దాశరథి రంగాచార్య- వాడ్రేవు చినవీరభద్రుడు

దాశరథి రంగాచార్య వెళ్ళిపోయారు. ఒక ప్రాకృత కవి అన్నట్టు అటువంటి మనిషి వెళ్ళిపోతే ఊరి మధ్యలో పెద్ద మర్రిచెట్టు వేళ్ళతో పెకలించుకుపోయినట్టు ఉంటుంది. పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. ఆ చెట్టు ఉన్నప్పుడు తన నీడతో ఎట్లా ఆకట్టుకునేదో, ఇప్పుడింక చాలాకాలంపాటు తానులేని లోటుతో ూడా మనల్ని కట్టిపడేస్తూనే ఉంటుంది.

నా అదృష్టం కొద్దీ దాశరథి సోదరులు ఇద్దరి ప్రేమూ, వాత్సల్యానికీ నేను నోచుకున్నాను.

1999 చివర్లో ఒకరోజు ఎమెస్కో విజయకుమార్‌ నాకు ఫోన్‌ చేసాడు. తాను దాశరథి రంగాచార్యగారిని కలిసాననీ చెప్తూ చాలా ముచ్చట్లే చెప్పాడు. ఆ మాటల్లో కొత్త ద్వీపాన్ని కనుగొన్న ఎ్ౖసట్‌మెంట్‌. ప్రతి ఒక్కటీ నమ్మశక్యంగాని నిజాలే. ప్రతి ఏటా జరిగే విజయవాడ పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి రమ్మని దాశరథి రంగాచార్య గారిని అడిగామనీ ( ఆ గౌరవం కోసం తెలుగునేల మీద చాలామంది ప్రముఖులే ఎదురుచూస్తుంటారు), కాని తాను రాలేనన్నారనీ, కారణమేమిటో తెలుసా, ‘ఆ రోజు మా కాలనీ వాకర్స్‌ మీటింగ్‌ ఉంది, దాన్ని వదులుకుని ఎక్కడకి పోలేను’ అన్నారాయన’ అన్నాడు విజయకుమార్‌.

ఆ ఒక్క సంఘటన దాశరథి వ్యక్తిత్వం మొత్తానికి అద్దం పడుతుంది. రంగాచార్య గొప్ప రచయిత, పండితుడు, అన్నీ నిజమే కాని, అన్నిటికన్నా ముందు మనిషి, తోటిమనుషల కోసం పడిచచ్చే మనిషి. తాను ఇష్టపడ్డవాళ్ళు తనని ూడా అంతలా ఇష్టపడాలని కోరుకునే మనిషి, వాళ్ళట్లా ఇష్టం చూపించకపోతే వాళ్లెందుకు ఇష్టపడరేమని నిర్ఘాంతపోయేమనిషి, ఇష్టపడితీరాలని శానించే మనిషి.

రంగాచార్య వేదాల్ని ప్రేమించారంటే అందు ప్రేమిం చారు. ‘వేదాల్లోనే అన్నీ ఉన్నాయనే వాళ్ళూ, వేదాల్లో ఏదీ లేదనే వారూ ‘ఇద్దరూ వేదాల్ని చదవలేదు’ అన్నాడాయన ఒక్కమాటలో.

ఆ రోజు విజయకుమార్‌ చెప్పిన మాటల్లో అన్నిటికన్నా గొప్ప ఆశ్చర్యం : ‘ఆయన ఇంటినుంచి వచే్చనముందు అక్కడ అలమారులో పెద్ద పెద్ద బైండు పుస్తకాలు కనిపించారు. అవేమిటి సార్‌ అనడిగాను. ‘అవా వేదాలు. నేను అనువాదం చేనినవి అన్నారాయన తాపీగా.’ నేను ఆశ్చర్యపోయాను. ‘చూడొచ్చా సార్‌’ అనడిగాను. తీని చూన్తే కుదురైన దస్తూరీలో నాలుగు వేదాలూ తెలుగులో కనిపించాయి. వీటిని ఎవరికోసం అనువదించారు అనడిగాను. బహుశా ఎవరైనా ప్రచురణ కర్త అడిగితే చేని ఉంటారనే ఉద్దేశ్యంతో, ‘ఎవరికోసమేమిటి? నా కోసమే నేను తెలుగులో రాసుకున్నాను’ అన్నారాయన. అంతే. మరుక్షణంలో ‘సార్‌, ఈ గ్రంథాల్ని ఎమెస్కో ప్రచురిస్తోంది అన్నాను ఆయనతో’ అని చెప్పాడు విజయకుమార్‌.

2000 జనవరి పుస్తక ప్రదర్శనలో శుక్ల యజుర్వేద సంహిత తెలుగు అనువాదం విడుదల. ఆ రోజు విజయవాడలో ఆ వేదికమీద ఆ అనువాదాన్ని పరిచయం చేనే భాగ్యం నాకు లభించింది. ఆ రోజే రంగాచార్యగారిని మొదటిసారి చూడటం, మాట్లాడటం. అదొక ఉజ్జ్వలసమయం. ఆ తరువాత జరిగినదంతా చరిత్ర.

ఆ ఉగాదికి వేదాల సంపుటాల్ని హైదరాబాదులో ఆవిష్కరించారు. అప్పుడు కూడా ఆ వేదికమీద ఎందరో వేదపండితులున్నా ఆ సంపుటాల్ని పరిచయం చేనే అవకాశం నా లభించింది. ఆ ఏడాదే జూలైలో అనుకుంటాను, ఆయనతో పాటు గుంతకల్‌ వెళ్ళాం. అక్కడ ఆయన ప్రసంగం, ఆ ప్రసంగమైన తరువాత ఒక రెడ్డిగారి ఇంట్లో విందు. అక్కడ అన్నం వడ్డిస్తూ ఆ కుటుంబ సభ్యులు, స్త్రీలు ‘జీవనయానం’ లోంచి వాక్యాలకు వాక్యాలు అప్పగిస్తున్నారు. పద్యాలు అప్పగించడం చూసాను, పాటలు వల్లెవేయడం చూసాను, ఒక వచనరచనని కూడా అట్లా వల్లె వేయడం నేను చూడటం అదే మొదటిసారి. ఈ పదిహేనేళ్లలో మళ్ళా అట్లాంటి దృశ్యమెక్కడా చూడలేదు. చూడగలనని ూడా అనుకోలేను.

ఆ తరువాత కొన్నేళ్లపాటు రంగాచార్యగారితో తరచూ మాట్లాడుతుండేవాణ్ణి, అప్పుడప్పుడూ చూడగలిగే అవకాశం కూడా  దొరికింది. ఆయన వల్లనే నాకు వానిరెడ్డి నీతాదేవిగారి పరిచయం దొరికింది. ఒకసారి ఫోన్‌ చేనినప్పుడు అండాళ్‌ ని చదువుతున్నానని చెప్పాను. అండాళ్‌ అనే మాట వింటూనే ‘మార్గశిరత్తిల్‌ మనుమనదరగళ్‌… అంటూ ‘మనసు కలిగిన మార్గశిరదినాలు’ అందయ్యా ఆమె, ఆ నిందమిళం అందమే అందం అంటూ ఒక వాక్ప్రవాహంలో నన్ను ముంచెత్తారు. ఆ తన్మయత్వం అక్కడితో ఆగక, తిరుప్పావైని తెలుగు చేనేదాకా ఆగలేదు. ఆ అనువాదం వెనక ఆనాటి మా సంభాషణ ఏదో ఒక మేరకు కారణమయిందని నాకు కించిత్‌ గర్వం.

రంగాచార్య వ్యక్తిత్వంలో ఒక విశేషముంది. ప్రాచీన గ్రీకు నాయకపాత్రల్లాగా, డొస్టవన్కీ, కాఫ్కా పాత్రల్లో లాగా, చలంలాగా ఆయనలో కూడా తీవ్రమైన parricidal tendency ఉంది.  Authority మీద ఆయన చేనిన తిరుగుబాట్లన్నిటికీ అదే ప్రాతిపదిక. కాని సనాతన భారతీయ విలువలు ఎటువంటి filial piety ని కోరుకున్నాయో దానికి తాను అర్హుడు కావాలని కూడా ఆయన తపించాడు. ఈ వైరుధ్యం ఆయన జీవిత ప్రస్థానం అడుగడుగునా కనిపిస్తుంది. ఆ filial piety లేకపోయుంటే ఆయన జీవితం కూడా బ్రదర్స్‌ కరమజోవ్‌ నవలగా మారిపోయుండేది. అటువంటి ప్రమాదం నుంచి ఆయన్ను తప్పించిన మహనీయులు ఇద్దరు కనిపిస్తారు. ఒకరు వారి తల్లిగారు, రెండవవారు ఆయన శ్రీమతి కమలగారు, ఇద్దరికీ చేతులెత్తి నమస్కరించాలి.

తనలోని parricidal tendency వల్ల ఆయనెప్పుడూ ఒక శత్రువుకోసం అన్వేషిస్తూన ఉండేవారు. అది నిజాం నవాబుమీద తిరగబడటంలోనే కాదు. తరువాతి రోజుల్లో మునినిపల్‌ కార్పోరేషన్లో పనిచేస్తున్నప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇంటికి నిక్కచ్చిగా పన్ను మందింపు చేని ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవడంలో కూడా కనిపిస్తుంది. రాజకీయ నాయకులుండే ఏ వేదికనీ తాను ఎక్కూడదని చివరిదాకా కూడా భీష్మించు కోవడంలోనూ అదే ఆగ్రహం, అదే మొండితనం, ఎక్కడుంది అటువంటి వెన్నెముక ఇప్పుడు?

కాని ఆయన ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఒక తండ్రి ూడా. అది ూడా రామాయణం, ఒక మనిషి ఎటువంటి కొడుకుగా, తమ్ముడిగా, తండ్రిగా ఉండాలని కోరుకుందో అచ్చం అలానే. అదంతా జీవనయానంలో మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక దృశ్యం, దాశరథి కృష్ణమాచార్య జైలు నుంచి ఇంటికొచ్చినప్పుడు వాళ్ళమ్మగారు ఆ వంటింట్లోంచి అట్లానే పరుగుపరుగున వచ్చిన దృశ్యం. ఆ అన్నదమ్ములిద్దరినీ కన్న ఆ తల్లిని తలుచుకుంటే నా కళ్ళు ఇప్పుడు ూడా సజలాలైపోతున్నాయి.

రంగాచార్య అద్వితీయుడు, ఒకడు రంగాచార్య, ఆధునిక సంప్రదాయ జీవన విలువల, విశ్వాసాల, వైరుధ్యాల జమిలినేత, బహుశా తెలుగునేలమీద అటువంటి literary protagonist  ని ఇప్పట్లో చూడగలమనుకోను.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.