శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలో శ్రీమతి శారదా శ్రీనివాసన్, లీలాకుమారి సంయుక్తంగా రచించిన ”చిరంజీవి సాహిత్య సమాలోచనం” గ్రంథం ఆవిష్కరణ సభ 22-4-2015 న జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వఅధ్యక్షులు ఆచార్య ఎన్వీ రామారావు అధ్యక్షతన జరిగిన నాటి సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా|| .వి. రమణాచారి ముఖ్య అతిథిగా హాజరై ”చిరంజీవి సాహిత్య సమాలోచనం” గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన మౌనఋషి చిరంజీవి అని, ఆయన జీవనాన్ని, సాహిత్యాన్ని ఓ నిద్ధాంత గ్రంథంలా రచించిన శారద, లీలాకుమారి లిరువురూ అభినందనీయులని అన్నారు. అనంతరం గ్రంథకర్తలను ఘనంగా సత్కరించారు. పుస్తకాన్ని పరిచయం చేనిన ప్రముఖ నినీ రచయిత చైతన్యప్రసాద్ మాట్లాడుతూ- నాటకం రానినా, నవల రానినా సమాజహితం కోసమే అన్న చిరంజీవి, మార్కి ్సష్టు భావజాలంతో తన సునిశిత పరిశీలనతో, ఉత్తమ స్వర ప్రయోక్తగా ఆకాశవాణికి, తెలుగు సాహిత్యానికి పేరు తెచ్చారన్నారు. ఇంకాసభలో సాహితీవేత్తలు వలేటి గోపీచంద్, రఘుశ్రీ, సుధామ, గ్రంథకర్తలు ప్రసంగించారు. తొలుత చిరంజీవి చిత్రపటానికి పుష్పమాలవేని, జ్యోతి ప్రకాశనం గావించిన డా|| రమణాచారి, చిరంజీవి కుమారుడు చైతన్యను సంస్థల పక్షాన సత్కరించారు.
-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
