలలో నూతన హేతువాద ఆలోచనలు బలంగా వ్యాప్తి చెందాయి. తర్వాత మహిషారుడు, నరకుడు తదితర ప్రతినాయకుల గొప్పదనాన్ని చెప్పే రచనలు కూడా రాసాగాయి.

50, 60 సంవత్సరాల క్రితం నుండే ప్రజలలో హేతువాద ఆలోచనలు పెంపు కోసం పై వారి రచనలు ఎంతో తోడ్పడ్డాయి. ఈ మధ్యకాలంలో స్త్రీవాద ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ, తదితర అస్తిత్వ ఉద్యమాలు ఉద్భవించి పురోగ మిస్తున్నాయి. ఈనాడు ప్రతి విషయాన్ని ఆ ఉద్యమాల వెలగులో పరిశీలన ప్రారంభమయింది.

స్త్రీవాద ఉద్యమ వెలుగులో పురాణాల్ని మరి ఒకసారి పరిశీలించడము జరుగుతూ వస్తున్నది ఆ పరిశీలనలో భాగంగానే స్త్రీల పట్ల పురాణాలలోని నాయకా ప్రతినాయకులు ఎలా ప్రవర్తించారు అనే చిన్న పరిశీలనే ఈ వ్యాసం.

మతవాదులచే ఉన్నత విలువల ప్రతినిధిగా చూడబడే రాముడు స్త్రీల పట్ల వ్యవహరించిన తీరు గర్హణీయం. తండ్రికిచ్చిన మాటకోసం పేరుతో భార్యని, తమ్ముణ్ణి తనతో పాటు కష్టాల పాలుచేశాడు. వలచి వచ్చిన శూర్పణఖను తిరస్కరించడము సరి అయినదే. కాని ఆమె ముక్కు, చెవులు కోని అవమానించాడు యజ్ఞయాగాల్ని నిరనించి, అడ్డుకున్న తాటకిని విశ్వామిత్రుని కోసం చంపాడు. గర్భవతిగా ఉన్న భార్యను తాగుబోతు వాగాడంబరాన్ని ప్రజాభిప్రాయమని ప్రకటించి నీతను అడవుల పాల్జేశాడు. అయినప్పటికీ ధైర్యంగా పిల్లల్ని పెంచి పెద్దచేని, చివరకు రామున్ని తృణీకరించి, త్యజించింది నీత. అన్నకు తోడుగా వెళ్ళిన లక్ష్మణుడు ఊర్మిళను వంటరి చేని అగచాట్లపాలు చేశాడు.

ఇక ప్రతినాయకుడిగా మతవాదులచేత, నాయకుడిగా హేతువాదుల చేత పేర్కొనబడిన రావణుడు స్త్రీల పట్ల రాముడి కంటే భిన్నంగా ప్రవర్తించలేదు. రంభకాదని ఎంత వేడుకున్నా వినకుండా ఆమెను బలాత్కరించి, ఆమె భర్త నలూబరుడి శాపానికి గురయ్యాడు. వేదవతిని వెదికి, వెదికి పట్టుకోవాలని ప్రయత్నించాడు. తాను కామించిన వారిని ఎలాగయిన దక్కించుకోవాలనే తాపత్రాయంతో స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. స్త్రీలను వారి ఇష్టం లేకుండా తాకితే చనిపోతాడు అనే నలూబరుడి శాపం లేనట్లయితే నీతని ూడా బలాత్కరించు వాడేమో. తన చెల్లెలు శూర్పణఖ ముక్కు – చెవులు రాముడు కోయిన్తే, యుద్ధం చేని రాముడి మీద పగ తీర్చుకోవాల్సింది పోయి, దొంగతనంగా మునివేషంలో నీతను బలవంతంగా తీసుకుపోయి అశోకవనంలో బంధించాడు. స్త్రీల విషయంలో రాముడు – రావణుడు ఎవరూ ఎవరి తీనిపోని దౌర్జన్యాలు చేశారు.

తులనీ జలంధర కథలో జలంధరున్ని ఓడించటానికి విష్ణవు దొంగ జలంధరుడిగా ప్రవేశించి మోసం చేని తులని శీలాన్ని దోచుకుంటాడు. అలాగే అహల్యను దొంగ గౌతముడి వేషంలో ఇంద్రుడు ప్రవేశించి మోసంతో ఆమెను పొందాడు. విష్ణవు – ఇంద్రుడు స్త్రీల పట్ల చేనిన అపచారాన్ని క్షమించలేము.

ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకున్న దుష్యంతుడు, రాజాస్థానంలో గర్భవతిగా వున్న శకుంతలను నీవెవరో నాకు తెలియదు అని లోకానికి భయపడి న్వీకరించలేదు. ఆ సందర్భంలో శకుంతల వేదన వర్ణనాతీతం. అయినప్పటికీ శకుంతల ధైర్యంగా నిలబడిన తీరు ప్రశంశనీయం.

నల, దయమంతులిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. జూదంలో రాజ్యాన్ని కోల్పోయిన నలుడు, దమయంతితో కలిని అడవిలో జీవిస్తూ వుండగా, అకస్మాత్తుగా దమయంతికి చెప్పకుండా, ఎక్కడికో వెళ్ళిపోతాడు. నలుడు వదిలి వెళ్ళినందుకు దయమంతి ఎంతో బాధపడుతుంది. అంతే కాకుండా ఏ కారణంతో వదిలివెళ్ళాడో తెలియక దమయంతి పడిన మనోవ్యథను వర్ణించలేము.

పతివ్రతా ధర్మం పేరు చెప్పి కుష్ఠు వ్యాధిగ్రస్తుడైన భర్త తనను వేశ్యాగృహానికి తీసుళ్ళెమని కోరగా ఆ భర్త నీచత్వానికి సుమతి ఎంత కుమిలిపోయి వుంటుందో వూహించలేము.

ఏ నేరమూ చేయని తన తల్లి రేణుకని తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ పేరుతో పరశురాముడు నరికి చంపడం చెప్పరాని అమానుషం.

రాముడు, వశిష్టడు తదితరులచే గౌరవింపడే ఋష్యశృంగుడు, తనని ఎంతో ప్రేమించి మృగ జీవితాన్నుంచి మానవ జీవితానికి తీసుకువచ్చిన వైశాలిని పదవికోసం, గౌరవం కోసం వదిలివేని వేరొక స్త్రీని పెళ్ళాడిన దుర్మార్గుడు ఆ ఋష్యశృంగుడు.

ఇక భారతంలో ద్రౌపది పొందినన్ని అవమానాలు వేరెవరూ పొందలేదు. స్వయంవరంలో ద్రౌపదిని గెలుపొందిన అర్జునుడు తల్లిమాట పేరుతో ఐదుగురు అన్నదమ్ములకు ఆలిని చేశాడు. ఇందులో ద్రౌపది అభిప్రాయంతో పనేలేదు. భారతంలోని కర్ణ సందేశంలో పాండవ పక్షంలో కర్ణుడు చేరితే ద్రౌపదికి ఆరవ భర్త కావచ్చని కృష్ణడు ఆశచూపుతాడు. కానీ కర్ణుడు వ్యతిరేకిస్తాడు అది వేరే విషయం. జూదంలో భార్యని పందెంలో ఒడ్డే హక్కు లేకపోయినా ధర్మరాజు ద్రౌపదిని పందెం కాస్తాడు. ద్రౌపది అడిగిన ధర్మవిజితనా! అధర్మ విజితనా! అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోగా దుర్యోధనుడు తన తొడలమీద కూర్చొనమని ద్రౌపదిని కోరతాడు. ఆ తర్వాత ద్రౌపదిని వస్త్రాపహరణం చేయడం చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఎంతో ఉదాత్తుడయిన కర్ణుడు ూడా వారించకపోగా బలపర్చడం అతని జీవితానికి పెద్ద మచ్చ. ఇంకా విరాట కొలువులో కీచకుని అకృత్యాలు, అరణ్యపర్వంలో సైంధవుని అకృత్యాలకు ద్రౌపది గురయింది. వీటన్నిటికి తట్టుకొని నిలబడిన తీరు ద్రౌపది గొప్పతనాన్ని చెబుతుంది.

ఎనిమిది మంది భార్యలేకాక వేలమంది స్త్రీలతో కామకేళీకలాపాలు సాగించిన కృష్ణడు దేవుడిగా చలామణి అవుతున్నాడు. కృష్ణని మీద కక్షతో పదహారు వేలమంది గోపికా స్త్రీలను చెరపట్టి దానీలుగా చేని, అనుభవించిన నరకాసురున్ని నాయకుడిగా ఎలా చూడగలుగుతాము. అంతకంటే ఆ పదహారు వేలమంది విముక్తి కోసం నరకుని చంపిన సత్యభామను ధీరవనితగా, స్త్రీ శక్తి నిదర్శనంగా చూడవచ్చును గదా!

మహిషాసురుని ఓడించి, చంపిన ఆదిశక్తిని (దుర్గని) స్త్రీ శక్తి యొక్క గొప్పతనంగా చెప్పవచ్చును.

రామాయణ భారత భాగవంత ఇతర పురాణాల్ని పుక్కిటి పురాణ గాధలుగానే చూడాలి తప్ప వేరు కాదు. అందులో రాముడు, కృష్ణడు, పరశురాముడు మొదలయిన నాయకులు గానీ, రావణ-దుర్యోధన, నరక మొదలయిన ప్రతినాయకులు గానీ స్త్రీలపట్ల అమానుషంగానే ప్రవర్తించారు. ఈనాటి స్త్రీవాద ఉద్యమాలు స్ఫూర్తికోసం అవసరమయిన నీత, ద్రౌపది, సావిత్రి, దమయంతి, శకుంతల, సత్యభామ, దుర్గ, తాటకి, తదితరుల ఆత్మెన్థౖర్యాన్ని, ఆత్మనిగ్రహాన్ని న్వీకరించాలి. అంతేకాని నాయక- ప్రతినాయకుల్ని న్వీకరించడం కాదు. ఇంకా దళిత ఉద్యమాల స్ఫూర్తికోసం ఏకలవ్యుడు, శంబూకుడు, సత్యకామాజాబాలి, కర్ణుడు, బలిచక్రవర్తి మొదలయిన వీరోచిత, ఉదాత్త, త్యాగపూరిత పాత్రల్ని న్వీకరించాలే తప్ప రాముడ్ని, కృష్ణన్ని కాదు – రావణున్ని, దుర్యోధనుడ్ని అంతకంటే కూడా కాదు

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో