చిన్నప్పటి ఫోటో- రమాసుందరి బత్తుల

”నీకు అప్పటి నా ఫోటో దొరక్కపోవచ్చు. కానీ మేడ మీద పాత సాక్స్‌లో నా పాదముద్రలు ఉంటాయి.” అన్నాడు ఒకాయన గత స్మృతుల గురించి మాట్లాడుతూ. ఫోటోలు లేని ఆ జీవితం ఎంత సువాసన భరితంగానూ, చైతన్యభరితంగానూ ఉండేదీ! కొన్ని బాధలు అనుభవించినా గడిచిన కాలం ఎప్పుడూ తియ్యగానే ఉంటుంది. కొన్ని ముళ్ళు గుచ్చుకొన్నా నడిచిన దారులు చాలా సార్లు అందంగానే గుర్తు ఉంటాయి. ఎవరికి వాళ్ళకు బాల్యం ఒక అందమైన దృశ్య కావ్యం. నలభై ఏళ్ళ నాటి నా బాల్యాన్ని దర్శించటం నాప్పుెడూ ఆనందమే. అది మధ్య తరగతిగా సాదానీదాగా ఉన్నప్పటికీ కూడా. ఈ నాటి నా ఉనికికి, ప్రవృత్తికీ బీజాన్ని వేనిన నా చిన్నతనాన్ని ఆ పరిసరాలకు వెళ్ళి వెదుక్కోవటం గొప్ప అనుభూతినిస్తుంది.

నరసరావు పేటలో నా బాల్యం మరీ పనిది కాదు. తొమ్మిది నుండి పన్నెండేళ్ళ సంవత్సరాల మధ్య వయసు .. పది మంది పిల్లలతో కలిని గుంపు జీవిత ఉల్లాసం అనుభవించగలిగిన పరిణితి గలిగినది. ఇంట్లో జీవితం కంటే ఆరు బయట న్నేహితులతో చేనే వెర్రి న్నేహమే ముఖ్యమూ, శాశ్వతమూ అనుకొనేంత అమాయకమైనది. కథలు నవలల్లో తాత్వికత అర్థం కాకపోయినా వాటి ద్వారాలలో అందమైన లోకాల్లో విహరించ గలిగినంత ఆహ్లాదకరమైనది. ఇంకా ఆర్థిక వత్తిళ్ళు ఊహకు అందుకోగలిగినంత గడుసుది. సామాజిక అస్తవ్యస్త్యాలు అర్థం చేసుకోలేక గందరగోళపడేంత చేదైనది. అమ్మ పిల్లల కోసం పడుతున్న కష్టం అర్థం చేసుకొని సగం పంచేసుకోవాలని తొందరపడేంత ఆవేశం కలిగినది.

ఒంగోలు నుండి నరసరావుపేటకు వెళ్ళిన ప్రతిసారీ అక్కడ నా జ్ఞాపకాల తాలూూ శకలం ఒక్కక్కటే అదృశ్యం అవుతుంటే ఆ అదృశ్యం చుట్టూ ప్రదక్షిణాలు చేని వస్తుంటాను. ఏడేళ్ళ క్రితం వెళ్ళినప్పుడు నేను చదివిన మున్సిపల్‌ హైస్కూల్‌ శిధిలాల్లో కనిపించింది. ఐదో క్లాసులో నా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేనిన ప్రభావతీ టీచరు గారి ఇల్లు కనబడలేదు. లతలు అల్లుకొన్న పందిరితో, వరండాలో చిన్న కాళ్ళను బానింపట్లా వేసుకొని కూర్చొని లాంతర్ల వెలుతురులో నా చేత పాఠాలు బట్టి పెట్టించిన ఆ పెంకుటిళ్ళు.. ఎత్తుగా పెరిగిన బిల్డింగుల మధ్య ఎక్కడో ఉండి

ఉంటుంది .. కొంత రూపం మార్చుకొని. పాలంద్రం పక్కగుండా వెనక్కి వెళితే వచ్చే పొలాలు, తోపులు, కార్తీక మాసంలో పిక్నిక్కులను భరించిన మామిడి తోటలు … గుర్తు పట్టలేక పోయాను. ఆ వంటరిదారుల్లో టైరు తిప్పుకొంటూ వెళ్ళి, దారి తప్పి బిక్కపోయిన హృదయం.. ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్దాయ్యాక అక్కడే ఆగి రానని మారాం చేస్తుంటే బలవంతంగా లాక్కొని వచ్చాను.

ఎెన్సెన్‌ కాలేజీ గ్రౌండ్‌లో కాలికొద్ది పరిగెత్తి ఆడుకొన్ని ఆటలు … ”రమరమరమ … మరమరమర ..” అంటూ చేతులు తిప్పి ఏడిపించిన మస్తాన్‌ వలీని ఇంత లావు రాయి తీసుకొని కొట్టాను. రక్తం కారుతున్న వాడిని వాళ్ళ అమ్మ స్కూల్కి తీసుకొని వేన్త.. నా పేరు చెబుతాడేమోనని హడలి చస్తూ ఒక పక్క నక్కాను. వాడు నోరు విప్పలేదు పాపం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో! నీ మీద బెంగగా ఉంది వలీ. నీది బాల్యపు ఇష్టమే అయి ఉండొచ్చు. కానీ హిమాచల్‌ ప్రదేశ్‌లో పారుతున్న నదుల అడుగున కనబడే రాళ్ళలాగా ప్రస్ఫుటంగా ఉందిప్పుడు నాకు. గాంధీ పార్క్‌లో నేను క్రింద పడేసి కొట్టిన నరనింహారావు ఏమి చేస్తున్నాడో? సారి నరనింహారావూ. తొండి చేని నిన్ను ఓడించాను.

బెంచి టి్కట్టుకు ఇంట్లో రూపాయి తీసుకొని రెండు నేల టి్కట్లు కొనుక్కొని అచ్చంగా నేలమీద ూర్చొని నినిమా చూనిన ప్రియమైన సాహచర్యం … గీత వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉండాలి. లేదు. అపార్ట్మెంట్‌ కట్టేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యూక్లియార్‌ ఫిజిక్స్‌ చదువుతూ ఆటో యాక్సిడెంట్లో మరణించిన పొడుగు కాళ్ళ, బాబ్డి హైర్‌ గీత ఆనవాళ్ళు అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయి. ఇదిగో ఇక్కడ నా మనసులో మాత్రం సజీవంగా మిగిలి పోయాయి. నరసరావుపేటూ నాూ వారధిలాగా మిగిలి ఉన్న హేమ .. హేమమాలిని … నేను పెత్తనం చేని భయపెట్టినా నన్ను ప్రేమించిన తడికళ్ళ మధ్వుల పిల్ల …. వాళ్ళ ఇల్లు అప్పుడు పెద్దదిగా కనిపించేది. ఇప్పుడు ఏమిటి ఇంత చిన్నదైపోయింది. ఏడవ తరగతి పరీక్షలప్పుడు ఒ బుడ్డీ కింద నాతో తల మోడించి పాఠాలు చదివిన నాగిరెడ్డి, చిరుజల్లు పడుతున్న ఒక మధ్యాహ్నపు వేళ నాన్నకు అన్నం ఇవ్వటానికి సైకిలు మీద గొడుగు వేసకొని పొలానికి వెళ్ళి పిడుగు పడి … నాన్న చేతుల మధ్య నిర్జీవంగా .. నిద్రపోతున్నట్లు .. వద్దు వద్దు గుర్తుకు రావద్దు. నాపరాళ్ళతో కట్టిన చిన్న చిన్న కిటికీల ఒక పాత ఇల్లు ఆ ప్రాంతంలో నాకు మిగిలిన ఒ ఒక పురాతన స్మృతి. పనితనపు ఈతలు కొట్టిన నాగార్జున కాల్వ ఎండిపోయి, కుంచించుకొని పోయి చెత్తాచెదారాన్ని మోస్తుంది. ఈ నీటి ఊట కదూ నరసరావుపేటను పచ్చనివనంగా మార్చింది? ఏవీ ఆ గులాబీ తోటలు? మొక్కలు వృక్షాలుగా మారి ఇంటి గోడలను పూలతో అలంకరించిన అందాలు? ఏవీ ఆ జినియా పూలు? ఒంటి రెక్క సౌందర్యాలు? ఏవీ ఆ బంతులు, తెల్లటి చామంతులు…. కుండిల్లో కూడా కనబడటం లేదు? కనీసం ఆ పేద ముళ్ళ గోరింటలైనా ఎక్కడైనా చాటుగా తలదాచుకొన్నాయా ఈ కాంక్రీటు ప్రపంచంలో?

కాలువ దాటగానే అప్పుడు ఒక వెలుగు వెలిగిన సాగర్‌ క్వార్టర్స్‌ .. ఇప్పుడు ఎండిపోయిన వనంలో మోడైపోయిన వృక్షాలలాగా .. మానిపోయిన ముసలి, మురికి సాధువుల్లాగా ప్రత్యక్షమయ్యాయి. ఇళ్ళ మధ్య మట్టి దారులు మాత్రం నన్ను పిలిచాయి. మా మీద నడుస్తూ నువ్వు చేనిన అల్లరి ఊహలు మాతోనే ఉన్నాయని బెదిరించాయి. శంకరభారతీ పురం దాటాక పక్క పల్లెకి వేనిన ఏకాంత దారిలో .. చిన్నతనాన కలల్లో భయపెట్టిన ఊడలు దిగిన మర్రి చెట్టు కోసం ఎంత దూరం వెళ్ళినా కనబడలేదు.

మళ్ళీ వస్తాను. ఇంకా వెదుకుతాను. ఎన్ని మారినా నేను అప్పుడు పరుగులు పెట్టి ఆడుకొన్న .. నన్ను మోనిన నేల మట్టిపొరలు మారవు కదా. ఆ పొరల్లో నేను దాచి పెట్టుకొన్న, నేను ూడా మర్చిపోతున్న నా చిన్ననాటి రహస్యాలు .. నా బతుకంతటికీ మధురిమ పంచిన బాల్యస్మృతులు వెతుక్కోవటానికి మళ్ళీ మళ్ళీ నా చరమాంకం వరూ వస్తూనేవుంటా ఇక్కడకు.

 

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

One Response to చిన్నప్పటి ఫోటో- రమాసుందరి బత్తుల

  1. బావుంది రమాసుందరి గారూ…ఇక్కడ అప్రస్తుతమే గానీ మీ పేరు రాస్తుంటే గుర్తొచ్చింది…రాజాం వెలుగు రామినాయుడు గారి పెద్దమ్మాయి పేరు కూడా రమాసుందరే! రెండో అమ్మాయి పేరు ఇందీవర 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో