శివలెంక రాజేశ్వరీదేవి- నామాడి శ్రీధర్‌

శివలెంక రాజేశ్వరీదేవి జన్మతః ఓ అద్భుతమైన కవిత. మనమధ్యన ఒంటరిగా జీవించిన అమాయక బాలిక. శరత్‌, చలం, చండీదాన్‌ రచనల్లోంచి రెక్కలు కట్టుకువచ్చిన దయాళువైన వనిత. ఎల్లల్లేని న్వేచ్ఛలోకి అశ్రుబిందువై హరించుకుపోయిన ముక్త.

ఆమెది జననంతో ప్రాప్తించిన ఏకాకితనం. దివాస్వప్నంలో కరిగిన యవ్వనం. ప్రత్యుత్తరం లేని ప్రేమలేఖనం. పీటలమీద ఆగిపోయిన కళ్యాణం. ఒక్క గదిలో కొనసాగిన ప్రపంచయానం. సాహిత్యం, సంగీతం తోడునీడలుగా తనలో తాను మాట్లాడుకొన్న శూన్యావరణం. ఎదురెదురుపడే నిరాదరణంతో తలపడే దినదినం. ఏ ఒక్క సంతోషరేణువునో గుప్పెట బంధించాలన్న జాగరణం. ఆ అరవయ్యేళ్ల నిష్పలపరంపరకు ముగింపుగా ఆఖరికి ఆదరించినది మరణం.

1984-94 మధ్య రాజమండ్రిలో నా విద్యాభ్యాసం, ఉద్యమకాలం, అంతరాంతరం నవచైతన్యంతో వికనిస్తోన్న యవ్వన ప్రాయం. కవిత్వమొక తీరని దాహమైన దేశదిమ్మరితనం. అప్పుడొక పత్రికలో రాజేశ్వరీదేవి కవిత కనబడింది. ఎంత బావుందీ కవిత, ఎవరీ కవయిత్రీ అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఆనాటి నుంచి ఇవాళ్టికీ ఆమె కవితని అపురూపంగానే భావించాను. మిత్రులతో ‘కంజిర’ (1990-95) ప్రారంభించాక, కవిత కోసం పోన్ట్‌కార్డ్‌ రాశాను. ‘టెలిఫోన్‌టాక్‌’ పంపించింది. నాల్గవ బులెటిన్‌లో అచ్చువేశాం. అటుపిమ్మట హైదరాబాద్‌ ‘వార్త’ రోజుల్లో (1995-98) ూడా సాహిత్యం పేజీ, సండే మ్యాగజైన్‌లలో కొన్ని కవితలు ప్రచురించాం.

నేను ఉద్యోగం వదలివేశాను. స్వస్థలం చేరుకొన్నాను. ఓ రోజు ఒమ్మి రమేష్‌బాబు వచ్చేడు. మా కబుర్లలో… ని.వి.ఎన్‌. మహేష్‌, కవులూరి గోపీచంద్‌, టి.వి.ఎన్‌. రామన్‌, కలేూరి ప్రసాద్‌, శివలెంక రాజేశ్వరీదేవి ఇత్యాది కవుల పుస్తకాలు రావడంలేదు. మనం పూనుకోవడం మంచిదనుకున్నాం. ఆ తర్వాత రాజేశ్వరీదేవికి ఫోన్‌ చేశాను. ‘మీ కవిత్వమంటే మాకిష్టం, పుస్తకం వేయండి, లేదా, కవితలన్నీ మాకివ్వండి, పుస్తకం తీసుకొస్తాం’ అని సంభాషణ ప్రారంభించేను. ఆమె ఏ కొంచెం ూడ ఉబ్బితబ్బివ్వలేదు. ఇప్పుడెందుకునే అన్నట్టు మాట మార్చింది. ఆ ప్రథమ పరిచయంలోనే ఒక ముఖ్యమైన సంగతి చెప్పింది… ‘శ్రీధర్‌, నీ తల్లి అకాలమరణంతో నువ్వెంతగా దుఃఖించావో విన్నాను. ఆ బాధ నేనెరుగుదును. ఆమె తిరిగిరాదు. ఇక నేనే నీకు అమ్మనని… ఆ రోజుల్లో ఉత్తరం రాశాను. నాన్నా! అది పోస్టు చేయలేదు’ అప్పటినుంచి ఆమె నాకు అమ్మతో సమానం.

అయితే, అక్కడితో నేను ఆగిపోలేదు. నా దగ్గరున్న పత్రికలు, ప్రత్యేక సంచికలు, సంకలనాలు వెతకసాగాను. న్నేహితులనీ వాకబు చేశాను. పది కవితలు వెలికితీశాను. తెలుగు కవిత్వంలో ఆమెది ఓ ప్రత్యేక తరహా. మధ్యేమధ్యే అందం కోసం రంగుల పూసలవలె ఆంగ్లపదాల్ని గుచ్చుతుంది. పాత నినిమా పాటల్లో చరణాల్ని చేర్చుతుంది. స్వతంత్ర భావం, ఇంపైన పరిభాష, ప్రభాత పవనం, నిర్మలమైన నీరెండ కలగలిని మనని స్పృశిస్తోన్న అనుభూతి కలుగుతోంది. ఏ కవిత పనిగట్టుకొని రానినట్టుండదు. అసలు ఆ అవసరమే లేదామెకు. కవనం కొండవాగుమల్లే స్వచ్ఛంగా సాగుతోంది. వాక్యం న్వేచ్ఛగా సంచరిస్తోంది. పగిలిన అద్దంలో, కవితాత్మ కత, ఒంగిన గగనం, ద్వైతం, రంగులు వెలని రాగాలు వినిపించని వేళ, ఇక శెలవా మరి… ఇలా కొన్నిటిని నేకరించాను. ఇవిగో మీ కవితలని కొరియర్‌లో పంపాను. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆలస్యంగా తెలినిన నిజమేమిటంటే, ఇంట్లోని పాత న్యూన్‌పేపర్స్‌లో కలినిపోయిన ఆ కవితల కాగితాలూ తూకానికి వేనేశారని.

కొత్తలో ప్రతిరోజు ఎడతెగని మాటలు. కాలక్రమంలో ముక్తసరి సంభాషణలు. నేను పనిలోపడి రెండ్రోజులు ఉలుూ పలుూ లేకుంటే ఎదురుచూపులు. ఉమ్మడి మిత్రులెవరిౖనా ఫోన్‌ చేనేది. నా కుశలం తెలుసుకొన్నాక న్థిమితపడేది.

రాజేశ్వరీదేవికి నిరంతరం సాహిత్యమే. సాహిత్యమే సర్వస్వం. బుద్ధిపూర్వకంగా సాహిత్యం మినహా ఇతరేతర చిల్లర విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. శరత్‌, చలం, చండీదాన్‌, ఆలూరి బైరాగి, శేషేంద్రశర్మ, మోహన్‌ప్రసాద్‌, చినవీరభద్రుడు అంటే ఆమెకు అపరిమితమైన మక్కువ. ఆ అక్షరాలంటే అపారమైన సమ్మోహం. ఆమె హృదయంలో ఇంకిపోయిన, రుధిరంలో సంలీనమైన రచనలవి. ఆ కథలు, నవలల్లోని పాత్రలు ఆమెకు చిరపరిచితమైన వ్యక్తులు, నేస్తాలూను. కొన్ని సంభాషణలు కంఠోపాఠం. కవిత్వ చరణాలనేకం అవలీలగా ఉదహరించేది. బాలసరస్వతి పాటలు, శారదా శ్రీనివాసన్‌ మాటలు మరీమరీ చెప్పేది. శేషేంద్ర, చండీదాన్‌ మరణించినప్పుడయితే రోజులకి రోజులు బాధపడిపోయేం, ఇరువురం అదేపనిగా చర్చించుకున్నాం. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, నండూరి రామ్మోహనరావు, ఎబీ ప్రసాద్‌, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, . శ్రీనివాన్‌, అఫ్సర్‌, ఆర్టిన్ట్‌ మోహన్‌ రచనల గురించి ఇష్టపూర్వకంగా ముచ్చటించేది.

రాత్రి నడిజాము దాటి దాకా చదువుకోవడం, పొద్దె్కక లేవడం, కాఫీ తాగడం, నాలుగు న్యూన్‌ పేపర్లు చూడడం, ఎడిట్‌ పేజీల్లో చదవవలనినవి పక్కన పెట్టడం, ఇష్టమైన పుస్తకం పట్టుకుని ూర్చోవడం, అప్పుడప్పుడు టీవీ, సాయంకాలం వాహ్యాళి. ఎప్పుడుగురొ్తన్త అప్పుడు మిత్రుల్ని ఫోన్‌లో పలుకరించడం, సాహిత్యం పేజీల్లో, సండే మ్యాగజైన్లలో వచ్చిన కవితలు, కథలు, వ్యాసాల గురించి మాట్లాడడం, హిందీ, బెంగాలీ, తెలుగు ఆర్ట్‌ నినిమాలని గుర్తుచేయడం, పాతపాటలని తలచుకోవడం. ఏడాదికోసారి విజయవాడ పుస్తకోత్సవంలో కొత్త పుస్తకాలు కొనడం… ఇంతే జీవిత పర్యంతం. ఆమె కాలాతీత వ్యక్తి. ఇరవైనాలుగు గంటల్లో ఏ క్షణమైనా ఫోన్‌ చేనేది. ఊరకనే పలుకరించేది. బదులు లేకపోతే, గుడ్‌నైట్‌ లేడా గుడ్‌మార్నింగ్‌ మై డియర్‌ బాయ్‌ అనే మెనేజ్‌. కిందన ‘మా’ అని రానేది.

ఆమె ఎంచుకున్న న్నేహితులు తక్కువ, ఒమ్మి రమేష్‌బాబు, గుడిపాటి, కుప్పిలి పద్మ, జుగాష్‌విలి, ఎమ్మెన్‌ నాయుడు, ఆర్టిన్ట్‌ అన్వర్‌, జూలూరి గౌరీశంకర్‌, ఎమ్మెన్‌ సూర్యనారాయణ, భాస్కర్‌ జోగేష్‌, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, ఘంటశాల నిర్మల, మరో ఇద్దరు ముగ్గురు, విజయవాడ ఆకాశవాణి ంద్రంలో కవిత్వ పఠనం కోసం తొలినాళ్ల రాకపోకల్లో కొన్ని పరిచయాలు, కొందరు మిత్రులు. అన్నీ నెమ్మదిగా చెల్లాచెదిరిపోయిన స్మృతులు.

రాజేశ్వరీదేవికి అంలుె, లెక్కలంటే భయం. అహం ప్రదర్శించే తెలివితేటలంటే అసహ్యం. నానాటికీ డబ్బు ఊబిలో ూరుకుపోతున్న అవివేక సమాజమంటే ఛీత్కారం. వేళకి భోజనం అలవాటు లేదు. ఒక్కతే రోడ్డు దాటడమనేది తనవల్లకాని పని. ప్రయాణమంటే మహా హైరానా. ఎన్నడూ సర్వసాధారణమైన సౌఖ్యాలవేపు మొగ్గలేదు. మానవీయ విలువల కోసం అన్వేషణ ఆ గొంతులో ధ్వనించేది. ఆమెది సంపూర్ణంగా హృదయసంబంధం. పేదరికమంటే చలించి, తలకు మించిన సాయంచేనే హానికరం. ఇవన్నీ ఇంటా బయటా ఆమెకు కష్టం కలిగిస్తుందన్న ఎరుకలేకపోలేదు. అయినా సరే మనుషల్ని ప్రేమించడమే ఆమె బలమూ, బలహీనత అయింది.

ఇన్నేళ్లలో ఆమెని ఒఒక్క పర్యాయం చూడగలిగాను. 2008లో కాబోలు, ంద్రసాహిత్య అకాడమీ రాజమండ్రిలో సదస్సు నిర్వహించింది. అందులో నేను పాల్గొంటున్నానని తెలిని, ఎంతో దూరం నుంచి నన్ను చూడవచ్చింది. ఓ తెల్లని పారదర్శకమైన గాజుబొమ్మమల్లే అనిపించింది. అలా తాకగానే చిట్లిపోతోందేమో అన్నంత సున్నితంగా కనిపించింది.

‘మా ఇంటిలో ఇమడలేకపోతున్నాను. నాకు ఎవ్వరున్నారని, ఎక్కడికని వెళ్లను?’ అన్నది అనేకసార్లు. కోననీమకు రండి. మా ఇంట, మాతో బాటు ఉండండి. అనేక పుస్తకాలు, నలువైపులా నీరు, వరిచేలు, కొబ్బరితోటలు, ఒంటరితనం నుంచి ఒకింత బయటపడే కొత్త వాతావరణంలోకి ఆహ్వానించాను. మీ కవితలన్నీ తీసుకురండి. నేను పుస్తకం వేస్తాను. నలుగురూ చదువుతాను. మీతో మాట్లాడతారు. అది ఉత్సాహకారకంగా ఉంటుందనీ అభ్యర్థించాను.

ఆద్యంతం, ఆమెకు ఈ రెండేరెండు మాటలు చెప్పు కొచ్చాను. ఒక్కటీ లక్ష్యపెట్టలేదు. ఆమెకు ఇష్టంలేక కాదు. ఏనాడో ఆ సాంప్రదాయక కుటుంబం, రాజేశ్వరీదేవి అనే ఇంద్రధనుస్సుని ఒక గుంజకి కట్టిపడేనింది. అరవయ్యేళ్ల పెనుగులాటలో దేహం మాత్రమేనా అలనిపోయింది. ఏ తెగువ చేయలేని మనిషీ నిలువెల్లా వినిగిపోయింది. కడకు కోకిలవంటి హృదయం ెనౖతం నిశ్చలనమయింది. లేకపోతే, తొలుత ఆమె హాయిగా బతుకుతుండేది. సాహిత్యలోకంలో వైభవోపేతమైన కవిత్వ సంపుటమూ నిలిచేది. ఇప్పుడు తెగిపోయిన ఆ హరివిల్లు అదృశ్యతీరానికి తరలిపోయింది.

నా చిన్నతనంలో శరత్‌నీ, చండీదాన్‌నీ, డాక్టర్‌ శేవరెడ్డినీ పరిచయం చేనింది నన్ను కన్నతల్లి. విచిత్రంగా ఆ రచనల గురించి పదే పదే చర్చించిన అమ్మ రాజేశ్వరీదేవి. ఇరువురూ, నా ఎడల అవ్యాజప్రేమని చూపారు. నా శ్రేయస్సుని కోరుకున్నారు. ‘ఆకుపచ్చ లోయ’ని శిశువువలె అక్కున జేర్చుకొన్నారొకరు. ‘బంధనఛాయ’ని అభిమానించి మురినిపోయారు మరొకరు. అయితే నాకు ఒక్కమాట మాత్రం చెప్పకుండానే, ఇద్దరూ హఠాత్తుగా అదృశ్యమైనారు.

(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ సౌజన్యంతో)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో