”స్త్రీ ఆవేదనలకు అక్షర రూపం ”స్వేచ్ఛ” నవల” – బి. నాగశేషు

స్త్రీని పూజించకపోయినా సాటిమనిషిగా గౌరవిస్తేచాలు సకల సుఖాలు, శుభాలు మన సొంతమౌతాయి స్త్రీతత్వం అనేది జీవ లక్షణంకాదు సాంస్కృతిక లక్షణం. స్త్రీ స్త్రీగా పుట్టడంలేదు స్త్రీగా పెంచబడుతందిఅనేది సమాజ సూత్రాలలో ఒకటి ప్రస్తుతమున్న సామాజిక వ్యవస్థ మగవాడు స్త్రీకంటే ఎక్కువ లేదా స్త్రీ కంటే గొప్పవాడు కనుక స్త్రీలమీద పెత్తనం చేయడానికి అర్హులు అనే అభిప్రాయాన్ని నిర్ధ్వంద్వంగా అంగీకరించిన సామాజిక వ్యవస్థ ఇటువంటి పురుషాధిక్య భావజాలం ఈ వ్యవస్థలని స్త్రీ పురుషులలోనూ జీర్ణమైపోయింది అనేది సమాన సూత్రం ఇప్పుడున్న సామాజిక వ్యవస్థలోని ప్రత్యుత్పత్తి ఆలోచనలు వివాహం, కుటుంబం లాంటి సామాజిక వ్యవస్థలన్నీ స్త్రీని మగవాడి పెత్తనం క్రింద వుంచే రూపంలోనే ఉన్నాయనడంలో సందేహం లేదు కనుక ముందు స్త్రీ ఈ వ్యవస్థలో నుండి బయటపడాలి అని కొందరు స్త్రీవాదులు అభిప్రాయ పడ్డారు అలాంటి స్త్రీవాద రచయితల్లో ”ఓల్గా” అనే రచయితే ”స్వేచ్ఛ”అనే నవలలో తన అభిప్రాయాల్ని తెలియపరచాలి స్త్రీ పడే మానసిక ఆవేదనలకు అక్షరరూపం ఇచ్చారు. పెళ్ళియిన తరువాత భర్తతో సంసారం చేసి పిల్లల్ని కనిపెంచడమే కదా స్త్రీ బాధ్యత అని ప్రశ్నిస్తారు.

బాధ్యతల్ని తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందా లేక యిష్టంతో స్వీకరించిందా లేక ఆ బాధ్యతల్ని పురుషాధిక్య ప్రపంచం ఆమె మీద మోపిందా? అని ప్రశ్నిస్తుంది. ఓల్గా సృష్టించిన ”అరుణ”అనే మధ్యతరగతికి చెందిన ఆధునిక స్త్రీ పాత్రను ప్రధానపాత్రగా తీసుకొని స్త్రీని స్త్రీగా కుటుంబ వ్యవస్థ ఎలా పెంచుతుంది అనే అంశాన్నినిర్ణయించేందుకు అరుణ తన పుట్టింట్లో పెరిగే రోజుల్లో వాళ్లమేనత్త ఇంకెన్నాళ్ళు ఈ తిప్పలు ఎగురుళ్ళు అన్నీ పోతాయి ఆ మూడు ముళ్ళు పడగానే అంటూ కుటుంబానికి పనికి వచ్చే అమ్మాయిగా అందరూ ఆమెను తీర్చిదిద్దడం లాంటి విషయాలను రచయిత్రి చూపిస్తుంది. ప్రతి ఒక్కర్లోనూ ఈ ఆలోచనలు ఎంత బలంగా నాటుకుపోయాయో రచయిత్రి కళ్ళకు కట్టినట్లు విశదీకరించారు. ఎంతటి స్వేచ్ఛకు కోరుకునే మగవాడైన తాను కట్టుకోబోయే పెళ్లాం మాత్రం కట్టుబాట్లలో వుండాలని కోరుకోవడం గమనిస్తే స్త్రీని ఏ దశలోనూ ఎవరూ స్వేచ్ఛలేని వస్తువుగా చూస్తారనే విషయం లిఖితమౌతుంది అలాంటి పాత్రే ”ప్రకారం” పాత్ర ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించక తప్పదు ఆమెను ఎవరూ నియత్రించకపోయినా ఆవిడే కొన్ని నిబంధనలను సిద్ధంచేసుకొని వాటికి లోబడే జీవితం గడుపుతుంటుంది. ఈ విషయాన్ని ”ఓల్గా” గారు తప్పుపట్టినా ఆచరణ కష్ట సాధ్యంగా వుంటుందనేది మాత్రం నిజం. తన స్వేచ్ఛాకాంక్షను ఒక అపరాధ భావంతో చూసుకోవటం జరుగుతూ వుంటుందనే విషయాన్ని” అరుణ ”జీవితంలో ఎప్పటికప్పుడు చూపిస్తుంటుంది అంటే పై విషయాన్ని రచయిత్రి సమర్ధించినట్లే కదా!

అణిగి మణికి వుండడం స్త్రీ లక్షణములు ఎప్పటికప్పుడు చూపిస్తుంటుంది ఎంత బాధవున్నా మనసులో ఉంచుకోవాలే గాని నోరుమెదపకూడదనే విషయాన్ని రచయిత్రి చెప్పకనే చెప్పింది.

నేను ఎప్పుడైనా కొంచెం ఆలస్యంగా ఇంటికొస్తే వాళ్ళేం అవక్కర్లేదు వాళ్ళ చూపులే అర్థమౌతాయి అని అరుణ ఉమతో అంటుంది చూపులు సైతం స్త్రీలను నియంత్రించగలవనే విషయం జగమెరిగిన సత్యం పెళ్లయ్యాక భర్త ప్రకాశంతో గొడవలు పడినపుడు నాలోనే తప్పులున్నాయమో అని సర్దుకుపోతుంటుంది.

ఎంత ఆర్ధిక స్వేచ్ఛ లభించినా స్త్రీ కుటుంబ వ్యవస్థలోని రాజకీయాలలో బానిసగానే బ్రతక వసలి వస్తుందని చూపించేందుకు అరుణ పాత్రను ఉద్యోగంలో వున్నస్త్రీగా ఏర్పాటు చేసింది. నేను సంపాదించిన సొమ్ములో నెలకు వంద రూపాయలు ఖర్చుపెట్టకూడ దంటావా?అని అరుణ అంటుందంటే స్త్రీ ఉద్యోగం చేసినంత మాత్రాన ఆర్ధిక స్వేచ్ఛ వుందని భావించవచ్చా అని రచయిత ప్రశ్నిస్తుంది. అరుణ గర్భవతి అయ్యాక ఆనందంగా రాబోయే బిడ్డను ఆహ్వానించడానికి నిశ్చయించు కొంటుంది పాప పుట్టాక పాపే ప్రపంచమైంది. అరుణకి పెళ్ళయ్యే దాకా తల్లిదండ్రులే ప్రాణంగా బతుకుతుంటారు. పెళ్ళయ్యాక భర్తే సర్వస్వం అనుకొంటారు బిడ్డలు పుట్టాక పిల్లలే ప్రపంచంగా భావించి బాధ్యతగా మసలుకొంటుంటారు. వీటి వెనుక ఏదో తెలియని బాధ సుఖం రెండూ వుంటాయనే విషయాన్ని అందరూ గమనించాల్సిందే స్త్రీ సంపాదించిన సంపదంతా ఖర్చుపెట్టెయ్యాలనే ఆలోచన ఏ స్త్రీకి వుండదు ఎందుకంటే గృహమనే స్త్రీనే కదా పొదుపు మంత్రం నేర్పించే స్త్రీ. పురుషుడైనా సంపాదించిందంతా తానేఖర్చు పెట్టేస్తే సంసారం అనే బండి అగిపోతుంది.

స్త్రీ ఉద్యోగం చేయడం వెనుక పురుష ప్రయోజనముందనే విషయం వాస్తవం కాదు ఉద్యోగం చేయడం వల్ల సమాజాన్ని అధ్యయనం చేసినట్లవుతుంది తనకెలాంటి బాధ్యతలిచ్చినా ధైర్యంగా నెరవేర్చగలిగే నమ్మకం ఆమెకు కలుగుతుంది. అందువల్ల పక్షికి రెండు రెక్కల్లో ఏ రెక్కలేకపోయినా ఎలా ఎగరలేదో అలాగే భార్య భర్తలిద్దరూ బాధ్యతగా నడుచుకోవాల్సి వుంటుంది. ఆధునిక ప్రపంచంలో స్త్రీ ఉద్యోగం చేయడం సాధారణ విషయంగానే మనం పరిగణించవచ్చు. కుటుంబ వ్యవస్థ బాగుపరచుకోడానికి ఇది దోహదపడుతుంది. తన భర్త ఎలాంటి వాడైనా పరాయి మగాళ్ళ కంటే ఎంతో కొంత మంచి వాడనే ఆలోచన ప్రతి వొక్క స్త్రీకి వుంటూది అలాగే అరుణ పాత్ర ద్వారా ప్రకాశాల్ని అలా అనేలా చేసింది. రాత్రంతా మత్తులో ఉండి భార్యను కొట్టే భర్తలనుసైతం నా మొగుడు తాగకపోతే ఆయనంత మంచివాళ్ళు ఈ లోకంలో లేరని సర్దుకుపోయే మానవతావాది మహిళ. కుటుంబం స్త్రీని ఏవిధంగా తన స్వేచ్ఛని హరిస్తుందో ఈ నవలలో తెలియజేశారు. ఎన్నికలైనా అనుభవించి సంసారాన్ని ఈదాలనే ప్రతిస్త్రీ కూడా కలలుగంటుంది. దీనికి పురుషుడు కూడా అనువైన వాతావరణం సృష్టించాలి.కుటుంబ వ్యవస్థ నుండి బయట పడితే ఎలా జీవించవచ్చు అనే ప్రశ్నకు ఒక ఉదాహరణంగా ఉమ, సుధీర్‌ల జీవన విధానాన్ని చూపించారు రచయిత్రి. సాంప్రదాయిక స్త్రీలు ఆధునిక స్త్రీలు అందరూ పాత వ్యవస్థకు అనుగుణంగానే ఆలోచిస్తారనే అభిప్రాయం సరికాదని సూచించేందుకు’ అరుణ అత్తగారైన కమలమ్మతో అభ్యుదయ భావాలు చూపిస్తారు రచయిత్రి అరుణపాత్ర ఈ నవల చివరికొచ్చే సరికి సంక్షోభదశ దాటి సంఘర్షణంటే ఆనందాన్ని పొందగలిగే దశ కొచ్చింది. కాబట్టి స్త్రీలు కూడా సమాజంలో ఒక భాగమనే విషయాన్ని పురుషులు గమనించాలి వారికి సమానమైన హక్కులు కల్పిస్తూ గౌరవించగలిగినపుడే సమాజం సాంఘికంగా, ఆర్ధికంగా రాజకీయంగా బలవంతమౌతుంది. అభివృద్ధి పయనంలో దూసుకుపోతుంది. కుటుంబ వ్యవస్థ బాగుపడితే సమాజం బాగుంటుంది. తారతమ్యాలులేని స్వేచ్ఛాయుత సమాజం కోసం మనందరం పాటుపడాలి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>